ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు-సంప్రదాయాలుగల ప్రజల మధ్య సంబంధాలు ఏర్పరచుకోవడానికి అత్యంత ప్రభావశీల మార్గం ఆహారం, వంటకాలు. ఈ కోణంలో చూస్తే భారతదేశానికి ఘనమైన పాకశాస్త్ర వారసత్వం, వంటకాల సంప్రదాయం ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాణిజ్య సౌలభ్య విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు భారతీయ ఆహార ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాబట్టే మన దేశం ఏటా 1300 కోట్ల అమెరికా డాలర్ల విలువైన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘ప్రపంచ ఆహార భారత ఉత్సవం’ ఘనమైన భారత ఆహార సంస్కృతిని లోకానికి పరిచయం చేసే ప్రభావశీల మాధ్యమంగా మారింది. ఈ మేరకు నవంబర్‌ 3 నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన రెండో ‘ప్రపంచ ఆహార భారత్‌’ ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

‘‘భారతదేశంలో ఇవాళ పంటకోత అనంతర మౌలిక సదుపాయాల కల్పన దిశగా ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ పథకం కింద 50 వేల కోట్లకు పైగా పెట్టుబడితో వేలాది పనులు సాగుతున్నాయి. మరోవైపు దేశంలో నేడు అమలు చేస్తున్న పెట్టుబడిదారు హిత విధానాలతో ఆహార రంగం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతోంది. ఆహార సంబంధిత ప్రతి రంగంలోనూ భారత్‌ అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. కాబట్టి ప్రతి కంపెనీకి, అంకుర సంస్థకు ఇప్పుడు ఇదొక సువర్ణావకాశం.’’ న్యూఢల్లీిలోని భారత మండపంలో ‘ప్రపంచ ఆహార భారత్‌-2023’ ప్రారంభోత్సవంలో ప్రధాని ఈ విధంగా చెప్పడం వెనుక బలమైన కారణాలున్నాయి. భారతదేశంలోని 140 కోట్ల మానవ వనరుల మద్దతు వ్యవస్థ ఉంది.. దేశం వ్యవసాయపరంగా అతిపెద్ద వైవిధ్యభరిత వస్తు ఉత్పత్తి దారుగా ఉంది.. భారత వ్యూహాత్మక భౌగోళిక స్థానంతోపాటు భారీ శ్రామికశక్తి, సానుకూల వ్యాపార పర్యావరణం వంటివి ప్రపంచ ఆహార వ్యవస్థకు మన దేశాన్ని భవిష్యత్‌ కూడలిగా మారుస్తున్నాయి. భారతదేశంలో ‘‘యథా అన్నం.. తథా మనం’’ అనే నానుడి ఉంది. అంటే – మన ఆహారాన్ని బట్టి మన మనసు ప్రభావితం అవుతుందని అర్థం. శారీరక-మానసిక ఆరోగ్యం విషయంలో ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. నేటి భారత సువ్యవస్థిత ఆహార సంస్కృతి వేల ఏళ్ల పరిణామాత్మక పయనం ఫలితమే.

ఆహార తయారీ రంగం పురోగమనానికి మూడు మూలస్తంభాలు

ఆహార రంగంలో భారత పురోగమనానికి చిన్న రైతులు, చిన్నతరహా పరిశ్రమలు, మహిళలు మూడు మూల స్తంభాలని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. చిన్న రైతుల భాగస్వామ్యంతోపాటు వారి ఆదాయం పెంపునకు 10 వేల రైతు ఉత్పత్తిదారు సంస్థలు (ఎఫ్‌ పిఒ) అవసరం కాగా, ఇప్పటిదాకా 7 వేలు ఏర్పాటయ్యాయి. అలాగే ఆహార తయారీ రంగంలో చిన్నతరహా పరిశ్రమల భాగస్వామ్యం పెంపు దిశగా దాదాపు 2 లక్షల సూక్ష్మ- చిన్నతరహా పరిశ్రమలు పని చేస్తున్నాయి. మరోవైపు భారతదేశం మహిళా చోదక ప్రగతి పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో నిరంతరం పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం ఆహార తయారీ పరిశ్రమకు ఎంతో మేలు చేకూరుస్తోంది.

ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోగల లక్షకు పైగా స్వయం సహాయ సంఘాల (ఎస్‌ హెచ్‌) ను బలోపేతం చేసే దిశగా వాటిలోని సభ్యులకు 3380 కోట్లతో ప్రాథమిక మూలధన సహాయ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వెల్లడిరచారు. ప్యాకేజింగ్‌, తయారీ, నాణ్యతను మెరుగుపరచడం ద్వారా విపణిలో పోటీతత్వాన్ని పెంచుకోవడంలో ‘ఎస్‌హెచ్‌జి’లకు ఈ ప్రాథమిక మూలధనం తోడ్పడుతుంది. ‘ప్రపంచ ఆహార భారతం-2023’లో భాగంగా ప్రధాని ‘ఆహార వీధి’ (ఫుడ్‌ స్ట్రీట్‌)ని కూడా ప్రారంభించారు.

ఈ వేడుకల ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ- ఆరోగ్యానికి మేలు చేసేవే కాకుండా, ప్రకృతితోపాటు నేలకు హాని చేయని ఆహార పదార్థాలను మనం తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్త ప్రముఖ ఆహార తయారీ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు సహా 80కి పైగా దేశాల ప్రతినిధులను ‘ప్రపంచ ఆహార భారతం- 2023’ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి నెదర్లాండ్స్‌ భాగస్వామ్య దేశం కాగా, జపాన్‌ ప్రధాన దేశంగా పాల్గొంది. భారతదేశాన్ని ‘ప్రపంచ ఆహార కూడలి’గా చూపడంతోపాటు 2023ను అంత ర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా నిర్వహించు కోవడం ఈ వేడుకల లక్ష్యం. ‘ప్రపంచ ఆహార భారతం-2023’ భారతీయ ఆహార ఆర్థిక వ్యవస్థకు ముఖద్వారం. భారత, విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యానికి ఇది సౌలభ్యం కల్పిస్తుంది. కాబట్టే ఆహార తయారీని నవోదయ రంగంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.

ఇది ప్రపంచ సుస్థిర-ఆహార భద్రత భవిష్యత్తుకు పునాది వేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సుస్థిర జీవనంలో ఆహార వృథాను అరికట్టడం కూడా ఒక పెద్ద సవాలేనని, ఆ మేరకు మన ఉత్పత్తులు వృథా కారాదని ఆయన పేర్కొన్నారు. భారత జి-20 అధ్యక్షత నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం, ఆహార-పోషకాహార భద్రతలను గురించి కూడా న్యూఢల్లీి దేశాధినేతల తీర్మానం స్పష్టం చేసింది.

కాగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే భారత్‌ తొలిసారిగా వ్యవసాయ ఎగుమతి విధానాన్ని రూపొందించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా రవాణా, మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌ను ఏర్పరిచింది. ఈ చర్యల వల్లనే ఇవాళ దేశంలోని 100కుపైగా జిల్లాస్థాయి ఎగుమతి కేంద్రాలు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా జిల్లాలు నేరుగా ప్రపంచ విపణితో అనుసంధానం కాగలవు.

ఆహార తయారీ కూడలిగా భారత్‌

  • 50,000 మిలియన్‌ డాలర్లకు పైగా వ్యవసాయ ఎగుమతులతో భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది.
  • భారత ఆహార పరిశ్రమ 2014-15 నుంచి 600 కోట్ల డాలర్లకు పైగా విలువైన విదేశీ పెట్టుబడు లను ఆకర్షించింది.
  • ఆహార ఉత్పత్తుల ఎగుమతి 2014-15లో 496 కోట్ల డాలర్లు కాగా, 2022లో 107 కోట్ల  డాలర్లకు పెరిగింది.
  •  2015లో 13.7 శాతం కాగా, 2022-23లో 25.6 శాతానికి పెరిగింది.
  • భారతదేశ ప్రాసెసింగ్‌ సామర్థ్యం 12 లక్షల టన్నుల నుంచి ప్రస్తుతం 200 లక్షల టన్నుల స్థాయి కన్నా పెరిగి,9 ఏళ్ల వ్యవధిలో 15 రెట్లుగా నమోదైంది.
  • కొత్త ఆహార తయారీ యూనిట్ల లాభాలపై 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చారు.
  • నమోదిత తయారీ రంగంలోని మొత్తం శ్రామిక శక్తిలో 12.2 శాతం ఆహార తయారీ రంగంలో ఉపాధి పొందుతున్నారు.
  • గడచిన ఐదేళ్లలో ఆహార ఉత్పత్తి రంగం సగటు వృద్ధి 9 శాతంగా నమోదైంది.
  • దేశంలో 23 మెగా ఫుడ్‌ పార్కులు, 12 ఆగ్రో ప్రాసెసింగ్‌ సముదాయాలు పనిచేస్తున్నాయి.
  • 271 సమీకృత శీతల గిడ్డంగి సదుపాయాల శ్రేణి, 140 నాణ్యత నిర్ధారణ ప్రయోగశాల లున్నాయి.

        – ‘న్యూ ఇండియా సమాచార్‌’ నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE