– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అదనపు ఆదాయంతో ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కొన్ని వివాదాలు సర్దు కుంటాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగు తాయి. సోదరులు, స్నేహితులతో ఆనందంగా గడుపు తారు. వ్యాపారులు మరింతగా లాభాలు అందు కుం టారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడా కారులకు నూతనోత్సాహం. 17,18తేదీలలో బంధు విరోధాలు. దేవీస్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆత్మీయులు, బంధువుల ఆదరణ పొందుతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త విషయాలు తెలుసు కుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారస్తులు పెట్టుబడులకు తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు తమ సమర్థతను చాటుకుంటారు. 18,19 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. శ్రమ తప్పదు. ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన కార్య క్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. మీమాటకు ఎదురుండదు. బంధువర్గంతో వివాదాలు సర్దుబాటుకాగలవు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూత నందిస్తారు. వ్యాపారస్తులకు అధిక లాభాలు. ఉద్యో గులకు ఒత్తిడులు తొలగుతాయి. 20,21 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు.అనారోగ్యం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. పరపతి మరింత పెరుగు తుంది. భూములు, వాహనాలు కొనుగోలు. బంధువు లతో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, ర చయితలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. 18,19 తేదీల్లో కుటుంబంలో చికా కులు. అనారోగ్యం. గణపతి స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలలో విజయం. సభలు, సమా వేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందు తారు. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. కళా కారులు, రచయితలు, రాజకీయవేత్తలకు ప్రోత్సాహ కరం. 16,17 తేదీలలో వ్యయ ప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలలో మరింత పురోగతి సాధిస్తారు.ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవు తాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. పరిస్థితులు అను కూలం. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభిస్తాయి. రాజకీయవేత్తలు, కళా కారులు, రచయితలకు ఆహ్వానాలు•. 19,20 తేదీల్లో వివాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగు లకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు.. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. కళాకారులు, రచయిత లకు అవార్డులు. 16,17 వ తేదీలలో వ్యయ ప్రయాసలు. ధనవ్యయం. శివపంచాక్షరి పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సంద ర్శిస్తారు. అనారోగ్య సూచనలు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. సహాయం పొందినవారే సమస్యలు సృష్టించవచ్చు, అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి. దూరప్రాంతాల నుంచి సమాచారం.17.18 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
మొదట్లో కొంత చికాకులు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూర తాయి. ఉద్యోగులకు ప్రశంసలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విదేశీపర్యటనలు. 21, 22 తేదీలలో ఖర్చులు. దూరప్రయాణాలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు నూతనోత్సాహం. 16,17 తేదీలలో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. వాహనసౌఖ్యం. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు గుర్తింపు. 17,18 తేదీల్లో వృథా ఖర్చులు. సుబ్రహ్యణ్యాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ముఖ్య కార్యక్రమాలు చకచకా పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు మరింత లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు ఒక సమా చారంతో ఊరట. కళాకారులు, రాజకీయ వేత్తలు, క్రీడాకారులకు సన్మానయోగం. 18,19 తేదీల్లో వ్యయప్రయాసలు. విష్ణుధ్యానం చేయండి.