సరిలేరు నీకెవ్వరు!

సెప్టెంబర్‌ 17 ‌మోదీ పుట్టినరోజు

భారతదేశంలో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ప్రధాని, బీజేపీ నాయకుడు నరేంద్ర దామోదరదాస్‌ ‌మోదీకి జేజేలు పలుకుతున్నారు. విశ్వసనీయ సర్వేలకు ప్రసిద్ధిగాంచిన ప్యూ రిసెర్చ్ ‌సెంటర్‌ ఈ ‌విషయాలు వెల్లడించింది. భారత ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని ప్రతి పదిమంది భారతీయులలో ఏడుగురు సగర్వంగా చెబుతున్నట్టు ప్యూ సర్వే తెలియచేసింది. మోదీ ఇంట గెలవడమే కాదు, రచ్చ గెలుస్తున్నారు కూడా. భారత్‌లో ఏర్పాటైన జి 20 ప్రపంచ సదస్సు నేపథ్యంలో ఈ సర్వే వెలువడింది. విదేశీయులు కూడా భారత్‌ ‌పట్ల సానుకూలంగా స్పందించారు. భారత్‌ ‌సహా 24 దేశాలలో, 30,000 మంది అభిప్రాయాలను ఇందుకు స్వీకరించారు.

 23 దేశాలలో భారత్‌ ‌పట్ల ఈ సానుకూల దృక్పథం వెల్లడైంది. ఆ దేశాలలో 46 శాతం భారత్‌ ‌పట్ల సానుకూలత వ్యక్తం కాగా, 34 శాతం ప్రతికూలత కనిపించింది. 16 శాతం దేశాలలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం కాలేదు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా భారత్‌ను అభిమానిస్తున్న దేశం ఇజ్రాయెల్‌. ఇక్కడ 71 శాతం భారత్‌ ‌పట్ల సానుకూలత ప్రకటించారు.బ్రిటిషర్లు కూడా 66 శాతం భారత్‌ ‌పట్ల సానుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలో 51 శాతం భారత్‌ ‌పట్ల సదభిప్రాయంతో ఉన్నారు. 1952 నాటికి అమెరికా వారి దృష్టిలో భారత్‌ అం‌టే పాములు పట్టుకునే వాళ్లు ఉండే దేశం. కెన్యా, నైజీరియా, యూకేలలో కూడా సానుకూలతే వ్యక్తమైంది. కానీ దక్షిణాఫ్రికా ప్రజలు భారత్‌ ‌పట్ల విమర్శనాత్మక వైఖరితో ఉన్నారు. కొంత సిద్ధాంతపరమైన ఏకాత్మకత హంగెరి, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లలో భారత్‌ ‌పట్ల మొగ్గుకు కారణమైందని సర్వే వ్యాఖ్యానించింది. వామపక్ష, ఉదారవాదాల ప్రభావాలలో ఉన్న దేశాలలో ఇంత సానుకూలత వ్యక్తం కాలేదు.

భారతీయులలో 55 శాతం మోదీ అంటే గాఢాభిమానం వ్యక్తం చేశారు.

పసిఫిక్‌ ‌ద్వీప దేశాల ఐక్యతకోసం కృషికి, గ్లోబల్‌ ‌సౌత్‌కు నేతృత్వం వహిస్తున్నందుకు పపువా న్యూ గ్యునియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘కాంపేనియన్‌ ఆఫ్‌ ‌ది ఆర్డర్‌ ఆఫ్‌ ‌లోగోహు’’ పురస్కారాన్ని మోదీకి అందజేశారు. గ్లోబల్‌ ‌లీడర్‌షిప్‌కు గుర్తుగా ఫిజి ప్రధాని నరేంద్ర మోదీకీ ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కాంపేనియన్‌ ఆఫ్‌ ‌ది ఆర్డర్‌ ఆఫ్‌ ‌ఫిజీ’’ని ప్రదానం చేశారు. 2014, నవంబర్‌ 19‌న ఫిజిలో పర్యటించినప్పుడు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఇదే సమయంలో 14 ఇండో-పసిఫిక్‌ ‌ద్వీపదేశాల అధినేతలతో చర్చలు జరిపి ‘‘ఫోరం ఫర్‌ ఇం‌డియా-పసిఫిక్‌ ఐలాండ్స్ ‌కోఆపరేషన్‌’’ (ఎఫ్‌ఐపిఐసీ) ఏర్పాటుకు ప్రతిపాదించారు. మోదీ పర్యటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ‌నవంబర్‌ 21, 2014‌న హడావుడిగా ఇవే ద్వీప దేశాల్లో పర్యటించడం గమనార్హం. ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎదిగిందని చెప్పడానికి ఇవి గొప్ప ఉదాహరణలు. ఇది మోదీకి ఈ ఏటి జన్మదిన కానుకగా చెప్పవచ్చు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు.


‌జాతి హితం కోసం దేశాధినేత చేసే విదేశీ పర్యటనలు సత్ఫలితాలనివ్వడమే కాదు, దేశ కీర్తి ప్రతిష్టలను శిఖర సమాన స్థాయికి తీసుకెళతాయని చెప్పడానికి నరేంద్రమోదీ ప్రధాని హోదాలో చేసిన విదేశీ పర్యటనలే గొప్ప ఉదాహరణ. ఇతర దేశాలకు మనపై ఉన్న అభిప్రాయాలను సానుకూలంగా మార్చుకోవడానికి ముఖాముఖి దౌత్యం అవసరం. దీన్ని గుర్తించకుండా, పర్యటనల ఖర్చు గురించి మాట్లాడే విపక్షాలు, ఆ పర్యటనలు సాధించిన విజయాలను విస్మరించడం విషాదం. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధ నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ, తటస్థ వైఖరి అనుసరిస్తూ ఈ రెండు శిబిరాల మధ్య సమన్వయంతో దౌత్యాన్ని నెరపుతున్న దేశం భారత్‌ ‌మాత్రమే. రష్యాతో పటిష్ట స్నేహాన్ని కొనసాగిస్తుండ గానే, అగ్రరాజ్యం అమెరికా గతంలో ఎన్నడూ లేనివిధంగా యుద్ధ విమాన ఇంజన్ల టెక్నాలజీ బదలాయింపునకు అంగీకరించిందంటే ఈ పర్యటనతో పాటు పటిష్ట దౌత్యం కారణం. యు.కె., ఫ్రాన్స్, ‌జర్మనీ, ఇటలీ, పోర్చుగల్‌ ‌వంటి యూరప్‌ ‌దేశాలతో భారత్‌ ‌సంబంధాలు మరింత బలోపేతం కావడం, యూరోపియన్‌ ‌యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలు తిరిగి ప్రారంభమవడం, ఇండో-నార్డిక్‌ ‌సదస్సును (నవీకరణలు, వాతావరణం, తయారీ అంశాలకు ఈ సదస్సు ప్రాధాన్యతనిస్తుంది) మనదేశం ప్రారంభించడం వంటి గొప్ప విజయాలు మోదీ రాజనీతిజ్ఞతతో కూడిన విస్తృత పర్యటనలతో పాటు, దౌత్యం వల్లనే సాధ్యమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పసిఫిక్‌ ‌ద్వీపకల్ప దేశాలతో సహా ఆఫ్రికా, యూరప్‌, ‌లాటిన్‌ అమెరికా దేశాల్లో విస్తృతంగా ఫలితంగా18 ఆఫ్రికా దేశాల్లో భారత రాయబార కార్యాలయాలను తెరవాలన్న కీలక నిర్ణయం జరిగింది. పరాగ్వే, డొమెనికన్‌ ‌రిపబ్లిక్‌, ఇస్తోనియా, లిథియేనియా వంటి దేశాల్లో భారత్‌ అడుగు పెట్టింది. భారత్‌ ఏర్పాటు చేసిన ఇంటర్నే షనల్‌ ‌సోలార్‌ అలయెన్స్‌లో ప్రస్తుతం వంద దేశాలు భాగస్వాములు! చంద్రయాన్‌-3 ‌విజయవంతమైన నేపథ్యంలో భారత్‌ ‌స్పేస్‌ ‌పోగ్రామ్‌లో సహకారం కోసం 60 చిన్న, పేద దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఒకవైపు ధనికరాజ్యాలతో మరోవైపు పేదదేశాలతో సమన్వయంతో కూడిన స్నేహసంబంధాలు నెరపడం ఒక్క భారత్‌కే సాధ్య మన్నది వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. నేడు మనదేశం ఆస్ట్రేలియా గ్రూప్‌ (ఏజీ), మిస్సైల్‌ ‌టెక్నాలజీ కంట్రోల్‌ ‌రిజైమ్‌ (ఎం‌టీసీఆర్‌), ‌వాసెనార్‌ అరేంజ్‌మెంట్‌ (‌డబ్ల్యుఏ) అనే మూడు ‘‘నాన్‌ ‌ప్రొలిఫరేషన్‌ ఎక్స్‌పోర్ట్ ‌కంట్రోల్‌ ‌రిజైమ్స్‌లో సభ్యురాలు. అణుసరఫరా దేశాల్లో సభ్యత్వం కోసం భారత్‌ ‌ప్రయత్నాలు సాగిస్తోంది. కేవలం చైనా సైంధవ పాత్రే మనకు సభ్యత్వం లభించడంలో జాప్యానికి కారణం. యాక్ట్ ఈస్ట్ ‌పాలసీని మరింత విస్తరించడంతో సెంట్రల్‌ ఆసియా, ఆసియన్‌, ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కొరియా దేశాలతో సంబంధాలు మంచి ఫలితాలి స్తున్నాయి.

ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలు

ప్రధాని నరేంద్రమోదీ 2014 నుంచి ఇప్పటి వరకు జరిపిన 71 విదేశీ పర్యటనల్లో 66 దేశాలను సందర్శించారు. ఇందులో అమెరికా, ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ పర్యటనకూడా ఉన్నాయి. కొవిడ్‌ ‌మహమ్మారి కాలంలో ఆయన విదేశీ పర్యటనలు తగ్గిపోయాయి. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆయన అత్యధికంగా అంటే 8సార్లు పర్యటించిన దేశం అమెరికా కాగా, 7సార్లు పర్యటించిన దేశాలు ఫ్రాన్స్, ‌జపాన్‌లు. ఇక జర్మనీ (6సార్లు), చైనా, నేపాల్‌, ‌రష్యా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (5‌సార్లు), సింగపూర్‌ (4‌సార్లు), దక్షిణాఫ్రికా, శ్రీలంక, యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌, ఉజ్బెకిస్తా న్‌ (3‌సార్లు), కాగా 15 దేశాలను రెండుసార్లు, 38 దేశాలను ఒక్కసారి సందర్శించారు. వీటిద్వారా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై భారత్‌ అనుసరిస్తున్న విదేశీ విధానాన్ని ఆయన ఆయా దేశాలకు స్పష్టంగా చెప్పగలిగారు. ఆవిధంగా మనదేశంపై అప్పటివరకు ఉన్న ప్రపంచ దేశాల దృక్కోణాన్ని సమూలంగా మార్చివేగలగడమేకాదు, దేశాన్ని గ్లోబర్‌ ‌లీడర్‌ ‌స్థాయికి తీసుకెళ్లారు. సోవియట్‌ ‌యూనియన్‌ ‌పతనంతో అమెరికా ఆధిపత్యంతో ఏకధృవాత్మక ప్రపంచాన్ని, బహుళ పాక్షిక ప్రపంచంగా మార్చాలన్న అవసరాన్ని ఆయన ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. వాతావరణమార్పులు, ఉగ్రవాదం, సైబర్‌ ‌సెక్యూరిటీ అంశాలపై ప్రపంచం ప్రధానంగా దృష్టిసారించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడమే కాదు, అప్పటివరకు ఉన్న ఆయా దేశాల ఆలోచనా ధోరణుల్లో మార్పు తీసుకొనిరాగలిగారు. నేడు ప్రపంచంలోని 201 దేశాలతో భారత్‌ ‌దౌత్య సంబంధాలు నెరపుతోంది. వీటిల్లో పాలస్తీనా, హోలీ సీ (దీన్నే సీ ఆఫ్‌ ‌రోమ్‌, ‌పెట్రీన్‌ ‌సీ, అపోస్టోలిక్‌ ‌సీ, గవర్నమెంట్‌ ఆఫ్‌ ‌వాటికన్‌ ‌సిటీ అనే పేర్లతో కూడా పిలుస్తారు), నియు (న్యూజి లాండ్‌లోని స్వయంపాలిత ప్రాంతం) కూడా ఉన్నాయి.

ముస్లిం దేశాలతో బలమైన స్నేహం

 మోదీ నాయకత్వంలో ముస్లిం దేశాలతో సంబంధాలు బలోపేతమయ్యాయి. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మనదేశంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో సాన్నిహిత్యంగా ఉంటున్నాయంటే మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానమే కారణం. ఇక పశ్చిమాసియా/మధ్యప్రాచ్య దేశాలతో కూడా భారత్‌ ‌సంబంధాలు సుస్థిరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆరు గల్ఫ్ ‌సహకార దేశాలతో భారత్‌ ‌సంబంధాలు కీలకం. ఎందుకంటే దాదాపు 8 మిలియన్ల మంది భారతీయులు ఈ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరి భద్రతకు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇటీవలనే భారత్‌ ‌యు.ఎ.ఇ.తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2015లో ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ సందర్శించిన మొట్టమొదటి గల్ఫ్ ‌దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్. అం‌తకుముందు 34 సంవత్సరాల కాలంలో ఆ దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి ప్రధాని మోదీ. మనదేశంలో మౌలిక సదుపాయాల విస్తరణకు యు.ఎ.ఇ.75 బిలియన్‌ ‌డాలర్ల పెట్టు బడులు పెట్టాలన్న లక్ష్యాన్ని ఇరు దేశాలు నిర్దేశించు కున్నాయి. ఉగ్రవాద నిరోధం, మనీలాండరింగ్‌ను అరికట్టడం వంటి అంశాల్లో భారత్‌- ‌గల్ఫ్ ‌దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు కొనసాగు తున్నాయి. పశ్చిమా సియా/మధ్యప్రాచ్య దేశాల్లో సౌదీ అరేబియా, యు.ఎ.ఇ, బహ్రైన్‌, ‌పాలస్తీనా వంటి దేశాలు అత్యున్నత అవార్డులతో ప్రధానిని సత్కరించాయి. ఈ దేశాలతో మనదేశానికి ఒకవైపు సంబంధాలు పెరుగుతుండగా, పాకిస్తాన్‌తో వీటి అనుబంధం తగ్గుతూ రావడం గమనార్హం. ఫలితంగా భారత్‌- ‌పాకిస్తాన్‌ ‌సమస్యల విషయంలో పాకిస్తాన్‌కు వీటి మద్దతు తగ్గిపోవడం మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సాధించిన విజయం. ఇదే సమయంలో వీటికి బద్ధవిరోధి ఇజ్రాయిల్‌తో మన సంబంధాలు అత్యంత బలీయంగా కొనసాగు తున్నాయి. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌ను సందర్శించారు. ఆవిధంగా ఈ దేశాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఐ1యూ2 (ఇజ్రాయిల్‌-ఇం‌డియా, యుఎస్‌-‌యుఎఇ) ఏర్పాటు కూడా ఇజ్రాయిల్‌-‌గల్ఫ్‌దేశాల మధ్య నెలకొన్న అగాధాన్ని తొలగించింది. ఆవిధంగా బద్ధవిరోధ దేశాలను కూడా మన దౌత్యం దగ్గర చేస్తున్నది.

వ్యాక్సిన్‌ ‌క్యాపిటల్‌గా…

మనం అనుసరిస్తున్న ‘‘వసుదైక కుటుంబకం’’ విధానం ఇప్పుడు అన్నిదేశా ల్లో మంచి పేరుతెచ్చి పెట్టింది. ముఖ్యంగా కోవిడ్‌మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో అభివృద్ధి చెందిన దేశాలు, వ్యాక్సిన్‌ ‌పేటెంట్‌ ‌హక్కులను తాత్కాలికంగా రద్దు చేసేందుకు అంగీకరించకపోవడంతో, మనదేశం వంద దేశాల తరపున ఈ వైఖరిని ఖండించింది. మనదేశంలోనే వ్యాక్సిన్లను తయారుచేసి 300 మిలియన్ల వ్యాక్సిన్లను వందకు మించిన దేశాలకు ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు సరఫరా చేయడం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. దేశీయంగా 2.2 బిలియన్‌ ‌డోస్‌లను ప్రజలకు ఇవ్వడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసింది. ఇదే సమయంలో దేశం ‘వ్యాక్సిన్‌ ‌క్యాపిటల్‌’‌గా ఎదగడం విశేషం.

భారత్‌కే సాధ్యం

ఇటీవలికాలంలో ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల్లో పర్యటించారు. 12 మంది ప్రపంచ నాయకులతో చర్చలు జరపడమే కాదు, 3 సదస్సుల్లో పాల్గొన్నారు. జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్‌ ‌ప్రధానితో సహా పలువురు నాయకులను కలుసుకొని అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. వీరిలో అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌, ఉ‌క్రెయిన్‌ అధ్యక్షులు జెలెన్‌స్కీ, యు.కె. ప్రధాని రుషి శౌనక్‌లున్నారు. ఈ ఏడాది మే 20న హిరోషిమాలో జరిగిన క్వాడ్‌ ‌సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, ‌జపాన్‌ ‌ప్రధాని ఫ్యుమియో కిషిడా, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశమయ్యారు. చైనాకు వ్యతిరేకంగా ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో శాంతి సుస్థిరలకోసం ఏర్పాటు చేసిన ‘‘క్వాడ్‌ ‌గ్రూపు’’లో భారత్‌ ‌సభ్యురాలు. ఇదే సమయంలో పశ్చిమ దేశాల ఆధిపత్యానికి, జీ-7 దేశాలకు దీటుగా ఏర్పాటు చేసిన ‘‘బ్రిక్స్’’‌లోనూ మనదేశం భాగస్వామి. అంతేకాదు ‘‘షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌’’‌లో కూడా సభ్యత్వాన్ని కలిగివుంది. ఈవిధంగా పరస్పర వైరుధ్య దేశాలతో వ్యవహరించే విధానం భారత్‌ ‌సొంతం. ఇప్పటి వరకు మరే ఇతర దేశానికి ఈ ‘‘దౌత్య నైపుణ్యం’’ సాధ్యం కాలేదు.

నైబర్‌ ‌ఫస్ట్ ‌విధానం

ప్రధాని పదవిని చేపట్టిన దగ్గరినుంచి ప్రధాని ‘‘నైబర్‌ ‌ఫస్ట్’’ ‌విధానాన్ని అనురిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో మన సంబంధాలు 1975 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి చెందాయి. 2015, జూన్‌, 2021 ‌మార్చిలో మోదీ ఢాకా పర్యటన, 2017, ఏప్రిల్‌, 2019 ‌సెప్టెంబర్‌లో షేక్‌ ‌హసీనా భారత్‌ ‌పర్యటన రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. 2014లో మోదీ మొట్టమొదటి సారి నేపాల్‌లో పర్యటించారు. 17 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ప్రధాని ద్వైపాక్షిక సందర్శన రెండుదేశాల సంబంధాలను మరింత సుస్థిరం చేసింది. ఆతర్వాత 2018లో జనక్‌పూర్‌కు, 2022లో లుంబినికి ప్రధాని వెళ్లారు. ఈ రెండూ ద్వైపాక్షిక పర్యటనలు కాగా, 2014లో సార్క్ ‌సమావేశానికి, 2018, ఆగస్టులో బిమ్‌స్టిక్‌ ‌సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నేపాల్‌ ‌వెళ్లారు. నేపాల్‌ ‌ప్రధానిగా కె.పి. శర్మ ఓలి పదవిని చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఇబ్బందులకు లోనైనప్పటికీ, ఆయన పదవీచ్యుతితో మళ్లీ మామూలు స్థాయికి చేరుకున్నాయి. 2015లో ప్రధాని హోదాలో నరేంద్రమోదీ మొట్టమొదటిసారి శ్రీలంకకు ‘‘సముద్రయాత్ర’’ చేశారు. 28 సంవత్స రాల తర్వాత మనదేశ ప్రధాని జరిపిన తొలి ద్వైపాక్షిక యాత్ర ఇది. ఇటీవలి కాలంలో ఆర్థికంగా కుప్పకూలిన శ్రీలంకకు భారత్‌ 4 ‌బిలియన్‌ ‌డాలర్లు ఉదారంగా సహాయం అందించి నిజమైన మిత్రుడెవరో తెలిసేలా చేసింది. ఇక పాకిస్తాన్‌ ‌విషయానికి వస్తే, ఉగ్రవాదాన్ని ఎగదోసే పక్రియను నిలిపేస్తేనే శాంతి చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. హింస-శాంతి ఒకేసారి సాధ్యం కాదని తెగేసి చెప్పింది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా 2016లో బాలాకోట్‌ ‌దాడులు జరిపింది. ఆక్రమించిన కశ్మీర్‌ ‌ప్రాంతాన్ని ఖాళీచేయాలని పాక్‌ను తీవ్రంగా హెచ్చరించింది. మోదీ అధికారం లోకి వచ్చిన తర్వాత పాక్‌ ‌విషయంలో మనదేశ వైఖరి పూర్తి కఠినంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌కు 3బిలియన్‌ ‌డాలర్ల విలువైన ఆహార పదార్థాలు, మందులను భారత్‌ అం‌దించింది. తాలిబన్‌ ‌ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినప్పటికీ గోధుమలు, ఇతర మానవతా సహాయాన్ని భారత్‌ అం‌దిస్తూనే ఉంది. కాబూల్‌లో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇదే సమయంలో పాక్‌-ఆఫ్గనిస్తాన్‌లలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్న నేపథ్యంలో భారత్‌ ‌తన జాగ్రత్తలో తాను మెలుగుతూనే ఉంది. 2018లో మాల్దీవుల్లో భారత వ్యతిరేక అబ్దులా యామీన్‌ ‌ప్రభుత్వం పడిపోయి ఇబ్రహీం సోలె అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల సంబంధాలు పురోభివృద్ధి సాధించాయి.

చైనాతో ఇబ్బందులు

చైనాతో సంబంధాలు గల్వాన్‌ ‌సంఘర్షణ తర్వాత మరింతగా క్షీణించాయి. తాజాగా అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ను, ఆక్సాయ్‌చిన్‌ను తమ దేశంలో భాగాలుగా చూపుతూ మళ్లీ చైనా పితలాటకాన్ని లేవదీయడం, దీన్ని భారత్‌ ‌తీవ్రంగా ఖండించడం వరుస పరిణామాలు. ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ ‌సమావేశంలో మోదీ, షీ జిన్‌పింగ్‌లు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్‌ ‌జి-20 దేశాల సదస్సుకు చైనా అధ్యక్షుడు డుమ్మా కొట్టవచ్చన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ ‌సదస్సులో చైనా ఆధిపత్య ధోరణిని భారత్‌ ‌విజయవంతంగా అడ్డుకున్న నేపథ్యంలోనే, చైనా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యుఎస్‌, ‌జపాన్‌, ఆ‌స్ట్రేలియాలతో

గత తొమ్మిదేళ్ల కాలంలో భారత్‌-‌యుఎస్‌ ‌సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయి. ప్రధాని మోదీ ఈ కాలంలో ముగ్గురు అమెరికా అధ్యక్షులతో పనిచేశారు. వీరు ముగ్గురితో ఆయన మంచి స్నేహ సంబంధాలను కొనసాగిం చారు. రెండు దేశాల మధ్య దాదాపు 60 అంశాల్లో బలీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికాతో భారత్‌ అత్యధిక సైనిక విన్యాసాలు జరుపుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే చైనా అనుసరిస్తున్న విస్తరణ విధానాలు, దుందుడుకు వైఖరే భారత్‌-అమెరికాలను సన్ని హితం చేశాయని చెప్పవచ్చు. జపాన్‌-ఆ‌స్ట్రేలియా దేశాలతో రాజకీయ, రక్షణ, ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో సంబంధాలు ఇటీవలి కాలంలో మరింత ఊపందుకున్నాయి. 2023 మార్చిలో జపాన్‌ ‌ప్రధాని ఫ్యుమియో కిషిడా మనదేశంలో పర్యటించారు. అయితే ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంలో జపాన్‌ ‌సరికొత్త దృక్పథంతో వ్యవహ రిస్తున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసింది. ఇదే నెలలో భారత్‌ ‌సందర్శిం చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ అల్బనీస్‌ ‌మనదేశాన్ని అత్యున్నత స్థాయి భద్రత భాగస్వామిగా ప్రకటిం చారు.

జి-20 నాయకత్వం

ప్రస్తుతం జి-20 అధ్యక్షు రాలిగా ఉన్న భారత్‌ ‘‌వసుదైక కుటుంబం’ అంటే ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే లక్ష్యంతో ముందు కెళుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సరఫరా శృంఖాలు తీవ్రంగా దెబ్బతిన్న తరుణంలో, భారత్‌పై ప్రపంచ దేశాలు గొప్ప ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటు రష్యాతో అటు పశ్చిమ దేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం భారత్‌ ‌వల్లనే సాధ్య మన్న దృఢవిశ్వాసం ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. గతంలో జి-20 అధ్యక్షత స్థానం వహించిన దేశాలకు భిన్నంగా ప్రస్తుతం భారత్‌ ‌ముందుకెళుతోంది. ఇందులో భాగమే గత జనవరిలో ‘‘గ్లోబల్‌ ‌సౌత్‌ ‌సదస్సు’’ నిర్వహణ. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ప్రాంతాలకు చెందిన అభివృద్ధి చెందిన దేశాల సమస్యలను తెలుసుకొని, వాటిని జి-20 సదస్సులో ప్రస్తావించడమే దీని లక్ష్యం. దాదాపు 125 దేశాలు ఈ సదస్సులో పాల్గొనడం విశేషం. ఈవిధంగా గ్లోబల్‌ ‌సౌత్‌కు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది.

దేశ ప్రయోజనాలే ముఖ్యం

రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలనుంచి ఎంతగా వత్తిడి వచ్చినా లొంగకుండా దేశ ప్రయోజనాలకే మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసి రష్యాతో సంబంధాలు కొనసాగిస్తోంది. విచిత్రమే మంటే రష్యాపై కూడా ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలు భారత్‌పై ఆపని చేయలేకపోయాయి. అదీ భారత్‌ ‌సత్తా అంటే! ఈ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో రష్యా విషయంలో భారత్‌ ‌తటస్థ వైఖరినే అనుసరిస్తోంది. ఇదే సమయంలో రష్యా నుంచి క్రూడాయిల్‌ ‌దిగుమతులు మనదేశానికి పెద్దమొత్తంలో పెరగడం ఈ యుద్ధం తెచ్చిన పరిణామం. ఇదే సయంలో ఉక్రెయిన్‌ ‌ప్రజలకు మానవతా సహాయాన్ని భారత్‌ అం‌దిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 10-12 ‌తేదీల్లో ఉక్రెయిన్‌ ‌డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమైన్‌ ‌జపరోవా మనదేశంలో పర్యటన కారణంగా, భారత్‌-ఉ‌క్రెయినల్‌ ‌మధ్య సహకారం, అవగాహనకు అవకాశం ఏర్పడిన అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. విచిత్రమేమంటే ఈ యుద్ధం కారణంగా చైనా-రష్యాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడం, రష్యా క్రమంగా చైనాకు అనుయాయిగా మారుతున్న నేపథ్యం భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశం. భారత్‌నుంచి రష్యాను మరింత దూరం చేయడానికి పశ్చిమ దేశాలు ఎట్లా కృషి చేస్తున్నాయో, చైనా కూడా అదే మాదిరి యత్నిస్తున్నది. ఈ నెలలో జి-20 సదస్సుకు పుతిన్‌ ‌హాజరు కాకపోవడం వెనుక చైనా ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. కానీ అంతర్జాతీయంగా రష్యాను ఎప్పటి కప్పుడు దౌత్యపరంగా ఆదుకోగలిగిన దేశం భారత్‌ ‌మాత్రమే. ఈ విషయం పుతిన్‌కు తెలియంది కాదు. నాటి సోవియట్‌ ‌యూనియన్‌ అం‌దించిన సహా యాన్ని భారత్‌ ఎన్నడూ మరచిపోదు. స్నేహధర్మాన్ని విడనాడదు!

  • జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE