– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆదాయం  మెరుగుపడి కొన్ని అప్పులు తీరే అవకాశం. ఉద్యోగార్థులకు కొత్త ఆశలు చిగు రిస్తాయి.  స్థిరాస్తి వివాదాలు తీరి ఒడ్డున పడతారు.  వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సఫలమవు తాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. 8,9 తేదీల్లో శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

అనుకున్నంత రాబడి దక్కి అవసరాలు తీర తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. ఉద్యోగులకు బాధ్యతల భారం నుంచి కొంత విముక్తి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు కలసివస్తుంది. రచయితలు, క్రీడాకారులు లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. 10,11 తేదీల్లో స్వల్ప శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు శివాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉండి  అప్పులు తీరి ఊరట చెందుతారు. వ్యాపారస్తులకు మరింతగా లాభాలు అందు తాయి. రాజకీయవేత్తలకు శుభవర్తమానాలు. రచయితలు, క్రీడాకారులకు కొత్త ఆశలు. 13,14 తేదీల్లో సన్నిహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొన్ని కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు. దైవకార్యాలలో పాల్గొంటారు. బంధువులు, స్నేహితులతో తగాదాలు క్రమేపీ పరిష్కారమవు తాయి. ఆస్తుల ఒప్పందాలలో కొంత జాప్యం. వ్యాపారులు కొంతమేర లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో  బాధ్యతలు మరింత  పెరుగు తాయి. క్రీడాకారులు, పరిశోధకులకు కాస్త ఊరట లభిసుంది. 9,10 తేదీల్లో వృథా ఖర్చులు.  ఆదిత్య హృదయం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కొన్ని ముఖ్యకార్యక్రమాలు నిదానించినా చివరికి పూర్తవుతాయి.  కష్టానికి తగిన ఫలితం అంతగా కనిపించ•. స్థిరాస్తి వివాదాలు గందర గోళంగా మార వచ్చు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుం టారు. ఉద్యోగులకు విధుల్లో మనశ్శాంతి చేకూరు తుంది. పరిశోధకులు, రచయితల కృషి కొంతమేర ఫలిస్తుంది. 8,9 తేదీల్లో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. అన్నపూర్ణాష్టకం పఠించండి..


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగ మిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగార్థుల యత్నాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు కొంతమేర తొలగు తాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు  విజయవంతంగా సాగుతాయి. 10,11 తేదీల్లో  శ్రమాధిక్యం. గణేశాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం మరింత మెరుగుపడి, అప్పులు తీరి ఊరట చెందుతారు.  పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తుల  విషయంలో వివాదాలు తీరతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు  పనిభారం కొంత తగ్గవచ్చు. 10,11 తేదీల్లో స్వల్ప శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో విభేదాలు. రామరక్షాస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కొన్ని కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి బయటపడే అవకాశం. స్థిరాస్తుల వ్యవహారాలలో  కొత్త ఒప్పం దాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.  వ్యాపారులకు పెట్టుబడులు అనూహ్యంగా దక్కుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు విజయాలు వరిస్తాయి.  స్నేహితులతో విభేదాలు. హనుమాన్ఛాలీసా పఠించండి..


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  అదనపు ఆదాయం సమకూరి అప్పులు తీరతాయి. నిరుద్యోగులకు. ఉద్యోగలాభం. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పరిశోధకులు, క్రీడాకారు లకు అంచనాలు నిజమమవుతాయి. 8,9 తేదీల్లో అనుకోని ఖర్చులు. పంచాక్షరి పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.   నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచ యాలు.  స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.  ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగులు  పనిభారం నుంచి బయటపడతారు.  12,13 తేదీల్లో  ఆకస్మిక ప్రయా ణాలు. శారీరక రుగ్మతలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ముఖ్యమైన కాంట్రాక్టులు తప్పిపోతాయి.  స్థిరాస్తుల వివాదాలు కొంత సమస్యగా మారవచ్చు. గృహ  నిర్మాణ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారులకు  చికాకులు, ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పవు. పారి శ్రామిక, రాజకీయవర్గాలకు ఒడుదొడుకులు  ఎదురు కావచ్చు. 10,11 తేదీల్లో ధనలాభం.. శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా చాకచక్యంగా  ఆకట్టుకంటారు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించు కుంటారు. శత్రువులుకూడా స్నేహితులుగా మారతారు. విద్యార్థు లకు అవకాశాలు అనుకోకుండా దక్కుతాయి.  వ్యాపారులకు లాభసాటి. ఉద్యోగులకు అనుకున్న  హోదాలు దక్కగలవు. 8,9 తేదీల్లో సన్నిహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE