– రవి మిశ్ర

ముస్లింలు మెజారిటీలో ఉన్న ప్రాంతంలో హిందువులకు ఎటువంటి హక్కులూ ఉండవని ‘సెక్యులర్‌’ ‌దేశంలో ఉంటున్న ముస్లింలు ఇచ్చిన సందేశం ‘నూహ్‌’ (‌హరియాణా). ముందస్తు ప్రణాళికతో, క్షుణ్ణమైన అవగాహనతో, వ్యవస్థీ కృతంగా, కుట్రతో చేసిన హింస ఇది. తాము మెజారిటీగా ఉన్న ప్రాంతంలో హిందువులు అణిగి మణిగి ఉండాలే తప్ప సమానంగా ప్రవర్తించ కూడదన్నదే ‘నూహ్‌’‌లో జరిగిన హింస ఇస్తున్న సందేశం.


ముస్లింల భావనలలో ముఖ్యమైన అంశం ప్రజాస్వామ్యానికి సంబంధించినది కాదు. హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలు చేసే పోరాటాన్ని మెజారిటీ పాలనతో ప్రజాస్వామ్యం ఎలా ప్రభావితం చేస్తుందన్నదే వారి ఆలోచన. అది వారిని బలహీనం చేస్తుందా? ఒకవేళ ప్రజాస్వామ్యం వారిని బలహీనం చేస్తే, వారికి ప్రజాస్వామ్యం వద్దు. హిందువులపై ఆధిపత్యాన్ని కలిగి ఉన్న ముస్లిం పాలకుడిని బలహీనం చేయడం కన్నా ముస్లిం రాష్ట్రాలలో క్షీణించిన స్థితిగతులు కొనసాగాలనే వారు కోరుకుంటారు.

– డా।। బాబా సాహెబ్‌ అం‌బేడ్కర్‌, ‌పాకిస్తాన్‌ ఆర్‌ ‌పార్టిషన్‌ ఆఫ్‌ ఇం‌డియా,  థాకర్‌ అం‌డ్‌ ‌కో లిమిటెడ్‌, ‌బాంబే, 1945, పేజీ. 227..


వాస్తవంగా, 1946-47, అంటే భారత విభజనకు ముందు, ఢిల్లీలోని మేహరౌలీ నుంచి, రాజస్తాన్‌లోని దౌసాలో గల బందికుయి వరకు స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మియోస్తాన్‌’‌ను డిమాండ్‌ ‌చేస్తూ పాల్పడ్డ హింసను ఈ నూహ్‌లో జరిగిన తాజా ఘటనలు గుర్తుకు తెస్తున్నాయి.

నూహ్‌ ‌జిల్లా ఎప్పుడూ ఏదో ఒక వివాదం వల్ల వార్తల్లో ఉంటుంది- సైబర్‌ ‌క్రైమ్‌, ‌పశువుల అక్రమ రవాణా, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, బలవంతపు మతమార్పిడులు, హత్యలు, దళితులపై దాడులు.. ఒకటేమిటి, సర్వభ్రష్టుత్వాలూ అక్కడ కనిపిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, దీనిని నేరాలకు కేంద్రంగా పరిగణించవచ్చు. ఇటీవలే శివయాత్ర లేక జలాభిషేక యాత్ర సందర్భంగా ఇక్కడ జరిగిన ఘటనలు మొత్తం దేశానికి, ప్రత్యేకంగా హిందువు లకు ఒక సందేశంగా భావించాలి. మేవాట్‌లోని సాంప్రదాయాలు, మహాభారత కథనాలతో ప్రజలను పున:అనుసంధానం చేసేందుకు ఈ ప్రాంతంలో ప్రతి ఏడాది విశ్వహిందూ పరిషత్‌, ‘‌జలాభిషేక యాత్ర’ను నిర్వహిస్తుంది. ఈసారి యాత్ర నూహ్‌ ‌ప్రాంతంలోకి ప్రవేశించగానే, యాత్రికులపై రాళ్లు రువ్వడం ప్రారంభమైంది. అంటే, యాత్ర ప్రవేశించే ముందే ముస్లింలు తమ ఆయుధాలను సిద్ధం చేసిపెట్టు కున్నట్టుగా వారు ఒక్కసారిగా యాత్రికులపై దాడికి పాల్పడ్డారు. పోలీసు లెక్కల ప్రకారం ఆరుగురు మాత్రమే మరణించినా, ప్రత్యక్ష సాక్షులు ఆ సంఖ్య మరింత ఎక్కువేనని చెప్తున్నారు. ఇంత చేసీ, వారు తమ మైనార్టీ కార్డును నిస్సిగ్గుగా బయటకు తీసి, హింసకు కారణం బజరంగ్‌ ‌దళ్‌, ‌గోసంరక్షకులని ఆరోపిస్తున్నారు.

భారతదేశ వ్యాప్తంగా హిందువులపై జరిగే దాడుల సరళితో నూహ్‌ ‌మమేకం అవ్వడమే కాదు, దాదాపు 4000 మంది భక్తులను ఒక ఆలయంలో బందీలను చేసి, భారీగా పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ, జంకూ గొంకూ లేకుండా కాల్పులకు పాల్పడడం ద్వారా ఇతరుల కన్నా ఒక అడుగు ముందుకు వేశారు. అక్కడకు చేరుకున్న పోలీసు దళాలు.. ప్రధాన రోడ్లన్నీ ముస్లింల ముట్టడిలో ఉండడంతో బందీలను రహస్యంగా పొలాల నుంచి కాపాడవలసి వచ్చింది. తాము ప్రజాస్వామిక, స్వేచ్ఛను ప్రేమించే సమాజంలో ఉన్నామని చెప్పుకునే ప్రజలు, పాలనావ్యవస్థ ఉన్న దేశంలో ఇటువంటి ఘటనలు జరగడం తీవ్ర ఆందోళనకు, ఆలోచనకు లోను చేస్తాయి.

రాడికల్‌ ఇస్లాంవాదులు విదేశీ మద్దతుతో, హిందువులపై దాడులకు ఒక టూల్‌ ‌కిట్‌ను ప్రమాణీకరించారు. ఇస్లాం మూకలు అవసరమై నప్పుడల్లా సత్వర సమన్వయ, సహకారం కోసం సోషల్‌ ‌మీడియా వేదికలను ఉపయోగించు కుంటున్నాయి. ముఖ్యంగా, దాడుల సమయంలోనూ, తరువాత తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు వారు దీనిని విస్తృతంగా వాడుకుంటున్నారు. వారి లక్ష్యం సుస్పష్టం-హిందువుల పండుగలు, మత పరమైన సందర్భాలపై దాడి చేయడం. కొద్దికాలం ముందే బెంగాల్‌లో రామనవమి ఊరేగింపుపై, ఉత్తరాఖండ్‌, ‌ఢిల్లీలో హనుమాన్‌ ‌జయంతి యాత్రల సందర్భంగా, సోషల్‌ ‌మీడియా పోస్టు సాకుతో బెంగళూరులో హింస, సీఏఏ వంకతో ఈశాన్య ఢిల్లీలో దాడులు.. ఇవన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సమాచార యుద్ధంలో ఒక కీలక భాగమైన ప్రధాన స్రవంతి మీడియా, ‘సెక్యులర్‌’ ‌సాకు చూపించి, తరచూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. బాధితులు హిందువులైనప్పుడు, దాడి చేసినవారిని గుర్తించేందుకు సంశయించడం అన్నది పూర్తిగా వారి వృత్తిపరమైన విలువలకు వ్యతిరేకమైనది.

ముందస్తు ప్రణాళికతో దాడి

  • ‘ఒకవేళ మొను (మొనేసర్‌) ‌మేవాట్‌ ‌వస్తే, మేం మొత్తాన్నీ భస్మం చేస్తాం’ అంటూ మహమ్మద్‌ ‌సబీర్‌ఖాన్‌ ‌జులై 31వ తేదీన ఫేస్‌బుక్‌లో రోడ్డుపై వరుసగా పెట్టిన గ్యాస్‌ ‌సిలిండర్ల ఫోటోను పోస్టు చేశాడు.
  • అదే రోజు (జులై 31న)న జలాభిషేక యాత్ర ప్రారంభమైన కొద్ది సేపటి తర్వాత, ‘కుఛ్‌ ‌దేర్‌ ‌మే నూహ్‌ ‌మే… ఇన్షాల్లా’ (కొద్దిసేపట్లో నూహ్‌లో ఇన్షాల్లా) అంటూ రహీస్‌ ‌ఖాన్‌ ‌రంగలియా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ ‌చేశాడు.
  • యాత్రగా మేవాట్‌కు వస్తున్న వీహెచ్‌పీ సభ్యుల ఊరేగింపునకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్లను ఆయేషా నవాజ్‌, ఆర్బాజ్‌ఖాన్‌ ‌దంగల్‌ అనే యువకులు పోస్టు చేస్తూ వచ్చారు.
  • యాత్రలో పాల్గొంటున్న హిందువుల కన్నా ఎక్కువ సంఖ్యలో ముస్లిం పురుషులు ముందుకు వచ్చి, అవకాశం వచ్చినప్పుడు దాడి చేసేలా యాత్రికులకు ముందు, చివరలో నిలబడవల సిందిగా ఆదేశిస్తూ మహమ్మద్‌ ‌సాబీర్‌ ‌ఖాన్‌ ‌తన ఓ పోస్ట్ ‌చేశాడు.
  • మరొక ఫేస్‌బుక్‌ ‌చాట్‌లో సిద్ధంగా ఉండవల సిందిగా ట్రక్కు, డంపర్‌ ‌డ్రైవర్లను కోరాడు.
  • హింసాత్మక అల్లర్ల తర్వాత, ఆధారాలు దొరక కుండా తమ సోషల్‌ ‌మీడియా పోస్టులను, వీడియోలను తొలగించవలసిందిగా పరస్పరం విజ్ఞప్తి చేసుకున్నారు.

నూహ్‌లో హిందూ భక్తులపై దాడి ఎంత సమన్వయపూరితంగా జరిగిందో చెప్పేందుకు కొన్ని ఆధారాలు:

జులై 31న యాత్ర సందర్భంగా కత్తులు, తుపాకులతో ముస్లిం మూకలు తమపై దాడి చేస్తారని హిందూ భక్తులు ఊహించలేదు. ఈ యాత్రలో మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా పాల్గొన్నారు. బజరంగ దళ్‌ ‌కార్యకర్తలు అభిషేక్‌ ‌రాజ్‌పుట్‌, ‌ప్రదీప్‌ ‌శర్మలను ఎంచుకుని మరీ దాడి చేశారు. ఓ మిఠాయి అమ్మకందారు అభిషేక్‌ ‌తన దుకాణం కట్టేసి ఇంటికి తిరిగి వస్తుండగా అతడిని దారుణంగా హత్య చేశారు. అంతేకాదు, నీరజ్‌, ‌గురుసేవక్‌ అనే ఇద్దరు హోంగార్డులను కూడా హత్యచేశారు. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య ఐదుగురు హిందువులు సహా ఆరు అని చెప్తుండగా, ఆలయం ప్రాంతంలో దాదాపు 50 మంది భక్తులను హత్యచేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే, వారి మృతదేహాలు ఇంకా దొరకలేదు. కొందరు వ్యక్తులు కనిపించడం లేదంటూ ఫిర్యాదులు అందగా, దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దాడిలో 10 మంది పోలీసులు, ఒక డీసీపీ సహా 200 మంది గాయ పడగా, 300 వాహనాలను తగులబెట్టినట్టు తెలుస్తోంది.

నూహ్‌ ‌ప్రాముఖ్యం:

మహాభారతంలో ప్రస్తావించిన మూడు శివలింగాలకు నూహ్‌ ‌ప్రాంతం ప్రతీక. అలాగే కృష్ణ భగవానుడు తన గోవులను ఇక్కడ మేతకు తీసుకువచ్చేవాడని విశ్వాసం. సోహ్నా నుంచి మేవాట్‌లోకి యాత్ర ప్రవేశించే సమయంలో ఆచారం ప్రకారం నల్హర్‌ ‌మహాదేవ్‌ ఆలయం వద్ద జలాభిషేకం చేస్తారు. ఆరావళి పర్వతాల నడుమ ఉన్న ఈ ప్రాచీన ఆలయం పాండవుల కాలం నాటిదని అంటారు. ఇది నూహ్‌ ‌పట్టణానికి సమీపంలో ఉంటుంది. దీంతో పాటు నల్హర్‌ ‌పాండవ్‌ ‌రిజర్వాయర్‌ ‌కూడా ఉంది. జలాభిషేకం తర్వాత భక్తులు ఝిరకేశ్వర్‌ ‌మహాదేవ్‌ ఆలయం, పున్‌హన తహశిల్‌లోని శృంగార్‌ ‌గ్రామంలో రాధాకృష్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత వారు శృంగేశ్వర్‌ ‌మహాదేవ్‌ ఆలయాన్ని సందర్శించి అక్కడ మరొకసారి జలాభిషేకం చేస్తారు.

‘మియోస్తాన్‌’‌ను కోరుకున్నవారు

మేవాట్‌ ‌ప్రాంతంగా మనం చెప్పుకునేది, హరియాణా దాటి రాజస్తాన్‌లోని మూడు జిల్లాలు, ఉత్తర్‌పద్రేశ్‌లోని మథుర జిల్లాకు విస్తరిస్తుంది. ఈ ప్రాంతం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్‌ల మధ్య ఉన్న గోల్డెన్‌ ‌ట్రయాంగిల్‌ ‌పర్యాటక సర్క్యూట్‌ ‌మధ్యలో గుండె కాయలా ఉంటుంది. కమ్యూనిస్టు మియో నాయకుడు కున్వర్‌ ‌మహమ్మద్‌ అ‌ష్రఫ్‌, ‌రాజ్‌ ‌పుటాణాలో గల ముస్లిం లీగ్‌లోని ఒక వర్గం సంక్షుభిత 1946-47 కాలంలో ప్రత్యేక ‘మియోస్తాన్‌’ ‌కోసం డిమాండ్‌ ‌చేశారు.

పాకిస్తాన్‌కు పక్కగా మియోస్తాన్‌ను సాధించాలని వారి భావన. జిన్నా కోరుకున్నట్టుగా పంజాబ్‌ ‌ప్రాంతం మొత్తం (నేటి హరియాణా, హిమాచల్‌ ‌ప్రదేశ్‌) ‌పాకిస్తాన్‌ ‌వడిలో వాలుతుందను కున్నారు. స్వాతంత్య్రం, విభజన అనంతరం మంటలు చల్లారినప్పటికీ, సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు వెళ్లిన మియోలను వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం నెహ్రూ ప్రభుత్వం చేసింది. ఈ విధానాలను నిరసిస్తూ, భరత్‌పూర్‌, ఆళ్వార్‌, ‌గుర్గావ్‌కు చెందిన మియోలు ముస్లిం లీగ్‌ ‌స్ఫూర్తితో ప్రత్యేక మియోస్తాన్‌ను డిమాండ్‌ ‌చేయడమే కాక, స్వాతంత్య్ర సమయంలో తమ ఇరుగు పొరుగులపై తీవ్రమైన హింసకు, అల్లరకు పాల్పడ్డారని రాజ్యాంగ సభలో సర్దార్‌ ‌భూపేందర్‌ ‌సింగ్‌ ‌పేర్కొనడం గమనార్హం.

 ‘సడలింపు లతో కూడిన అనుమతి వ్యవస్థ కింద మియోలు తిరిగి వచ్చి తమ ఆస్తుల కోసం డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఒక వైపు, మన వద్ద ఆస్తులు తక్కువ ఉండగా, ఇంకోపక్క వారికి రాయితీల మీద రాయితీలు ఇస్తున్నారు. ఇది నిస్సందేహంగా సెక్యులరిజమే, కానీ ఏకపక్ష, అవాంఛనీయమైన పద్ధతి. ఇది సిక్కు, హిందూ శరణార్థులకు వ్యతిరేకమైన పక్షపాత ధోరణి. కొద్ది కాలం కిందటే భారత సమగ్రతను విస్పష్టంగా అగౌరవపరిచిన వారికి పౌరసత్వ హక్కులను ఇవ్వడం నాకు ఇష్టం లేదు’ అని ఆయన అన్నారు. నేడు మనం ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపు కుంటున్న సమయంలో భారత్‌ ‌తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవలసి ఉంది. మనం చరిత్ర నుంచి నేర్చుకోకపోతే, చరిత్ర పునరావృతం అవుతుంది.

—————

ప్రణాళికాబద్ధమైన దాడుల సరళి

దాడికి ముందు

ఏదో ఒక మిషతో హిందువులపై దాడి చేసేలా స్థానిక ముస్లింలను రెచ్చగొట్టేం దుకు సోషల్‌ ‌మీడియా వినియోగం

దాడి చేయాలనుకున్న ప్రదేశం వద్ద మేడలపై భారీ ఎత్తున రాళ్లు, గాజు సీసాలు, పెట్రోలు బాంబులను సేకరించి పెట్టడం

 ఈ ద్వేషపూరిత నేరానికి పాల్పడే ముందు సీసీటీవీ కెమెరాలను బద్దలు చేయడం

××××××××××××

దాడి సమయంలో…

 మేడలపై నుంచి లేదా (ఈ సందర్భంలో) కొండపై నుంచి, పట్టుకోలేని, చేరలేని విధమైన స్థానాల నుంచి ఆకస్మిక దాడులకు పాల్పడడం

జిహాదీ/ ఇస్లామిక్‌ ‌నినాదాలు చేయడం

మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం

పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం

ముస్లిం మెజారిటీ ప్రాంతాలలోని పోలీసు రికార్డులను ధ్వంసం చేయడం

ఒకరికొకరు మార్గదర్శనం చేసుకునేందుకు సోషల్‌ ‌మీడియాను ఉప యోగించడం

  • ‘ఆర్గనైజర్‌’ ‌నుంచి

About Author

By editor

Twitter
YOUTUBE