ఝాన్సీ లక్ష్మీబాయి అనుయాయి వీర ఝుల్కారీ జయంతి – నవంబర్‌ 22

ఝాన్సీ ఈ పేరు విన్నారా? ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసు మనకు. ఝాన్సీకీ రాణీ, తొలి స్వాతంత్య్ర సమరంలో ఆమెదే  కీలక భూమిక. పర పాలకుల పనిపట్టిన ‘మణికర్ణిక’. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతం రaాన్సీ. అంతకు ముందు పేరు బల్వంత్‌నగర్‌. చరిత్రాత్మకత సంతరించుకున్న కోట స్థలం. సమరం, కోట అనగానే… వెంటనే మన మదిలో మెదలాల్సిన వనిత రaల్కారీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయికి చెందిన సేనాదళంలో మహిళా విభాగ సభ్యురాలు. ఆమెది నాయికతో సరిసమాన పాత్ర, విశిష్టత. రaల్కారీ జీవితకాలం ఇరవై ఏడు సంవత్సరాలు! తను పుట్టిన తేదీ నవంబరు 22, 1830. అస్తమయం 1858లో. అంత చిన్న వయసులో ఎంతో పేరూ ఖ్యాతీ సాధించిన ఝుల్కారీ గురించి ఎంత మాట్లాడుకున్నా, చదివినా, విన్నా.. ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అంతటి ఘనత ఆమెది.

భారత విప్లవం చరిత్రాత్మకం, చరితార్థం.

అది యొక భవ్యభారత మహాద్భుత విప్లవవీరశక్తి

దుర్శద రిపుకోటి నోర్చి అభిమానము మానము నిల్పుకొన్న పు

ణ్యద శుభవాసరంబు, దురితాత్ముల నిల్వున నీరుసేయ భూ

విదిత పరాక్రముల్‌ భరతవీరులు సాగిన జైత్రయాత్ర

అని పలికింది కవిగళం. కొనసాగింపుగా

భారత భారతీ ప్రగతి భాగ్యము పండెను, ఝాన్సి శత్రుసం

హార మొనర్పసాగె మహిషాసుర మర్దినియై, రణాంగణ

స్వైర విహారమున్‌ సలుపు సాహసమూర్తి యపార శౌర్యసం

చరాకథల్‌ పవళ్ళును నిశల్‌ దిశలెల్ల ప్రతిధ్వనించె… అంటూ ముక్తాయించింది దశాబ్దాలనాడే.

1857 లో సిపాయిల తిరుగుబాటు సందర్భం

బ్రిటిషర్ల దమననీతికి ప్రతిఘటనగా తలెత్తిన మొట్టమొదటి అభివ్యక్తి. సేన తిరగబడటంలో పౌర భాగస్వామ్యమూ ఉంది. ఆంగ్లేయుల విస్తరణ విధానానికి తీవ్రస్థాయి నిరసన.

ఝాన్సీ ప్రాంతంతో పాటు నాగ్‌పూర్‌, సతారాపై కూడా పాలకుల కళ్లు పడ్డాయి. విలీనక్రమంలో ఉదయ్‌పుర్‌, సంబల్‌పుర్‌ సైతం. ఇలా అనేకానేక కారణాలు జతచేరి, తిరుగుబాటుకు మూలమయ్యాయి. ఝాన్సీ దత్తపుత్రుడి సింహాసన అర్హతను ఆంగ్లేయులు తిరస్కరించారు. సరిగ్గా అప్పుడే రాణీ లక్ష్మీబాయి సమరశంఖం పూరించింది. ఆమె సైనిక దళంలోని వ్యక్తే రaల్కోరీ.

అప్పుడు ఝాన్సీబాయికి ఇరవై రెండేళ్లే! ఆమే నేతృత్వం వహించింది.

పోరాటాన్ని సాగించింది. వ్యతిరేక ఫలితాలు వచ్చినా ఆగలేదు.

వ్యక్తిలా కాదు`శక్తిలా పోరాడిరది ఝాన్సీ. ఆ నాయకురాలి నుంచీ స్ఫూర్తి అందుకుంది ఝుల్కారీ.

తిరుగుబాటు ఎంతకాలం అంటే ఏడాదిపైగా.

అందులో ఝుల్కారీ మెరిసింది. కాళికలా విజృంభించింది.

ఆమెది పేద కుటుంబం. తల్లి ఆమె చిన్నతనంలోనే మరణించింది. అప్పటి నుంచే  తండ్రే ఝుల్కారీ ఆలనా పాలనా చూసుకున్నాడు. బతుకు విద్యతోపాటు యుద్ధ విద్యనీ నేర్చుకుంది. కత్తిసాము చేయడం, గుర్రపు స్వారీ, వేట వంటివి. యువతిగా ఉన్న సమయంలో ఒకరోజు అడవి బాటగుండా సాగుతోంది ఆమె. అంతలో ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఓ చిరుత!

ఒక్కసారిగా వణికిందామె. అది క్షణంసేపే. మరుక్షణంలోనే ఎక్కడాలేనంత ధైర్యం తెచ్చుకుంది. తన ప్రాణం తాను కాపాడుకోవాలి. ఆ మృగం బారి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి.

అందుకే తన చేతి కర్రనే ఆయుధం చేసుకుంది. ఎదిరించింది. బెదిరించింది. అదిలించింది. చివరికి మృగం బెడదను వదిలించుకుంది.

అదీ ఆమె సాహస ప్రవృత్తి. తిరుగులేని రీతి.

ఆమె స్వస్థలం ఝాన్సీ ప్రాంతంలోని భోజ్‌లా. చాలా చిన్న ఊరు. బహు చిన్నపాటి ఇల్లు. అక్కడే ఝుల్కారీ పెరిగింది. ధైర్య సాహసాలనే తన చిరునామాగా మార్చుకుంది. చిరుతను ‘తప్పించడం’ అందులో ఒక భాగం. రaల్కారీకి ఒక పూరణ్‌ అనే యువకుడితో పరిచయమైంది.తను కూడా రaాన్సీ లక్ష్మీబాయి దళంలోనివాడే. ఆయుధ విభాగంలో పని. వారి మధ్య ప్రేమ  చిగిర్చి, పెళ్లికి దారి తీసింది.  ఆ  పెళ్లి ఝాల్కారీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె లక్ష్మీబాయికి దగ్గరయ్యేలా చేసింది. ఫలితంగా, ఆ సేనలో తనూ భాగస్తురాలైంది.

ధైర్యం, సమయస్ఫూర్తి, వేగం మూర్తీభవించిన మూర్తిమత్వం రaల్కారీది. అందువల్లనే సైనికురాలి నుంచి పదోన్నతి పొందింది.‘దుర్గావాహిని’ అనేది సాయుధ బృందం. శిక్షణ, రక్షణలతో దూసుకెళ్లే విభాగం. అదే విభాగ నాయకురాలిగా రూపాంతరం చెందిందామె. అయినా, తనను తాను సైనికురాలిగానే భావించుకునేది.

నాయకత్వం, సైనికతత్వం -రెండు తనవే.

నాటి స్థితిగతులు మారుతూ వచ్చాయి.

‘భారతదేశ గౌరవము పాడొనరించు పిశాచి మూక త

ద్వీర విజృంభణమ్మను రవిప్రభ వల్లడ తల్లడయ్యె, త

ద్దారుణ విప్లవోజ్వోల కథల్‌ వినిపించు నిరంకుశత్వ దు

ద్వార దురంత దుర్మద దురాక్రమణంబుల గుండె జీల్చుచున్‌’

అది సంగతి. అంతటి సమరంలో ప్రసిద్ధ పాత్ర వహించింది ఝుల్కారీ.

ఆంగ్ల సేనలు ఝాన్సీ ప్రాంతాన్ని ముట్టడిరచాయి. ఆ మెరుపుదాడి నుంచి విజయవంతంగా తప్పించుకుంది ఝాన్సీ లక్ష్మీబాయి.

తానే లక్ష్మీబాయిలా ప్రత్యక్షమైంది ఝుల్కారీ.

కోట ముందు మోహరించి నిలిచింది.

ప్రత్యర్థి సేనమీద వీరోచితంగా విరుచుకుపడిరది.

ఆ ధాటికి వాళ్లు ఉక్కిరి బిక్కిరయ్యారు.

లక్ష్మీబాయి ఎవరో, ఎక్కడ ఉందో తేల్చుకోలేకపోయారు.

వాళ్లంతా గడబిడగా ఉండగానే, దుర్గలా విజృంభించిందామె.

పోరాటం సాగిపోతోంది.

వ్యూహం మూర్చుకున్న ఆంగ్లేయసేన నానాపాట్లూ పడిన తర్వాతే ఆమెను బందీగా పట్టుకోగలిగింది.

అటు తర్వాత ఏమైందో ఎవరికీ ఏమీ తెలియదు.

నిర్బంధం నుంచి ఆ నాయకురాలు తప్పించుకుందా? లేక.. వాళ్ల చేతుల్లో వీర మరణం పొందిందా? అన్నది స్పష్టత లేదు.

వీరవనిత ఆమె

ఇప్పటికీ తనను అక్కడివారంతా స్మరించుకుంటూ ఉంటారు. భూమి పుత్రికగా సంభావించుకుంటారు.

బుందేల్‌ఖండ్‌ పరిసర ప్రాంతాల్లోనైతే, ఆ పేరే ధ్వనిస్తుంటుంది.

ఆక్కడి ప్రజల మాటల్లో, పాటల్లో ఆమే ఉంటుంది. ఇక ముందు కూడా జానపద రీతిలో గీతికలు వినవస్తూనే ఉంటాయి.

ఝుల్కారీ జీవితాన్ని కథలుగా చెప్తుంటారు.  నాటకంగా మలచి ప్రదర్శిస్తుంటారు.నాటి పోరాట సంఘటనలు ఎన్నెన్నో. అన్నింటికీ కేంద్రంగా ఝుల్కారీబాయి పేరే వినవస్తుంటుంది ఈ నాటికీ.

స్వాతంత్య్రం అనంతరం ఆమె  స్మృత్యర్థం రెండు దశాబ్దాల క్రితం  ప్రత్యేక తపాలా బిళ్ల విడుదలైంది.

భారతీయ భావి భాగ్య

భానుదీప్తి ఆమె

నవజీవన మార్గాంకిత

యువజన విస్ఫూర్తిగీతి

అందుకనీ ఎందరెందరో ఈ నాటికీ ఝుల్కారీని తలచుకొంటున్నారు. తన జీవితాన్నే సందేశంగా మలచుకున్న ఆ ధీరురాలికి చేతులు జోడిరచి నమస్కరిస్తున్నారు.

  • జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE