నేషనల్‌డెమొక్రటిక్‌ అలయెన్స్(ఎన్‌డిఏ) భాగస్వామ్య పక్షాలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆంధప్రదేశ్‌లోని చిలకలూరిపేట బొప్పూడిలో మార్చి 17న నిర్వహించిన ప్రజాగళం సభ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వైసీసీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల ఆగ్రహాన్ని వెల్లడించింది. ఇప్పుడు ఈ అంశాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ సభకు అశేష ప్రజానీకం హాజరైంది. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, వనరుల దోపిడి, అశాంతి, రౌడీయిజం, మతవివక్షలను అయిదేళ్లుగా ఎదుర్కొన్న ప్రజానీకం ఈ సభకు హాజరై ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబునాయముడు,పవన్‌ ‌కల్యాణ్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వంటి నాయకుల ప్రసంగాలు ఆసాంతం విన్నారు. వారు వైసీపీపై చేస్తున్న విమర్శలకు సభికులు గళం కలిపి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తెలియచేశారు.

మరో ప్రధాన అంశం టీడీపీ తిరిగి ఎన్‌డిఏ కూటమి చేరడం. ఒకప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించిన టీడీపీ ఇప్పుడు తప్పు తెలుసుకుని ప్రధాని మోదీ లేకపోతే అధికారం మాట అటుంచి రాష్ట్రంలో మనలేమని గ్రహించింది. తమను, రాష్ట్రాన్ని రక్షించాలని ప్రధానిని అభ్యర్ధించింది. ప్రధానిని ఎన్నికల ప్రచారానికి తీసుకువచ్చి తమకు ఆయన అభయం ఉన్నదని అధికార వైసీపీకి హెచ్చరిక చేయించుకుంది. అవినీతిలో మునిగిన వైసీపీ పాలనను తీవ్రంగా ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. వైసీపీ, కాంగ్రెస్‌ ‌వేర్వేరు కావని స్పష్టం చేశారు. ఆంధప్రదేశ్‌ ‌ప్రజలు వైసీపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్‌ ‌ప్రయత్నిస్తోందని, ఇది గమనించి ప్రజలు తమకు ఓటు వేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్తూ వారి అభివృద్ధిని కోరుకుంటుందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ ‌కళ్యాణ్‌ ఆం‌ధప్రదేశ్‌ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని మోదీ కితాబిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ మనం గెలిస్తే డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ఏర్పడి, అప్పుడే వికసిత ఆంధప్రదేశ్‌ ‌సాధ్యం అన్నారు.

వైసీపీ సర్కార్‌ను సాగనంపాలి

రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ పిలువు నిచ్చారు. జగన్‌ ‌పార్టీ, కాంగ్రెస్‌ ‌పార్టీ వేర్వేరు కాదని.. వీటిని ఒకే కుటుంబం నడువుతోందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని కాంగ్రెస్‌ ‌కుట్ర పన్నుతోందని అన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు రెండు సంకల్పాలు తీసుకోవాలని సూచించారు. ఒకటి…కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రెండోది.. ఏపీలో అవినీతి వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడటం అని మోదీ అన్నారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరితో మరొకరు పోటీపడుతున్నారని.. అందుకే గత ఐదేళ్లు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. దేశంతో పాటు, ఏపీ అభివృద్ధి కాంక్షించే వారంతా ముందుకొచ్చి ఎన్డీయేకు ఓటేయాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఎన్డీయేతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.

త్రికూటేశ్వరుని ఆశీస్సులు

‘చంద్రబాబునాయుడు, పవన్‌ ‌కళ్యాణ్‌ ఆం‌ధప్రదేశ్‌ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. వీరి కృషి, పోరాటాన్ని గుర్తించాలి. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం లభించినట్టు భావిస్తున్నా. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి డృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్‌ 4‌న రాబోతున్నాయి. అంటే ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు వస్తాయని సూచనలా కనిపిస్తోంది. ప్రాంతీయ భావాలతోపాటు, జాతీయ భావాలను కలుపుకొని కూటమి ముందుకెళ్తుంది. ఇందులో భాగస్వాముల సంఖ్య పెరిగితే మరింత బలం పెరుగుతుంది. ఏపీలో డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కారు రావాలి. అప్పుడే వికసిత ఆంధప్రదేశ్‌ ‌సాధ్యం.

కాంగ్రెస్‌ను ఎన్టీఆర్‌ ‌మట్టికరిపించారు

తెలుగు వారికి కాంగ్రెస్‌ ‌చేసిన అవమానంతోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని, దాని వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌)‌కాంగ్రెస్‌ ‌పార్టీని మట్టి కరిపించారని మోదీ అన్నారు. ఆయన పోషించిన రాముడు, కృష్ణుడి పాత్రలు అజరామరమని, ఆయా పాత్రలను తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారని అన్నారు. ఆయన శతజయంతిని పురస్కరించుకొని కేంద్రం రూ. 100 వెండి నాణెం విడుదల చేసిందని గుర్తు చేశారు. తెలుగువారి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును ఎన్డీయే ప్రభుత్వం భారతరత్నతో గౌరవించిందన్నారు. ఎన్డీఏ పార్టీలకు అతీతంగా అందరిని గౌరవిస్తుందన డానికి ఇదే నిదర్శనం అని చెప్పారు.

వైసీపీ, కాంగ్రెస్‌ ‌రెండూ ఒకటే

‘రాష్ట్రం ప్రగతి సాధించాలంటే, వైసీపీ ప్రభుత్వం పోయి, ఎన్డీయే నెగ్గాలి. డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌వస్తే అంతా సవ్యంగా సాగుతుంది. వైఎస్‌ ‌జగన్‌, ‌వైఎస్‌ ‌షర్మిల ఒకే కుటుంబానికి చెందినవారు. అంటే వైసీపీ, కాంగ్రెస్‌ ఒకటే ఒరలో ఉన్న కత్తులు. వైసీపీపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌వైపు మళ్లించడానికి కుట్ర చేస్తున్నారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటే ఎన్‌డీయేకు ఓటు వేసి ఆశీర్వదించాలి. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో వెనకబడి పోయింది. దాన్ని అధిగమించడం ఎన్‌డియే వల్లే సాధ్యం. ఇక్కడ కూటమి, కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ ఉం‌టే రాష్ట్రంలో మౌలికవసతుల కల్పన, పేదలకు సంక్షేమం అందించడం సాధ్యమని గుర్తించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ పండుగ లాంటి వాతావరణం కోసం టార్చ్‌లైట్‌ ‌వేసి వెలుగులు నింపాలి. ఢిల్లీకి ఏపీ ప్రజలు తమ సందేశాన్ని పంపించాలంటే ఎన్‌డీయేకు ఓటు వేసి గెలిపించాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు..

ఇండియాకూటమి స్వార్ధపరుల బృందం

ఇండియా కూటమి అవసరాల కోసం ఏర్పాటైన స్వార్థపరుల బృందం. ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుంటాయి. కేరళలో లెఫ్ట్, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు. ఢిల్లీలో మాత్రం కలిసిపోతాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణముల్‌, ‌లెఫ్ట్ ‌పార్టీలు విమర్శించుకుంటాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ ‌కాంగ్రెస్‌, ‌మార్గాలు వేరు. కాంగ్రెస్‌, ఇం‌డియా కూటమి మిత్రులను వాడుకుని వదిలేస్తుంది. ఆ కూటమిలోని పార్టీలకు ఏకాభిప్రాయం ఉండదు.

వచ్చే ఐదేళ్లు అవకాశం ఇవ్వండి..

దేశంలో ఎన్నికలు షెడ్యూలు వెలువడగానే ఆంధప్రదేశ్‌కు వచ్చాను. ఈ సభకు హాజరైన జనసందోహాన్ని చూస్తుంటే కూటమిపై అభిమానం, వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. మీ ఓటు అభివృద్ధికి పడాలి తప్ప అరాచకానికి కాదు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. ఏపీలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌రావాలి. పేదుల, యువత, మహిళా సంక్షేమానికి పునరంకితమవుతాం. రాష్ట్రంలో మౌలికవి వసతులు మెరుగుపరుస్తాం. నౌకాశ్రయాలు నిర్మిస్తాం. నీలి విప్లవానికి పునాదులు వేస్తాం. పీఎం ఆవాస్‌ ‌యోజన కింద ఏపీలో 10 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. ఈ పల్నాడు జిల్లాలో దాదాపు 5 వేల ఇళ్లు ఇచ్చాం. ఆయుష్మాన్‌ ‌భారత్‌తో ఏపీలో కోటి 25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. జలజీవన్‌ ‌మిషన్‌ ‌కింద కోటి ఇళ్లకు మంచినీటి కనెక్షన్లతో నీరు ఇచ్చాం. రైతుల కోసం ఎన్డీయే ఎంతగానో కృషిచేస్తోంది. కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధితో పల్నాడు జిల్లా వారికి రూ.700 కోట్లు ఇచ్చాం. ఆంధప్రదేశ్‌ను ఎడ్యుకేషన్‌ ‌హబ్‌గా మార్చాం. విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశాం. తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌ ‌నిర్మించాం. మంగళగిరిలో ఎయిమ్స్, ‌విజయ నగరంలో గిరిజన విశ్వ విద్యాలయం లాంటివి ఎన్నో ఏర్పాటు చేశాం. ఏపీలో నీలి విప్లవానికి ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుంది. యువతకు, మహిళలకు ఉద్యోగాలతో పాటు కొత్త అవకాశాల కల్పనకు ప్రణాళిక వేస్తున్నాం. వచ్చే ఐదేళ్లూ డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కారుకే అవకాశం ఇవ్వాలని ఆంధప్రదేశ్‌ ‌ప్రజలను మోదీ కోరారు.

సంక్షేమానికి చిరునామా మోదీ

సంక్షేమానికి, అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ చిరునామా అని, భారత్‌ను విశ్వగురువు స్థానంలో నిలిపి ప్రపంచం మెచ్చిన నాయకుడిగా ఎదిగారిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని ఆయన అయిదేళ్లలో ఐదవ స్థానానికి తీసుకవచ్చారని, సమీప భవిష్యత్‌లో మూడవ స్థానానికి చేరతామని అన్నారు. వికసిత్‌ ‌భారత్‌ ‌ప్రధాని కల అని, వికసిత్‌ ఆం‌ధప్రదేశ్‌ ‌మనందరి కలని, దాని సాధనకు మనమంతా ప్రధాన ఆశయాలతో అనుసంధానం కావాలని పిలుపు నిచ్చారు.

దేశానికి సరేన సమయంలో ప్రధాని మోదీ లాంటి నాయకుడు దొరికారని, ఆయన చేసే ప్రతి ప్రయత్నంలో తాము వెంట ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో 11 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పా మని, వైసీపీ ప్రభుత్వ సుమారు అయిదేళ్ల పాలనలో రాష్ట్రం బాగా వెనుకబడి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ ఎన్డీఏతో పరిస్థితి చక్కబడు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజల భుజం కాయడానికే…

అరాచకపాలనతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల భుజం కాయడానికే ప్రధాని నరేంద్రమోదీ వచ్చారని జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి దేదీప్యమానంగా వెలగాలని అందుకు తాను అండగా ఉన్నానంటూ ప్రధాని మళ్లీ వచ్చారని చెప్పారు.ఆయన నాయకత్వంలో తిరుమల బాలాజీ ఆశీస్సులతో 2014లో ఘనవిజయం సాధించిన ఎన్డీఏ, ఈ ఎన్నికల్లో బెజవాడ కనకదుర్గమ్మ కరుణతో అంతకుమించిన ఘన విజయం సాధిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిని పెంచుతూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని గణాంకాలు సహా వివరించారు.

-వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ

ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE