రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని భారత్ ఉత్సవంగా జరుపుకున్నప్పుడు ఒక దేశం, ఆ దేశపౌరులు ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు, శుభాభినందనలు వెల్లువెత్తించారు. సాంస్కృతిక పునరుద్ధరణకు చట్టాలు చేసిన భారత్, గ్రీస్‌లు పురాతన కాలం నుంచి సన్నిహిత, చారిత్రక, సాంస్కృతిక, నాగరికతాపరమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. వాణిజ్యం, విజ్ఞానం ఇచ్చిపుచ్చుకున్న చరిత్ర కలిగిన ఈ దేశాలు సమగ్రమైన సంబంధాలను పటిష్టం చేసుకున్నాయి. ఇవి రెండూ పూర్వం నుంచి సముద్రయానం తెలిసిన దేశాలే. ఈ దృక్పథంలో చూసినప్పుడు హెలెనిక్ రిపబ్లిక్ భారత్‌కు సహజ, సంప్రదాయ మిత్రదేశం. ఈ సంబంధాల బలానికి మరింత ఊతాన్నిస్తూ, హిందూ మహా సముద్ర, మెడిటరేనియన్ ప్రాంత శక్తిమంతమైన భారత్, గ్రీస్‌లు ద్వైపాక్షిక సంబంధాలకు మరింత జీవాన్నిస్తూ నూతన శకానికి నాంది పలికాయి.
సాంస్కృతిక సంబంధాలను సమీక్షించి, పునరనుసంధానిస్తూ, ప్రధానమంత్రి మోదీ ఆగస్టు 2023లో గ్రీసులో పర్యటించారు. భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. ఇరుదేశాల నాయకులు తమ సంబంధా లను వ్యూహాత్మక కక్ష్యలోకి తీసుకువెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాలను ‘సహజ పునః కలయిక’గా అభివర్ణిస్తూ ప్రధాని మోదీ గ్రీస్ చేరుకున్నారు. తూర్పు యూరప్ ప్రాంతంతో వ్యూహాత్మక సంబంధాలను కలిగి ఉండేందుకు వారిని చేరుకోవాలన్న ఉద్దేశంతో అదే ఊపును నిలకడగా కొనసాగిస్తూ గ్రీసు ప్రధాన మంత్రి కైరియాకోస్ మిత్సోతకిస్‌ను 9వ రైజినా డైలాగ్స్, 2024లో ప్రారంభోపన్యాసం చేసేందుకు భారత దేశం ఆహ్వానించింది. రైజినా డైలాగ్స్‌లో ఒక యూరో పియన్‌ను ముఖ్య అతిథిగా పిలవడం మూడేళ్లలో ఇది వరుసగా మూడవసారి. 2023లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి, అంతకు ముందు ఏడాది యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డేర్ లెయన్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది.
రెండురోజుల అధికారిక పర్యటన కోసం ప్రధాని మిత్సోతకీస్ ఫిబ్రవరి 21న న్యూఢల్లీికి వచ్చారు. దాదాపు 15ఏళ్ల తర్వాత గ్రీస్ ప్రధాని తొలి పర్యటన ఇది. దాదాపు 63 మంది సభ్యుల వాణిజ్య బృందం సహా ఉన్నత స్థాయి ప్రతినిధులతో వచ్చిన గ్రీస్ ప్రధాని, సంప్రదాయ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, ప్రతినిధి స్థాయి చర్చలను నిర్వహించ డమే కాక, ప్రధాని మోదీతో పరిమిత చర్చలు నిర్వహించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించి, సుసంపన్నం చేయాలన్న దృఢ సంకల్పంతో, ద్వైపాక్షిక చర్చల సందర్భంగా 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా తోడ్పడేం దుకు, సహకరించు కునే రంగాలను నాయకులు గుర్తించారు. భారత్` గ్రీస్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం 2022`23లో 2 బిలియన్ డాలర్లు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసేందుకు, దేశాలు ఫార్మస్యూటికల్ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రేవులు, షిప్పింగ్, రసాయన పరిశ్రమ, ఆహారం, సమాచార రంగాలు, వ్యవ సాయం, పర్యాటకంలో సహకారంపై దృష్టి పెట్టాయి. వ్యూహాత్మక భాగస్వామ్య వేదికను బలోపేతం చేసేందుకు నాయకులిద్దరూ 2023 ఆగస్టులో ఎన్‌ఎస్‌ఎ స్థాయిలో చర్చల కోసం సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిష్యత్ సహకారానికి వేదికను ఏర్పాటు చేస్తూ, గ్రీస్ ప్రధాని భారత పర్యటనకు ముందే ఇరు దేశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎలు ఫిబ్రవరి 8వ తేదీన న్యూఢల్లీిలో సమావేశమైన ఇరు దేశాల భాగస్వామ్య దృక్పధానికి అనుగుణంగా సహకారానికి అవసరమైన మార్గాలను గుర్తించారు.
మెరుగైన ద్వైపాక్షిక సహకారం కోసం మార్గాన్ని అనుసరిస్తూ, నాయకులు అంతరిక్ష, నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, పర్యావరణ అనుకూల ఇంధనం, పునరావృత ఇంధనం, ఇ`గవర్నెన్స్, ఇ`లెర్నింగ్, ఉద్భవిస్తున్న సాంకేతికతలను తాజా పరచుకోవడం, స్టార్టప్, ఆవిష్కరణ రంగాలలో సహకారానికి సంభావ్యత ఉన్నట్టు నాయకులు గుర్తించారు.
తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగితతో అల్లాడుతున్న గ్రీసు ఆర్ధిక వ్యవస్థను మిత్సోతకిస్ తన సంస్థాగత సంస్కరణలతో స్థిరీకరించారు. గ్రీస్ తీవ్రమైన ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుని, దివాలా తీయడాన్ని నివారించడానికి 260 బిలియన్ల యూరోల విలువైన మూడు భారీ బెయిలౌట్ల అవసరంలో ఉంది. అటువంటి ఆర్ధిక వ్యవస్థను ప్రస్తుతం పెట్టుబడి స్థాయికి తీసుకువచ్చారు. రెండవ పర్యాయం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే ఆయన వృద్ధి పథాన్ని వేగవంతం చేసేందుకు అవసరమైన అనుకూల వ్యాపార వాతావరణాన్ని సృష్టించారు.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థగా అవతరించే దిశలో ఉన్న భారత్‌తో ఆర్ధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవాలన్న ఆసక్తితో, ముంబైలో నిర్వహించిన భారత్` గ్రీస్ వాణిజ్య సదస్సులో ప్రధాని మిత్సోతకీస్ భారతీయ వాణిజ్య వేత్తలను లాజిస్టిక్స్, ఇంధన, సరఫరా లంకెల రంగాలలో ఉన్న అవకాశాలను వినియోగించుకో వలసిందిగా ఆహ్వానించారు. భారతీయ కార్మి కుల వ్యవస్థీకృత వలసలను సులభతరం చేసేందుకు మిత్సోతకీస్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్‌షిప్ అగ్రిమెంట్ (ఎంఎంపిఎ)ను త్వరితగతిన కుదుర్చు కునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణం, ఆతిథ్యం, వ్యవసాయ రంగాలలో కార్మిక శక్తి లోటును గ్రీస్ ప్రస్తుతం ఎదుర్కుంటున్న నేపథ్యంలో భారతీయ ప్రతిభను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.
భౌగోళికరాజకీయంగా అస్థిర ప్రాంతాలలో వ్యూహాత్మకంగా స్థితమై ఉన్న నౌకాదళ శక్తులు భారత్, గ్రీస్‌లు ఒకేరకమైన ముప్పులను, సవాళ్లను ఎదుర్కొం టాయి. జాతీయ భద్రతా సామర్ధ్యాలను మెరుగు పరిచేందుకు ఇరు దేశాల క్రమంతప్పకుండా ఉమ్మడి విన్యాసాల ద్వారా స్థిరంగా అంతర్ కార్యాచరణను పెంపొందించాయి. దానిని మరొక స్థాయికి తీసుకు వెళ్లాలన్న ఆసక్తని ఇరు దేశాలూ ప్రదర్శిస్తూ రక్షణ ఉత్పత్తిరంగంలో ఉమ్మడి వెంచర్లను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ, భారత దేశంలో రక్షణ తయారీలో సహ` ఉత్పత్తి, సహ`అభివృద్ధికి అవకాశాలను సృష్టిస్తున్నామని, ఇది ఇరుదేశాలకూ లాభదాయకమని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాలకు చెందిన రక్షణ పరిశ్రమలను అనుసంధానం చేయాలని తాము అంగీకారానికి వచ్చామన్నారు.
మధ్యధరా సముద్రం, ఇండో`పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యాలను నిర్మించుకోవాలన్న నిబద్ధతను బలపరుస్తూ, భారత్ ప్రతిపాదిస్తున్న ఇండో`పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ)లో చేరాలన్న గ్రీస్ నిర్ణయాన్ని మిత్సోతకిస్ ప్రకటించారు.
ఎర్రసముద్రంలో ఎడతెరిపి లేకుండా జరుగు తున్న దాడుల నేపథ్యంలో ఇరు దేశాలకూ వాణిజ్య నౌకలు సురక్షితంగా, భధ్రంగా ప్రయాణించగలగడం ప్రధాన సవాలుగా మారింది. కనుక, సముద్రయాన అనుసంధానతను పెంపొందించుకోవలసిన అవసరంతో పాటు, ఇండియా` మిడిల్ ఈస్ట్` యూరోప్ ఎకనమిక్ కారిడార్ (ఐఎంఇసీ) భాగస్వామ్యంతో సహా వైమానిక అనుసంధానత అవసరాన్ని నాయకులు నొక్కి చెప్పారు. సముద్ర యాన అనుసంధానత అన్నది ఐఎంఇసీ పరిధి కిందకి వస్తుంది. భారత్, గ్రీక్‌ల మధ్య వైమానిక అనుసంధానతను మెరుగుపరిచేందుకు ఇరు దేశాల మధ్య నేరుగా విమానసేవలను ప్రారంభించ వలసిం దిగా ప్రైవేటురంగాన్ని నాయకులు ప్రోత్సహించారు.
‘ఐరోపాకు వెళ్లేందుకు భారత్ నా దేశాన్ని మించిన ప్రవేశద్వారాన్ని కనుగొనలేదు, అలాగే గ్రీస్‌కు ఆసియాను చేరుకునేందుకు భారత్‌తో సన్నిహితమైన వ్యూహాత్మక సంబంధాలను కలిగి ఉండటాన్ని మించిన ప్రవేశద్వారం ఉండబోదు’ అని భారత పర్యటనకు బయలుదేరే ముందు మిత్సోతకిస్ పేర్కొన్నారు.
ఐరోపాకు ప్రవేశద్వారం గ్రీస్. 2008లో గ్రీస్ ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న సమయంలో చైనా వారికి సాయపడిరది. చైనా ప్రభుత్వ షిప్పింగ్ కంపెనీ సీఓఎస్‌సీఓ పోర్ట్ పైరియస్ నిర్వహణ హక్కులను కొనుగోలు చేసింది. క్రమంగా ఆ రేవులో తన యాజమాన్య వాటాను 67శాతానికి పెంచుకుంది. పైరియస్‌లో తన కార్యనిర్వహణ ఆధారంగా, చైనా తన జాడలను ఐరోపాకు విస్తరించింది. కాగా, భారతీయ ప్రైవేటు కంపెనీలు రేవుల నిర్మాణంలో గ్రీకు భాగస్వాములతో చురుకుగా పని చేస్తున్నాయి. ఈ ఉమ్మడి వెంచర్లు ఈ ప్రాంతంలో చైనా చొచ్చుకు పోవడాన్ని నిలవరించగలవు.
బలమైన జీ2జీ భాగస్వామ్యాలతో పాటుగా, ఇరు దేశాలూ బీ2బీ కార్యకలా పాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ పర్యటనలో చెప్పుకోదగిన ఫలితం, ప్రైవేటు రంగంతో పలు ఎంఓయూలు, ఒప్పందాలు ఖరారు కావడం. ఇందులో రెయిజినా డైలాగ్‌కు, డెల్ఫి ఫోరంకు మధ్యÑ యూరోబ్యాంకు, ఎన్‌సీఐ మధ్యÑ భద్రతా అంశాలపై ద్వైపాక్షిక చర్చలు, ఎంటర్‌ప్రైజ్ గ్రీస్ `సీఐఐÑ ఎంటర్‌ప్రైజ్ గ్రీస్, ఫిక్కీ, ఏథెన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీల మధ్య ఎంఓయూలు చేసుకున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ నిలువరించ లేనప్పటికీ, గతవారం ఐఎంఇసీికి సంబంధించి తన భాగస్వామ్యాన్ని యుఏఈ గతవారం దృఢ పరిచింది. ముఖ్యంగా, ఆరోగ్యవంతమైన లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో తన నిబద్ధతను చూపింది. ఐఎంఇసి సాకరమయ్యే ప్రాజెక్టుకాదని, కలలు కల్లలు అవుతాయనే నకారాత్మక శక్తులకు ఆగ్రహం కలిగించేలా ద్వైపాక్షిక చర్చలు, రెయిజినా డైలాగ్ ఉపన్యాసాలలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఐఎంఇసీి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ‘శాంతి ప్రాజెక్టు’ పట్ల భారత్, గ్రీస్ పట్టుదలతో ఉండాలని మిత్సోతకిస్ వ్యాఖ్యానించారు.
సముద్ర దొంగలు, దేశ సైన్యాలతో పీడనకు గురవుతున్న ప్రాంతాల గుండా వెళ్లవలసిన వాణిజ్య నౌకలకు ప్రత్యామ్నాయ, ఆచరణీయ అనుసంధాన తను ఐఎంఇసీి కారిడార్ కల్పిస్తుంది. ఇరుకైన జలసంధులు, భద్రతలేని ప్రాంతాలతో నిండిన సముద్ర మార్గం నుంచి ఐఎంఇసీ ఉపమార్గంగా ఉంటుంది. ఇది భూసరిహద్దుల గుండా వెళ్లే సురక్షిత భౌగోళిక రవాణా నెట్‌వర్క్ ద్వారా వాణిజ్య రవాణా దారి మార్చేందుకు ఆచరణీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. తీవ్రంగా దెబ్బతిన్న యుఎస్`ఇరాన్ సంబంధాలు మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న భద్రతా సవాళ్లను మరింత సంక్లిష్టం చేసి, విశ్వసనీయ అనుసంధానత అవసరాన్ని పెంచాయి.
ఇయుతో ఎఫ్‌టిఎ (స్వేచ్ఛా వాణిజ్య) చర్చల పురోగామ దిశలో ఉన్నందున, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య నౌకాదళాన్ని నియంత్రించే గ్రీసుతో వ్యూహాత్మక భాగస్వామ్యం భారతదేశ ఆర్ధిక ఆకాంక్షలకు భారీ ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే, గణనీయమైన చమురు, సహజవాయువుల గణనీయ నిల్వలు కలిగిన గ్రీస్, భారతదేశ ఇంధన భద్రతలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
ఉక్రైన్ యుద్ధం, పశ్చిమ ఆసియా సంఘర్షణ వంటి అంతర్జాతీయ సవాళ్ల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా, ‘వివాదాలను, ఉద్రిక్తతలను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని అన్ని దేశాలు విశ్వసిస్తున్నాయ’న్నారు.
భారత్‌ను ఏకాభిప్రాయ నిర్మాత, గ్లోబల్ సౌత్‌లో ప్రముఖ ప్రజాస్వామ్యంగా ప్రస్తావిస్తూ, మిత్సోతకిస్ భారత్ ప్రజాస్వామిక వ్యవస్థను ప్రశంసించారు. ప్రజాస్వామిక ధర్మాలను పరిరక్షించడం, నిబంధనల ఆధారిత వ్యవస్థకు కట్టుబడి ఉంటున్న భారత్ అంతర్జాతీయ వేదికలపై విలువను కలిగిన గొంతుకగా, ఒక శక్తిగా ఉద్బవిస్తోందన్నారు. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, పెరుగుతున్న ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ వంటి విశ్వసనీయ భాగస్వామ్యం కోసం దేశాలు చూస్తున్నాయి.
నాగరికతా పరమైన లంకెలు, సమకాలీన వ్యూహాత్మక కలయికల కోసం నాయకులు తమ భాగస్వామ్యాన్ని తీవ్రతరం చేసేందుకు వేదికను ఏర్పాటు చేశారు. భారీ భౌగోళిక రాజకీయ సంస్థితులు, అస్థిరతల నడుమ ఒక బలమైన పునాదిగా వ్యవహరించేందుకు ఒక స్థిరమైన భాగ స్వామ్యాన్ని ఖరారు చేసుకోవాలని ఆకాంక్ష అత్యవసరాన్ని తక్కువకాలపు ఉన్నతస్థాయి పరస్పర పర్యటనలు పట్టి చూపుతాయి. పరస్పర లాభదాయక మైన వ్యూహాత్మక భాగస్వామ్యం అపారమైన సంభావ్యతకు హామీ ఇస్తోంది, నాయకులు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
– డా. రామహరిత