– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు, సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ఊహించని బాధ్యతలు దక్కవచ్చు. రచయితలు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూల పరిస్థితులు. 28,29 తేదీల్లో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొన్ని కార్యక్రమాలలో కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. వ్యాపారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలు, కళాకారులు, పరిశోధకుల యత్నాలు సఫలం.28,29 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్న కార్యక్రమాలు స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆదాయం గతం కంటే కాస్త పుంజుకుంటుంది. కొన్ని సమస్యలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. క్రీడాకారులు, పరిశోధకులు, రచయితలకు శుభవార్తలు అందుతాయి. 30,31 తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శత్రువులను సైతం మాటలతో ఆకట్టుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగుల శ్రమ ఫలించే సమయం. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. రచయితల యత్నాలు సఫలం. 1,2 తేదీల్లో బంధువులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరతాయి. సన్నిహితుల సూచనలతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థుల యత్నాలు కాస్త ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ, పారిశ్రామికవర్గాలు, రచయితలకు కీలక సమాచారం అందుతుంది. 31,1 తేదీల్లో శారీరక రుగ్మతలు. సోదరులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
వీరికి పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింత లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు విశేష గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 29,30 తేదీల్లో కుటుంబసభ్యులతో విభేదాలు. మానసిక అశాంతి. లక్ష్మీస్తుతి మంచిది.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సన్నిహితులు మీకు మరింత చేదోడుగా నిలుస్తారు. సమాజంలో మీకంటూ గౌరవం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు కాస్త ఊరట లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. రచయితలు, కళాకారులకు శ్రమ ఫలిస్తుంది. 28, 29 తేదీల్లో ఖర్చులు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఒక సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడవచ్చు. వ్యాపారులకు సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయ,పారిశ్రామికవర్గాలు, రచయితలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. 31,1 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. విష్ణుధ్యానం చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. వ్యాపారులకు గతం కంటే మరింత అనుకూల పరిస్థితి ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు కొంత తగ్గే సూచనలు. రాజకీయ, పారిశ్రామివర్గాలు, పరిశోధకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 1,2 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. సమాజంలో మీపై ఆదరణ పెరుగుతుంది. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలం. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు నిరుత్సాహం. కళాకారులు, రచయితలు, పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. 28,29 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కొంత పురోగతి ఉంటుంది. వ్యాపారులు సంస్థలను లాభాల దిశగా నడిపిస్తారు. రచయితలు, కళాకారులకు కాస్త అనుకూలత ఉంటుంది.29,30 తేదీల్లో ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
చేపట్టిన కార్యక్రమాలు చకచకా పూర్తి అవుతాయి. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు అందుతాయి. 31,1 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. శారీరక రుగ్మతలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.