– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అనుకున్న కార్యక్రమాలను కొంత జాప్యంతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీకు సహాయంగా నిలిచి ఆస్తుల వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. రాబడి కొంత పెరిగి అప్పులు తీరుస్తారు. గతంలో చేజారిన కొన్ని పత్రాలు తిరిగి లభ్యమవుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులు మరింతగా లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు. రచయితలకు శుభవార్తలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
మొదట్లో సమస్యలు ఎదురైనా క్రమేపీ అధిగమించి ముందుకు సాగుతారు. పరిస్థితులు చక్కబడతాయి. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. సాహిత్య, సంగీతాలపై ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలు ఎట్టకేలకు కొలిక్కి తెస్తారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు. రాజకీయవేత్తలు, కళాకారులు పరిశోధకులకు అనుకూల వాతావరణం. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
చిత్రవిచిత్రమైన రీతిలో కొన్ని వ్యవహారాలు పూర్తవుతాయి. ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. ఆస్తి ఒప్పందాలలో ఆటంకాలు తొలగుతాయి. సంతానం ఆరోగ్యం కుదుటపడి ఊపిరిపీల్చుకుంటారు. సేవాభావంతో ముందుకు సాగి అందర్నీ ఆకట్టుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలు, రచయితలు, పరిశోధకులు అనుకున్న విజయాలు సాధిస్తారు. అంగారక స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. బంధువులు,స్నేహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. అయితే ఆర్థికపరమైన హామీల విషయంలో తొందరపాటు వద్దు. కు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విధుల్లో సమర్థతను చాటుకుంటారు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. శారీరక రుగ్మతలు. ఈశ్వరారాధన మంచిది.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చేపట్టిన కార్యక్రమాలను కొంత శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. నేర్పరితనంతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల నుంచి కూడా కొంత సొమ్ము అందుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు ఈతిబాధలు తొలగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. విమర్శలను దీటుగా ఎదుర్కొంటారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఆదాయం క్రమేపీ మెరుగుపడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. వ్యాపారులు లాభాలదిశగా కొనసాగుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు శుభవార్తలు. తీర్థయాత్రలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం కొంత పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. నిరుద్యోగులకు లక్ష్యం నెరవేరుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మనస్సులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. వ్యాపారులు మొదట్లో నిరాశ చెందినా క్రమేపీ లాభపడతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు సత్కారాలు. దేవీస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగదు. ఆలోచనలు స్థిరంగా ఉండక గందరగోళం చెందుతారు. ఆప్తులతో సైతం వివాదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఆదాయం ఆశించినంతగా లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. నిర్ణయాలలో కొన్ని పొరపాట్లు దొర్లవచ్చు. వ్యాపారులకు స్వల్పంగానే లాభాలు దక్కవచ్చు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
పట్టినపట్టు వీడరు. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మీపై వచ్చిన అభాండాలు తొలగుతాయి. మీ సచ్ఛీలత, నైపుణ్యతను అందరూ గుర్తిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా కొనసాగుతాయి. రాబడికి లోటు ఉండదు. బాకీలు సైతం వసూలవుతాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి తెస్తారు. అ కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఒక సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగుల దీర్ఘకాలిక నిరీక్షణ ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు రాగలవు. కుటుంబంలో సమస్యలు. శివాష్టకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు అమలులో ఆటంకాలు అధిగమిస్తారు. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు మరింత గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు సత్తా చాటుకుంటారు. శారీరక రుగ్మతలు.పంచాక్షరి పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. గతంలో చేజారిన కొన్ని వస్తువులు తిరిగి లభ్యమయ్యే అవకాశం. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పోస్టులు పెరుగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనారోగ్యం. దూరప్రయాణాలు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.