– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరిఊరట చెందుతారు. మీ ప్రతిపాదనలు, నిర్ణయాలు కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. ముఖ్య కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.  విద్యార్థులు, నిరుద్యోగులు అనుకూల ఫలితాలు సాధి స్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. 18,19 తేదీల్లో  అనుకోని ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు సంభవం. స్నేహితులు, బంధువులతో అకారణంగా తగాదాలు. కష్టానికి తగ్గ ఫలితం కని పించదు. విలువైన వస్తువులు, వాహనాలు జాగ్రత్తగా చూసు కోండి.  రాజకీయవేత్తలు, కళా కారులకు అవకాశాలు చేజారతాయి. రచయితలు, క్రీడాకారులు కొంత నిరుత్సాహం చెందుతారు. 19,20 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. దేవీఖడ్గమాల పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని బాకీలు అందుతాయి. ఆస్తివివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు ఆశించిన విధంగా లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులు విధినిర్వహణలో ప్రశంసలు అందుకుం టారు. పారి శ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం. క్రీడాకారులు విశేష గుర్తింపు పొందు తారు. 20,21 తేదీల్లో లేనిపోని  వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త పనులు ప్రారంభిస్తారు.  కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తులకు  లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు.  పారిశ్రామిక వేత్తలకు విదేశీపర్యటనలు. కళాకారులు, పరి శోధకులు, రచయితల యత్నాలు సఫలం. 15,16 తేదీల్లో వృథా ఖర్చులు. ప్రయాణాలు.అనారోగ్యం.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆకస్మిక ధనలాభం.  ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇళ్లు, స్థలాలు సమకూర్చుకుంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నేర్పుగా ఆస్తి వివాదాలనుంచి బయటపడతారు.  ఉద్యోగులకు హోదాలు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అనుకోని విదేశీ పర్యటనలు. కళాకారులు, రచయితలు సత్తా చాటుకుంటారు.19,20 తేదీల్లో  కుటుంబసభ్యులతో తగాదాలు. గణేశాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే.  గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించవచ్చు. ఆస్తి వివాదాల పరి ష్కారం. వ్యాపారస్తులకు ఊహించని లా•భాలు అందు తాయి. పారిశ్రామికవర్గాలవారు అనుకున్నది సాధి స్తారు. క్రీడాకారులు, రచయితలు, కళాకారులకు పట్టింది బంగారమే. 18,19 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శివస్తుతి మంచిది.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

వివాదాలు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. ఆదాయానికి లోటుఉండదు.  వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందు తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. రాజకీయ, పారిశ్రామిక వేత్తల యత్నాలు సఫలం. కళాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 16,17 తేదీల్లో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. అన్నపూర్ణాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

మీ కష్టం ఫలించే సమయం. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారంరాగలదు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగాఉంటాయి. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు విదేశీ పర్యటనలు. 15,16 మానసిక అశాంతి. ఆంజనేయ దండకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

నిరుద్యోగులు, విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. రాబడి ఆశించినంతగా ఉండి అవసరాలు తీరతాయి.  కాంట్రాక్టులు దక్కవచ్చు.  వ్యాపారులు పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయ వేత్తలు, కళాకారులకు సన్మానాలు. క్రీడాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 18,19 లలో ప్రయాణాలు.శివపంచాక్షరి పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. చేపట్టిన కార్య క్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. స్థిరాస్తి వివా దాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఉద్యోగులకు పైస్థాయివారినుంచి సమస్యలు తీరతాయి. కళా కారులు, పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. రచ యితలు, పరిశోధకులకు అవార్డులు దక్కే అవ కాశం. 20,21లలో శుభవార్తలు. వాహనయోగం. మంచిది.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు పయనిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులు మరింతగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి. పారిశ్రామిక వేత్తలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. 15,16 తేదీల్లో  ఆస్తి వివాదాలు. శారీరక రుగ్మతలు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

రాబడి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు.  ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వివాహ,ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి.   పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు అవార్డులులభిస్తాయి. 15,16 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE