– వల్లూరు జయప్రకాష్ నారాయణ
కేంద్రంలోని నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరి పాలన అందిస్తూ దేశాన్ని ప్రగతిపథాన నడిపిస్తోంది. అన్ని వర్గాల సాధికారత, అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తోంది. అన్ని రాష్ట్రాల పట్ల సమభావంతో వాటి అభివృద్ధికి చేయూతనిస్తోంది. ఆ కోణంలోనే విభజిత ఆంధప్రదేశ్‌కు అవసరమైన నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేసి స్వర్ణాంధప్రదేశ్ నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తోంది.
నరేంద్రమోదీ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సాధికారత, అభ్యున్నతి లక్ష్యంగా పాటు పడుతోంది. ఆంధప్రదేశ్‌కు రాజధాని నిర్మాణంతో పాటు జాతీయ విద్యాసంస్థలు నెలకొల్పింది. వివిధ రంగాలలో మౌలిక సదుపాయాల మెరుగుకు భారీగా నిధులు మంజూరు చేస్తోంది. ఈ మోదీ తొమ్మిదేళ్ల పాలన నేపథ్యంలో, దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఆంధప్రదేశ్‌లో మే 30 నుంచి జూన్ 30 వరకు విజయోత్సవాలు జరుగుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు జే•పీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు రాష్ట్రంలో పర్యటించి ఈ ఉత్సవాలలో పాల్గొం టున్నారు. కేంద్రం రాష్ట్రానికి చేకూరుస్తున్న లబ్ధిని సమీక్షించుకుంటే.…
పేదలకు ఇళ్లు
నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత పేదలకు 21,32, 343, గ్రామీణ ప్రాంత పేదలకు 2,48,682 ఇల్లు మంజూరు చేసింది. రాష్ట్రంలోని పట్టణప్రాంత పేదల గృహాల నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ. 18,645 కోట్లు ఇచ్చింది.
ఆహార భద్రత
కరోనా సమయంలో ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2022 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 2.68 కోట్ల మందికి 28.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణి చేసింది. 2023 జనవరి నుంచి ఈ పథకం కింద పూర్తి ఉచితంగా పంపిణీ జరుగుతోంది.
పోషణ అభియాన్
పోషణ అభియాన్ కింద రాష్ట్రంలోని 55,639 అంగనవాడి కేంద్రాల్లో 27,25,217 మంది పిల్లలు, యుక్తవయస్సులో ఉన్న బాలికలు, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ఉచితంగా పోషకారం పంపిణీ చేస్తున్నారు. ప్రధాన మంత్రి మాతృవందన యోజన కింద 2017 నుండి ఇప్పటివరకు సుమారు 14.33 లక్షల మంది తల్లులకు రూ.647 కోట్లు నేరుగా వారి ఖాతాలకు జమ చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళల కోసం 200 ఉజ్వల గృహాలు, 21 స్వధార్ గృహాలు ఏర్పాటయ్యాయి. 2015 నుండి 2023 వరకు హింసకు గురైన 37,582 మహిళలను వన్ స్టాప్ సెంటర్ల ద్వారా ఆదుకున్నారు. సఖీనివాస్ పథకం కింద 12 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాట య్యాయి.
స్వచ్ఛ భారత్ మిషన్
రాష్ట్రంలో 6830 గ్రామాలు బహిరంగ మల మూత్ర విసర్జన రహితంగా మారాయి. 7489 గ్రామాల్లో ఘనవ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఏర్పాటైంది. 42,39,300 వ్యక్తిగత మరుగు దొడ్లు, 14,605 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు నిర్మించారు.
గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు
జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 2019 నుండి ఇప్పటి వరకు 35.88 లక్షల గ్రామీణ గృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. నాలుగేళ్లలో 7750 కోట్ల రూపాయలు విడుద య్యాయి. నేషనల్ హెల్త్ మిషన్ కింద కేవలం 2019-22 మధ్య రూ. 3412 కోట్లు ఖర్చు చేసింది. కొత్తగా ఏడు ఈఎస్‌ఐ ఆస్పత్రులు నిర్మాణానికి, మూడు ఆస్పత్రుల పునర్నిర్మాణానికి నిధులు విడుదయ్యాయి. జాతీయ అర్బన్ మిషన్ కింద, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో దాదాపు 6 వేల పోస్టులు భర్తీ చేశారు. ఈ మిషన్ కింద 110 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఏర్పాట య్యాయి. ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్ష యోజన కింద అనంతపురం వైద్య కళాశాల అభివృద్ధికి రూ.240 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రూ.1000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు, కొత్తగా 17 వైద్య కళాశాలలకు, మూడు నర్సింగ్ కళాశాలలకు కేంద్రం అనుమతించింది.
రైతులకు చేయూత
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సుమారు 60.80లక్షల మంది రైతులకు సంవత్సరానికి రూ. 6000 రూపాయలు వంతున పెట్టుబడి సాయం అందించారు. 1930 గ్రామాలకు సంపూర్ణ బీమా గ్రామ యోజన వర్తింపచేశారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కింద 1.36 లక్ష హెక్టర్లకు బిందుసేద్యం అందుతోంది. అనంతపురం జిల్లాలోని సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్ట్సిట్యూట్ ద్వారా 4000 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. రైతులు తమ పంటలను సరసమైన ధరలకు అమ్ముకునేందుకు రాష్ట్రంలో 33 వ్యవసాయ మార్కెట్లకు ఈ-నామ్ వసతి కల్పించారు. కడప జిల్లా మైదుకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన
దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా రాష్ట్రంలోని 1,06,528 మంది గ్రామీణ యువతకు శిక్షణ అందించి 73,925 మందికి ఉపాధి కల్పించారు. 2014 నుండి ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి లేని విధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.55 వేల కోట్లు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం.
విద్యుత్ రంగం
ఈ మధ్య దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన, సమగ్ర విద్యుత్తు అభివృద్ధి పథకాల ద్వారా 2017-19 కాలంలో 1,882 కోట్లతో ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్తును అందించే వ్యవస్థ ఏర్పాటైంది. ఉజాలా పథకం కింద సుమారు 2.21 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ జరిగింది. సౌభాగ్య పథకం ద్వారా 1.82 లక్షల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు అందచేశారు.
జాతీయ రహదారులు
2014 నాటికి రాష్ట్రంలో 4193 కి.మీ.జాతీయ రహదారులు ఉండగా, మోదీ ప్రభుత్వం డిసెంబర్ 2022 నాటికి 8744 కిలోమీటర్ల రహదారులు అభివృద్ధి చేసింది. 2 జూన్ 2014 నుండి ఏప్రిల్ 2023 వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 3273 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మించింది. రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర రహదారులు మౌలిక సదుపాయాల నిధి, సేతుబంధన్ పథకాల కింద గత మూడు సంవత్స రాల్లో రూ.1552.35 కోట్లు అందచేసింది.
రైల్వే రంగం
రాష్ట్రానికి 2009-2014 లో ఉన్న రూ. 886 కోట్ల వార్షిక సగటు రైల్వే బడ్జెట్ కేటాయిం పులు 2014-2019 మధ్య రూ. 2830 కోట్లకు పెరిగాయి. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ మంజూ రైంది. విశాఖపట్నం- సికింద్రాబాద్, సికింద్రాబాద్- తిరుపతి మధ్య రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభ మయ్యాయి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే పాజెక్టు పూర్తి కాగా, భద్రాచలం- కొవ్వూరు, శ్రీకాళహస్తి-నడికుడి, కోటిపల్లి-నరసాపురం, రాయదుర్గం- రాయచూరు రైల్వే ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తోంది.
విమానయానం
కడప, తిరుపతి విమానాశ్రయాలలో రన్‌వేల విస్తరణ, విజయవాడ విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం. విశాఖ విమానాశ్రయంలో టెర్మినల్ బిల్డింగ్ విస్తరణ చేపట్టారు. తిరుపతి, విశాఖ, విజయవాడ విమానాశ్ర యాలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్త విమానాశ్రయ నిర్మాణం. కడప, రాజమండ్రి, తిరుపతి, విశాఖ పట్నం, విజయవాడ విమానాశ్ర యాల మౌలిక వసతులు అభివృద్ధి కోసం 2017 నుండి 2023 వరకు రూ.902.62 కోట్లు ఖర్చుచేశారు. విజయ నగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అనుమతి మంజూరైంది.
నౌకాశ్రయాలు…
ఓడరేవుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సాగరమాల పథకం కింద రూ.2500 కోట్లతో 14 ప్రాజెక్టులు నిర్మాణం. 8 ఫిషింగ్ హార్బర్లు, 3 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు అభివృద్ధి చేపట్టారు. విశాఖపట్నం పోర్టులో రూ.30 కోట్లతో తీరప్రాంత బెర్త్ నిర్మితమైంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ, ప్రకాశం జిల్లాలో వోడరేవు, కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లు. విశాఖపట్నం జిల్లా భీమిలి, రాజయ్యపేట, విజయనగరం జిల్లా చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు నిధులు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాస, పాలకొండలో మూడు మెరైన్ ఆక్వా హబ్‌ల ఏర్పాటయ్యాయి.
స్మార్ట్ సిటీ పథకం
విశాఖపట్నం నగరానికి రూ.2077.23 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులు, కాకినాడకు 99 ప్రాజెక్టులు (రూ.1938.99 కోట్లు), తిరుపతికి 87 ప్రాజెక్టులు, (రూ.1695.70 కోట్లు), అమరావతికి 21 ప్రాజెక్టులు (రూ.2046 కోట్లు) మంజూరయ్యాయి. అమృత్ పథకం కింద 32 పట్టణాలలో రూ3,334 కోట్లతో మంచినీటి కనెక్షన్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల పనులు చేపట్టారు.
సమగ్ర శిక్షా అభియాన్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి, ఉపాధ్యాయుల శిక్షణకు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల ఉచిత పంపిణీకి గ•త మూడు సంవత్సరాల్లో కేంద్రం రూ.2420 కోట్లు మంజూరు చేసింది. 4,93,075 బౌద్ధ, క్రిస్టియన్, జైన్, ముస్లిం, పార్సీ, సిక్కు మైనారిటీ విద్యార్ధుల విద్యాభివృద్ధి కోసం ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్, మెరిట్- కమ్-మీన్స్ స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్థిక సహాయం అందజేసింది.
గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించ డంతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధిని ప్రోత్స హించడం కోసం రాష్ట్రంలో 13 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించారు.415 వన్ ధన్ వికాస్ కేంద్ర సమూహాలు కేటాయించి 152 క్లస్టర్లు ఏర్పాటు చేయడంతో 1,23,258 మంది గిరిజనులు ప్రయోజనం పొందారు. లంబసింగిలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మిత మైంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు పీ•ఎంఎంఎస్‌వై కింద రూ. 655.38 కోట్లు మంజూరయ్యాయి.
ముద్రా యోజన
ముద్రా యోజన ద్వారా రాష్ట్రంలో 60.82 లక్షల మందికి రూ.82,017 కోట్ల రుణ సాయం. డీడీయూ-జీకేవై ద్వారా గత ఆరేళ్లలో 82 వేల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా 2,38,850 ఎంఎస్‌ఎంఈ లకు ఈసీఎల్‌జీఎస్ కింద 9250 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ-శ్రమ్ ద్వారా రాష్ట్రంలోని 79,54,498 అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్ధిక భద్రతతో పాటు సంఘటితరంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించారు. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్-ధన్ పథకం కింద 1,70,262 మందికి లబ్ధి కలిగింది.
వ్యాసకర్త: ఛైర్మన్,సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు,
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.