‘‘భారతదేశంలో ఇస్లాం యధాతథంగా ఉంది. ఎందుకంటే, ఇస్లాంను భారత్ తన గొప్ప వైఫల్యంగా పరిగణంచి చూస్తోంది. తాను పూర్తిగా మతాంతరీకరించిన ఇతర దేశాలలోలాగా ఇస్లాం, భారతదేశంలో ఎప్పుడూ విశ్రమించలేకపోయింది. ఖురాన్‌లో మూలాలు కలిగిన దాని సైద్ధాంతిక కోరలను పీకివేయడాన్ని హిందువుల నేర్చుకొనే వరకూ అది విశ్రమించదు!’’
చంద్‌మల్ చోప్రా అనే వ్యక్తి ఖురాన్‌ను నిషేధించాలని కోరుతూ కలకత్తాలో దాఖలు చేసిన పిటిషన్‌ను, అందులోని అంశాలను, ఆ కేసు సందర్భంలోనూ, అనంతర పరిణామాలను సంకలనం చేసి ప్రముఖ రచయిత సీతారాం గోయల్ ‘కలకత్తా ఖురాన్ పిటీషన్’ పేరిట పుస్తకాన్ని ప్రచురిం చారు. ఆ పుస్తకం మూడవ ఎడిషన్‌కు ముందుమాట రాస్తూ గోయెల్ అన్న మాటలివి. ‘భారతదేశంలోని హిందూ మేధావులుగానీ, ముఖ్యంగా హిందూ నాయకత్వం కానీ, భారత జాతీయవాదానికి, ఇస్లామిక్ సామ్రాజ్యవాదానికి మధ్య పునరుద్ధరించిన పోటీ విషయంలో ఎటువంటి పాఠాలు నేర్చుకున్న సంకేతాలు కనిపించడం లేదని’ ఆయన అభిప్రాయ పడ్డారు. దానికి తోడు, నేడు పాకిస్తాన్ ఆచరిస్తున్న ఇస్లాం అది ఆవిష్కరించిందేం కాదని, అది ఎప్పుడూ భారతదేశం (దక్షిణ ఆసియా లేదా ఇండో-పాక్ ఉపఖండం)లో ఎనిమిదవ శతాబ్దం నుంచే ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, దీని గురించి ఆలోచించే వారందరూ కూడా మతోన్మాద, రక్తపిపాసి అయిన ఇస్లాంకు భారత్ ఎప్పుడూ కంచుకోటగా ఉంది, ఉంటుంది అని గుర్తించాలని ఆయన హెచ్చరించారు.
దేవ్‌బంద్ ఫత్వా
దాదాపు నాలుగు దశాబ్దాల కింద ఆయన వెలువరించిన ఈ పుస్తకంలోని అభిప్రాయాలు ఇప్పటికీ వర్తిస్తాయనే విషయాన్ని ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని సహరాన్‌పూర్‌లో దేవబంద్‌కు చెందిన దారుల్ ఉలూమ్ మదరసా తన తీవ్రవాద మనస్తత్వాన్ని బయటపెట్టుకోవడం ద్వారా రుజువుచేసింది. ఇస్లామిక్ గ్రంథాలలో పేర్కొన్న ఘజ్వా-ఎ-హింద్‌ను గుర్తిస్తూ దారుల్ ఉలూమ్ ఫత్వాను జారీ చేసింది. ఘజ్వా-ఎ-హింద్ అంటే భారత్ మీద దాడి, మరొక మాటలో చెప్పాలంటే హిందువులపై దాడి. కనుక వారిపై దాడిచేస్తూ మరణించిన వారిని గొప్ప వీరులుగా కీర్తిస్తారని, ఒకవేళ ఈ పోరాటంలో మరణిస్తే వారు నేరుగా స్వర్గానికి వెడతారని పేర్కొంది. ఇటువంటి వివాదాస్పదమైన ఫత్వాలను జారీ చేయడం దారుల్ ఉలూమ్‌కు కొత్తకాదు. అనేకసార్లు ఇటువంటి ఫత్వాలను జారీచేసి ఆ ఇస్లామిక్ సంస్థ వార్తల్లోకెక్కింది.
భారత ఉపఖండంలో జరుగనున్న ఘజ్వా-ఎ- హింద్‌ను హదీత్ ప్రస్తావిస్తుందా? అందులో మరణించినవాడు గొప్ప అమరుడు, గొప్ప ఘాజీ (యుద్ధ వీరుడు) అయి స్వర్గానికి (జెన్నత్) వెడతాడా, దయచేసి సమాధానమి మ్మంటూ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అల్లా సందేశం తెచ్చిన వ్యక్తి తాము భారత్‌పై దాడి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం నన్ను నేనే కాదు, నా సంపదను కూడా త్యాగం చేస్తాను. ఒకవేళ నన్ను చంపితే, నేను ఉత్తమ వీరుడిని అవుతాను, ఒకవేళ నేను తిరిగి వస్తే నేను అబు- హురాయ్రా ఆల్-ముహర్రార్‌ను అవుతా నంటూ దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ సమాధానం ఇచ్చింది. పసి మనసులను విషపూరితం చేయగల ఈ ఫత్వా వెలుగులోకి రావడంతో బాలల హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది.
బాలల హక్కుల జాతీయ కమిషన్ జోక్యం!
ఈ ఫత్వాకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని కోరుతూ సహరా న్‌పూర్ ఎస్‌డిఎం, ఎస్పీలకు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో లేఖ రాశారు. ఈ విషయంలో హోంశాఖకు బదులుగా బాలల హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడం ఏమిటా అని ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ, ఈ ప్రశ్నకు సమాధానంగా కనూంగో చెప్పిన మా•లలో వాస్తవాన్ని వింటే, మనకైనా వెన్ను జలదరిస్తుంది. దారుల్ ఉలూం దేవ్‌బంద్‌కు అనుబంధంగా కేవలం భారత్‌లోనే కాదు, బంగ్లాదేశ్ సహా దక్షిణ ఆసియాలో కూడా పెద్ద సంఖ్యలో మదరసాలు నడుస్తున్నాయి. వీటికి పాఠ్యాంశాలను, సైద్ధాంతికమూలాన్ని ఇచ్చేది దేవ్‌బందే. ఈ క్రమంలో ఈ మదరసాలలో చదువు కునే పిల్లలు తమ మాతృదేశానికి వ్యతిరేకంగా ఎంతటి ద్వేషపూరిత మనస్తత్వంతో బయటకు వస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇది అనంతర కాలంలో వారి మానసిక, భౌతిక సమస్యలకు కారణమవు తుంది. అంటే ఒకరకంగా, జిహాదీలుగా బయటకు వస్తారన్న మాట! ఈ దుస్థితి నుంచి బాలలను కాపాడడమే బాధ్యతగా భావించిన బాలల హక్కుల కమిషన్ ఈ ఫత్వా జువనైల్ జస్టిస్ యాక్ట్, 2015 లోని సెక్షన్ 75ను ఉల్లంఘిస్తున్నందున వారిపై కేసు నమోదు చేసేందుకు ముందుకు వచ్చింది.
దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ జనవరి 2022లో, జులై 2023లో కూడా జారీ చేసిన వాటితో సహా పెద్ద సంఖ్యలో ఫత్వాలను కమిషన్ జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ఫత్వాలన్నిం టినీ దారుల్ ఉలూమ్ తమ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తు న్నదని, ఇది ప్రజలను పక్కదోవ పట్టించే అవకాశం ఉంది కనుక సంస్థ వెబ్‌సైట్ సహా అటువంటి ఇతర వెబ్‌సైట్‌లు ఏమైనా ఉంటే లోతుగా పరిశీ లించి, దర్యాప్తు చేసి తక్షణమే బ్లాక్ చేయవలసిందిగా కమిషన్ గతంలో కోరింది. అయితే, జిల్లా యంత్రాంగం దీనిని గంభీరంగా పరిగణించక పోవడమే కాదు ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో, వారిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం ద్వారా అటువంటి విషయాంశాలను ప్రజలు చదవడం వల్ల తలెత్తే అవాంఛనీయ పరిణామాలకు జిల్లా యంత్రాంగం కూడా సమానంగా బాధ్యురాలవుతుందనే అభి ప్రాయానికి కమిషన్ వచ్చిందని కనూంగో అన్నారు.
జిహాద్ అంటే ఏమిటి?
కశ్మీర్ ఉదంతం నుంచి నిన్నటి హల్ద్వానీ, సందేశ్ ఖాలీ ఘటనల వరకూ జరుగుతున్న దాడులను గమనిస్తే ఎవరికైనా వచ్చే అనుమానం ఒక్కటే. ఇస్లాం శాంతిని ప్రబోధిస్తే, ఇటువంటి హింసాత్మక సంఘ టనలు ఎందుకు జరుగుతు న్నాయి? సాధారణంగా చర్చలకు వచ్చినప్పుడు ముస్లిం ప్రతినిధులు మతపెద్దలు ‘జిహాద్’ అంటే పవిత్ర యుద్ధమని, వ్యక్తి తనలోని అంతర్గత శత్రువులపై చేయవలసిన పోరాటమని అంటుంటారు. కానీ, ప్రవక్త సహా అనంతర కాలంలో ఇస్లామిక్ సిద్ధాంతంలో వాడిన ‘జిహాద్’ అన్నది సాధారణ పదం కాదని సీతారాం గోయెల్ అభిప్రాయపడ్డారు. కాఫిర్లను పూర్తిగా మతాంతరీకరించేవరకూ లేదా జిమ్మీలు (ముస్లింల ఆధిపత్యంలో జీవించేందుకు) అయ్యేందుకు అంగీకరించే వరకు లేదా సామూహికంగా హననం చేసి, తమదైన నిజ విశ్వాసాన్ని వ్యాప్తి చేసేందుకు ఒక సంపూర్ణ వ్యవస్థ- అంటే ఉగ్రయుద్ధం అంటూ ఆయన ‘జిహాద్’ అన్న పదానికి వివరణ ఇవ్వడం గమనార్హం.
నిషేధం కోసం కలకత్తా పిటిషన్
ఖురాన్ హింసను ప్రేరేపిస్తుందని, ప్రజాశాంతిని భగ్నం చేస్తుందని, వివిధ మతాలు, సమాజాల మధ్య మతపరమైన శుత్రుత్వాన్ని, ద్వేషాన్ని పెంచడమే కాక, ఇతర మతాలను, వారి విశ్వాసాలను అవమాన పరుస్తుంది కనుక దానిని ఐపిసి సెక్షన్లు 153ఎ, 295ఎ కింద నిషేధించాలని చంద్‌మల్ చోప్రా తన పిటిషన్‌లో కోరడం నాడు బెంగాల్ సహా దేశ, విదేశాల్లో సంచలనాన్ని రేకెత్తిం చింది. దీనిపై చర్చోపచర్చలు సాగాయి. అంతిమంగా, హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పిచ్చింది. అయితే, అందులో లేవనెత్తిన విషయాలు తప్పనిసరిగా చర్చించ వలసినవి. భారతదేశంలో ఇస్లామిక్ సామ్ర్యావాద తోడుదొంగలు కమ్యూ నిస్టులు, సోషలిస్టు, నెహ్రూవాద సెక్యులరిస్టులు, గాంధేయవాదులు – వీరంతా కూడా ఇస్లాంను కాపాడేందుకు అన్ని న్యాయపరమైన మర్యాదలను, విధానాలను గాలికొదిలేస్తారు. వారి దృష్టిలో తమ సామాన్య శత్రువు హిందూ సమాజం, సంస్కృతి. వాటికి వ్యతిరేక, శక్తిమంతమైన, సమర్ధవంతమైన ఆయుధంగా వారు ఇస్లాంను చూస్తారని గోయెల్ చేసిన వ్యాఖ్యలు అసమంజసమైనవి కావు.
చంద్‌మల్ చోప్రా పశ్చిమబెంగాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా దేశంలోనే కాదు, పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో కూడా సంచలనం నెలకొంది. నాటి పాక్ మైనార్టీ వ్యవహారాలమంత్రి దీనిని మతపరమైన అసహనంగా అభివర్ణిస్తూ ప్రకటన చేయడం, భారత్‌లో, బంగ్లా దేశ్‌లో ముస్లిం మూకల హింసాత్మక ప్రదర్శనలు, పిటిషన్ దాఖలు చేసినవారిపై అబద్ధపు ఆరోపణలు, పత్రికల అసత్యరాతలు, ఒక పథకం ప్రకారం చంద్‌మల్‌కు తన వాదనలను సమర్థించుకునేందుకు తగిన సమయం ఇవ్వకపోవడం చేయడం ద్వారా కోర్టు దానిని డిస్మిస్ చేసి, తీర్పునిచ్చేందుకు వేదికను తయారు చేసుకుంది. తన తీర్పులో కూడా భారత్‌లో సెక్యులరిజం గొప్పతనం, ఇస్లాంలోని లోతైన విష•యాలు అంటూ న్యాయమూర్తి ప్రస్తావనలు చేస్తూ కేసును ముగించి, భారత సెక్యులరిజాన్ని కాపాడారు!
‘దేశంలో మతకల్లోలాలు ఎందుకు జరుగుతాయి?’
సీతారాం గోయెల్ పుస్తకం తొలి ఎడిషన్ 1986లో ప్రచురితం కాగానే, చంద్‌మల్‌చోప్రా దాఖలుచేసిన కలకత్తా ఖురాన్ పిటీషన్‌లో ‘ఆయత్’లు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో, ఆ ఆయత్‌లతో ఒక నిరసన పోస్టర్‌ను తీయాలని హిందూ రక్షక్ దళ్ అనే సంస్థ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు ఇంద్రసేన్ శర్మ, కార్యదర్శి రాజ్‌కుమార్ ఆర్యలు నిర్ణయించి, దానిని ప్రచురించారు. ‘దేశంలో మతకల్లోలాలు ఎందుకు జరుగుతాయి?’ అన్న శీర్షికతో ప్రచురించిన ఆ పోస్టర్‌లో ప్రచురణకర్తలు ఖురాన్‌లోని 24 ఆయత్‌లను ప్రస్తావించారు. ఇతర మతాలను అనుసరించే వారికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ ఆయత్‌లు ముసల్మాన్లను ఆదేశిస్తాయి. ఈ ఆయత్ లను ఖురాన్ నుంచి తొలగించనంతవరకూ దేశంలో మతకల్లోలాలను నివారించ లేమని వారు ఆ కరపత్రంలో తమ వ్యాఖ్యను జోడించారు.
కాగా, ఖురాన్‌ను ఏయే సెక్షన్ల కింద నిషేధించా లని కోరుతూ చంద్‌మల్ చోప్రా తన పిటిషన్‌లో కోరారో అవే సెక్షన్లైన 153ఎ, 295 ఎ కింద వారిరువురిని అరెస్టు చేసి, నాటి ప్రభుత్వం తన సెక్యులరిజాన్ని బయటపెట్టుకుందే తప్ప తమ ముందున్న ముప్పును గుర్తించడానికి ఇష్టపడలేదు. ఈ కేసు ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి కారణం ఇంద్రసేన్‌శర్మ నాడు ఆలిండియా హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు కావడం కూడా. ప్రాసిక్యూషన్ తాము పెద్ద చేపను పట్టామనే ఉత్సాహంలో ఉండగా, ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జెడ్ ఎస్.లోహత్ వారి భావాలతో ఏకీభవించలేదు. అభియోగాలను మోపి, శిక్షించేందుకు తగిన రుజువులు ప్రాసిక్యూషన్ ఇవ్వనందున వారిని వదిలిపెడుతున్నానని పేర్కొంటూనే, పవిత్ర గ్రంథమైన ఖురాన్ మజీద్‌కు తగిన గౌరవమిస్తున్నానని, కానీ ఆ ఆయత్‌లను సన్నిహితంగా పరిశీలిస్తే, అవి హానికరమైనవని, మహమ్మదన్లకు, దేశంలోని ఇతరవర్గాలకు మధ్య విబేధాలు సృష్టించే అవకాశం కల్పించేవిలా ఉన్నా యని తన తీర్పులో మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించారు.
బహిరంగ చర్చే పరిష్కారం
ఈ క్రమంలోనే గోయెల్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. మతపరమైన లేదా ఇతరత్రా పుస్తకాలను నిషేధించడమనేది ప్రతికూల ఫలితాలనిస్తుందని తాము నిష్కర్షగా భావిస్తున్నామన్నారు. ముఖ్యంగా, ఖురాన్ విషయానికి వస్తే, ముస్లిమేతరులు పెద్ద సంఖ్యలో దానిని చదవడం ద్వారా అందులో ఉన్న బోధల నాణ్యతను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నామని ఆయన అన్న మాటలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.
తాము కలకత్తా పిటిషన్ పుస్తకాన్ని ప్రచురించడా నికి కారణం, మతంగా ఇస్లాంపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం; ముఖ్యంగా, ఖురాన్, హదీజ్ అనేవి దైవిక మూలాలు కలిగినవనే వారి వాదనపై చర్చించడం అని ఆయన వివరణ ఇచ్చారు.
భారతదేశంలోని ముస్లింలు తమపై, తమ ప్రవక్తపై బహిరంగ చర్చను నిరోధించేందుకు భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)లోని సెక్షన్లు 153ఎ, 295ఎను అడ్డంగా పెట్టుకుంటారు. ప్రవక్తను, ఇస్లాంలో దైవీసంభూతులుగా భావించే వ్యక్తుల గురించి ఎవరైనా విమర్శనాత్మకంగా ప్రచురించడం అన్నది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 95 కింద నిషేధితం. ఇందుకు కారణం, అరిచిగీపెడుతూ, హింసాత్మకంగా నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా వారు తెచ్చే ఒత్తిడే. అయితే, చట్టంలోని ఇవే సెక్షన్లను పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను నిషేధించమని కోరేందుకు ఉపయోగించ వచ్చనే విషయాన్ని వారు 1985లో కలకత్తా కోర్టులో ఖురాన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయ్యే వరకూ గుర్తించలేకపోయారు. అయితే, వారికి కవచ కుండలాల్లా వామపక్షవాదులు, సెక్యులర్, ఉదారవాదులు ఉన్నంతవరకూ భయంలేదని కూడా గ్రహించారు.
నీల