ఆగ్నేయాసియా దేశాల్లో రామాయణ గాథ ఆయా భాషల్లో వివిధ పేర్లతో ప్రాచుర్యంలో ఉంది. ఇండొనేసియా (స్థానిక ఫిలిపినో భాషలో), థాయ్‌లాండ్‌ (‌రామాకిన్‌), ‌కంబోడియా (రీయంకర్‌-‌కంబోడియా భాషకు చెందిన కావ్యం), మలేసియా, వియత్నాం, లావోస్‌, ‌నేపాల్‌, ‌టిబెటో-చైనీస్‌, ‌మాలె భాషల్లో కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇండొనేసియాలోని బాలి దీవిలో రామాయణం నృత్యనాటకం అత్యంత ప్రసిద్ధి పొందింది. క్రీ.శ.19-20 శతాబ్దంలో ప్రముఖ రచయిత భానుభక్త ఆచార్య రచించిన రామాయణాన్ని నేపాల్‌ ‌తొలి కావ్యంగా పరిగణిస్తారు. తర్వాత సిద్ధిదాస్‌ ‌మహజు, స్థానిక నేపాల్‌ ‌భాషలో (దీన్నే స్థానికంగా నెవార్‌ ‌లేదా నెవారీ అని వ్యవహరిస్తారు. •ట్మాండు లోయ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈభాష వాడుకలో ఉంది) రామాయణ కావ్యాన్ని రచించాడు. ఈ రచన ఆధునిక నేపాల్‌ ‌భాషోద్యమం ఊపందుకోవడానికి దోహదం చేసింది. అయితే నేపాల్‌లో బహుళ జనాదరణ పొందింది మాత్రం భానుభక్త ఆచార్య రచించిన రామాయణ కావ్యమే. కంబోడియాలో ‘రీయంకర్‌’ ‌పేరుతో ప్రాచుర్యంలో ఉన్న రామాయణం ‘ఖ్మేర్‌’ ‌సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ సాహిత్యం ‘ఫునాన్‌ ‌రాజ్యం’ కాలంనుంచి పరిఢవిల్లింది. ఇండొనేసియాలో రామాయణం అనేక రూపాల్లో కనిపిస్తుంది. ‘కాకావిన్‌ ‌రామాయణం’ పేరుతో ప్రాచీన జవానీస్‌ ‌కావ్యంగా ప్రసిద్ధి పొందింది. క్రీ.శ.870లో మధ్య జావా ప్రాంతంలోని మతారం రాజ్యానికి చెందిన ఇంపు సిండోక్‌ ‌ప్రాంతంలో దీని రచన కొనసాగింది. సమీప ద్వీపం బాలిలో దీన్ని మరింత అభివృద్ధి చేసి ‘రామకవక’ పేరుతో బాలినీస్‌ ‌రామాయణాన్ని రూపొందించారు. ఇండొనేసియాకు చెందిన యోగ్యకర్త పట్టణంలో ప్రంబనన్‌ ‌దేవాలయంలో రామాయణ ఇతిహాసానికి చెందిన దృశ్యాలు చెక్కి ఉన్నాయి. క్రీ.శ.14వ శతాబ్దంలో తూర్పు జావాలో నిర్మించిన పెనాటరన్‌ ‌దేవాలయంలో కూడా రామాయణ కావ్యానికి చెందిన చిత్రాలను చూడవచ్చు. ‘బాలినీస్‌ ‌కేకక్‌’ ‌నృత్య (బాలినీస్‌ ‌హిందూ నృత్యం) రూపంలో రామాయణాన్ని ఇండొనేసియా ప్రజలు ముఖ్యంగా పురుషులు ప్రదర్శిస్తారు. యోగ్యకర్తలో ‘వెయాంగ్‌ ‌వాంగ్‌’ ‌పేరుతో ప్రదర్శించే జవానీస్‌ ‌నృత్యం కూడా రామాయణానికి సంబంధించినదే. లావోస్‌ ‌ప్రజల అధికారిక నవల ‘‘ప్ర లాక్‌ ‌ప్ర రామ్‌’’. ఇం‌దులో లాక్‌ అం‌టే లక్ష్మణ, రామ్‌ అం‌టే రాముడు. వీరిద్దరి పేర్లతో లావో భాషలో రామాయణ రచన సాగింది. గౌతమ బుద్ధుని గత జన్మగా రామలక్ష్మణుల కథను వివరించడం దీని ప్రత్యేకత. మలేసియాలో ‘హికాయత్‌ ‌సెరి రామ’’ పేరుతో మలై భాషలో రామాయణం రచించారు. మయన్మార్‌లో ‘‘యమ జట్‌డా’’ పేరుతో ప్రాచుర్యంలో ఉన్న బర్మీస్‌ ‌రామాయణాన్ని అనధికారిక జాతీయ కావ్యంగా పరిగణిస్తారు. ‘‘మహారాదియా లావన’’ అనేది ఫిలిప్పీన్స్‌కు చెందిన మరనావో ప్రజల రామాయణం. దీన్ని 1968లో ప్రొఫెసర్‌ ‌జువాన్‌ ఆర్‌. ‌ప్రాన్సిస్‌కో, నాగసుర మడాలేలు ఇంగ్లీషులోకి అనువదించారు. ‘‘రామా ఎట్‌ ‌సీత’’ (రాముడు – సీత) పేరుతో 1970లో ఫిలిప్పీన్స్‌లో ‘‘జాజ్‌ ‌బాలెట్‌’’ (ఒకరకమైన శాస్త్రీయ నృత్యనాటకం) రూపంలో రామాయణాన్ని నిర్మించి ప్రదర్శించారు.

ఆగ్నేయాసియా దేశాల్లో…

రామాయణం ప్రభావం ఆగ్నేయాసియా దేశాల్లో ఒక్క వియత్నాంలో తప్ప మిగిలిన దేశాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా క్రీ.శ.8వ శతాబ్దం నుంచి ఆయా దేశాల సాహిత్యంలో, దేవాలయాల్లో శిల్పాలు, చిత్రాలు, నాటకాలు, నృత్య రూపాల్లో బహుళ ప్రచారం పొందింది. ఇండోనేసియాలో ప్రత్యేకించి జావా, బాలి ద్వీపాల్లో నృత్యనాటకాలు, తోలుబొమ్మలాటల రూపంలో ప్రజల్లో సజీవంగా ఉంది. యోగ్యకర్త (ఇండోనేసియా)కు చెందిన సాంస్కృతిక కేంద్రంలో సేంద్రతరి రామాయణాన్ని వెయాంగ్‌ ఒరాంగ్‌ ‌శాస్త్రీయ రూపంలో సంప్రదాయ జవనీస్‌ ‌నృత్య నాటకంగా ప్రదర్శిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ప్రంబనాన్‌ ‌త్రిమూర్తి దేవాలయంలో ఎన్నో జాతులకు చెందిన ప్రజలు రామాయణాన్ని ప్రదర్శిస్తుం టారు. బాలినీస్‌ ‌హిందూ దేవాలయాల్లో కూడా బాలనీస్‌ ‌నృత్య నాటకాల రూపంలో తరచుగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఉబుద్‌, ఉలువట్టు ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలను చూడవచ్చు. ఇండోనేసియాకు చెందిన ముఖ్యంగా బాలినీస్‌ ‌చిత్రకారులు రామాయణాన్ని ఎన్నో చిత్రాల్లో చిత్రీకరించారు. గుస్తి ధోకర్‌ (1938‌కి ముందు), దేవా పోయిటోయ్‌ ‌సోయ్‌గిహ్‌, ‌దేవా గేడె రాకా పొయిడ్జా, ఇడా బాగస్‌ ‌మాడె తొగాగ్‌ ‌వంటి ప్రముఖ చిత్రకారులు తమ పెయింటింగ్స్‌లో రామాయణాన్ని చిత్రించారు. వీరి పెయింటింగ్స్ ‌ప్రస్తుతం నెదర్లాండ్స్ ‌రాజధాని ఆమ్‌స్టర్‌ ‌డ్యామ్‌లోని ట్రోపెన్‌ ‌మ్యూజియంలో భద్రపరచి ఉన్నాయి. మలేసియాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు సయ్యద్‌ ‌తాజుద్దీన్‌ ‌కూడా 1972లో రామాయణ చిత్రాలను గీసాడు. ప్రస్తుతం ఈ చిత్రాలు మలేసియాకు చెందిన నేషనల్‌ ‌విజువల్‌ ఆర్టస్ ‌గ్యాలరీలో ఉన్నాయి.

అజరామరం

ఎన్నో వేల ఏళ్లనాటి రామాయణ గాథ ఇన్నిదేశాల్లో ఇప్పటికీ వివిధ కళా రూపాల్లో సజీవంగా ప్రజల హృదయాల్లో నిలిచివున్నదంటే, జగదభి రాముడి గుణగణాలు, సీతాసాధ్వి పాతివ్రత్యం, అన్నా వదినలకు లక్ష్మణుడు చేసిన సేవ, హనుమంతుడి భక్తి వంటి అంశాలే ప్రధాన కారణం. సమాజాన్ని సరైన మార్గంలో నడిపింపజేయడానికి రామాయణం లోని ఒక్కో పాత్ర ఒక్కోరకమైన హితాన్ని చెబుతుంది. ఇందులోని సత్య, ధర్మాలు అన్నికాలాలకు వర్తిస్తాయి. అందువల్లనే రామాయణం బోధించేది ‘సనాతన ధర్మం’. ఇది అజరామరం!

– ‌విఠల్‌

About Author

By editor

Twitter
YOUTUBE