– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. విద్యార్థులు కోరుకున్న విద్యావకాశాలు పొందుతారు. బంధువులతో దేవా లయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, రచయితల ఆశలు నెరవేరతాయి. 27,28తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో విభేదాలు. గణేశాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కార్యక్రమాలు అనుకున్న విధంగా కొనసాగు తాయి. సమాజంలో మీకంటూ గౌరవం పెరుగు తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి మరింత మెరుగ్గా ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భాగస్వాముల సలహాలతో వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. యితలు, క్రీడాకారుల కృషి ఫలిస్తుంది. 26,27తేదీల్లో మానసిక అశాంతి. దూర ప్రయాణాలు. దేవీస్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామిక వేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం. కళాకారులు, పరిశోధకులకు ఆశయాలు ఫలిస్తాయి. 28,29తేదీల్లో బంధువులతో తగాదాలు. వృథా ఖర్చులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రాబడి తగ్గినా అవసరాలకు లోటురాదు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు ఇబ్బంది కలిగి స్తాయి. విద్యార్థులకు అవకాశాలు కొన్ని చేజారవచ్చు. వ్యాపారులకు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. కళాకారులకు కొంతమేర ఒత్తిడులు తప్పవు. క్రీడాకారులు, నాయ కులకు ఒడుదొడుకుల. . 27,28తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి..
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొన్ని కార్యాలు సజావుగా పూర్తి. ఆదాయం సమకూరుతుంది. భూ వివాదాలు తీరతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొంటారు. సమాజంలో విశేష గౌరవం. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. వ్యాపారులకు విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవేత్తలకు కొత్త పదవులు లభిస్తాయి. 2,3 తేదీల్లో ఖర్చులు. కుటుంబబాధ్యతలతో సతమత మవుతారు. ఆంజనేయ దండకం పఠించండి..
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరు ద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. ధార్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, క్రీడాకారులకు అనుకూల సమయం. 26,27తేదీల్లో శారీరక రుగ్మతలు… హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
రాబడి మొత్తంమీద మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు పెట్టు బడులు దక్కుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. 29,1తేదీల్లో మానసిక అశాంతి. కనకధారా స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
దూరప్రాంతాల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం కలిగే అవకాశాలు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొం టారు. వ్యాపారులు ఒత్తిడుల నుంచి బయట పడతారు. 28,29తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శివపంచాక్షరి పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ప్రముఖులతో పరిచయాలు. రాబడి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కళాకారులు, పరిశోధకులకు పట్టింది బంగారమే. 26,27తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. దత్తస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
నూతన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. మొండిబాకీలు వసూలై ఆదాయం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టు బడులు సమకూరతాయి. రాజకీయవేత్తలకు నూతన పదవులు. క్రీడాకారులు, రచయితలకు ఉత్సాహ వంతంగా ఉంటుంది. 28,29 తేదీల్లో మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మా ణాలకు ప్రణాళిక. రచయితలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 29,1తేదీల్లో కుటుంబంలో సమస్యలు. అనారోగ్య సూచనలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయానికి ఇబ్బందిలేకుండా గడిచిపోతుంది. అప్పులు తీరి ఒడ్డునపడతారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. బంధువులతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. వ్యాపారులకు సకాలంలో విస్తరిస్తారు. క్రీడాకారులు, పరిశోధకులకు అన్నింటా విజయమే. 2,3తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో చికాకులు. విష్ణునామ ధ్యానం చేయండి.