మార్చి నెల  నాలుగో వారంలో భారతదేశంలో జరిగిన రెండు ఘటనలను పరిశీలిస్తే చాలా విషయాలు తేటతెల్లమవుతాయి. దేశంలో మతం పేరుతో ఎవరు సమీకృతమవుతున్నారో చాలా సులభంగానే అర్ధమయ్యేటట్టు చేస్తాయి ఆ రెండు ఉదంతాలు. హోళి సందర్భంగా మార్చి 24న హైదరాబాద్‌ నగరం సమీపంలోని ఘట్‌కేసర్‌ లోని చెంగిచర్ల పిట్టలబస్తీలో హోళి వేడుక జరుపుకుంటున్న కొందరు హిందూ మహిళల మీద ముస్లిం గూండాలు దాడి చేశారు. అక్కడే నమాజ్‌ జరుగుతున్నందువల్ల పాటలు పెట్టుకుని వేడుక చేసుకుంటున్న హిందువుల మీద మూకుమ్మడి దాడి చేశారు మతోన్మాదులు. మరునాడు కూడా దాడి చేశారు. బజ్రంగ్‌దళ్‌, బీజేపీ, హిందూ వాహిని తదితర సంస్థల నాయకులు టి. రాజాసింగ్‌, బండి సంజయ్‌, మౌనిక సుంకర, బీజేపీ హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మాధవీలత వంటివారు వెంటనే వెళ్లి పరామర్శించారు. దాడి తరువాత అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. రాజాసింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. బండి సంజయ్‌ వెళ్లినప్పుడు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిరది. అప్పటికే అక్కడ 150 మంది పోలీసులు మోహరించి ఉన్నారు. యథాప్రకారం ఈ ఉదంతం చాలా చిన్నది అన్నట్టే అధికారులు, పోలీసులు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నించాయి. భారత రాష్ట్ర సమితి అసలు నోరే మెదపలేదు. రంజాన్‌ పవిత్ర మాసంలో ముస్లింల మీద (దాడికి దిగినప్పటికీ) కేసు పెట్టే మహాపాపం చేయలేమని పోలీసులు మొదట చెప్పారని వార్తలు వచ్చాయి. అక్కడికి హిందువులు కర్రలు, కత్తులు పుచ్చుకుని బారులు తీరలేదు. అసలు అదొక విషయమే కాదన్నట్టు కూడా వ్యవహరించారంటే అతిశయోక్తి కూడా కాదు. ఒక్క హిందూ సంస్థలు మాత్రమే వెళ్లాయి. బజ్రంగ్‌దళ్‌ వారు రాకపోతే మమ్మల్ని చంపి ఉండేవారని పిట్టలబస్తీ వారు బాహాటంగానే చెప్పారు.

మరొకటి, సరిగ్గా వారానికి జరిగింది ఉత్తరప్రదేశ్‌లో:

అతడి మీద ఎమ్మెల్యేని చంపిన కేసు ఉంది. వందలాది నేరాలకు కేసులు ఉన్నాయి. అతడు జైలులోనే చనిపోయాడు. పేరు ముఖ్తార్‌ అన్సారీ. మొదట ఉత్తరప్రదేశ్‌లో పెద్ద గూండా. తరువాత రాజకీయవేత్త అవతారం ఎత్తాడు. కానీ యోగి వచ్చిన తరువాత రాష్ట్రంలో అడుగు పెట్టడానికి భయపడిపోయాడు. చాలాకాలం పంజాబ్‌ జైళ్లలో గడిపాడు. కానీ చివరికి ఉత్తరప్రదేశ్‌ జైలుకే రావలసి వచ్చింది. ఇతడే హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఇతడి అంత్యక్రియలు స్వస్థలం యూసుఫ్‌పూర్‌లో జరిగాయి. ఈ అంత్యక్రియలకు ముస్లింలు కిక్కిరిసిపోయారు. ఆ ఫోటోలు మీడియాలో వచ్చాయి. ఆ జనాన్ని అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదు.

ఇదే ఇక్కడి మెజారిటీకీ, మైనారిటీకీ నడుమ ఉన్న తేడా.

 హిందువులు సహనశీలురు. అయితే అది బలమా? బలహీనతా? అని ప్రశ్నించుకోవలసిన సమయం ఎప్పుడో వచ్చింది. ఇలాంటి సమయాలు చాలానే వచ్చాయి. కానీ ఏనాడు హిందువులు, హిందూ సంఘాల పెద్దలు అవతలి వర్గం మీద దాడి కోసం జట్టు కట్టలేదు. కానీ ఇదే అవతలి వర్గం అలుసుగా తీసుకుంటున్నదని ప్రస్తుతం చాలామంది నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.

అన్సారీ అంత్యక్రియల ఉదంతం, చెంగిచర్ల ఉదంతం లోక్‌సభ ఎన్నికలు 45 రోజులలో జరుగుతాయనగా చోటుచేసుకున్నాయి. కాబట్టి ఆ కోణం నుంచి ఈ రెండు ఉదంతాలను, గతంలో జరిగిన వాటిని అంచనా వేయడం అవసరం.


మన దేశంలోని అతిపెద్ద మైనారిటీ మతం తీరే సపరేటు. ఒక ఎమ్మెల్యే సహా పలువురిని హత్య చేసి, భూకబ్జాలకు పాల్పడి ఉత్తర్‌ప్రదేశ్‌లో పెద్ద మాఫియా డాన్‌గా చెలామణి అయ్యాడు ముఖ్తార్‌ అన్సారీ. ఆ నేరాలతో జైలు శిక్ష అనుభవిస్తూ, ఇటీవలే గుండెపోటుతో మరణించిన అన్సారీ అంత్యక్రియలకు వేలమంది హాజరయ్యారు. కానీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మరణించినప్పుడు వందలలో కూడా అంత్యక్రియలకు రాలేదు. ఈ రెండు ఘటనలను పోల్చి చూసినప్పుడు మనకు అర్థం అయ్యేది ఒక్కటే, మైనారిటీకి దేశం కన్నా మతం ముఖ్యమని. తమ మతాన్ని నమ్మనివారిని హింసించాలని, హననం చేయాలని చెప్పే మతగ్రంథాలే ఇవాళ్లికి వారికి ఆదర్శం. అందుకే ఆ పనులను పుణ్యకార్యాలుగా భావిస్తూ ఆచరించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అందుకే సనాతనులు ఆనందోల్లాసాలతో ఊరేగింపులు, పండుగలు చేసుకోవడంపట్ల వారికి ప్రసన్నత ఉండదు. భారతదేశంలో ముస్లింలలో మెజారిటీ బలవంతంగా మతం మారినవారే అని చరిత్ర చెప్తుంది. ప్రవక్త చెప్పినమాటలను ప్రశ్నించ కూడదని, విశ్వాసంతో అనుసరించాలని ముల్లా మౌల్వీలు వారిని పక్కదోవ పట్టిస్తుండడం వల్లనే వారికీ, ఇతరులకూ కూడా సమస్యలు. దీనిని ఎదుర్కోవాలన్న చైతన్యం హిందువులలో కనిపించినా అది అన్ని ప్రాంతాలలో, అది కూడా సంపూర్ణ స్థాయిలో లేదు. అందుకే, హిందువులపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో హిందువులలో జాగృతిని తీసుకు వచ్చేందుకు, ఇస్లాం చరిత్రపై పరిశోధన చేసిన కొందరు అధ్యయనకారులు భారత్‌కు వ్యతిరేకంగా షేర్‌ షా సూరీ, అక్బర్‌, అహ్మద్‌ షా అబ్దాలీలు చేసిన జిహాద్‌పై లోతుగా చర్చించిన విషయాన్ని మనం చెప్పుకోవాలి. వామపక్ష చరిత్రకారులు, ముస్లింలు షేర్‌షా, అక్బర్‌ సెక్యులరిస్టులంటూ అల్లిన కథనాలలో వాస్తవం ఎంతో మధ్యయుగాల నాటి వారి దండయాత్రలు చెబుతాయి. ఆ దురాక్రమణదారుల చరిత్ర నిన్నమొన్నటి చరిత్రకారులు చెప్పిన సుద్దులను తునాతునకలు చేసినట్టే ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన నవ భారత సెక్యులరిజం ప్రవచకుడు పండిట్‌ జవాహర్‌లాల్‌ నెహ్రూ, వేర్పాటువాద మతానికన్నా, జాతీయవాదమనే ఆదర్శానికి ప్రాధాన్యం ఇచ్చిన భారత జాతీయవాద పిత అంటూ అక్బర్‌ను కొనియాడే స్థాయికి వెళ్లిన విషయాన్నీ పట్టి చూపారు. నిజానికి పాకిస్తాన్‌ ఆచరిస్తున్న ఇస్లాంను కొత్తగా ఏమీ కనుగొనలేదని, అది ఎనిమిదివ శతాబ్దం నుంచి భారతదేశంలో (దక్షిణాసియా లేదా భారత్‌`పాక్‌ ఉపఖండం) ఉందని ఆయన అంటారు. అంతేకాదు, రక్తపిపాసతో కూడిన మతోన్మాద ఇస్లాంకు పెట్టని కోటగా భారత్‌ ఉంది, ఉంటుంది అని కూడా వారు హెచ్చరించడం గమనార్హం. నిజానికి ఈ దేశంలో మెజారిటీల కంటే మైనారిటీలకే ఎక్కువ హక్కు అన్న రీతిలో నెహ్రూ వంటివారు చేసిన ప్రవచనాలతోనే వారిలో ఒక ప్రత్యేక మనస్తత్త్వం పుట్టుకొచ్చింది.

ఆధునిక చరిత్రలో…

భారతదేశ విభజనను తప్పనిసరి చేసిన ‘డైరెక్ట్‌ యాక్షన్‌ డే’ (ప్రత్యక్షచర్య) ప్రస్తావన లేకుండా ఈ దేశంలోని ముస్లింల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమో! ఎందుకంటే, సామాన్య ముస్లింలు కూడా తమ హిందూ మిత్రులు, పొరుగువారు, పరిచయ స్తులపై ప్రతాపాన్ని చూపించిన సందర్భమది. తాము హిందువులతో కలిసి ఉండలేం కనుక తమకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌తో హిందువులపై అకృత్యాలు, అత్యాచారాలు చేసేందుకు ఉద్దేశించినదే డైరెక్ట్‌ యాక్షన్‌ డే.

విభజన కోసం నాటిన విద్వేషాలు

ఇస్లాం శాంతిని కోరుతుందని, బోధిస్తుందని పదే పదే చెబుతూ ఉంటారు. అయితే వారి జీవనంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన రంజాన్‌లో అయినా ఆ సూత్రం అమలయిందా? చెప్పడం కష్టమే. నాటి బెంగాల్‌ ప్రధానమంత్రిగా ఉన్న సుహ్రావర్ది నేతృత్వంలో రుధిరధార ప్రవహిం చింది వారి పవిత్ర రంజాన్‌ మాసంలోనే కావడం అందరం గుర్తుపెట్టుకో వలసిన విషయం! నాటి ఉర్దూ పత్రికలు, కరపత్రాలూ అన్నీ కూడా మహమ్మద్‌ ప్రవక్త బదర్‌ యుద్ధంలో కాఫిర్లను హననం చేసి, వారి నుంచి మక్కాను ఎలా స్వాధీనం చేసుకున్నదీ వివరించడమే కాదు, ఆ విజయంతో పాటుగా పవిత్ర ఖురాన్‌ ఆవిష్కృతమైన పవిత్ర మాసంలోనే పాకిస్తాన్‌ కోసం మన పోరాటాన్ని ఆరంభించాలనే ‘ఆలిండియా ముస్లిం లీగ్‌’ రంజాన్‌ నెలను ఎంపిక చేసుకుందంటూ పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ఆగస్టు 16, 1946కు ముందు ప్రచురితమైన ఉర్దూ పత్రికలు చదివి ఎవరైనా ధ్రువీకరించుకోవచ్చు.

ప్రత్యక్షచర్య దారుణాల అనంతరం భారతీయ ముస్లింలలో పవిత్ర రంజాన్‌ మాసంలో తాము చేయవలసిన ‘పవిత్ర కార్యాలు’ ఏమిటో బోధపడటమే కాదు, చేసేందుకు సాహసమూ వచ్చిందనే విషయం మనకు పదే పదే రుజువవుతూ వస్తోంది. ఎందు కంటే, ఈ మాసంలోనే కాదు ఎప్పుడు హిందువులను జిహాద్‌లో హననం చేసినా, అతడికి గాజీగా గౌరవమే కాక, ముస్లిం ఉమ్మా (రాజ్యం/ ప్రపంచం)లో అత్యున్నత స్థానం దక్కుతుంది. జిహాద్‌లో మరణించిన ముస్లిం షహీద్‌ (అమరుడు) కావడమే కాదు, నేరుగా ఖురాన్‌లో పేర్కొన్న స్వర్గానికి వెళ్లి… ఖయామత్‌ కె దిన్‌ కోసం ఇతరులతో కలిసి ఎదురు చూస్తారని విశ్వాసం. అయితే, ఉత్తరప్రదేశ్‌ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సదరు దిన్‌ ఎన్నటికీ రాదంటూ అసెంబ్లీలోనే స్పష్టం చేయడం మరొక విషయం. మదరాసాలలో పిల్లలకు ఈ విషయాలే నూరిపోస్తుంటారు. అందుకే, హిందువుల శ్రీరామ నవమి ఉత్సవాలు, హనుమజ్జయంతి, దుర్గాపూజ, గణేశ ఉత్సవాల ఊరేగింపుల మీద దాడులు జరగడం. ఇవన్నీ హిందూ సంఘాలు, సంస్థలు చెప్పినవి కావు. నిఘా విభాగం వెల్లడిరచినవే.

 కాగా, మక్కా యవనికపై ఇస్లాం అవతరించక ముందు ప్రపంచంలో ఏ ఒక్కరూ దానిని పట్టించుకో లేదని, బదర్‌ యుద్ధంలో పోరాడిన వారిని అవతలి పక్షం అంతమొందించి ఉంటే ప్రపంచంలో ఎక్కడా ఎవరూ అల్లాను ప్రార్ధిస్తూ ఉండేవారు కాదని ఇస్లాం అధ్యయనకర్తలు అభిప్రాయం. ‘‘జిహాద్‌కు వివరణ పత్రం ఖురాన్‌’’ అంటారు వారు. పదమూడు వందల ఏళ్లుగా ఇస్లాం అంటే ఏమిటో హిందువులకి తెలుసంటారు. ఎందుకంటే, వారి దాడులు, అనంతర దోపిడీలు, విధ్వంసాలు, అత్యాచారాలు అన్నీ వారికి అనుభవంలోకి వచ్చిన విషయాలే. ‘ఇస్లాం ఒక నిరంకుశ అతివాదం నుంచి పుట్టిన సిద్ధాంతమని, నేటికీ అది తన రంగు మార్చుకోలేద’ న్నది వారి అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా వారి కార్యకలాపాలను గమనించిన ఎవరికైనా, దానిలోని వాస్తవం అవగతమ వుతుంది.

రంజాన్‌ మాసంలో కాఫిర్ల (తమ మతానికి చెందని పాపులు)పై విజయం సాధించడం కోసం ఏ పని చేసినా తమకు వందరెట్లు వేయిరెట్లు పుణ్యం వస్తుందని నమ్ముతారు. ఆ వర్గంలో అందరిచేతా నమ్మిస్తారు కూడా. కాఫిర్లకు ఎంత ఇబ్బందిని కలిగిస్తే వారికి అంత పుణ్యం, ఇక చంపినవారైతే నేరుగా స్వర్గానికే వెళ్లిపోతారు వంటి పిచ్చి నమ్మకాలను మసీదులలో, మదరాసాలలో కూర్చున్న ముల్లాలు, మౌలానాలు బోధిస్తుండటం వల్ల దేశవ్యాప్తంగా టైమ్‌బాంబులు తయారవుతున్నాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకు అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో ప్రభుత్వపరంగా యత్నాలు ప్రారంభమై నప్పటికీ, సాధారణ హిందువులు కూడా అవతలివారి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రత్యేక దేశం ఎవరి కోసం?

 పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌లలో పీడిత హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ, క్రైస్తవులకు కోరితే భారత పౌరసత్వం ఇస్తామని బీజేపీ ప్రభుత్వం సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) ప్రకటించిప్పటి నుంచే కొన్ని వర్గాల కడుపులో బాధ మొదలైంది. హిందువు లతో తాము కలిసి ఉండలేం కనుక తమకు మతం ఆధారంగా ప్రత్యేక దేశం విభజించి ఇవ్వాలని పట్టుబట్టి, పోరాటం చేసి 1947లో దానిని సాధించు కున్నారనే విషయాన్ని విస్మరించి, ఆ ఇస్లామిక్‌ దేశంలో కూడా కొందరు ముస్లింలు పీడనకు గురవుతున్నారు కనుక వారిని కూడా భారత్‌లోకి రానివ్వాలనే గానాన్ని మొదలుపెట్టారు. దీని కోసం కూడా సుప్రీం కోర్టుకు వెళ్లడాన్ని మన ఉదారవాద సెక్యులరిస్టులు సమర్ధించడం వారి మూర్ఖత్వమా లేక వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి కరొనా`19 మహమ్మారి దేశాన్ని చుట్టుముట్టడంతో లాక్‌డౌన్‌ ప్రకటించక పోయి ఉంటే సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో ప్రారంభించిన ఉద్యమం పవిత్ర మాసంలో ఇంకెంత రక్తాన్ని ప్రవహింపచేసి ఉండేదో!

విద్యతో సంబంధం లేని మూఢత్వం

దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చిన మదరాసాలు గరుపుతున్న విద్య సమాజ, దేశ వినాశనానికి కారణం అవుతోంది. అలా అని, సెక్యులర్‌ సంస్థలలో చదువుకున్న వారిలో ఇటువంటి మూర్ఖత్వం దూరం అవుతున్నదా అంటే అదీ లేదు. చాలాకాలం ముస్లింలలోని అవిద్య వల్ల అశాంతిని సృష్టిస్తున్నారని, వారు అమాయకులని వాదన ఉండేది. కానీ ఇటీవల అదంతా అబద్ధమని తేలింది. ఒక పవిత్ర ముస్లిం పళ్లు తోముకోవడం ఎలా, గడ్డం ఎంత పొడుగ్గా ఉంచుకోవాలి వంటి చిన్న విషయాల నుంచి జిహాద్‌ వరకూ మహమ్మద్‌ ప్రవక్త చెప్పిన, చేసిన పద్ధతులనే అనుసరించాలి. వ్యక్తిగత చొరవకు కానీ నిర్ణయానికి కానీ ఇస్లాం ఎక్కడా ఆస్కారం ఇవ్వదు. ఏదైనా విషయంలో సందేహం తలెత్తితే ఆ ముస్లిం మసీదులోని ముఫ్తి వద్దకు వెళ్లి, అలాంటి పరిస్థితి ప్రవక్తకు ఎదురైతే ఏం చేస్తాడనే విషయంపై ఫత్వాను పొందాలి. అయితే, అటువంటి పరిస్థితు లను ప్రవక్త ఎదుర్కొన్నట్టుగా ఎక్కడా ఆధారాలు మనకు కనిపించవని ఇస్లాంను అధ్యయనం చేసినవారు అంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే, ఇస్లాంలో అల్లా గురించి చర్చించవచ్చు కానీ, మహమ్మద్‌ ప్రవక్త గురించి చర్చించడం నిషిద్ధం. అతడిని కొనియాడేందుకు మాత్రమే ముస్లింలకు స్వేచ్ఛ ఉంటుంది. ఇంత స్వేచ్ఛ, శాంతి కలిగిన సిద్ధాంతమిది.

‘మదరసాలు రాజ్యాంగ విరుద్ధం’

ఇటీవలే అలహాబాద్‌ హైకోర్టు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మదరసా విద్యా చట్టం, 2004 సెక్యులరిజ భావనను అతిక్రమిస్తోంది కనుక రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్ధులకు సాధారణ విద్యా సంస్థలలో చోటు కల్పించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 21, 21`ఎ కింద 14 ఏళ్ల లోపు వయసు పిల్లలకు సార్వత్రిక, నాణ్యమైన పాఠశాల విద్యను కల్పించడంలో మదరాసాలు విఫలమవుతున్నా యంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేసింది. ఇప్పటికే యూపీి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం జరిపిన విచారణలో 13వేల అక్రమ మదరాసాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. ముఖ్యంగా, నేపాల్‌ సరిహద్దులలో ఉన్న మహారాజ్‌గంజ్‌, శ్రావస్తి, బెహ్రైచ్‌ సహా ఏడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 50కి పైగా మదరాసాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సిట్‌ దర్యాప్తులో తేలింది. గత 25 ఏళ్లలో అక్రెడిటేషన్‌ ప్రమాణాలను నెరవేర్చకుండా నడుస్తున్న మొత్తం 23వేల మదరాసాలను కనుగొనగా, అందులో 5వేలు అవసరమైన గుర్తింపులేకుండా సాగుతున్నాయి. పైగా, ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్న 80 మదరాసాలకు రూ.100 కోట్ల నిధులు వచ్చాయన్న విషయాన్ని సిట్‌ ఖరారు చేసింది. భారత్‌పై జిహాద్‌ కోసం శాంతిప్రియులుగా చెప్పుకునే మైనార్టీ పడుతున్న తపన దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు.

సాంకేతిక యుగంలో జిహాదీలు

తాజా ఉదంతం పరిశీలిస్తే, ఆలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన హారిస్‌ ఫరూకీ ఎఎంయు విద్యార్ధుల గ్రూపును ప్రారంభించాడు. అతడు చదువులో ఎప్పుడూ నెంబర్‌ వన్‌, స్నేహపూర్వక వ్యక్తి, చాలా పాపులర్‌. వీటన్నింటితో పాటుగా అతడు ‘ఐఎస్‌ఐఎస్‌ భారత్‌ విభాగం’ అధిపతి. ఈ పండుగల మాసంలో ఐఇడీలను పాతాలని కుట్ర పన్నుతున్న అతడిని అస్సాం ఎస్‌టిఎఫ్‌ పట్టుకుంది. ఐఎస్‌ఐఎస్‌తో ప్రభావితమై చేరతానంటూ పేర్కొన్న గువాహతిలోని ఐఐటి విద్యార్ధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఏడాదిన్నర కిందట కూడా యూపీ ముఖ్యమంత్రిపై గోరఖ్‌పూర్‌ మఠంలో దాడి చేయాలనుకున్న యువకుడు కూడా ఐఐటి విద్యార్ధే, చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన వాడే అయినప్పటికీ, వారిలో మూఢత్వం పరాకాష్ఠకు చేరుకోవడమన్నది గమనించి, అప్రమత్తంగా ఉండవలసిన విషయం.

మొన్నటికి మొన్న అభంశుభం ఎరుగని ఇద్దరు పసివాళ్లను అకారణంగా ఇద్దరు గొంతుకోసం చంపడమే కాదు, వారి రక్తాన్ని కూడా తాగారంటూ వచ్చిన వార్తలు విన్నవారికి ఎవరికైనా ఒళ్లు గగుర్పొడచక మానదు. ముఖ్యంగా బాధిత కుటుంబంతో పరిచయం కలిగి ఉన్నవారే ఈ పని చేయడం వెనుక హేతుబద్ధత వెదకడం మన మూర్ఖత్వమే అవుతుంది. పెద్దగా చదువులేని మహమ్మద్‌ జావేద్‌, సాజిద్‌ అన్న యువకులిద్దరూ అతివాద ఇస్లాం ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ మాటలతో స్ఫూర్తి పొందారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, 2010లో బరేలీ జిల్లాలో జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లకు బాధ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ ఇంటి నుంచి బయటకురాలేని పరిస్థితి కల్పించిన బరేల్వీ నాయకుడు తౌకీర్‌ రాజా కూడా పరారీలో ఉన్నాడు. ఈ అల్లర్ల వెనుక అతడి కుట్ర, హస్తం ఉన్నాయని దర్యాప్తులో తేలడంతో తౌకీర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ముందస్తు బెయిలు తెచ్చుకునేందుకు యత్నించిన అతడికి అది లభించకపోవడంతో పలాయనం చిత్తగించేశాడు.

హిందూ సమాజం అప్రమత్తంగా ఉన్నదా?

మతం పేరుతో బహిరంగంగా మేమేమైనా చేస్తాం, మీరు చేస్తే మాత్రం ఒప్పుకోం అన్నది మన దేశంలోని అతిపెద్ద మైనార్టీల వాదన. రోడ్లకు అడ్డంగా అందరికీ ఇబ్బంది కలిగిస్తూ నమాజు చేసినా, మసీదులపై లౌడ్‌ స్పీకర్లను బిగించి సాధ్యమైనంత బిగ్గరగా రోజుకు ఐదుసార్లు నమాజు చదివినా, హిందువుల ఆడపిల్లలను మోసం చేసి మరీ పెళ్లి చేసుకుని మతం మారుస్తాం (లవ్‌ జిహాద్‌) కానీ మా ఆడపిల్లల జోలికి వస్తే మిమ్మల్ని చంపేస్తాం అన్న మానసికతను ఒక వర్గం కలిగి ఉన్నా, భారతదేశంలో మతహక్కు, స్వేచ్ఛా హక్కు వగైరాల ముసుగులో నడిచిపోతుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో వచ్చిన సోషల్‌ మీడియా వల్ల ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా తెలుస్తోంది. అయితే ఇది రెండంచుల కత్తి కావడంతో హిందువులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.

హిందువుల తాత్వికతే సెక్యులర్‌

దేశంలో విద్యా వ్యవస్థ, మేధావుల మాటలు, బయటనుంచి వచ్చిన సిద్ధాంతాల కారణంగానూ హిందువులు ‘సెక్యులరిజం’ అనే సాలెగూటిలో నుంచి బయిటపడలేకపోతున్నారు. బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌ 1998లో వాజ్‌పేయిని వేసిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బీజేపీ కారణంగా భారత్‌ సెక్యులర్‌ కాలేదు, ఇక్కడ ఉన్నవారిలో 82శాతం ప్రజలు హిందువులు కావడంవల్లనే భారతదేశం సెక్యులర్‌ అయింది. హిందువుల ఆలోచన తాత్వికతే ఈ దేశాన్ని సెక్యులర్‌ చేస్తుంది. వారు ఇతరులలాగా ఒకే పుస్తకానికి లేదా ఒకే ప్రవక్తకు కట్టుబడి లేరు. దేవుడుని విశ్వసించని వ్యక్తి కూడా హిందువే. హిందుత్వం అందరినీ సమానంగా స్వీకరిస్తుంది’, అంటూ సనాతన ధర్మసారాన్ని సులువుగా, అక్తర్‌కు చెంప పెట్టులా వివరించేశారు.

ఇస్లాంలోని తెగలన్నిటికీ భారత్‌లో మనుగడ!

భారతదేశంలో కనిపించినన్ని మతాలు మరే దేశంలోనూ కనిపించవు. ఇతర మతాల విషయం పక్కన పెట్టి, ఇస్లాంలోని వివిధ తెగల విషయాన్ని పరి శీలిస్తే, భారతదేశంలోనే పరస్పరవిరుద్ధ భావజాలం ఉన్నవి కూడా, తామర తంపరలా పెద్ద సంఖ్యలో ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించాలి. సున్నీ, షియాలుగా విడిపోయిన ఇస్లామిక్‌ దేశాలలో, ఒక మతానికి చెందినవే అయినా ఇతర తెగలను ఎంతగా అణచివేస్తారో మనకు పొరుగుదేశం పాక్‌ ఉదాహరణ చాలు. భారతీయుల జన్యువులలోనే ఎదుటివారి జీవనవిధానాన్ని వారి స్వంత విషయంగా భావించి ఆమోదించడం ఉన్నది కనుకనే మన దేశం సెక్యులర్‌ దేశంగా కొనసాగగలుగుతోంది. కానీ, పరమత సహనం పేరుతో మనను మనం అతిగా మోసం చేసుకోవడం కూడా సరికాదు. ‘మోతాదు మించిన ఏదైనా విషంతో సమానమే. అది హిందువుల సహనమైనా’ సరే.

గుర్రం అటూ ఇటూ చూడకుండా గంతలు కట్టి పరుగెత్తించినట్టుగా మైనార్టీలను పరుగెత్తిస్తున్న మతగురువులను, మేధావులను ఒక తరంలోనే మార్చడం సాధ్యమయ్యే పనికాదు. కనుక, హిందువులే అవసరమైన సమయంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు ప్రదర్శించడం నేర్చుకోవాలి. హిందువులకు సహనమనేది వారసత్వంగా వచ్చిన మాట వాస్తవమే, అయితే పోరాటం కూడా వచ్చిందనే విషయం వారు మర్చిపోయారు. దాదాపు 18వందల ఏళ్లపాటు ప్రపంచ జీడీపీకి 25 నుంచి 35శాతం వరకు దోహదం చేసిన భారతదేశానికి ఆత్మరక్షణ అంటే ఏమిటో తెలియదనుకోవడం శుద్ధతప్పు. సంపద ఉన్నప్పుడు దాని రక్షణకు కూడా ఏర్పాట్లు ఉంటాయి. అయితే, భారతదేశం విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించుకుని అందుకు అనుగుణంగా జీవించడంవల్ల వారు ఇస్లామిక్‌ దాడుల దుష్టత్వాన్ని ఊహించలేక పోయారు. ప్రతి ఏడాదీ చెడుపై మంచి గెలుపుని వేడుకగా చేసుకుంటాం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనేది మన ధర్మంలోనే ఇమిడిపోయి ఉన్న విషయాన్ని వర్తమానంలో మనం గుర్తు పెట్టుకుంటే చాలు. మరొక్క విషయం మేధావులు గుర్తించాలి. మెజారిటీ మతోన్మాదం మైనారిటీ మతోన్మాదం కంటే ప్రమాదం అన్న అత్యంత హీనమైన వాదనను కట్టిపెట్టాలి. ముస్లింల పరిస్థితి, ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా తయారవుతున్న వాస్తవ పరిస్థితులు వారికి అర్ధమయ్యేటట్టు వాస్తవాన్ని వివరించాలి. తప్పును తప్పుగా చెప్పాలి. ఆధునిక సమాజంలో జీవించేలా వారిని సంస్కరించాలి. అసహనం ఎవరిదో, సహనం అంటే ఏమిటో తెలియ చెప్పడం మరింత అవసరం.

– నీల

About Author

By editor

Twitter
YOUTUBE