– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. స్నేహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలలో కదలికలు. శుభకార్యాల నిర్వహణపై చర్చలు జరుపుతారు. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  కళాకారులకు శ్రమానంతరం అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు. 12,13 తేదీల్లో మానసిక ఆందోళన. విచిత్రమైన సంఘటనలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆప్తుల సూచనలు,సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. కోర్టుకేసులు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభాలు. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన  సహాయం అందుతుంది. వ్యాపారస్తులకు లాభాలు తథ్యం. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం.  11,12 తేదీల్లో దుబారా ఖర్చులు. బంధువిరోధాలు. ఆదిత్య హృదయం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వాహనాలు, ఆరోగ్యవిషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. రావలసిన సొమ్ము సకాలంలో అందక నిరాశ చెందుతారు.   వ్యాపారస్తులకు లాభాలు కష్టమే. ఉద్యోగస్తులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు అవకాశాలు చేజారతాయి. 14,15 తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు. కళాకారులు, రచయితలకు అనుకూలత. 16,17 తేదీల్లో వృథా ఖర్చులు. లేనిపోని వివాదాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కొత్త ఆశలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రారంభంలో  నిరాశ కలిగినా చివరికి పూర్తి చేస్తారు. . దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు చేజారిన అవకాశాలు తిరిగి దక్కుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.  వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు మరింత ఉత్సాహం. 14,15 తేదీల్లో అనుకోని ఖర్చులు. బంధువులతో విరోధాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. అనుకున్న రాబడి దక్కుతుంది.  దేవాలయాలు సందర్శిస్తారు. కొంత అనారోగ్య సూచనలు. వ్యాపారస్తులకు నూతనోత్సాహం. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు అంచనాలు నిజం కాగలవు. 16,17 తేదీల్లో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపడతారు. అందరిలోనూ విశేష గౌరవం పెరుగుతుంది.  ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది.  వ్యాపారులు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.  రచయితలు, కళాకారులకు కొత్త ఆశలు. 14,15 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఎటువంటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి విముక్తి.  ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంత ఊరట లభిస్తుంది. కళాకారులకు ఊహించని అవకాశాలు. పరిశోధకులు, రచయితలకు కొత్త ఆశలు.11,12 తేదీల్లో ధననష్టం. కుటుంబంలో చికాకులు. వినాయకుని స్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి.   వ్యాపారస్తులకు లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం. క్రీడాకారులు, రచయితల యత్నాలు సఫలం.శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. 12,13 తేదీల్లో వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి  చేస్తారు. మీలో దాగిన ప్రతిభపాటవాలు అందరూ గుర్తిస్తారు.ఊహించని విధంగా ఉద్యోగలాభం.  భూ, గృహయోగాలు కలుగవచ్చు. రావలసిన సొమ్ము అంది ఊపిరిపీల్చుకుంటారు.   కొద్దిపాటి అనారోగ్యం. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అనుకోని అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రచయితలు, కళాకారులకు శుభవార్తలు. 14,15 తేదీల్లో ధనవ్యయం. దూరప్రయాణాలు. శివస్తుతి మంచిది.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొంత శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి కాగలవు. వాహనాలు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అవసరాలకు సొమ్ము అందుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. క్రీడాకారులు, పరిశోధకులకు కార్యసిద్ధి. 15,16  తేదీల్లో వ్యయప్రయాసలు. కుటుంబంలో ఒత్తిడులు. శివపంచాక్షరి పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. కాంట్రాక్టర్లకు అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. శారీరక రుగ్మతలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు.   16,17తేదీల్లో  అనుకోని ఖర్చులు. స్నేహితుల నుంచి ఒత్తిడులు. ఆంజనేయ దండకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE