అ‌క్రమ వలసదారుల పట్ల అత్యంత కఠినంగా ఉండాలన్నదే ఆమె నిశ్చితాభిప్రాయం. ఆమె ఇంగ్లండ్‌ ‌హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి. ఏప్రిల్‌ ‌మొదటివారంలో ఆమె ఇచ్చిన ఒక ప్రకటన పాకిస్తాన్‌, ఇం‌గ్లండ్‌ ‌దౌత్య సంబంధాలను ప్రభావితం చేసే స్థాయికి తీసుకుపోయింది. కానీ ఆమె ఇచ్చిన ప్రకటనలో ప్రతి అక్షరం సత్యమే. మైనారిటీలు ఏం చేసినా మౌనం దాల్చడమే మార్గమని నమ్మే వీర ఉదారవాదులు ఇంగ్లండ్‌లో కూడా ఉన్నందున, వారు నోరు మెదపనందున పాకిస్తాన్‌ ఆమె ప్రకటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆమె పేరు సయిల్లా బ్రేవ్‌మన్‌. అసలు సయిల్లా ఏమన్నారు? ఆమె తీవ్రంగా విమర్శించిన ‘గ్రూమింగ్‌ ‌గ్యాంగ్స్’ ఎవరు? ఈ గ్యాంగ్స్ ‌పని పట్టక తప్పదని ఇంగ్లండ్‌ ‌ప్రధాని రిషి సౌనక్‌ ఎం‌దుకు ప్రతిన పూనవలసి వచ్చింది?

గ్రూమింగ్‌ ‌గ్యాంగ్స్ అం‌టే పాకిస్తాన్‌ ‌నుంచి వలస వచ్చి ఇంగ్లండ్‌లో స్థిరపడినవారే. అంటే బ్రిటిష్‌ ‌పాకిస్తానీలు. ఈ ముఠాలు కొన్ని దశాబ్దాలుగా బ్రిటిష్‌ ‌బాలికలకు వల వేసి సెక్స్ ‌బానిసలను చేస్తున్నారు. మత్తుమందుల• అలవాటు చేసి, దేశదేశాలలో అమ్ముతున్నారు. కాబట్టే ఈ బిట్రిష్‌ ‌పాకిస్తానీలు తమ బాలికలకు చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదని ఆమె ఆక్రోశించారు. బాలికలను ఎత్తుకుపోయే ఒక నెట్‌వర్క్‌ను వీరు నడుపుతున్నారని కూడా ఆమె ఆరోపించారు. ‘తమ వలలో సులభంగా చిక్కుతా రనుకునే శ్వేతజాతి బాలికలను వెతికి పట్టుకుంటు న్నారు. వారి సామాజిక స్థితిగతులను బట్టి కూడా వారిని వెంటాడుతున్నారు. కొందరిపై లైంగిక అత్యా చారాలు చేస్తున్నారు. మత్తుమందులకు బానిసలను గావిస్తున్నారు. ఇలాంటి పనుల కోసం వీళ్లు ఒక నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు’ అని సయిల్లా నిష్కర్షగా ఆరోపించారు. ఈ మాటలన్నీ ఆమె ఎక్కడో సభ లోనో, అధికారుల ముందో అనలేదు. సాక్షాత్తు స్కై న్యూస్‌ ‌టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే బాహా టంగా చెప్పారు. బాలికల పట్ల ఇంత ఘోరంగా ఆ ముఠాలు వ్యవహరిస్తూ ఉంటే సభ్య సమాజంగా చెప్పుకునే వారంతా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని కూడా ఆమె కడిగి పారేశారు. ఇదేదో ఉదారవాదం, సెక్యులరిజం అనుకుంటూ, ఇదంతా రాజకీయ వ్యవస్థ సరిదిద్దవలసినదే అన్నట్టు కొన్ని వ్యవస్థలు, సంఘసేవకులు, ఉపాధ్యాయులు, ఆఖరికి పోలీసులు కూడా చూసీ చూడనట్టే ఉండిపోతున్నారని కూడా ఆమె ఆరోపించారు. అలాగే తాము ‘ముస్లిం సోదరుల’ను ఏమన్నా విమర్శిస్తే జాత్యహంకారం కింద జమ కడతారనే భయం కూడా ప్రస్తుతం బ్రిటిష్‌ ‌పౌరులను భయపెడుతున్నదని చెప్పారు. దీని ఫలితం ఎందరో చిన్నారుల జీవితాలు సర్వనాశనం కావడమే నని గుర్తు చేశారు.

కాబట్టి గ్రూమింగ్‌ ‌గ్యాంగ్స్ ఏం ‌చేస్తుంటాయో ఈ పాటికే అర్ధమై ఉంటుంది. ఇందుకు వీళ్లు అనుస రించే పద్ధతులు ఒళ్లంతా తడమడం, భయపెట్టడం, బలవంతం చేయడం. ఆ బాలికలంతా సాధారణంగా 11 ఏళ్ల ప్రాయం వారే. పైగా కన్యలైన బాలికలనే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే ఈ పనికి అక్కడ వర్జిన్‌ ‌జిహాద్‌ అన్న పేరు కూడా వచ్చింది. ఇదే భారతదేశంలో అయితే ఒక ముస్లిమేతర బాలిక ముస్లిం యువకుడిని పెళ్లాడవచ్చు. కానీ ఇంగ్లండ్‌లో వీళ్లు కన్యలనే వేటాడి పట్టుకుంటున్నారు. ఈ ముఠాలకి సహజంగానే విచ్ఛిన్న కుటుంబ నేపథ్యం ఉన్న బాలికలు బలైపోతూ ఉంటారు. అందుకే సయిల్లా అన్నారు, ఈ గ్రూమింగ్‌ ‌ముఠాలు బ్రిటన్‌కి మాయని మచ్చల్లా తయారయ్యారని ఆరోపించారు. నిజానికి ప్రధాని రిషి తాను ప్రధానిగా ఎన్నికైతే ఈ గ్రూమింగ్‌ ‌ముఠాలను ఏరివేస్తానని, బాధితులకు న్యాయం అందిస్తానని హామీ ఇచ్చారు కూడా. ఇప్పుడు తమ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చే పనిలో ఉన్నదని సయిల్లా చెప్పారు. బ్రిన్‌ ‌సమాజంలో ఈ వ్యవహారం గురించి వారి భావనే వికృతంగా ఉంది. ఈ ముఠాలను వాళ్లు బ్రిటిష్‌ ‌పాకిస్తానీలు అని చెప్పకుండా ఆసియావాళ్ల పని అంటున్నారు. కానీ ఇప్పుడిప్పుడే వాస్తవం చెప్పడానికి కొద్దిమంది అయినా ముందుకు వస్తున్నారు. ఈ దుర్మార్గాలు బ్రిటన్‌కు వచ్చి స్థిరపడిన పాకిస్తానీయులవేనని అంగీకరిస్తు న్నారు.

ఇంత నీచమైన పనులకు ఒడిగడుతూ కూడా గ్రూమింగ్‌ ‌ముఠాలు దానికి మతం ముసుగు వేయడమే జుగుప్సాకరంగా కనిపిస్తుంది. తాము చేజిక్కించుకుంటున్న బాలికలను ఆ ముఠాలు కాఫిర్‌లని ముద్ర వేస్తున్నాయి. అంటే ఇస్లాంకు చెందని వారు. ఈ మూకలు ఇంతగా బరితెగించ డానికి కారణం అక్కడ ఆ ముస్లింల పలుకుబడి పెరగడమే. అందుకే ఏప్రిల్‌ 3‌న ప్రధాని రిషి ఈ ముఠాల ఆట కట్టించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్టు ప్రకటించవలసి వచ్చింది. ఉదారవాదులు, సెక్యులరిస్టుల సణుగుడు ఎలా ఉన్నా గ్రూమింగ్‌ ‌ముఠాల అణచివేత పట్ల రిషి, సయిల్లా మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నీచపు పనులన్నీ పాకిస్తాన్‌ ‌నుంచి వచ్చి తిష్ట వేసినవాళ్లవేనని నిర్మొహమాటంగా చెబుతున్నారు. పాకిస్తాన్‌ ‌దౌత్యసంబంధాలలో ఎగుడుదిగుళ్లు వస్తాయని తెలిసినా వెనుకాడడం లేదు. ఆఖరికి తమ మీద ఇస్లాం వ్యతిరేకులు అన్న ముద్ర పడినా సరే ఆ ముఠాలను అణచివేయాలన్న దృక్పథంలోనే ఆ ఇద్దరు ఉన్నారు. ఉదారవాదాలు, సెక్యులరిస్టు దృక్పథాలు పాశ్చాత్య సమాజాన్ని ఎంత నిర్వీర్యం చేశాయంటే, ముస్లింలను ఏమైనా అంటే తమ మీద ఇస్లామో ఫోబియా ముద్ర పడిపోతుందని భయపడుతున్నారు. అంతేకాని, అభం శుభం తెలియని బాలికలను ఆ ముఠాలు సెక్స్ ‌స్లేవ్స్‌గా మార్చివేస్తున్నా నోరు విప్పక పోవడం మానవతకు ద్రోహమని, అమానుషమని భావించడం లేదు. కొన్ని దశాబ్దాలుగా ఈ ముఠాలు సాగిస్తున్న ఈ వికృత క్రీడలో ఎన్ని వేలమంది శ్వేతజాతి బాలికల జీవితాలు ధ్వంసమైనాయో వాళ్లకి పట్టడం లేదు. అలాంటి సమయంలో రిషి, సయిల్లా ముందుకు వచ్చారు. భారత్‌లో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఒక్క బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ ఓటు బ్యాంక్‌ ‌రక్షణ కోసం, ఉదార వాదులమనీ, సెక్యులరిస్టులమనీ చెప్పుకోవడానికి మైనారిటీలు ఏమి చేసినా మౌనం దాల్చడానికే మొగ్గు చూపుతున్నాయి. ఆతిక్‌ అహ్మద్‌ ‌వంటి కరుడగట్టిన నేరగాడిని చంపినా అతడికి అమరత్వం అంటగడు తున్నారు. లవ్‌ ‌జిహాద్‌ అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతున్నా నోరు విప్పరు. పైగా ఇది అన్యాయ మని చెప్పే సంఘ పరివార్‌ ‌మీద మతోన్మాదం ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు బ్రిటన్‌ ‌సమాజంలో కూడా ఇదే జరుగుతున్నది. పాకిస్తానీలు ఏం చేసినా ఇస్లామోఫోబియా ముద్రకు భయపడి నోరు విప్పడం లేదు.

2018లో ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ‌ప్రచురించిన ఒక కథనం గ్రూమింగ్‌ ‌ముఠాలు చేసే అకృత్యాలను వెల్లడించింది. బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాలలో బాలికలను ఏ విధంగా లోబరుచుకుంటున్నదీ ఆ వార్తా కథనం తెలియచేసింది. నిజానికి ఆ ప్రాంతాలన్నీ ముస్లింల ఘెట్టోలుగా మారిపోయాయి. అంటే వాళ్ల అడ్డాలు. మరొక వర్గీయుడు ఎవరికీ అక్కడ ప్రవేశం ఉండదు. ఇదే పరిస్థితి ఫ్రాన్స్‌లో కూడా ఉంది. ఆ అడ్డాలలోకి ఏ అధికారి ప్రవేశించ లేడు. ఆ అడ్డాలన్నీ పాకిస్తాన్‌ ‌నుంచి బ్రిటన్‌ ‌వెళ్లి స్థిరపడినవారివే. లేదా అక్కడ పుట్టిన పాకిస్తానీ సంతానం కాలనీలే. వీళ్లు ప్రధానంగా భారతీయ సిక్కు బాలికలను లక్ష్యం చేసుకుంటున్నారు. ఇక్కడే మరొక అంశం ఉంది. ఇదంతా పాకిస్తానీ ముస్లింల నిర్వాకమే అనుకుంటే పొరపాటు. వారి దాయాదులైన భారతీయ ముస్లింలు కూడా ఇలాంటి ఘోరాలు చేయడంలో వెనకబడి లేరు. హసన్‌ ‌సరూర్‌ అనే ఒక భారతీయ ముస్లిం జర్నలిస్టు ఇందుకు ఉదాహరణ. ఇతడు తన 65వ ఏట 14 ఏళ్ల బ్రిటిష్‌ ‌బాలికకు అసభ్య సందేశాలు పంపి, లైంగికంగా వేధించాడు (ది టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా, నవంబర్‌ 13, 2015). ఎం‌త చిత్రమంటే కండోమ్స్ ‌కొనమని తాను ఆ బాలికకు డబ్బు ఇచ్చానని స్వయంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో సరూర్‌ అం‌గీకరించినా, సరైన ఆధారాలు లేవన్న కారణంగా కోర్టు ఇతడిని నిర్దోషిగా విడిచిపెట్టింది.

గ్రూమింగ్‌ ‌ముఠాల వికృత చేష్టలు భయానకంగా ఉంటాయి. బ్రిటన్‌ ‌పోలీసు యంత్రాంగం 660 మంది పైడోఫిల్స్‌ను (బాలబాలికలతో లైంగిక చర్యకు పాల్పడే మానసికరోగులు) 2015లో అరెస్టు చేసింది. ఇదేకాదు, బ్రాడ్‌ఫోర్డ్ అనే ప్రాంతంలో నాలుగేళ్ల బ్రిటిష్‌ ‌జాతి బాలికపై అత్యాచారం జరిగింది. ఉమర్‌, ‌ఖాలిద్‌, ‌జమీల్‌ అనే ముగ్గురు సహా మొత్తం 21 మంది కేసు నమోదైంది. వీళ్లంతా బ్రిటిష్‌ ‌పాకిస్తానీలే. 2020లో 150 లైంగిక నేరాలకు సంబంధించి 32 మంది మీద కేసులు నమోదైనాయి. అత్యాచారానికి గురైన వారంతా యార్క్‌షైర్‌ ‌ప్రాంతానికి చెందిన మైనర్‌ ‌బాలికలే. దీనిని బట్టి ఈ తరహా నేరగాళ్లు బ్రిటన్‌లో ఎంత విస్తరించి ఉన్నారో అర్ధమవుతుంది. అసలు బ్రిటిష్‌ ‌పాకిస్తానీ ముస్లింల మనస్తత్వమే మధ్య యుగాల నాటిది. ఈ చర్యల పట్ల వాళ్లకి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మహిళ అంటే ఒక ఆటబొమ్మగా, లైంగిక అవసరాలు తీర్చే వస్తువుగానే వాళ్లు భావిస్తారు. మధ్య యుగాలలో యుద్ధంలో గెలిచిన దేశాల స్త్రీలను సెక్స్ ‌బానిసలుగా ఉపయోగించుకునే అలవాటు ముస్లిం దురాక్రమణదారుల చేష్టలలో కనిపిస్తుంది. అంతేకాదు, అంతర్జాతీయ విపణులలో స్త్రీలను అమ్మేయడం కూడా సర్వసాధారణంగా జరిగేది. ఇది చరిత్ర. అయితే ఇదంతా ముస్లిమేతర స్త్రీల విషయంలోనే. పానిపట్‌ ‌యుద్ధం తరువాత అక్కడ దొరికిన హిందూ మహిళలు, పిల్లలను కాబూల్‌ ‌మార్కెట్‌లో అమ్మేశారు. అదే మనస్తత్వం నేటికీ కొనసాగుతున్నది. ఐఎస్‌ఐ, ‌బోకో హరాం ఉగ్రవాద సంస్థ కూడా ఇటీవల కాలంలోనే ఇలాగే చేశాయి. ఐఎస్‌ఐ ‌యజ్ది వర్గ మహిళలను వస్తు మార్పిడి కోసం ఉపయోగించుకుంది. ఇప్పుడు బ్రిటన్‌ ‌పాకిస్తానీలు చేస్తున్నది ఇదే. పైగా తాము విక్రయిస్తున్న లేదా అనుభవిస్తున్న వారంతా కాఫిర్లు కాబట్టి జంతువులతో సమానం. వారిని అమ్ముకున్నా తప్పు లేదు. ఇక ఇతరులందరినీ కాఫిర్లుగా జమకట్టి నీచంగా చూసే సంస్కృతిని ముస్లిం సమాజం తమ పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పుతుంది.

ఇంగ్లండ్‌లో నానాటికీ పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యం, వారిలో పెరుగుతున్న వికృత ధోరణుల గురించి ఇడి హుసేన్‌ ‌తన రచన ‘ఎమాంగ్‌ ‌ది మాస్కస్. ఎ ‌జర్నీ ఎక్రాస్‌ ‌ముస్లిం బ్రిటన్‌’ (‌బ్లూమ్స్‌బర్గ్ ‌ప్రచురణ, 2021) నమోదు చేశారు. అక్కడ ముస్లింల ఆధిపత్యం ఉన్న 9 ప్రదేశాలలో క్షేత్రస్థాయిలో జరిపిన సర్వే ఆధారంగా ఆయన ఈ పుస్తకం వెలువరించారు. ఇక్కడొక వాస్తవం గుర్తించాలి. ప్రస్తుతం లండన్‌ ‌మేయర్‌, ఐర్లెండ్‌ ‌ప్రధాని ముస్లింలే. ఆ ప్రదేశాలలో కొన్ని ఏళ్ల నుంచి మసీదులు పుట్టగొడుగుల మాదిరిగా పుట్టుకు వచ్చాయి. అక్కడ తబ్లిగ్‌ ‌జమాత్‌ ‌కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఆఖరికి ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న ఇంగ్లిష్‌ ‌జాతీయులు వేరే ప్రాంతాలకు తరలి పోతున్నారు. అనతికాలంలోనే మైనారిటీలే అక్కడ మెజారిటీ ప్రజలుగా చెలామణి అవుతున్నారు. రాజ్యాంగబద్ధంగా మాత్రం వారు మైనారిటీలే. దీనితో రాజకీయ వ్యవహారాలను శాసించ గలుగు తున్నారు. ఆఖరికి ఆసియా వారి ఓట్లు ఆసియా వారికే అన్న నినాదం కూడా పుట్టించారు. ఇక్కడ ఆసియా వారు అంటే మిగిలిన ఆసియావారు ఎవరూ కాదు. ముస్లింలు మాత్రమే. అలా ఓట్లను గంపగుత్తగా బేరం పెడుతున్నారు. ఈ ప్రలోభాలకు లొంగిపోయిన వారే గ్రూమింగ్‌ ‌ముఠాల గురించి పెదవి విప్పడం లేదు.

అయితే సయిల్లా ప్రకటనతో కొంత కదలిక కనిపించింది. ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ నేర నివారణ చట్టాలను కఠినతరం చేయడం అనివార్య మని చాలామంది అంగీకరిస్తున్నారు. నిజానికి ఇలా కౌమారంలో ఉన్న శ్వేతజాతి బాలికలను అపహ రించడం అనే దుశ్చర్య ఇంగ్లండ్‌లో 1997 నుంచి ఉన్నదని భారత విదేశీ గూఢచారి సంస్థకు చెందిన విక్రమ్‌ ‌సూద్‌ ‌చెప్పారు. అంతేకాదు, ముస్లిమేతరులైన 1400 మంది బాలికల మీద లైంగిక అత్యాచారాలు జరిగినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. వారంతా పాకిస్తానీ ముస్లింలేనని కూడా సూద్‌ ‌వెల్లడించారు. చాలా ఫిర్యాదులు ఇస్లామోఫోబియా కారణంగా చెత్తబుట్ట పాలయ్యాయని కూడా ఆయన చెప్పారు. అంటే తమను ముస్లిం వ్యతిరేకులుగా ముద్ర వేస్తారన్న ఒక భ్రమలో వారంతా జీవిస్తున్నారు. సూద్‌ ‘‌రా’ అధిపతిగా అక్కడ కొద్దికాలం పనిచేశారు. పోలీసులు కూడా గ్రూమింగ్‌ ‌ముఠాల మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నాయి. ఇందుకు కారణం కూడా ఇస్లామోఫోబియానే కారణం. ఇప్పటికి కూడా చాలినంత ఆధారం లేకుండా పాకిస్తానీ ముస్లింలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటు న్నారని ప్రధాని రిషిని, సయిల్లాను విమర్శిస్తున్నవారు లేకపోలేదు. అయినా మహిళలకు, బాలికలను తగిన రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. ఇందుకు ఉదారవాదాలు, సెక్యులరిజాలు ఆటంకం కాకూడదని కూడా ఆయన వ్యాఖ్యా నించారు. కానీ సయిల్లా ప్రకటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా పాక్‌ ‌సహా ముస్లిం దేశాలు, సంఘాలు మండిపడుతున్నాయి.

  – జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE