కశ్యప మహాముని భూమి, శైవసిద్ధాంతా నికి అగ్రపీఠం, గొప్ప సారస్వత`వైదిక నాగరికతలకు పుట్టిల్లుగా పరిఢవిల్లిన సుందర కశ్మీర్‌ నుంచి హిందువుల తరిమివేత కొన్ని దశాబ్దాల కింద మాత్రమే ప్రారంభమైంది కాదు. కశ్మీర్‌ అంటే నేడు మనం మ్యాప్‌లలో చూస్తున్న భౌగోళిక ప్రదేశమే కాదు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని కొన్ని ప్రదేశాలు, గిల్గిత్‌బల్తిస్తాన్‌, ఖైబర్‌ఫక్తూన్వా సహా లద్దాఖ్‌ వరకు ఉన్న ప్రాంతం. అందుకే, దండయాత్రలకు వచ్చిన ముస్లిం పాలకులు హిందూఖుష్‌ పర్వతాల మీదుగా ముందుగా అడుగుపెట్టేది కశ్మీర్‌లోనే. కనుక, నేడు పాకిస్తాన్‌ ఆధీనంలో ఉన్న ఆక్రమిత కశ్మీర్‌ను కూడా కలుపుకుంటే, ఆ విస్త్రతిలో విలసిల్లిన ఒక నాగరికతను ముస్లిం రాజులు, మతమౌఢ్యులు ఏ విధంగా అణచివేశారో అర్థం అవుతుంది. అంటే, మనం 1990వ దశకంలో చూసింది శతాబ్దాల కింద ప్రారంభమైన అనాగరిక బీభత్స చర్యకు కొనసాగింపే.

ఈ ప్రక్రియ క్రీ.శ.1339లో తొలి ముస్లిం ఆక్రమణదారు షా మీర్‌ కాలంలోనే ప్రారంభమైంది. హింసాత్మక పద్ధతుల ద్వారా అనేకమంది కశ్మీరీ పండిట్‌లను ఇస్లాంలోకి మార్చడమే కాదు, సుప్రసిద్ధ ఆలయాలను, వారసత్వాన్ని, సంస్కృతిని విధ్వంసం చేసే పనికి శ్రీకారం చుట్టాడు. తర్వాత వచ్చిన తైమూర్‌ నాడు మెజారిటీగా ఉన్న హిందువులకు, మైనార్టీ ముస్లింలకు మధ్య చిచ్చుపెట్టడమే కాదు, కశ్మీరీ పండిట్లను హింసించేందుకు చట్టాలు ప్రవేశపెట్టాడు. తర్వాత వరుసగా వచ్చిన ఇస్లామిక్‌ పాలకులు పండిట్లను, హిందూ సంస్కృతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం, వాటిని కాపాడు కునేందుకు పండిట్లు లోయ నుంచి పారిపోవడం ప్రారంభమైంది. తొలి వలసలు మొదలైంది షా మీర్‌ హింసలు భరించలేకే.

రెండవ విడత క్రీ.శ.1506 నుంచి 1585 వరకు పండిట్ల వలసలు సాగాయి. తర్వాత కశ్మీర్‌ పాలకులుగా వచ్చిన షా మీర్‌ సైన్యానికి చెందిన ‘చక్‌లు’ నిర్దాక్షిణ్యంగా హిందూ మందిరాలను, ఇతర ప్రదేశాలను ధ్వంసం చేసి, లోయలో పూర్తిగా హిందుత్వను తుడిచిపెట్టాలని ప్రయత్నం చేశారు. అందుకే ఈ కాలాన్ని కశ్మీర్‌ చరిత్రలో ‘అంధ యుగమ’ని పేర్కొంటారు. అనేక బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారిని వారు హింసించి మరీ ఇస్లాంలోకి మార్చారు. ప్రతి రోజూ వెయ్యిమంది హిందూ పండిట్లను హింసించడం, వారిని ఇస్లామ్‌ మతంలోకి తీసుకువచ్చేందుకు బలవంతంగా గోమాంసం తినిపించడం చేసేవారు. వేలాది గోవులను ప్రతివారం వధించేవారు. ఈ హింసను, అకృత్యాలను భరించలేకపోయిన పండిట్లు పెద్ద సంఖ్యలో లోయను వదిలి వలసమార్గం పట్టారు.

మూడవ విడత వలసలు మొగలుల పాలనా కాలంలో క్రీ.శ. 1585 నుంచి 1753 మధ్య చోటు చేసుకున్నాయి. ఉదారవాది, అత్యంత గొప్పవాడని మనం చరిత్రలో చదువుకున్న అక్బర్‌ దీన్‌`ఇ` ఇలాహిని స్థాపించిన తర్వాత కశ్మీరీ పండిట్లు తిరిగి కశ్మీర్‌కు వెళ్లి తమ మతాన్ని అనుసరించేందుకు అనుమతిచ్చాడు. తిరిగి వెళ్లిన పండిట్లు తమ జన్మ భూమికి వచ్చిన ఆనందాన్ని పూర్తిగా అనుభవించక ముందే, అతడి కుమారుడైన జహంగీర్‌ తిరిగి వారిపై అత్యాచారాలను ప్రారంభించాడు. ఆ తర్వాత వచ్చిన షాజహాన్‌, ఔరంగజేబులు కూడా కశ్మీరీ పండిట్ల సామూహిక హత్యలు, హింసలకు అనుమతించారు. క్రూరుడైన ఔరంగజేబు ఈ మతమార్పిడి కార్యక్రమాలకు అడ్డుపడతారనే భావనతో హిందూ పండితులను చంపించాడు. దీనితో వేలమంది మతం మార్చుకోవడమో లేక ఆ ప్రాంతాన్ని వదిలి పారి పోవడమో జరిగింది. ఫలితంగా కశ్మీరీ పండిట్ల సంస్కృతిని ఇస్లామిక్‌ పాలకులు ధ్వంసం చేస్తున్న క్రమంలో తమ ధర్మాన్ని, మతాన్ని కాపాడుకునేందుకు పండిట్లు కశ్మీర్‌ను వదిలి పారిపోయారు.

నాలుగవ విడత వలసలు 1753లో ఆఫ్ఘాన్‌ గవర్నర్ల పాలనా కాలంలో చోటు చేసుకున్నాయి. ఆటవిక పద్ధతుల్లో, నిర్దాక్షిణ్యంగా వారు పాల్పడిన హింస కారణంగా కశ్మీరీ పండిట్లు ఉద్వేగపూరితమైన, ఆధ్యాత్మికమైన ఆవేదనను అనుభవించవలసి వచ్చింది. ముఖ్యంగా కశ్మీరీ బ్రాహ్మణులను మతం మార్చేందుకు వారు అత్యంత క్రూరమైన, అమానవీ యమై, బర్బరీకమైన పద్ధతులను అవలంబించారు. వారి కిరాతక పద్ధతులు ఏ స్థాయికి చేరాయంటే హిందువులను గోనె సంచుల్లో కట్టేసి దాల్‌ సరస్సులో సజీవంగా విసిరివేసేంత వరకూ వెళ్లాయి. భీతిల్లిన, బాధిత హిందువులు దేశం వదిలిపారిపోవడమో, మరణించడమో లేక ఇస్లాంను స్వీకరించడమో జరిగేది. ఆ బర్బరీకుల కళ్లు తమ కుమార్తెల మీద ఎక్కడ పడతాయో అని హిందూ తల్లిదండ్రులు తమ కుమార్తెల ముక్కు, చెవులు కోయడం, గుండు గీయించడం వంటివి చేసేవారట. కశ్మీర్‌లోని సార స్వత బ్రాహ్మణులను కూడా గడ్డం పెంచుకోవాలని ఒత్తిడి చేయడమే కాక తిలక ధారణను అడ్డుకున్నారు. అఫ్ఘాన్‌ గవర్నర్ల పాలనను అంతం చేస్తూ సిక్కులు కశ్మీర్‌పై విజయం సాధించిన తర్వాత ఈ వలసలు ఆగడమే కాదు కాస్త శాంతి ఏర్పడిరది.

ఐదవ విడత వలసలు 1900 మొదటి కాలంలో చోటు చేసుకున్నాయి. సిక్కులు అధికారాన్ని చేపట్టిన తర్వాత పండిట్‌ బీర్బల్‌ ధర్‌ కారణంగా మహారాజా రంజిత్‌ సింగ్‌ జమ్ము, కశ్మీర్‌లో హిందూ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయగలిగాడు. ఈ సమయంలో మతసామరస్యం కొనసాగింది. ఇదే కాలంలో అనేకమంది ఇస్లామిక్‌ పాలకులు తిరగబడి ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. దీనికి తర్వాత కాలంలో ముస్లిం రీడిరగ్‌ రూమ్‌ అన్న పేరు వచ్చింది.

వారంతా కూడా విద్యావంతులైన కశ్మీరీ పండిట్లు ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవుల్లో ఉండి, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు అసహనానికి, అసూయకు లోనయ్యారు. ఫలితంగా జులై 13,1931 కశ్మీరీ పండిట్ల జీవితంలో ఒక చీకటి దినం అయింది. కశ్మీరీ ముస్లింలు శ్రీనగర్‌లోని పండిట్ల ఇండ్లపై దాడి చేసి, లూటీ చేసి, హత్యలు చేసి వారి ఆస్తులను చేజిక్కించుకున్నారు. దీని ఫలితంగా తర్వాత డోగ్రా పాలకులు అధికారంలోకి వచ్చినప్పటికీ కశ్మీరీ పండిట్లకు ఏ హక్కులూ లేకుండా పోయాయి.

స్వాతంత్య్రానంతరం కూడా దేశమంతా వేడుకలు జరుపుకుంటున్నా, కశ్మీరీ పండిట్లు ఆ పని చేయలేకపోయారు. అందుకు కారణం కశ్మీర్‌పై పాకిస్తాన్‌ దాడి చేయడమే. ఫలితంగా వేలాదిమంది కశ్మీరీ పండిట్లు తమ స్వంత ఇళ్లను వదిలి శ్రీనగర్‌లో తలదాచుకోవడానికి వచ్చారు. స్వాతంత్య్రానంతరం కూడా ఈ వలసలు ఏదో ఒకస్థాయిలో కొనసాగు తూనే ఉండటానికి కారణం వారికి కశ్మీర్‌లో ఎటువంటి హక్కులు, అవకాశాలు లేకపోవడమే.

ఆరవ విడత వలసలకు కారణాలు కూడా భిన్నమైనవి కావు. నాటి పాలకుడైన గుల్‌షా పాలనలో కర్ఫ్యూ విధించిన కాలమే ఎక్కువ కావడంతో, అతడిని తర్వాతి కాలంలో ‘గుల్‌ కర్ఫ్యూ’ అని పిలిచేవారట. తమ పరిస్థితిపై కశ్మీరీ హిందువుల నిరసన ప్రదర్శించిన ప్రతిసారీ వారిపై హింస, ఆలయాల ధ్వంసం జరిగేవి. ఈ ఘటనలతో కశ్మీర్‌ అనేది ముస్లింల భూమి అయిందని, అక్కడ ఉండటం కశ్మీరీ హిందువులకు సురక్షితం కాదని వారికి అర్థం అయింది. ఈ క్రమంలోనే వారి వలసలు ప్రారంభం అయ్యాయి. ఈసారి వారు ఢల్లీి, అలహాబాద్‌ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లారు. అనేకమంది లోయ నుంచి కాలినడకన వెళ్లారు.

మనం చెప్పుకోబోయే ఏడవ విడత వలసలే ముందు తరానికి, ఈ తరానికి తెలిసిన వలసలు. కారణాలు శతాబ్దాల కిందటివే.. అదే ప్రవృత్తి అక్కడి ముస్లింలలో కొనసాగడం. అందుకు పాకిస్తాన్‌ వత్తాసు పలికి, తోడ్పాటు ఇవ్వడం. పాక్‌ ముస్లిం దేశం కనుక తామంతా ఒక తానులో ముక్కలమనే భావన కశ్మీరీ ముస్లింలలో బాగా నింపడంతో ఆధునిక కాలంలో అనేక ఆటవిక, అమానవీయ, క్రూర, నిర్దాక్షిణ్య ఘటనలు చేసుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాన్ని వదిలి పారిపోయిన పండిట్ల సంఖ్యపై అనేకవాదనలు ఉన్నప్పటికీ, స్థూలం 3లక్షల 50వేల మంది 1990లో తమకున్నదంతా వదిలివేసి, తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పారిపోయారు.

కశ్మీర్‌కు భారత్‌నుంచి విముక్తి కల్పించాలన్న భావనను నాటి యువత బుర్రల్లోకి పాక్‌ ఎక్కించిన ఫలితంగా అక్కడ హింస నిత్యకృత్యమైంది. ‘జాలిమ్‌ ఓ కాఫిరో, కశ్మీర్‌ హమారా ఛోడ్‌ దో’ (దయలేని కాఫిరులారా మా కశ్మీర్‌ను వదిలిపొండి)Ñ ‘కశ్మీర్‌ మె అగర్‌ రెహనా హై, ఆల్లా హో అక్బర్‌ కెహనా హోగా’ (స్థూలంగా దీనర్థం ` ఇక్కడ ఉండాలంటే ఇస్లాం మతం పుచ్చుకో), ‘లా షర్కియా లా ఘర్బియా, ఇస్లామియా! ఇస్లామియా! (తూర్పు నుంచి పశ్చిమం వరకూ ఇస్లాం మాత్రమే ఉంటుంది)Ñ ‘ముసల్మానోం జాగో, కాఫిరో భాగో’ (ముస్లింలలారా నిద్రలేవండి, కాఫీర్లలారా పారిపొండి), ‘కశ్మీర్‌ బనేగా పాకిస్తాన్‌’ (కశ్మీర్‌ పాకిస్తాన్‌ అవుతుంది), ‘పాకిస్తాన్‌ సె క్యా రిష్తా? లా ఇలాప్‌ా`ఎ`ఇల్లాప్‌ా ( పాకిస్తాన్‌తో మా సంబంధాన్ని ఇస్లాం నిర్వచిస్తుంది)Ñ దీనితో పాటు కశ్మీరీ పండిట్‌ పురుషులు కాకుండా వారి మహిళలతో కలిపి కశ్మీర్‌ను పాకిస్తాన్‌గా మారుస్తాం, మనసులో అల్లా చేతిలో కలష్నికోవ్‌ వంటి అనేక నినాదాలతో కశ్మీరీ పండిట్లపై అంతిమ దాడి ప్రారంభమైంది.

పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌, టర్కీ, సూడాన్‌ సహా అనేక దేశాలకు చెందిన క్రూరులైన ఉగ్రవాదులు రకరకాల సంస్థల పేర్లతో లోయలోకి ప్రవేశించారు. కాగా, ఆఫ్తాబ్‌ అనే స్థానిక ఉర్దూ పత్రికలో జనవరి 4, 1990న కశ్మీరీ పండిట్లంతా లోయను తక్షణమే విడిచివెళ్లాలంటూ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ప్రకటన విడుదల చేసింది. తర్వాత అల్‌ సఫా అనే మరొక స్థానిక పత్రిక ఇదే హెచ్చరికను ప్రచురించింది. అనంతరం, ముసుగులతో, ఖలష్నికోవ్‌లు ధరించిన తీవ్రవాదులు సైనిక తరహా కవాతులను వీధులలో నిర్వహించడం ప్రారంభించారు.

బాంబు పేలుళ్లు, కశ్మీరీ పండిట్ల హత్యలు, పండిట్‌ మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్య మయ్యాయి. దీనితోపాటుగా, మసీదుల నుంచి మైకుల ద్వారా రెచ్చగొట్టే ఉపన్యాసాలు విరామం లేకుండా రోజంతా ప్రసారం కావడం ప్రారం భమైంది. ఇటువంటి ప్రచారాన్ని కలిగిన ఆడియో కేసెట్లను లోయంతా వినిపించి, అప్పటికే భయంతో వణికిపోతున్న కశ్మీరీ పండిట్‌ సమాజాన్ని మరింత భీతిల్లేలా చేశారు. ఈ వార్తలు వస్తున్నప్పటికీ, హిందువులను కాపాడకుండా ఫరూక్‌ అబ్దుల్లా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.

కశ్మీరీ పండిట్ల జీవితంలో జనవరి 19, 1990 కాళరాత్రి. క్రూర అఫ్ఘాన్‌ పాలకుల హింస తర్వాత అంత ఆటవికంగా కశ్మీరీ పండిట్ల మనసులపై ప్రతికూల ముద్రవేసిన ఘట్టం ఇదే. ఆ రాత్రి లోయలో ఉండి ఆ భయాన్ని అనుభవించిన వారెవరూ కూడా తమ జీవితకాలంలో దానిని మరచిపోలేరని బాధితులు చెబుతుంటారు. ఆ భయాన్ని అనుభవించి, పారిపోయి వచ్చినప్పటికీ మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు, ఇప్పటికీ పీడకలలను కనేవారు ఉన్నారు. ఈ ఘటనల క్రమంలో నాటి ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా పరిస్థితులను అదుపులోకి తెచ్చి, నిందితులను శిక్షించే పని చేయకుండా, తన పదవికి రాజీనామ చేసేసి చేతులు దులిపేసుకున్నారు. అప్పుడే జగమోహన్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. పరిస్థితిని కొంత అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూను విధించినప్పటికీ, దాని ప్రభావం లేకుండా పోయింది. పండిట్లకు వ్యతిరేకంగా జిహాద్‌ చేసేందుకు బయటకు రావలసిందిగా మసీదు నుంచి ప్రకటనలు ప్రారంభం అయ్యాయి. జెకెఎల్‌ఎఫ్‌ సాయుధదళాలు వీధిలో కవాతు చేస్తూ లోయలో మైనార్టీలు అయిన అటు హిందువుల, ఇటు సిక్కులనూ తీవ్రభయాందోళనలకు గురి చేశారు. ఆ రాత్రి ఇస్లామిస్టుల నినాదాలతో లోయ దదరిల్లిపోయింది. హిందూ, ముస్లిం వర్గాల మధ్య ద్వేషాన్ని రగిల్చే, ముస్లింలను హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలతో, పాటలతో లోయలో మరణమృదంగం మోగింది.

సెక్యులర్‌, ఉదారవాద, శాంతియుత, సంస్కార వంతమైన, విద్యావంతమైన కశ్మీరీ ముస్లింలంటూ, భారతీయ మేధావులు, మీడియా వర్గాలు అభివర్ణించే వీరంతా కూడా ఈ సామూహిక ఉన్మాదంలో తమ ముఖానికి తగిలించుకున్న మాస్క్‌లను పీకి అవతల పడేశారు. ఏళ్ల తరబడి పక్క పక్క ఇళ్ల లోనే జీవించినా పండిట్లు ఎవరో తమకు తెలియనట్టుగా అనేకమంది కశ్మీరీ ముస్లింలు వ్యవహరించారు. స్వతంత్ర భారతదేశంలో ఉన్మాదంతో కూడిన తీవ్రవాద మూకలు చుట్టుముట్టగా అనాథలులాగా తమ జన్మభూమిలో కశ్మీరీ పండిట్లు ఆ కాళరాత్రిని వెళ్లదీయవలసి వచ్చింది. ఈ రాత్రే వారు సహనం లేని ఇస్లాం తీవ్రవాద వాస్తవ ముఖాన్ని చూశారు. మేధావులు ప్రచారం చేసే ‘కశ్మీరియత్‌’ అన్న సంప్రదాయానికి పూర్తి విరుద్ధమైన ప్రవర్తనను వారు చూశారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఏజెన్సీలు, సైన్యం, పారామిలటరీ దళాలూ కూడా ఈ మొత్తం గందరగోళంలో తాము కలుగచేసుకోలేమన్నట్టుగా వ్యవహరించాయి. ముఖ్యంగా, సైనిక దళాలు తమ ఎదుటే అంత అమానవీయ ఘట్టాలు చోటు చేసుకుంటున్నా, తమకు ఉత్తర్వులు జారీ కాలేదన్న సాకుతో కలుగచేసుకోలేదంటే అర్థం ఏమిటి?

ఇస్లామిక్‌ తీవ్రవాదులకు చిక్కకుండా, ప్రాణాలరచేతిలో పెట్టుకుని కంటిమీద రెప్పవేయ కుండా ఒకరికొకరు అన్నట్టుగా తెల్లవారే వరకూ జాగారం చేసిన పండిట్లు లోయవదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే అనేకమంది తీవ్రవాద మూకల చేతిలో ప్రాణాలు విడిచారు. తెల్లారేసరికి కశ్మీరీ ముస్లింల ఉద్దేశం వారికి మరింత విశిదంగా అర్థమైంది. ఏ గోడల మీద ‘ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కశ్మీర్‌’ అంటూ పెద్ద అక్షరాలతో రాతలు, లోయను ఇస్లామీకరిస్తామంటూ దినపత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలతో బలవంతంగా పండిట్లు లోయ వదిలి వెళ్లిపోయేలా బెదిరించారు.

కశ్మీరీ పండిట్ల నిర్మూలన, మారణహోమానికి పాక్‌ ఉగ్రవాదులతో కలిసి ఇక్కడి రాజకీయ నాయకులు చేసిన దుర్మార్గాలను దేశం పట్ల ప్రేమ, మానవత్వం, మానవహక్కుల పట్ల గౌరవం కలిగిన ఎవరూ మరచిపోరు. ఇస్లామిక్‌ తీవ్రవాదులు పెట్టే హింసలను, అత్యాచారాలను తాళలేక అన్నీ వదులుకొని వచ్చిన కశ్మీరీ పండిట్లు అనేకమంది ఢల్లీిలోని శరణార్థ శిబిరాలలో జీవితం వెళ్లదీస్తు న్నారు. ఆర్ధిక స్థితి బాగున్నవారు, బంధువులు, స్నేహితులు సాయం చేసినవారు కొంత మెరుగైన జీవితాన్ని గడుపుతున్నా, శిబిరాలలో వారి పరిస్థితి అమానవీ యమే. తమ పరిస్థితిని పట్టించుకోమని వారు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, మొన్నటి వరకూ అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ పట్టించుకో లేదు. ఆఖరుకు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా తమపై జరిగిన అత్యాచారాలను విచారించమని కోరినా చాలాకాలం గడిచిపోయిందనే సాకుతో తిరస్క రించింది. చిత్రమేమిటంటే, లోయలో 1947లో 10శాతంగా ఉన్న కశ్మీరీ పండిట్ల శాతం 1989 నాటికి 5శాతానికి పడిపోగా, నేడు 0.5 నుంచి 1 శాతం మధ్య ఊగిసలాడుతోంది. కానీ ఈ వాస్తవాలు ఎవరికీ పట్టకపోవడం అతిపెద్ద విషాదం.

యూదులపై జరిగిన మారణహోమం ఒక కాలం మలుపులో జరిగినదే. అనంతర కాలంలో వారికి జరిగిన అన్యాయాలను ప్రపంచం విన్నది, అర్థం చేసుకున్నది, వాస్తవమని బాధితులకు ఊరటనిచ్చింది. కానీ శతాబ్దాలుగా కశ్మీరీ హిందువు లపై దాడులు, అత్యాచారాలు, మారణహోమాలు జరుగుతున్నా ప్రపంచం సరే, నేటికీ వామపక్ష మేధావులు సహా మానవహక్కుల కోసం పని చేస్తున్నా మని చెప్పుకునేవారు ఎవరూ మాట్లాడకపోవడం దురదృష్టకరం.

– డి. అరుణ

About Author

By editor

Twitter
YOUTUBE