– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

వీరికి పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.  వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి వారి ఆదరణ లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. రచయితలు, క్రీడాకారుల యత్నాలు సఫలం. 11,12 తేదీలలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. ఆత్మీయులు మరింత చేయూతనందిస్తారు. పెండిరగ్పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు.  ఆలయాలు సందర్శిస్తారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వైద్యులు, వ్యవసాయదారులకు శుభవార్తలు, 13,14 తేదీల్లో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

రాబడి ఆశాజనకమే. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.  విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు దక్కుతాయి. వైద్యులకు మంచి గుర్తింపు రాగలదు. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు మరింత దక్కుతాయి. 9,10 తేదీల్లో ధనవ్యయం. స్వల్ప వివాదాలు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొన్ని సమస్యలు పట్టుదలతో అధిగమిస్తారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు కొన్ని అవకాశాలు దక్కించుకుంటారు. రచయితలు, క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు.12,13 తేదీల్లో వ్యృథా ఖర్చులు. మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

రాబడి ఆశాజకనంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. 11,12 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఉత్సాహంగా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు.  ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవేత్తలకు ఊహించని సమాచారం. వైద్యులు, సాంకేతిక నిపుణులకు ఆహ్వానాలు రాగలవు. 15,16 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. దేవీస్తుతి మంచిది.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

అనుకున్న  కార్యక్రమాలలో ఆటంకాలు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.  ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు చికాకులు. 14,15 తేదీల్లో విందువినోదాలు. వాహనయోగం. విష్ణుధ్యానం చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధువులు లేదా స్నేహితుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు, రియల్‌ఎస్టేట్ల వారికి శుభవార్తలు. రచయితలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 16,17 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. ఆంజనేయస్వామి దండకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. మనస్సాక్షికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.  రాజకీయవర్గాలకు శుభవార్తలు. రచయితలు, క్రీడాకారులు మరింత పట్టుదలతో ముందుకు సాగుతారు. 14,15 తేదీల్లో వ్యయప్రయాసలు. అనారోగ్యం.  గణేశాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలులో కొంత శ్రమ పడాల్సివస్తుంది. రాబడి ఆశాజనకమే. చిరకాల ప్రత్యర్థులు మీకు మద్దతుగా నిలుస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. కళాకారుల యత్నాలలో కదలికలు. వైద్యులు, సాంకేతిక నిపుణుల కృషి ఫలిసతుంది. 13,14 తేదీల్లో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. శివాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. రచయితలు, క్రీడాకారులకు ఆహ్వానాలు. 13,14 తేదీల్లో వృథా ఖర్చులు, అనారోగ్యం. గణేశ్స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సంఘంలో గౌరవం పెరుగుతుంది.  విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.  ఆలయాలు సందర్శిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. రచయితలు, క్రీడాకారులకు రివార్డులు దక్కవచ్చు. 11,12 తేదీలలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. కాలభైరవాష్టకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE