– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని వాయిదా వేస్తారు. స్నేహితులు,  బంధువులతో విభేదాలు. స్వల్పశారీరక రుగ్మతలు. కష్టపడ్డా ఫలితం కనిపిం చదు. ఒక సమాచారం నిరాశపరుస్తుంది. గృహ నిర్మాణాల్లో కొంత జాప్యం. వ్యాపారులకు పెట్టుబడులు ఆలస్యమవుతాయి. కళాకారులకు కొన్ని చికాకులు తప్పవు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు. 24,25 తేదీల్లో శుభవార్తలు. ఉద్యోగయోగం. విష్ణుధ్యానం చేయండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సజావుగా పూర్తి చేస్తారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.   వాహ నాలు, భూములు కొనుగోలు చేస్తారు.   వ్యాపారులు పెట్టుబడులకు తోడు అనుకున్న లాభాలు అందు తాయి. ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు. రచయితలు, క్రీడాకారులు లక్ష్యాలు సాధిస్తారు. 27,28 తేదీల్లో అనుకోని ఖర్చులు. బంధువులతో వివాదాలు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

రాబడి మరింత  ఉత్సాహాన్నిస్తుంది. కొత్త  కార్యక్రమాలు చేపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వ్యాపారులు తగినంత లాభాలు అందుకుంటారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. కళాకారులు, రచయితలు పట్టుదలతో అవకాశాలు సాధిస్తారు. 22,23 తేదీలలో స్నేహితులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు. శ్రీ నృసింహస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆదాయం ఊరటనిస్తుంది. అప్పుల బాధలు తొలగుతాయి.  కొన్ని కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.  వాహనసౌఖ్యం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మరింత అనుకూలస్థితి. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. 26,27 తేదీల్లో ఖర్చులు అధికం.  గణేశాష్టకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.   విద్యార్థులకు నూతనోత్సాహం. రాబడి గతంకంటే మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగు తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు విశేషంగా కలసివస్తుంది. 25,26 తేదీల్లో బంధు వులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. శివపంచాక్షరి  పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు కొన్ని విజయవంతంగా సాగుతాయి. శ్రేయోభిలాషుల సూచనలు అమలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని విధంగా కాంట్రాక్టులు దక్కుతాయి. వాహన సౌఖ్యం.  వ్యాపారులకు అనుకోని విధంగా లాభాలు కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  22,23 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు నిదానించినా చివరికి పూర్తి కాగలవు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి.  సుదీర్ఘ విరామం తర్వాత బంధువులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. 23.24 తేదీల్లో  వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్న కార్యక్రమాలు ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేస్తారు.  రాబడి సంతృప్తినిస్తుంది.  విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారులకు లాభాలు.ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట నిస్తుంది. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. 24,25 తేదీల్లో వ్యయ ప్రయాసలు. శ్రీ లక్ష్మీస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

సమాజసేవలో చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం మరింత మెరుగుపడుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారులు లాభాల బాటలో నడుస్తారు. కళాకారులకు కొన్ని అవకాశాలు దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు.27,28  తేదీల్లో బంధువులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

మీ అంచనాలు,ఊహలు ఫలిస్తాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.  పారి శ్రామికవేత్తల యత్నాలలో కొంత పురోగతి. 22,23 తేదీల్లో స్నేహితులు,  బంధువులతో తగాదాలు. వృథా ఖర్చులు. ఆంజనేయ దండకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

స్నేహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి.  మీ సమర్థతను చాటుకుని ముందడుగు వేస్తారు. ఆదాయంలో పెరుగుదల, కొన్ని రుణాలు తీరే అవ కాశం. సేవాభావాన్ని చాటుకుంటారు. వివాహ, ఉద్యోగా యత్నాలలో పురోగతి. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు పూర్తిచేస్తారు. కళాకారులు, రచ యితలు లక్ష్యాలుసాధిస్తారు.24,25తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

అదనపు ఆదాయం సమకూరి ఎటువంటి  అవసరాలైనా తీరతాయి. బంధువుల నుంచి శుభవర్త మానాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ధార్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు.  ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయవేత్తలకు ఊహించని అవ కాశాలు. కళాకారులు, రచయితలకు ముఖ్య సమాచారం. 25,26  తేదీల్లో స్నేహితుల నుంచి ఒత్తిళ్లు. వృథాఖర్చులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE