రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు సీనియర్‌ ప్రచారక్‌, అఖిల భారతీయ మాజీ బౌద్ధిక్‌ ప్రముఖ్‌, శ్రీ రంగాహరీజీ 2023 అక్టోబర్‌ 29 ఉదయం ఏడు గంటలకు స్వర్గారోహణ చేశారు. హిందూ మేధావులలో మహోన్నత బుద్ధిజీవి, అప్యాయత నిండిన, మెత్తటి మాటలతో ఎదుటివారికి తోడ్పాటునిస్తూ  హృద్యంగా సంభాషించ గల వ్యక్తి, విశిష్టంగా ఆలోచించగలవారు, రాష్ట్రానికి అంకితమైన సంఘ రుషి జీవనయానం ముగిసింది. ఆయన వయసు 93 ఏళ్లు. 13 ఏళ్ల వయసుకే  సంఘ స్వయంసేవకుడు అయ్యి, 80 ఏళ్లు వచ్చే వరకు చురుకుగా సంఫ్‌ు కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు. ఆయన 1983-1993 మధ్య కేరళ ప్రాంత ప్రచారక్‌గా, 1991 నుంచి 2005 వరకు అఖిల భారతీయ బౌద్ధిక్‌ ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సంఘ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, రాబిన్‌ శర్మ పుస్తకం`‘ది లీడర్‌ హూ హాడ్‌ నో టైటిల్‌’  (బిరుదు లేని నాయకుడు) శీర్షికను నిజం చేస్తూ, శ్రీ రంగాహరీజీ  సృజనాత్మకమైన రీతిలో చురుకెన స్వయంసేవక్‌గా వ్యవహరించారు.

హింసాత్మక, వేర్పాటువాద, రక్తరంజితమైన వామపక్ష సిద్ధాంతం క్షేత్ర స్థాయిలో చేస్తున్న సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, కమ్యూనిజం పట్టి పీడిస్తున్న  కేరళ గడ్డపై హిందుత్వను సమర్ధించి, సమగ్ర జాతీయ సిద్ధాంతం, సంఘ జాతీయ ఆలోచనకి బీజాలు వేసిన వివేకవంతమైన, ఉత్సాహ వంతమైన కార్యకర్తలలో  శ్రీ రంగాహరి ముఖ్యులు. క్రూర మనస్తత్వం కలిగిన కమ్యూనిస్టులతో జరిగిన హింసాత్మక  ఘర్షణలలో అక్కడ 298 మంది సంఘ కార్యకర్తలు మరణించారు. వీరిలో 70 శాతం గతంలో కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అనుసరించి, తరువాత స్వయంసేవకులు అయినవారే. అటువంటి స్వయంసేవకుల కుటుంబాలను ఆదుకుంటూ, వారి దుఃఖాన్ని సాంత్వనపరుస్తూ, ఓదార్పునిస్తూ, తాము ఇంకా సంఘపరివారంలోనే ఉన్నామనే భావన కలిగేలా చూడడం అన్నవి ఆ దుర్ఘటనల తర్వాత చేపట్టవలసిన సంక్లిష్ట చర్యలు. అంతటి బరువును భరించేలా హృదయాన్ని గట్టిపరచుకునేందుకు ఎలా కృషి చేస్తారో వివరించమని శ్రీ రంగాహరీజీని నేను ఒకసారి అడిగినప్పుడు, ఆయన భోరున విలపించడం ప్రారంభించారు. పైన పేర్కొన్న తరహా హింసాత్మక పరిస్థితులు, వాటి పరిసర ప్రాంతాలలో నిత్యం జీవించడం అన్నది వ్యక్తి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేయడంవల్ల, అతడు బండబారి పోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే, ఆ రోజు నేను పుష్కలమైన సున్నితత్వం, మృదుత్వం కలిగిన శ్రీ రంగాహరీజీ హృదయాన్ని చూడగలిగాను.

కేరళలలో కమ్యూనిస్టు గూండాలతో పోరాటం విస్తరిస్తున్న తరుణంలో, కమ్యూనిస్టు పార్టీల నాయకులతో చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్న పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు శ్రీ రంగాహరీజీదే. అటువంటి ఒక చర్చలో సంఘ ప్రముఖులు శ్రీ దత్తోపంత్‌ ఠేంగ్డేజీ పాలుపంచుకున్నారు. హింసాత్మ కంగా, ఘర్షణాత్మకంగా మారిన కేరళ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడం ఎలా? అన్న అంశంపై కొత్తగా ధారావాహిక వ్యాసాలు ఆరంభించమని ‘కేసరి’ అనే మలయాళ వారపత్రిక పాఠకులను కోరినప్పుడు, ఆ చొరవ తీసుకున్నందుకు అభినందిస్తూ ఎడిటర్‌కు వ్యక్తిగతంగా శ్రీ రంగాహరీజీ లేఖ రాశారు.

గంభీరమైన, క్లిష్టమైన విషయాంశాలను ఉదాహరణలతో, హాస్యస్ఫోరకంగా, నాటకీయంగా వివరించడం ఆయన విలక్షణ శైలి. ఆయన సంస్కృత శ్లోకాలు, సుభాషితాలు వంటి సుసంపన్న సాహిత్యాన్ని సేకరించారు.

ఆయన అధ్యయనం చేసి, సంగ్రహించి, అనంతర కాలంలో తన రాతలలోనూ, ఉపన్యా సాలలోనూ ఉపయోగించిన సుభాషితాలను క్రోడీకరించి పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ పుస్తక శీర్షిక కూడా అత్యంత సందర్భోచితమైనది ` సుధీ వాణి ` సుధావాణి (తెలివైన మాటలు` అమృతతుల్య వాక్కులు). కొత్త భాషలను గ్రహించ డంలో ఆయన పద్ధతి, ఉత్సాహం అసాధారణమైనవి. గుజరాత్‌కు తొలి పర్యటనకు వెళ్లినప్పుడు, స్వల్పకాలంలోనే గుజరాతీ రాయడం, చదవడం నేర్చుకోవడం నన్ను నిశ్చేష్టుడిని చేసింది. ఆయన నిరంతర అధ్యయనం, ప్రాథమిక  విశ్లేషణ, లోతైన అర్థాలను గుర్తించడానికి శ్రమించేవారు.  విస్తృతమైన విషయాంశాలపై ఆయన 62 పుస్తకాలు ప్రచురించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు రెండవ సర్‌ సంఫ్‌ుచాలక్‌ పరమ పూజనీయ గోళ్వాల్కర్‌ (గురూజీ) జన్మ శతాబ్ది (2005-2006) సందర్భంగా, 33 సంవత్సరాల సుదీర్ఘ పదవీకాలంలో (1940-1973) వారు ఇచ్చిన అసంఖ్యా క ఉపన్యాసాల రాతప్రతులను సేకరించి, 12 సంపుటలుగా వర్గీకరించడం  శ్రీరంగాహరీజీ అందించిన అద్భుత సేవలలో ఒకటి. కాలపరీక్షకు నిలిచిన, నిత్యనూతనమైన శ్రీ గురూజీ ఆలోచనా మృతాన్ని, ‘శ్రీ గురూజీ `విజన్‌ అండ్‌ మిషన్‌’ అన్న శీర్షికతో చేసిన రచనతో పాటు ‘శ్రీ గురూజీ ఆత్మకథ’ అన్నవి పైన పేర్కొన్న జన్మశతాబ్ది కార్యంలో భాగంగా రంగాహరీజీ మేధో నైపుణ్యంతో అందించిన తీపి కానుకలు.

శ్రీ హరీజీ అత్యాధునికంగా, అనూహ్యంగా ఆలోచించడంలో ప్రవీణులు కావడమే కాదు, అనేకమంది తన సహచరులను కూడా ఒకటే పంథాలో కాకుండా తమ సాధారణ పరిమితులకు ఆవల ఆలోచించేందుకు సాహసించవలసిందిగా  ప్రోత్సహించారు.

ఔత్సాహిక రచయిత్రి దీప్తీ వర్మ, ‘పంచకన్య’ శీర్షికతో అందమైన పుస్తకాన్ని రచించారు. అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి ` ఐదుగురూ కూడా  పూజనీయ మహిళలు. ఈ మహిళల జీవితాల నుంచి ఈ శతాబ్దపు యువతులు గ్రహించగలిగే జీవిత పాఠాలను పట్టిచూపాలన్న ఉద్దేశంతో రచించిన ఈ పుస్తకం  ఆ తరం వారిలో ప్రాచుర్యం పొందింది. ‘అహల్య’ శీర్షికతో ఉన్న తొలి అధ్యాయాన్ని దీప్తి శ్రీ రంగా హరీజీ అభిప్రాయం కోసం పంపించారు. అందుకు ఆయన స్పందన ఇలా ఉంది ` దీప్తి వయసు శ్రీ హరీజీ మనవరాలి వయసుతో సమానం. అయినప్పటికీ, వారి చరిత్రలపై ఆధునిక దృక్కోణాన్ని ఆహ్వానిస్తున్న సంకేతంగా కేవలం తన ఆశీర్వచనాలు మాత్రమే పంపకుండా, ‘ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూడుగాక’ అని రాశారు. ఇది ఆయన అణకువను, వినయాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ లేఖ ఇలా ఉంది `

సు. శ్రీ దీప్తీజీ,

నమస్కారాలు. అహల్యపై మీ రచనను నిన్న చదివాను. క్లుప్తంగా చెప్పాలంటే, చాలా చక్కగా ఉంది. ప్రాథమిక పద్ధతి/ వైఖరి, విశదీకరణను చదివి చాలా ఆనందించాను. మిగిలిన నలుగురిపై రచనలు కూడా ఇదే శైలిలో ఉంటాయని నేను సరిగ్గానే భావిస్తున్నాననుకుంటాను.

ఒక సంతోషకరమైన వాస్తవాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను.

కేరళలో దాదాపు 120 సంవత్సరాల కిందట జన్మించిన రచయిత్రి లలితాంబికా అంతర్జానం. ఆమె సంప్రదాయ నంబూద్రి (కేరళ బ్రాహ్మణ) సమాజంలో పుట్టిన ఆమె మలయాళంలో ‘సీతా ముతల్‌ సత్యవతి వరే’ (సీత నుంచి సత్యవతి వరకు)’ అనే రచన చేశారు. అందులో ఒక అధ్యాయం అహల్య పైన ఉంది. ఈ విషాదం మొత్తానికి కారణం సరిపోలక పోవడం (మిస్‌మ్యాచ్‌)  అంటూ నువ్వు పట్టి చూపించిన అంశాన్నే ఆమె కూడా పేర్కొన్నారు. ఈ పుస్తకం మలయాళంలో ఉంది. నేను చదివిన పుస్తకాలలో ఒక మహిళ మరొక మహిళను మూల్యాంకనం చేసిన తొలి పుస్తకమదే. అలా మూల్యాంకనం చేయడం అన్నది కూడా అత్యంత ముఖ్యం. నువ్వు ఆ పని వాస్తవంగా చేసినందుకు ప్రశంసిస్తున్నాను.

శాస్త్రీయ దృక్పథమనే ఈ కాలం సోదరీమణుల, తల్లుల తృష్ణను, స్వభావాన్ని తృప్తి పరుస్తూ మీ వ్యాఖ్యానం ఉండటం నాకెంతో నచ్చింది.

మీరు పూర్తి చేయగానే రానున్న రచనలలో ఆ నలుగురి కోసం నేను ఎదురుచూస్తున్నాను.

 ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూడుగాక,

యువర్స్‌ సిన్సియర్లీ

  రంగాహరి

శ్రీ హరీజీ జీవితం నుంచి విడదీయలేని సహచరి హాస్య చతురత. సంఘ అఖిల భారతీయ బైఠక్‌లో ఏ మాత్రం విరామం లభించి, స్వయంసేవకులు ఒకచోట గుమిగూడి ఉండగా, అటుగా వెడుతున్న కార్యకర్తలు కూడా వారితో కలిసిపోవడం, అప్పుడ ప్పుడు నవ్వులు తెరలు తెరలుగా వినిపిస్తుండటం జరుగుతోందంటే, అక్కడ శ్రీ రంగాహరీజీ ఉన్నారని కచ్చితంగా భావించవచ్చు.

ఆయన పొట్టివారు (ఐదడుగులకన్నా కొద్ది తక్కువ)  కావడం వల్ల దూరం నుంచి అటువంటి సమూహాలలో ఆయనను గుర్తించడం అసాధ్యం అయినప్పటికీ, హఠాత్తుగా వినిపించే నవ్వుల జల్లు ఆయన అక్కడే ఉన్నారనడానికి తిరుగులేని సంకేతం.

నేను తరచు ఖలీల్‌ జిబ్రాన్‌ ‘యువర్‌ చిల్డ్రన్‌’ అనే కవితను ప్రస్తావించేవాడిని. హరీజీ ఉన్న ఒక సమావేశంలో నేను దానిని ప్రస్తావించేవరకూ ఆ కవిత నాకు పాక్షికంగా మాత్రమే తెలుసుననే విషయం నాకు ఎరుకలేదు. నేను ఆపిన దగ్గర నుంచి ఆ కవితకు ఇంకా కొనసాగింపు ఉందని ఆయన నాకు చెప్పారు. ఈ మెయిళ్ల కాలం కాని ఆ రోజుల్లో, శ్రీ రంగాహరీజి ముంబైలో ఉన్నారు. తన నిర్ణీత ప్రయాణాలను పూర్తి చేసుకుని, రెండు నెలల విరామానంతరం తను ముంబై కేంద్రానికి చేరుకున్న తర్వాత, ‘యువర్‌ చిల్డ్రన్‌’ అన్న ఖలీల్‌ జిబ్రాన్‌ కవిత మొత్తాన్ని ఎంతో ఆలోచనాత్మకంగా విశ్లేషించే లేఖ రాసి నాకు పంపారు. ఈ లేఖ చివరిలో, తన వినోద శైలిలో ఆయన ఒక నోట్‌ను కూడా జతపరిచారు. అది`

 ‘ప్రియమైన మన్మోహన్‌! ఏ పిల్లలూ లేని వారు ఏ పిల్లలూ లేనివారికి ‘యువర్‌ చిల్డ్రన్‌’ పంపిస్తున్నారు (Dear Manmohan, sending ‘Your Children’ to one who has none by one who also has none).

                    – ఆర్‌ హరి

(సంఫ్‌ు కేడర్‌ గురించి తెలియనివారికి` మేమిద్దరం ప్రచారకులం, ప్రచారకులు వివాహం చేసుకోరు.) ప్రచారక్‌ ‘అనికేతుడు’ (నికేత లేదా గృహం లేనివాడు అని), సంస్థ అవసరాలను బట్టి ఒక మూల నగరాన్ని అతడికి కేటాయిస్తుంది. శ్రీ రంగాహరీజీ మూల స్థావరం ముంబై. అక్కడ ఉన్నప్పుడు ఆయన గుజరాత్‌ పర్యటనకు వచ్చారు. ఇద్దరం కలసి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త నివాసానికి వెళ్లాం.  అక్కడ సంభాషణ ప్రారంభిస్తూ, ‘హరీజీ మీరు ఎప్పుడు వచ్చారు?’ అని పారిశ్రామిక వేత్త అడిగారు. గుజరాత్‌లో ఆయన ఎంత కాలముంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి అతడిలో బాగా ఉండడంతో తిరిగి, ‘మీరు ఎప్పుడు తిరిగి వెడుతున్నారు?’ అని కూడా అడిగారు. అందుకు హరీజీ తక్షణమే స్పందిస్తూ, ‘‘నేను మూడు రోజుల తర్వాత ఢల్లీి బయలుదేరి వెడతాను. తిరిగివెళ్లడం కాదు. నా అధికారిక స్థావరం ముంబై. ముంబై వెళ్లేటప్పుడు మాత్రమే నేను తిరిగి వెడుతున్నా నంటాను’’ అని సమాధానం చెప్పారు. ఒక సాధారణ సంభాషణలో కూడా అంత సమయస్ఫూర్తిని ప్రదర్శించడం నన్ను ఆశ్చర్యపరచడమే కాదు, ఆకట్టుకుంది కూడా.

శ్రీ రంగాహరీజీ ఒక వ్యవస్థ. ఆయన తన జీవితం, ప్రవర్తన, నడత ద్వారా అనేకమందికి ఎంతో బోధించారు. అంతేకాదు, అంతిమ క్షణానికన్నా కొన్ని ఏళ్ల ముందే గ్రహించి, తన మరణం గురించి ఆయన రాసుకున్న విషయాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, విస్తారంగా, లోతుగా ఉన్నాయి. కేరళ ప్రాంత ప్రచారకులను ఉద్దేశించిన సీల్డ్‌ లెటర్స్‌ను ప్రాంత ప్రచారక్‌కు అందించి, తాను భౌతికంగా శరీరాన్ని వదిలిపోయిన తర్వాతే వాటిని తెరవాలనే ఆదేశాలతో అప్పటివరకూ వాటిని జాగ్రత్తగా ఉంచమని చెప్పారు. ఆ లేఖలలో ఆయన, ‘మనిషి సజీవంగా ఉన్న కాలంలో తాను ఏం కావాలనుకుంటే అవి చేయగలడు. కానీ అతడు మరణించిన తర్వాత చేయవలసిన పనులను అతడు స్వయంగా చేయలేడు. తన కోసం ఇతరులు చేయాలని వారిపై ఆధార పడతారు. కనుక నా విజ్ఞప్తి ఏమిటంటే,  ఒక నిర్ధిష్ట కులానికి చెందిన వారి శ్మశానంలో నా భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించ వద్దు.  అందుకు బదులుగా, ఎవరికైనా అంతిమ సంస్కారం చేసే అవకాశం ఉన్న ప్రదేశంలోనే నా భౌతిక కాయానికి వాటిని నిర్వహించండి. నేను కుల ఆధారిత వివక్షను నా జీవితకాలంలో ఎన్నడూ అనుసరించలేదు. నా మరణం తర్వాత కూడా దానినే కొనసాగించాలనుకుంటున్నాను. పాండవులు పిండదానం చేసిన చారిత్రక ‘అయివారం మఠం’  కేరళలోని భరత నది ఒడ్డున ఉంది. నా అంతిమ సంస్కారాలు అక్కడ జరపాలి. అలాగే నా అస్తికలను, బూడిదను ఒక ప్రముఖుని లాగా రెండు మూడు ప్రాంతాల వ్యాప్తంగా గాక స్థానికంగా ఉన్న ఏదైనా నది, చెలమలో కలపండి. నేను నా శ్రాద్ధాన్ని, పిండదానాన్ని బ్రహ్మకపాలంలో (హిమాలయాలలోని బదరీనాథ్‌ ఆలయానికి సమీపంలోని ఒక పుణ్యక్షేత్రం) నిర్వహించాను, కనుక ఈ కర్మ కాండలను నా కోసం ఎవరూ నిర్వహించనవసరం లేదు. నా మేధోపరమైన రచనలు, ప్రచురణల యాజమాన్య హక్కులను సంఫ్‌ుకి ఇస్తున్నాను. కమ్యూనిస్టు కార్యకర్తలకు అంతిమ సంస్కారం చేసే ముందు వారిపై ఎర్రబట్టను కప్పడం కేరళలో చాలా ఎక్కువ. ఈ పద్ధతికి స్పందనగా సంఫ్‌ు స్వయం సేవకుల భౌతికకాయాలకు కాషాయం చుట్టడం అన్నది కేరళలో పెరిగింది. కానీ అది సరైన పని కాదు. కాషాయం అన్నది గురువుకు ప్రతినిధి (దారిచూపే కాంతి). కనుక, నా శరీరాన్ని కాషాయ బట్టతో చుట్టకండి!’

 ఇవీ రంగాహరీజీ రాసిపెట్టిన చివరి కోరికలు. అనుసరణీయమైన జీవితాన్ని ఆయన జీవించడమే కాదు మరణించే ప్రక్రియలో కూడా అన్వేషకుల మార్గానికి కాంతినిస్తూ, అనేకమంది మనసులలో కాంతిని నింపారు.

 దిగువన ఇచ్చిన ఈ మూడు శ్లోకాలతో శ్రీ రంగాహరీజీ తన చివరి ప్రార్థనను రచించారు.

మామికాన్తిం ప్రార్థన

కరణీయం కృతం సర్వం తత్‌జన్మమ్‌ సుకృతం మమ్‌

ధన్యోస్మి కృతకృత్యోస్మి గచ్ఛామ్యద్య చిరం గృహం       ॥ 1 ॥

కార్యార్ధం పునరాయుతమ్‌ తథాప్యాశాస్తి మే హృది

మిత్రై సహకర్మ కుర్వన్‌ స్వాంతః సుఖమవాప్నుయామ్‌ ॥ 2 ॥

ఏష చేత్‌ ప్రార్థన దృష్ట క్షమస్వ కరుణానిధే

కార్యమిదం తవైవాస్తి తావకేచ్ఛా బలీయసి ॥ 3 ॥

అర్థం`నాకు అప్పగించవలసిన పనులు అప్పగించినందున నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను, ఈరోజు నేను నా శాశ్వత నివాసానికి వెడుతున్నాను.  ఇదే పనిలో తిరిగి నిమగ్నమయ్యేందుకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. నేను నా సహకార్య కర్తలతో కలసి ఇదే పనిని మరింతగా చేసి ఆత్మ సంతృప్తిని పొందుతానని కచ్చితంగా అనుకుంటు న్నాను. ఒకవేళ ఈ ప్రార్థనతో అహంకారాన్ని ప్రదర్శిస్తే, నన్ను క్షమించండి. ఈ ‘పని’ కూడా మీదే, మీ కోరికే ప్రధానం.

దేఖనా దేహాంత తో జో, సాగరి సూర్యాస్త సా

అగ్నిచా పేరున్‌ జాతో రాత్రగర్భి వారసా ॥

ఒకవేళ ఈ పదాలను అనువదిస్తే, అర్థం ఇలా ఉంటుంది `

సముద్రంలోకి కుంగుతున్న సూర్యుడి చివరి కిరణాలలా మరణం కూడా అందమైనదే

అది వారసుని చీకటి గర్భానికి అగ్నిపరీక్షను ఆస్తిగా సంక్రమింప చేస్తుంది.

శక్తిమంతమైన హిమాలయాల వంటి ఎత్తులను అధిరోహించిన వ్యక్తి మా మధ్యలో నడిచాడు. ఆయన సహచరులుగా ఆయనతో సంభాషించే అవకాశం మాకు లభించింది. మనలాంటి సామాన్యమానవులు ఆయన అనురాగపు జల్లులతో మురిసిపోతారు` ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది. హింసాత్మక కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా పోరాటాన్ని, కేరళలో కమ్యూనిజం పీఠాన్ని కూల్చివేసేందుకు ఏకదృష్టితో, అంకితభావంతో పోరాడే సంఫ్‌ు కార్యకర్తలను అభివృద్ధి చేసిన ఉపజ్ఞత కలిగిన గురువు, మార్గదర్శి అయిన ఆ  మహోన్నత వ్యక్తికి నా వినయపూర్వక ప్రణామాలు.

దేఖనీ తీ పావులే జీ ధ్యాస పంథే చాలతీ

వాళవంతతూన శుద్ధ స్వస్తి పద్మే రేఖతీ ॥

ఆ పాదాలు మహిమాన్వితమైనవి, లక్ష్యంవైపు సాగుతాయి

మారుతున్న కాలపు ఇసుక మీద, ఉత్సాహ పూరితమైన ఆత్మ స్ఫూర్తిని ప్రకాశింపచేయండి/ వెలిగించండి.

– మన్‌మోహన్‌ వైద్య

అఖిల భారత సహ సర్‌కార్యవాహ, ఆర్‌ఎస్‌ఎస్‌

About Author

By editor

Twitter
YOUTUBE