భాగ్యనగర శివారు చర్లపల్లి సమీపంలోని చంగిచర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమాయత్త మైన హిందూ కుటుంబాలపై కొంత మంది ముస్లిం మూకలు దాడికి తెగబడడం వారిలో పెరుగు తున్న అభద్రతా భావాన్ని, అహంకారాన్ని సూచి స్తోందనే భావించాలి. మేం రోజుకు ఐదుసార్లు నమాజు చదువుతాం కానీ, మీరు ఏడాదికి ఒకసారి వచ్చే పండగని కూడా హడావిడిగా చేసుకోకూడ దన్నట్టుగా ముస్లింలలో ఒక వర్గం ప్రవర్తిస్తోంది.

ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు, నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వస్తారంటూ అనేక సర్వే నివేదికలు తెలుపుతుండడం, ఆ వర్గం నాయకులు తమవారిని గుప్పిట్లో ఉంచుకునేందుకు భయపెట్టి, రెచ్చగొట్టడం వంటి కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఇటువంటి పలు సంఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. ప్రభుత్వం సిఎఎ నోటిఫై చేసినప్పుడు వారు ఒకప్పటిలా తీవ్రమైన అల్లర్లకు పాల్పడలేకపోయారు. పైగా ఒకప్పటిలా సుప్రీం కోర్టు కూడా మైనార్టీ వర్గం తెచ్చిన పిటిషన్లను తక్షణ ప్రాతిపదికన విచారించి, తీర్పులు ఇవ్వడం లేదు. ఇది ఆ వర్గాన్ని తీవ్రంగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కరొనాకు ముందు సిఎఎ, ఎన్‌ఆర్‌సి వ్యతిరేకత పేరుతో షాహీన్‌బాగ్‌లో వారు చేసిన కాండ వంటిదే ప్రతి చోటా చేయాలని వారు కోరుకుంటున్నప్పటికీ, అంత ఆస్కారం లభించడం లేదు. ముఖ్యంగా, యోగి, హేమంత వంటి ముఖ్య మంత్రులు కుల, మత భేదాలు చూడకుండా తప్పు చేసినవారిని తగినట్టుగా శిక్షిస్తుండడంతో, ఇన్ని దశాబ్దాలుగా బుజ్జగింపులకు అలవాటుపడిన వారికి తీవ్ర బాధను కలిగిస్తోంది.

తాజాగా స్థానిక మల్కాజ్‌గిరీ నియోజకవర్గం పరిధిలోని మేకల మండీ ప్రాంతంలోని పిట్టలబస్తీలో హోలీ సందర్భంగా భక్తి పాటలు పెట్టుకుని హిందూ కుటుంబాలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటు న్నాయి. కాగా, ఆ ప్రాంతంలో గల మసీదులో నమాజుచేసుకొని వచ్చిన కొందరు ఈ కార్య క్రమానికి అభ్యంతరం చెప్పారు. అందుకు, హిందువులు అంగీకరించలేదు. తమ ఏర్పాట్లు తాము చేసుకోవడం ప్రారంభించారు. ఈ విషయంపై రెండు వర్గాల మధ్య వాదన ప్రారంభమైంది. నానా మాటలు అంటూ సుమారు 500మందికి పైగా ముస్లింలువారిపై దౌర్జన్యానికి దిగారని స్థానికులు చెబుతున్నారు. దీనిని అడ్డుకోబోయిన మహిళలు, స్థానికులపై ముస్లిం మూకలు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గొడవ గురించి సమాచారం అందుకుని వచ్చిన మేడిపల్లి పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

ఆశ్చర్యకరం కలిగించే విషయమేమిటంటే, ఇరువర్గాలూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేందుకు పోలీసు స్టేషన్‌కు పరుగుతీయడం. ఫిర్యాదు చేసిన వారిలో పిట్టలబస్తీకి చెందిన ఒక మహిళ తన ఫిర్యాదుకాపీలో పలువురు నిందితులపేర్లను ఏకరువు పెట్టడమే కాదు, వారు కర్రలతో తలపై, పొట్టమీద కొట్టడంతో తీవ్రగాయాలయ్యాని పేర్కొంది.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, మల్కాజ్‌గిరి అభ్యర్ధి ఈటెల రాజేందర్‌, హైదరాబాద్‌ లోకసభ అభ్యర్థి మాధవీలత, మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ సహా హిందూసంఘాల నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హిందూ కుటుం బాలపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజానికి ఆ వర్గానికి అత్యంత మేలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ సర్కారే. ఆ విషయం తెలిసినప్పటికీ, వారు తమ మతమత్తులో నుంచి బయటపడేందుకు ఇష్టపడు తున్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పుడు వారి భయ మల్లా మోదీ తిరిగి అధికారంలోకి వస్తే తమకున్న ప్రత్యేక హక్కులు ఏం ఊడబెరుకుతారేమో అన్నదే.

ఈసారి పాతబస్తీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఒక మహిళను నిలబెట్టడం కూడా ఆ వర్గానికి రుచిస్తున్నట్టు కనిపించడం లేదు. ఆ నియోజకవర్గ అభ్యర్ధి అక్కడి ముస్లిం మహిళల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే ప్రజల దృష్టికి వచ్చిన రెండవ సంఘటన ఇది. తొలి సంఘటన ఇటీవలే కోఠిలోని గుజరాతీ గల్లీలో జరిగింది. పోలీసులు దోషులపై చర్య తీసుకున్నా ఆ ప్రాంత శాసనమండలి సభ్యుడు వచ్చి వారిని విడిపించుకొని పోవడం పరాకాష్టగా భావించాలి. వారం రోజుల్లో తేడాతో చంగి చర్లలో రెండవ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇటువంటి ఘటనలు జరగడానికి అవకాశం ఉన్నందున హిందువులు అప్రమత్తత పాటించడం అవసరంగా మారింది.

About Author

By editor

Twitter
YOUTUBE