– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

‌ప్రారంభంలో కొద్దిపాటి ఒడుదొడుకులు, సమస్యలు ఎదురైనా సర్దుబాటుకాగలవు. ఆదా యానికి లోటు ఉండదు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్క రించుకుంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు కొంతమేర అందు తాయి.  పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీపర్యటనలు. 25,26తేదీల్లో అనుకోని ప్రయా ణాలు. మానసిక అశాంతి. కాలభైరవాష్టకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

రాబడి సంతృప్తినిచ్చినా కొంతవరకూ అప్పులు కూడా చేయాల్సివస్తుంది. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు అందుకుంటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు సమకూరతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతి బంధ కాలు తొలగుతాయి. క్రీడాకారులు, రచయితలకు మరింత అనుకూలం.  27,28 తేదీల్లో దూర ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. నృసింహ స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

పరిచయాలు మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.  ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  మీ పట్టుదలకు ప్రశంసలు అందుకుంటారు. ఉద్యో గార్థుల యత్నాలు సఫలం.  వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు కలసివచ్చే సమయం. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజం కాగలవు. 28,29తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు.లక్ష్మీనారాయణ స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆదాయానికి మించిన ఖర్చులుఉంటాయి.  అనుకున్న కార్యాలలో ఆటంకాలు. స్థిరాస్తి విష యంలో కొంత చికాకులు. శారీరక రుగ్మతలు బాధి స్తాయి. సోదరులనుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు ఆశించిన ఫలితాలు రాక నిరాశచెందుతారు. కళాకారులు, సాంకేతిక నిపుణు లకు సమస్యలు. 27,28 తేదీల్లో శుభవార్తలు. పాత స్నేహితులను కలుసుకుంటారు. గాయత్రీస్తోత్రాలు పఠించండి


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అన్ని విధాలా అనుకూల సమయం.  కొత్త కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కించుకుంటారు. ఇంటి   నిర్మాణాలు చేపడతారు.  వ్యాపారులు పెట్టు బడులు అందుకుంటారు. ఉద్యోగులకు సంతోష కరమైన సమాచారం. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు. కళాకారులు, క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. 30,31 తేదీల్లో ఆస్తివివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.    సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కుటుంబంలో శుభకార్యాల హడావిడి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ముఖ్య కార్యక్రమాలు అనుకున్న విధంగా సజావుగా సాగు తాయి.  భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.    పరిశోధకులు, క్రీడాకారులు తమ నైపుణ్యతను నిరూ పించుకుంటారు. 25,26 తేదీల్లో మనశ్శాంతి లోపి స్తుంది. అనారోగ్యం.నవగ్రహస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

రాబడి కొంత అనుకూలిస్తుంది. ముఖ్య కార్యాలలో అవరోధాలు తొలగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది.  ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. స్థిరాస్తిపై అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కళా కారులు, సాంకేతిక నిపుణులు అనుకున్నది సాధిస్తారు. 29,30 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు.  అంగారక స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

సానుకూల పవనాల మధ్య ముందడుగు వేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనల మేరకు కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు.  వ్యాపారులు పురోగతి సాధిస్తారు, పెట్టుబడులు అందుతాయి.  పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శ్రమానంతరం ఫలితం ఉంటుంది. రచయితలు పురస్కారాలు అందుకుంటారు. 29,30 తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

చేపట్టిన కార్యాలలో  కొంత జాప్యంతో పూర్తి కాగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.  విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు.  ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు.  వ్యాపారులు కొంతమేర లాభాలు ఆర్జిస్తారు.  క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. 25,26 తేదీల్లో  బంధువిరోధాలు. మానసిక అశాంతి.   దేవీస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగి స్తాయి.  వాహనయోగం.  విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు వచ్చే అవకాశం. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సమస్యలు కొన్ని తీరతాయి. 27.28 తేదీల్లో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్యమైన కార్యాలు సమయానికి పూర్తి కాగలవు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. దైవారాధనలో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. క్రీడాకారులు, పరిశోధకులకు శుభవార్తలు అందు తాయి. 28,29 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. ఖర్చులు అధికం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందు తుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కే అవకాశం.  భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు.    వ్యాపారులు మరింతగా లాభాలు ఆర్జిస్తారు.  పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు. క్రీడా కారులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. 30,31 తేదీల్లో మానసిక అశాంతి. శారీరక రుగ్మతలు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE