– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ముఖ్యమైన కార్యక్రమాలు కొంత శ్రమానంతరం పూర్తి చేస్తారు.శుభకార్యాల నిర్వహణతో సందడిగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకోవడంలో స్నేహితులు తోడ్పడతారు. వ్యాపారులకు  ఈతిబాధలు తొలగి ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. క్రీడాకారులు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. 9,10 తేదీల్లో లేనిపోని ఖర్చులు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. హనుమాన్‌ ‌చాలీసా పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

అదనపు రాబడి దక్కి అవసరాలు తీరతాయి. సేవాకార్యక్రమాలు ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు చేపడతారు. కొత్త వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారులకు ఊహించనిరీతిలో లాభాలు రావచ్చు.  కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కే ఛాన్స్. ‌రచయితలు, పరిశోధకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 11,12 తేదీల్లో అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలతో ఇబ్బందిపడతారు. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఇంటి నిర్మాణాలలో కొంత జాప్యం.ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు కొత్త చిక్కులు. కళాకారులకు నిరుత్సాహం. పరిశోధకులు, వైద్యుల కృషి అంతగా ఫలించదు. 12,13 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆశించిన విధంగా రాబడి ఉంటుంది. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారులు లాభాలబాటలో నడుస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులు స్వీయ అనుభవాలతో ముందడుగు వేస్తారు. క్రీడాకారులు, వైద్యుల సేవలకు గుర్తింపు లభిస్తుంది. 14,15తేదీల్లో  అనుకోని ప్రయాణాలు. బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆదాయం కొంత మెరుగుపడి అవసరాలు తీరతాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారం. బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. వేడుకలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు.  విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. భూములు, ఇళ్లు కొనే వీలుంది. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు. కళాకారులు, రచయితలకు ముఖ్య సమాచారం రాగలదు. 8,9తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

రాబడి ఆశించిన రీతిలో ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.  ఆస్తి వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి.  వ్యాపారులు సంస్థల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు నూతనోత్సాహం. 12,13తేదీల్లో  వ్యయప్రయాసలు. మనశ్శాంతి లోపం.  బంధువిరోధాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆశించిన ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దైవకార్యాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారులు పెట్టుబడుల అన్వేషణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం రాగలదు. పారిశ్రామికవేత్తలు స్వయంకృషితో విజయాలు సాధిస్తారు. కళాకారులు, వైద్యరంగాల వారు సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. 13,14 తేదీల్లో అదనపు ఖర్చులు. బంధువిరోధాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొంటారు. క్రాంట్రాక్టులు లభిస్తాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగులు స్వల్పమేర ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవేత్తలకు అనూహ్యమైన పదవులు దక్కవచ్చు. కళాకారులు, రచయితలు సమర్థతను చాటుకుంటారు. 8,9 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. శివపంచాక్షరి పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

రావలసిన సొమ్ము సమయానికి అందుకుంటారు. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఆశించినరీతిలో లాభాలు అందుకుంటారు.  ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనూహ్య అవకాశాలు. రచయితలు, క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. 10,11తేదీల్లో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. శివాలయ దర్శనాలు చేయండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో తగాదాలు తీరి ఊరట చెందుతారు.  భూవివాదాలు ఏర్పడవచ్చు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వాహనయోగం.వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సేవలు విస్తృతమవుతాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు. రచయితలు, పరిశోధకుల యత్నాలు ఫలిస్తాయి. 11,12దీల్లో వివాదాలు. మానసిక ఆందోళన. బంధువుల నుంచి ఒత్తిడులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని ఇబ్బందులు తీరతాయి.అనుకోని కాంట్రాక్టులు దక్కించుకుంటారు.  ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవలసిన అవసరం.  భూలాభాలు ఉండవచ్చు. వ్యాపారులకు అనుకున్న విధంగా పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు చిక్కుల నుంచి బయటపడతారు. క్రీడాకారులకు ఉత్సాహవంతమైన కాలం. 14,15తేదీల్లో ఆస్తి వివాదాలు. మానసిక ఆందోళన. అంగారక స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు.  విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు.  భూ వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారులు కొత్త సంస్థలు ప్రారంభిస్తారు.  పారిశ్రామికవేత్తలు ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. కళాకారులు, రచయితలు సంతోషదాయకంగా గడుపుతారు. 9,10 తేదీల్లో  దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

About Author

By editor

Twitter
YOUTUBE