భిన్న ధ్రువాలుగా మారుతూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న కాలంలో జి-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం, ప్రపంచ ఎజెండా రూపుదిద్దే అవకాశం దక్కించు కుంది. విద్య, ఆర్థిక, ఆరోగ్య రంగాలతో బాటు సుస్థిర ఆర్థిక వనరులు, పర్యా వరణం, వాతావరణ మార్పు, వర్తకం, పెట్టుబడులు, మౌలిక వసతులు, వ్యవసాయం, అంకుర సంస్థలపై ఈ ఏడాది మార్చి రెండో పక్షంలో దేశంలోని పలు ప్రాంతాలలో వర్కింగ్ గ్రూపుల మేధోమథన సదస్సులు జరిగాయి. రకరకాలుగా విడిపోయిన ప్రపంచంలో శాంతి, స్థిరత్వం, సంపద పంపిణీలో ముందడుగు వేయటానికి ఈ సదస్సులు కృషి చేశాయి. సమావేశాలు జరిగిన నగరాలలో సుసంపన్నమైన సంస్కృతి, వారసత్వ సంపదలను కూడా ప్రతినిధులు చూడగలిగారు.
అంతర్జాతీయ పరిశోధన, నవకల్పనలో నాయకత్వం భారత్ అధ్యక్షతన జి-20 కార్యక్రమా లలో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ వర్కింగ్ గ్రూపుల సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 15-17 మధ్య పంజాబ్‌లోని అమృత్ సర్‌లో విద్యపై జరిగిన వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశానికి విద్యా మంత్రిత్వ శాఖ ఆతిథ్యమిచ్చింది. జి-20 సభ్య దేశాలకు చెందిన 28 మంది ప్రతినిధులు, అతిథి దేశాల, యునెస్కో, యునిసెఫ్ లాంటి సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పరిశోధనను, నవకల్పనను, అధ్యయనాన్ని ప్రోత్స హించాల్సిన అవసరాన్ని ఈ సమావేశం ప్రధానంగా చర్చించింది. సామర్థ్య నిర్మాణానికి, భవిష్యత్తులో అంతర్జాతీయంగా పని చేయటానికీ మధ్య అనుసంధానం కలిగించడంలో నూతన విద్యా విధానం పాత్రను కూడా చర్చిం చింది.
ఐఐటి రోపార్‌లో జరిగిన సెమినార్లు, సదస్సులతో బాటు నవకల్పనలను ప్రోత్సహించ టానికి, మల్టీమీడియా ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా పరిశోధనకు భారతదేశంలో గల అంతర్జా తీయ అవకాశాలను వివరించారు. విశ్వవిద్యాల యాల మధ్య పెరిగిన సహకారం ఫలితంగా ఆచరణాత్మక పరిష్కార మార్గాలు రూపొందించటం సులభమవుతుంది. చర్చలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు కనీస ప్రాథమిక అభ్యసనంలోనూ, అంకగణిత పరిజ్ఞానంలోనూ టెక్నాలజీ వినియోగం చూసి ఆశ్చర్యపోయారు. ఈ ప్రతినిధులు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.
సుస్థిర ఆర్థిక వనరుల
వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం
మార్చి 21-23 తేదీలలో సుస్థిర ఆర్థిక వనరుల వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం రాజస్థాన్‌లో జరిగింది. ఈ సమావేశం 2023కు కార్యాచరణను, ప్రాధాన్యతా అంశాలను చర్చించింది. కార్యాచరణ ప్రణాళికలో సూచన ప్రాయంగా నిర్దేశించిన అంశా లలో సగం పూర్తయినట్టు ప్రకటించారు. వాతావరణ సంబంధమైన కార్యాచరణకు, జి-20 సుస్థిర ఆర్థిక సాంకేతిక సహాయ కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఆర్థిక వనరుల సమీకరణ సహా తగిన చర్యలు తీసుకోవటానికి సభ్యులు అంగీకరించారు. ఈ గ్రూప్ మొదటి సమావేశం ఫిబ్రవరి 2,3 తేదీలలో అస్సాం లోని గువాహటిలో జరిగింది. వాతావరణ అంశాలను మించి చర్చించాలని మొదటిసారిగా ఈ గ్రూప్ అంగీకరించింది. ఆ విధంగా డేటాతో ప్రకృతి, సామాజిక ప్రభావం మీద నివేదికతో నిర్దిష్టమైన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు మరింత నిధుల సమీకరణ జరగాలని అభిప్రాయపడింది.
మార్చి 24, 25 తేదీలలో జరిగిన వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశంలో జి-20 సభ్యదేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను కలుపుకొని మొత్తం 87 మంది పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ ప్రమాదాలు, ఆహార, ఇంధన అభద్రత, వాతావరణ మార్పులు, విధాన మార్పుల వలన కలిగే స్థూల ఆర్థిక ప్రభావం వంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ఈ అంశాల మీద ఎలా ముందుకు వెళ్లాలనే దానినిలో మొత్తం ఆర్థిక ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని అంశాలను నిర్ణయించారు. వాతావరణ మార్పుపై, పరివర్తన మార్గంలో స్థూల ఆర్థిక ప్రభావంపై ఒక బృందం చర్చించింది. వాతావరణ మార్పు వలన కలిగే సవాళ్ల మీద ఉమ్మడి అవగాహనను రూపొందించేందుకు యుఎఈ సహకారంతో ఈ సదస్సు జరిగింది. కాప్-28 కు యుఎఇ అధ్యక్షత వహించటం తెలిసిందే.
పర్యావరణ, వాతావరణ
వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం
పర్యావరణం, వాతావరణ మార్పులో మెరుగైన ఆచరణ విధానాల మీద చర్చ
పర్యావరణం, వాతావరణ స్థిరత్వ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మార్చి 27 నంచి మూడు రోజుల పాటు జరిగింది. సభ్య దేశాల ప్రతినిధులతోబాటు 11 ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, 14 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కలిసి మొత్తం 130 మందికిపైగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భూసారం క్షీణత, పర్యావరణ పునరుద్ధరణ వేగవంతం చేయటం, జీవవైవిధ్య సుసంపన్నత, వనరుల సామర్థ్యాన్ని ప్రోత్సహించటం, సుస్థిర, వాతావరణ అనుకూల నీలి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించటంపై సమావేశం దృష్టి సారించింది. ప్రతినిధులకు నమామి గాంగే, వాతావరణ పునరుద్ధారక మౌలిక వసతులు, భూగర్భ జలాల నిర్వహణలో ప్రజల ప్రాతినిధ్యం, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ లాంటి అంశాలమీద ప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇచ్చారు.
అంతర్జాతీయ వర్తకం,
పెట్టుబడులను పెంచే దిశలో జి-20
వర్తక, పెట్టుబడుల వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం మార్చి 28-30 తేదీల మధ్య ముంబయిలో జరిగింది. అంతర్జాతీయ వర్తకాన్ని, పెట్టబడులను వేగవంతం చేయటం పురోగతికి, సుసంపన్నతకు వర్తకం దోహదపడేట్టు చూడటం అంతర్జాతీయ పరిస్థితి కోలుకునే దిశలో కదలటం మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. అదే సమయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశలో పురోగతి సాధించటం. పారదర్శకతను వ్యవస్థలో సమీకృతం చేయటం, ప్రపంచ వ్యాప్తంగా ప్రామాణీకరణ సంస్థల మధ్య సహకారం మీద మార్చి 30 సమావేశంలో చర్చించారు. ఎంఎస్‌ఎంఇ సమాచారం, ఆర్థిక వనరులు సులభంగా అందుబాటులో ఉంచటంలో కలిగే ప్రయోజనాల మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌గోయల్ మాట్లాడుతూ, క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయంగా నెలకొన్న పెళుసుదనపు ఆర్థిక పరిస్థితుల మధ్య భారతదేశం జి-20 అధ్యక్ష బాధ్యత స్వీకరించాల్సి వచ్చిందన్నారు. భారతదేశం తన ప్రాచీన మేథస్సును మిగిలిన ప్రపంచంతో పంచుకొని విశ్వమంతటా అంగీకరించే మార్గం కనుక్కునే బాధ్యత చేపట్టే అవకాశం సరైన సమయంలో వచ్చిందని తెలిపారు.
వ్యవసాయ సంబంధిత సమావేశం
వ్యవసాయ ప్రతినిధులతో వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం మార్చి 29-31 మధ్య చండీగఢ్‌లో జరిగింది. ఆహార మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి, సామర్థ్య నిర్మాణ అవసరాలను గుర్తించటానికి ఇదొక కీలక చొరవ, సమావేశంలో పాల్గొన్న సభ్య దేశాలు ఆహార భద్రత, పోషకాహారం వాతావరణం-తెలివైన సేద్యం సమ్మిళిత వ్యవ సాయం, ఆహార వ్యవస్థలు, వ్యవసాయ రంగంలో మార్పులకోసం డిజిటైజేషన్ ద్వారా అవసరాలను తీర్చటం, సమస్యలు పరిష్కరించటం మీద సిఫార్సులను చర్చించింది. జి-20 చీఫ్ సైన్స్ అడ్వైజరీ రౌండ్ టేబుల్ మొదటి సమావేశం ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో జరిగింది. ఇందులో అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక సమస్యలను కూలం కషంగా చర్చించారు. భారత ప్రభుత్వ ప్రిన్సిపాల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయ సారథ్యంలో జి-20 సీ•ఎస్వీఆర్ సాగింది. ఈ ఒక రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారు రోగ నియంత్రణ, అంటురోగాల వ్యాప్తిని ఎదుర్కొనే సంసిద్ధతకు ‘ఒకే ఆరోగ్యం’ భావనలో ఉన్న అవకాశాల గురించి చర్చించారు. అదే విధంగా నిర్దిష్టమైన శాస్త్రీయ పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ కృషిని సమన్వయం చేయటం మీద, వైవిధ్యానికి అవకాశం కల్పించటం, సమ్మిళితి, శాస్త్ర సాంకేతికత అందు బాటుతోపాటు కార్యాచరణతో కూడిన అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విధానం మీద చర్చ జరిగింది.
స్టార్ట్-అప్ సంబంధిత సమావేశం
స్టార్ట్-అప్ 20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ రెండో సమావేశం మార్చి 18, 19 తేదీలలో సిక్కింలోని గాంగ్ టక్‌లో జరిగింది. మొదటి సమావేశం హైదరా బాద్ లోజరిగింది. 20కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రతినిధులు లేవనెత్తిన అంశాల మీద సిక్కిం సమావేశం చర్చించింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణం ఉన్న భారతదేశం, ఈ విషయంలో ఒక అంతర్జాతీయ వాహికను స్థాపించటానికి ఈ గ్రూప్ సహాయపడుతుంది. స్టార్ట్-అప్ 20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ తుది సమావేశం జులైలో గురుగావ్‌లో జరుగుతుంది. ఆ తరువాత జి-20 దేశాలకు వ్యాపార దక్షత, నవకల్పన మీద విధానపరమైన సిఫార్సుల రూపకల్పన జరుగుతుంది. ఈ సిఫార్సుల ఆధారంగా విధాన రూపకల్పన జరుగుతుంది.
‘న్యూ ఇండియా సమాచార్’ నుంచి