శతాబ్దాల హిందూ ధర్మంలో దేవాలయాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. అవి దేశ ఔన్నత్యానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీకలుగా విరాజిల్లాయి. ఆర్థిక పరిపుష్టిగల కేంద్రాలుగా వినుతికెక్కాయి. భారతీయ సౌహార్థ్ర, స్నేహ వాతావరణానికి కీర్తికేతనాలుగా ప్రపంచం నలుమూలల తమదైన ముద్రను వేశాయనడం అతిశయోక్తి కాదు. కాలక్రమంలో కొన్ని సంచార జాతుల, తండారి పిండారి దళాల ముష్కరులు దేవాలయాలపై దాడులు చేశారు. అలాంటి చరిత్ర శకలాల మధ్య వెలుగుచూసిన సత్యమే-‘జ్ఞానవాపి’!

చరిత్రను పరిశీలిస్తే… నాలుగైదు శతాబ్దాల మధ్య కాలంలో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అపారమైన భక్తిభావాలు, ధనరాశులతో విలసిల్లుతున్న ఈ కర్మభూమిపై దుష్టుల కన్నుపడింది. సుమారు నాలుగు వేల ఏళ్ల కిందట పప్రథమంగా భారతదేశంపై పర్షియా దేశపు రాణి సెమిరా మిస్‌ ‌దండెత్తి వచ్చింది. ఆ దాడులు, దోపిడీలు ఆంగ్లేయుల వరకు కొనసాగాయి. 1194లో మహ్మద్‌ ‌ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్‌ ఐబక్‌ ‌కన్నౌజ్‌ ‌రాజును ఓడించి, విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేసినట్టు చరిత్ర చెబుతోంది. స్వదేశీ రాజులు 1211లో దానిని పునరుద్ధరించగా, సికందర్‌ ‌లోఢీ హయాంలో (1489-1517 సంవత్సరాల మధ్యకాలంలో ) మళ్లీ కూల్చివేశారు. కొన్నేళ్ల తర్వాత 1585లో పునర్నిర్మించారు. ఈ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను రాజా తోడర్మల్‌ ‌దక్షిణ భారత దేశానికి చెందిన నిపుణుడు నారాయణ భట్‌కు అప్పగించినట్లు ఆర్కియాలజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా తన రికార్డులో రాసింది. ఔరంగజేబు మొఘల్‌ ‌సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 1669లో ఆలయాన్ని కూల్చేశాడని అప్పటి చరిత్రకారుల్లో ఒకరైన సకీ ముస్తయిద్‌ ‌ఖాన్‌ ‌తన ‘మాసిర్‌-ఎ-ఆలమ్‌గిరి’లో రాశాడు. అప్పుడే విశ్వనాథుడి ఆలయంపై మసీదు నిర్మించారని చరిత్రకారుల కథనం. అదే ప్రస్తుత జ్ఞానవాపి మసీదు!

సాధారణంగా మసీదుల్లో హిందూ ఆలయాలకు సంబంధించిన శిల్పకళ కనిపించదు. కానీ, విశ్వనాథ ఆలయం దక్షిణపు గోడపై రాతి శిలాతోరణాలు స్పష్టంగా కనిపిస్తాయి. విశ్వనాథ ఆలయానికి పూర్వ వైభవం తేవాలని 1742 ప్రాంతంలో ప్రయత్నాలు జరిగినా, నాటి నవాబుల వల్ల అది సాధ్యం కాలేదు. చివరకు మరాఠా సుబేదార్‌ ‌మల్హర్‌ ‌రావు హోల్కర్‌ ‌కోడలు అహల్యాబాయ్‌ ‌హోల్కర్‌ ‌హయాంలో ఆ ప్రయత్నాలు ఫలించాయి. అలా కట్టిందే నేటి ఆలయం.

31 ఏళ్ల కిందటి వివాదం

సుమారు 32 ఏళ్ల కిందట ‘జ్ఞానవాపి’ మందిరం వివాదం మొదలైంది. విశ్వనాథుని ఆలయం కూల్చిమసీదు కట్టారని ఆరోపిస్తూ హిందువులు ఆందోళనలు, నిరసనలు, న్యాయ పోరాటాలకు దిగారు. అక్టోబర్‌ 15, 1991‌న మందిరంలో పూజలకు అనుమతి కోరుతూ వారణాసి సివిల్‌ ‌కోర్టులో స్థానిక పూజారులు పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఔరంగజేబు ఆదేశాల మేరకు ఆయన అనుయాయులు, సిబ్బంది విశ్వనాథ దేవాలయంలో కొంత భాగాన్ని కూల్చి అధికారులు మసీదును నిర్మించారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. 1997లో జూన్‌లో విచారణకు చేపట్టిన న్యాయస్థానం, ఈ కేసు 1991 ప్రార్థనా స్థలాల చట్టానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ, జులై 17న ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై హిందూముస్లిం వర్గాలు రివిజన్‌ ‌పిటీషన్‌ను దాఖలు చేయగా, వారి అభ్యంతరాలను పరిశీలించేందుకు జిల్లా జడ్జి1998 సెప్టెంబర్‌ 28‌న అంగీకరించారు. అయితే, కోర్టు పునఃపరిశీలన నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టానికి వ్యతిరేకంగా ఉందని, మసీదు ప్రాంగణంలో విగ్రహాల విషయమై విచారణే అవసరం లేదని, దీనిపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అంజుమన్‌ ఇం‌తెజామియా మసీదు కమిటీ అలహాబాద్‌ ‌హైకోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టలేదని, మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ ‌బోర్డుకు చెందుతాయని పేర్కొంది. ఈ దృష్ట్యా సిటీ కోర్టు ఈ కేసును విచారించకూడదని ఆ కమిటీ వాదించింది. దీంతో 1998 అక్టోబర్‌లో ఈ తతంగమంతా హైకోర్టు పరిధిలోకి వెళ్లింది.

అయోధ్యపై తీర్పు

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే దక్కుతుందని 2019 నవంబరులో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టానికి కేవలం అయోధ్య ఒక్కటే మినహాయింపు అని పేర్కొంది. అయోధ్యపై అంతిమ తీర్పు వచ్చిన సరిగ్గా నెల రోజులకు వారణాసి సివిల్‌ ‌కోర్టులో విజయశంకర్‌ ‌రస్తోగి అనే న్యాయవాది ఓ కొత్త పిటిషన్‌ ‌వేశారు. విశ్వనాథుని ప్రతినిధిగా తాను ఈ పిటిషన్‌ ‌వేస్తున్నట్టు, స్వామి వారి వాదననే తాను వినిపిస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యలో మాదిరిగా ఇక్కడ కూడా పురావస్తు శాఖ సర్వే చేయాలని కోర్టుకు విన్నవించారు. ఇది జరిగిన రెండు నెలలకు (2020 ఫిబ్రవరి) 1991లో కేసు దాఖలు చేసిన వారంతా వారణాసి సివిల్‌ ‌కోర్టుకు వెళ్లి, 1998 అక్టోబరులో నిలిపివేసిన కేసును విచారించాలని కోరారు. కోర్టు ఇచ్చిన ఏ స్టే ఆర్డర్‌ అయినా ఆరు నెలలకు పునఃపరిశీలనకు అర్హమైందన్న 2018 సుప్రీం కోర్టు తీర్పుననుసరించి తమ కోరిక సరైందేనని వారు అందులో ప్రస్తావించారు. దీనిని మసీదు కమిటీ వ్యతిరేకించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అలహాబాద్‌ ‌హైకోర్టు స్టే విధించి, తీర్పును 2020 మార్చి 14కు వాయిదా వేసింది.

1991 ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌

అసలు 1991 ప్రార్థనా స్థలాల చట్టం అన్యాయమంటూ 2021 మార్చిలో సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ ‌దాఖలైంది. ఈ చట్టం, దేశంలోని హిందూ, జైన, బౌద్ధ ఆలయాలను కూల్చివేతలను సమర్థిస్తోందని, అసలు ఈ చట్టమే అన్యాయమని, దీనిని రద్దు చేయాలని బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది అశ్విన్‌ ఉపాధ్యాయ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తే ఆలయాలపై దాడులు, కూల్చివేతలతో దెబ్బతిన్న భక్తుల మనో భావాలు కుదుట పడతాయని, అదే సమయంలో కోల్పోయిన మందిరాలు తిరిగి వారికి దక్కుతాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా… బీజేపీ మరో నేత సుబ్రహ్మణ్య స్వామి, 1991 ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ విరుద్ధమైదంటూ ప్రత్యేక పిటిషన్‌ ‌దాఖలు చేశారు. వీరిద్దరి పిటిషన్ల మేరకు సుప్రీం కోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ ‌బాబ్డే, ఎఎస్‌ ‌బోపన్నల ద్విసభ్య ధర్మాసనం 2021 మార్చి 12న భారత హోం, న్యాయశాఖలకు నోటీసులు పంపుతూ వాటి అభిప్రాయాలను కోరింది. మరోవంక, జ్ఞానవాపి పరిసర ప్రాంతాల్లో అత్యాధునిక పరికరాల్లో సర్వే చేసేలా వారణాసి సివిల్‌ ‌కోర్టు జడ్జి అషితోష్‌ ‌తివారి ఆ మరుసటి నెల 8న భారత పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సర్వే బృందంలో పురావస్తు శా• ప్రతినిధితో పాటు హిందూ ముస్లింల నుండి ఇద్దరేసి సభ్యులుగా ఉండాలని సూచించారు. ఈ అయిదుగురిపై ఒక పరిశీలకుడిని కోర్టు నియమించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆ మసీదు కమిటీ అలహాబాద్‌ ‌హైకోర్టును ఆశ్రయించడంతొ 2021 సెప్టెంబరు 9న సర్వే పై స్టే విధించింది. 2023 జూలై 25న ఈ వివాదంపై దాఖలపై అన్ని పిటిషన్‌ల వాదనలను పరిగణలోకి తీసుకున్న అలహబాద్‌ ‌కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌పాడియా… దీనిపై అంతిమ తీర్పును 2023 ఆగస్టుకు వాయిదా వేశారు.

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని శృంగారగౌరి మాత, గణపతి, హనుమాన్‌లకు పూజలు చేస్తామంటూ మహిళలు 2023 ఆగస్టులో వారణాసి వారణాసి డిస్ట్రిక్‌ అం‌డ్‌ ‌సెషన్స్ ‌కోర్టులో పిటిషన్‌ ‌వేశారు. ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని హిందువుల తరపు న్యాయవాది మదన్‌ ‌మోహన్‌ ‌యాదవ్‌ ‌వాదించారు. కాగా, మసీదు ప్రాంగణంలో విగ్రహాల విషయమై విచారణే అవసరం లేదని, దీనిపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అంజుమన్‌ ఇం‌తెజామియా కమిటీ అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వేకు ఆదేశించింది. దీంతో మసీదు కమిటీ అలహాబాద్‌ ‌హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేయగా కోర్టు దానిని కొట్టి వేసింది. సర్వే ప్రారంభించాలని భారత పురావస్తు శాఖను ఆదేశించింది. ఆ మేరకు పురవాస్తు శాఖ సర్వే నివేదికను డిసెంబర్‌ 2023 ‌కోర్టుకు సమర్పించింది. ఆ నివేదికను బహిర్గతం చేయాలని 11 మంది కక్షిదారులు కోరడంతో కోర్టు ఆ సర్వే నివేదికను వారికి అందిస్తూ, దానిని దీనిని లీక్‌ ‌చేయకూడదని అఫిడవిట్‌ ‌తీసుకొంది.

జ్ఞానవాపిలో పూజలకు అనుమతి

మసీదు నేలమాళిగలోని శివాలయం ప్రాంతంలో పూజలు చేసే హక్కు హిందువులకు ఉందంటూ వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ అజయ్‌ ‌కృష్ణ విశ్వేష్‌ ‌తమ కీలక తీర్పులో వెల్లడించారు. ఈ పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయని పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. జనవరి 31, రాత్రి పూజలు పునఃప్రారంభ మయ్యాయి. ఇదిలావుండగా, తీర్పునకు వ్యతిరేకంగా అంజుమన్‌ ఇం‌తెజామియా మసీదు కమిటీ అలహాబాద్‌ ‌హైకోర్టులో ఫిబ్రవరి 1, 2024న పిటిషన్‌ ‌దాఖలు చేసింది.

జ్ఞానవాపి మసీదు సముదాయంలో గతంలో హిందూ పెద్ద దేవాలయం ఉండేదని ఆర్కియో లాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డి హయా(ఏఎస్‌ఐ) ‌నివేదిక వెల్లడించిన నేపథ్యంలో.. ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ ‌సింగ్‌, ‌హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్‌ ‌ముస్లింలను డిమాండ్‌ ‌చేశారు. ‘జ్ఞానవాపిలో ఆలయం ఉన్నట్టు అన్ని ఆధారాలూ బయటపడ్డాయి… ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని ముస్లిం సోదరులను కోరుతున్నా’ అని గిరిరాజ్‌ ‌సింగ్‌ అన్నారు.

అయోధ్యలానే హిందువులకు అత్యంత పవిత్ర స్థలాలైన మధుర, జ్ఞానవాపిలను ముస్లింలు గౌరవంగా అప్పగించాలని ప్రముఖ పురావస్తువేత్త కేకే మహమ్మద్‌ అభిప్రాయపడ్డారు. రాముడు, శివుడు, శ్రీ కృష్ణుడి దేవాలయాలు ఉన్న ప్రాంతాలతో హిందువులకు భావోద్వేగాలు ఉంటాయని, ఆయా ప్రాంతాలతో ముస్లింలకు పెద్దగా సెంటిమెంట్‌ ఉం‌డదని అంటూ, అందుకే వాటిని పవిత్ర ప్రాంతాలుగా చూసుకునే హిందువులకు ఇచ్చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. అయోధ్యలోని రాముడి గుడి నిర్మాణం, బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత నిజనిర్ధారణకు ఆ ప్రాంతాన్ని అధ్యయనం చేసిన భారత పురావస్తు శాఖ బృందంలో కేకే ముహమ్మద్‌ ‌కూడా సభ్యుడిగా ఉన్నారు (అయితే బాబ్రీ మసీదు కూల్చివేయడం ఒక పురావస్తు శాస్త్రవేత్తగా తనను ఎంతగానో దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు)..

జ్ఞానవాపిలో యోగి పూజలు

ఉత్తర ప్రదేశ్‌ ‌ము్య•మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ ‌నెల 12న కాశీలోని జ్ఞానవాపి ప్రాంగణాన్ని సందర్శించారు. ‘వ్యాస్‌ ‌కా టెహకానా’కు ప్రత్యేక పూజలు జరిపారు. సీల్‌ ‌చేసిన మసీదు బేస్‌మెంట్‌ ‌ప్రాంతంలోని హిందూ దేవతల విగ్రహాలకు పూజలు నిర్వహించుకోవచ్చన్న న్యాయస్థానం తీర్పుతో వారణాసి సందర్శించి విశ్వేశ్వరుడిని కూడా దర్శించుకున్నారు.

– జి.కృష్ణమూర్తి,

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE