మృత్యువును ఎవరూ రెచ్చగొట్టరు, దాన్ని సవాల్ చేయరు. కాని మన యుగపురుషుడు అటల్ బిహారీ వాజపేయి ఆ పనిచేసి చూపెట్టారు.
సన్నద్ధమైంది – మృత్యువు సన్నద్ధమైంది
కలయబడాలన్న సంకల్పం లేకుండినది
ఏ మలుపులోనో కలవాలన్న వాగ్దానము చేయలేదు
దారిలో అడ్డుగా నిలుచున్నది
జీవితం కన్నా పెద్దదయిందనిపించినది.
నిజమే! మృతువు కన్నా గొప్పదైంది ఏదీ లేదు. మృత్యువు జీవితంలో అన్నింటి కన్నా గొప్పది, దాని ముందర జీవితం మరుగుజ్జు మాత్రమే!
అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా వ్యవహరించినది ముచ్చటగా మూడుసార్లు … మొదటిసారి 13 రోజులకు మాత్రమే, రెండవసారి 13 నెలలకు మాత్రమే. మూడవసారి అక్టోబర్ 13, 1999న డజన్ పార్టీల హంగ్ ప్రభుత్వ సాధనతో పూర్తి కాలం కృతకృత్యంగా దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు.
తన సౌమ్యత, చిరునవ్వు, పదాల వైచిత్రి అల్లికలు ప్రసిద్ధి గాంచిన మహామహుడు ఆయన.
ఆయన సంస్మరణలో ఒండు -రెండు ముచ్చట్లు-
హేమామాలిని తన అందం – అభినయంలో భారతీయ వెండితెరపై బంగారంలా మెరిసిపోయిన నటి! ఆమె మాటల్లో..‘అటల్‌జీతో నేనెప్పుడూ ముఖాముఖి సమావేశంకాలేదు. బీజేపీ ప్రచారానికి మాత్రం పూనుకున్నాను, వారిని కలుసుకోదలచాను. అవకాశం లభించింది. నేను ఆయన ఎదుట కూర్చున్నంత సేపూ సంకోచిస్తూనే కనిపించారు. నేను సంకోచించాల్సింది – అసలు. సహజంగా నాతో మాట్లాడుతున్నట్లనిపించడం లేదు. అక్కడే ఉన్న ఒక మహిళను అడిగినప్పుడు, ‘వాజపేయి మీ గొప్ప అభిమాని-ఫ్యాన్! 1992లో వారు మీ హిందీ ఫిల్మ్ ‘సీతా ఔర్ గీతా’ 25 సార్లు చూసారు. అదే మీ ముందర సంకోచానికి కారణం’ చెప్పారు.
పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తమ ‘•ష్ట్రవ •బతీఅఱఅస్త్ర శీఱఅ•, జీశీబతీఅవ• •ష్ట్రతీశీబస్త్రష్ట్ర ష్ట్ర•శ్రీశ్రీశ్రీవఅస్త్రవ’ పుస్తకంలో అటల్జీ గురించి, ‘జూన్ 10, 2002న ఉదయాన అన్నా విశ్వవిద్యాల యము ఒక మనోభావన వాతావరణంలో రోజూలానే ‘అనుసంధాన పరియోజనల’పై ప్రొఫెసర్లు, విద్యార్థులతో నేను పనిచేస్తుండగా నా తరగతి క్షమత 60 విద్యార్థులకే ఉండగా 350 మంది విద్యార్థులు హాజరైన చోట కృతకృత్యంగా ముగించానో లేదో – వైస్ ఛాన్సలర్ ప్రొ.కళానిధి, ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఫోన్ ఎన్నోసార్లు వచ్చింది, ఫోన్ యెత్తానో లేదో అటు నుండి ప్రధానమంత్రి మీతో మాట్లాడదలచారని తెలిసింది’’ అన్నారు.
ఆ సమయాన్నే నా గదిలో ఫోన్ మోగింది – మొబైల్‌పై చంద్రబాబు నాయుడు, ‘వాజపేయి ఎంతో అత్యంత ప్రముఖమైన మాటలు మీతో మాట్లాడదలచారు. దానిని మీరు కాదనొద్దు’’- అన్నారు.
అప్పుడే అటల్‌జీతో ఫోన్ కనెక్ట్ అయ్యింది. ‘‘కలాం! మీ శైక్షణిక జీవితం ఎలా గడుస్తోంది?’’
నా జవాబు – ‘‘చాలా బాగా నడుస్తోందండీ?’
వారు – ‘‘మీకోసం ఒక మంచి వార్త. మా హంగ్ అందరు నాయకులతో మాట్లాడాను. అందరూ నిర్ణయించారు. రాష్ట్రపతిగా మీ అవసరం దేశానికి యెంతైనా ఉంది. అందరూ అనౌన్స్ చేయమన్నారు. ఈ రాత్రికి దీన్ని నేను ప్రకటించలేదు. దీనికై మీ సమ్మతి కావాలి గదా! దీనికి మీనుండి ‘‘ఔను’’ అనే జవాబే కోరతాను, ‘కాదు’ – ‘లేదు’ – ‘వద్దు’- అని కాదు’’ అన్నారు.
ఎన్.డి.ఏ. సర్కారు రెండు డజన్ల పార్టీల కలయిక! అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొనే అవకాశమే ఉండదు. అసమంజసంలో పడ్డ కలాం రెండు గంటల వ్యవధి అడిగారు-ఆలోచించి చెబుతానని, ‘‘సరే! మీ సమ్మతిపైనే మేము ముందు కెడతాము. ఔననే చెప్పాలి సుమా’’ అన్నారు అటు నుండి వాజపేయి.
కలాం హతప్రభులయ్యారు. ఆ మాటే నా మెదడులో భ్రమించసాగింది. సరే! అనుకొని నా మిత్రులైన వైజ్ఞానికులతో కొందరు ప్రశాసనిక అధికారులతో, దగ్గరి మిత్రులతో మంతనాలాడాను. వారిలో కొందరు రాజకీయ సంబంధాలు కలవారూ ఉన్నారు. నా కనిపించింది – భారతదేశ 2002 మిషన్ దేశం ముందర, లోకసభ- రాజ్యసభ పరిషత్తు ముందర పెట్టే బంగారు అవకాశం దొరికిందని, ఆ సువర్ణ అవకాశం ప్రధానమంత్రి వాజపేయి నా కందిస్తున్నారు. సరిగ్గా రెండు గంటలు కాగానే వాజపేయికి ఫోన్‌చేసి ‘నేను సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పాను వాజపేయి ‘ధన్యవాదాలు’ తెలిపారు. దాని తర్వాత 15 నిమిషాల తదుపరి ఈ కబురు సమస్త దేశానికి వెల్లడైంది. తన సంరక్షణకై ఏర్పాట్లు జరిగాయి. వందల మంది గుమిగూడారు. ఆ రోజే వాజపేయి వివక్ష నేత సోనియాగాంధీతో మాట్లాడారు. ‘ఆ నిర్ణయం ఫైనలేనా’ అని ఆమె అడిగగా, అటల్‌జీ సకారాత్మక జవాబిచ్చారు. సోనియాగాంధీ తమ పార్టీవారితో మాట్లాడి ‘సరే’ నన్నారు.
మానవతా పూజారి, సహృదయ కవియైన వాజపేయి దేశం హితం కోరి ఎన్నో నిర్ణయాలు తీసుకొన్నారు.
– శ్రీ పెరంబుదూరు నారాయణరావు
(హిందీ త్రైమాసపత్రిక – ‘సంకల్ప్’ సౌజన్యంతో)