– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

మీ ఊహలు, అంచనాలు నిజం చేసుకుంటారు.భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమవుతారు. ఆదాయమార్గాలు మరింత పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగిపోయే సమయం.  క్రీడా, వైజ్ఞానిక విషయాలపై ఆసక్తి చూపుతారు.  నిరుద్యోగులకు విజయం. వ్యాపారులు భాగస్వాములను పెంచుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ మరింత అనుకూలిస్తుంది. వారం మధ్యలో ఖర్చులు అధికం. శ్రమాధిక్యం. మానసికంగా ఆందోళన. శివాష్టకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

త్రుటిలో కొన్ని సంఘటనల నుంచి బయటపడతారు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు.  రాబడి కొంత పెరిగినా ఖర్చులు మీదపడవచ్చు. ఆహారవిహారాదుల వల్ల శారీరక రుగ్మతలు, వైద్యసేవలు. దూరపు బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు శ్రమిస్తారు.  ఇతరుల విషయాలపై శ్రద్ధ చూపడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. రచయితలు, వ్యవసాయదారుల ఆశలు కొన్ని ఫలించవు. వారం మధ్యలో వస్తులాభాలు. ఉద్యోగలాభం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు కొంత నెమ్మదిగానే కొనసాగుతాయి. రాబడి విషయంలో లోటు లేకున్నా కొంతమేరకు కొత్తగా అప్పులు చేయాల్సివస్తుంది.  సాంకేతిక, శాస్త్ర విభాగాల్లో విద్యార్థులు అవకాశాలు పొందుతారు. రియల్‌ఎస్టేట్ల వారు మరింత ఉత్సాహంగా కొనసాగుతారు. క్రీడాకారులు అనుకున్న విజయాల వైపు పయనిస్తారు.   పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఉత్సాహంగా గడుపుతారు. వారాంతంలో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపం. ఆకస్మిక ప్రయాణాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

మీలో దాగిన నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు మరింత ప్రయోజనాలు చేకూరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు. శ్రమాధిక్యమైనా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు.  చేజారిన వస్తువులు, డాక్యుమెంట్లు లభ్యమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.  వారారంభంలో బంధువులతో కలహాలు. ప్రయాణాలలో ఆటంకాలు. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ముఖ్య కార్యక్రమాలు సమయానికి పూర్తి కావడంలో మరింత శ్రమించాలి. బంధువులు, స్నేహితుల ఆదరణ పొందుతారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు మరింత అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారాలు మొదట్లో కొంత నిరాశపర్చినా క్రమేపీ అనుకూలిస్తాయి. వారాంతంలో శారీరకపరమైన రుగ్మతలు, దూరప్రయాణాలు, వ్యయప్రయాసలు ఉండవచ్చు. ఆంజనేయ దండకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేందుకు తాపత్రయపడతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు క్రమేపీ తొలగుతాయి. అనుకున్న రాబడి దక్కినా వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. భూములు క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు.  రాజకీయవేత్తలు, కళాకారులు విశేష ఆదరణ పొందుతారు. వారాంతంలో కుటుంబంలో కలహాలు. బాధ్యతలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

యత్నకార్యసిద్ధి. అనుకున్న రాబడి దక్కడంతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో అనుకూలత. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. వ్యాపారాలు కొత్త భాగస్వాములు, పెట్టుబడులతో కళకళలాడతాయి.  కళాకారులు, రాజకీయవేత్తల యత్నాలు సఫలం. వారారంభంలో వైద్యసేవలు, దూరప్రయాణాలు ఉండవచ్చు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

నిదానమే ప్రధానం అన్న సూక్తిని అనుసరించడమే మీ విజయరహస్యం. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు.  సోదరులు, బంధువుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కవచ్చు. విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు.  వ్యాపారాలు మరింతగా అనుకూలిస్తాయి. రాజకీయ,పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారాంరంభంలో శారీరక రుగ్మతలు. మనశ్శాంతి లోపం. ఒత్తిడులు. ధనవ్యయం. అన్నపూర్ణాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ముఖ్య కార్యక్రమాలు సకాలంలోనే పూర్తి చేస్తారు. విద్యార్థులు విజయపరంపర కొనసాగిస్తారు. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. రావలసిన బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  కొద్దిపాటి అస్వస్థత కారణంగా వైద్యసేవలు పొందాల్సిన పరిస్థితి. వ్యాపారాలలో తగాదాలు పరిష్కారం, మీ పట్టుదల, క్రమశిక్షణ వల్ల మరింత విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఊహించని విధంగా విదేశీయానం. వారం మధ్యలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

రావలసిన సొమ్ము అందుకుంటారు. క్రీడలు, వైజ్ఞానిక అంశాలపై ఆసక్తి చూపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.  వాక్పటిమ, నేర్పుతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు అనుకోని ఉపాధి అవకాశాలు దక్కుతాయి. స్థిరాస్తి విషయంలో అనుకూల పరిస్థితులు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు తోడవుతారు.  రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారాంతంలో దుబారా ఖర్చులు. మానసిక అశాంతి. గణేశ్స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. ఆదాయం ఆశించినంతగా సమకూరి అవసరాలు తీరతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది.  నేర్పుతో సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి.  రాజకీయవేత్తలు, వ్యవసాయదారులకు కొత్త ఆశలు. వారం ప్రారంభంలో అలసట, ప్రయాణాలలో మార్పులు. విష్ణుధ్యానం చేయండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

మీ శక్తిసామర్థ్యాలను చాటుకుంటారు. అప్రతిహతంగా విజయాలు సాధిస్తారు. మీపై బంధువులు మరింత ప్రేమానురాగాలు చూపుతారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి.  నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త భాగస్వాములు చేరతారు.పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు అన్ని విధాలా అనుకూల సమయం. వారారంభంలో ధననష్టం. శారీరక రుగ్మతలు, ఆకస్మిక ప్రయాణాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE