– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం పెరుగుతుంది.ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలులో అవాంతరాలు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త చికాకులు. రచయితలు, కళాకారులకు మానసిక అశాంతి. 4, 5 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. దత్త స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
రాబడి పెరుగుతుంది. అంచనాలు నిజం కాగలవు. సోదరులు, స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. మర్చిపోలేని సంఘటన ఎదురుకావచ్చు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 3, 4 తేదీల్లో ప్రయాణాలు వాయిదా. శారీరక రుగ్మతలు. బంధు విరోధాలు. శివారాధన మంచిది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మొదట్లో ఇబ్బందులెదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 6, 7 తేదీల్లో ధనవ్యయం. ఆరోగ్య భంగం. శివాష్టకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇంటి నిర్మాణాలు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు ఒత్తిడులు. 8, 9 తేదీల్లో శుభవర్తమానాలు. వాహనయోగం. కనకధారా స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. నూతన ఉద్యోగ యత్నాలు సానుకూలం. వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణ యత్నాల్లో స్వల్ప అవాంతరాలు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళాకారులు, రచయితలకు ఒత్తిడులు తొలగుతాయి. 5, 6 తేదీల్లో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు సజావుగా పూర్తికాగలవు. ఆదాయం సంతృప్తినిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మెరుగుపడతాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. 3, 4 తేదీల్లో అనారోగ్యం, దూరప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
రావలసిన సొమ్ము అందుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతారు. ఉద్యోగాలు సంతృప్తికరం. కళాకారులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు కాస్త ఊరట లభిస్తుంది. 7, 8 తేదీల్లో వివాదాలు. మానసిక ఆందోళన. హనుమాన్ ఛాలీసా పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం సంతృప్తినిస్తుంది. కార్యజయం. ఆస్తుల విషయంలో బంధువర్గంతో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. కొన్ని వివాదాలు సమర్థతతో పరిష్కరించుకుంటారు. వాహనసౌఖ్యం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలకు సమస్యలు తీరతాయి. 7, 8 తేదీల్లో వృథా ఖర్చులు. ఊహించని ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆర్థిక విషయాలు ఆశాజనకం. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఊహించని అవకాశాలు. 3, 4 తేదీల్లో శ్రమాధిక్యం. శారీరక రుగ్మతలు. గణేశాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
అనుకున్న పనుల్లో విజయం. ఆదాయం సంతృప్తికరం. రుణభారాలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరడంలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు కీలక సమాచారం అందుతుంది. 4, 5 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం ఆశాజనకం. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణాలు చురుగ్గా సాగుతాయి. నిలిచిపోయిన పనులు సైతం పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు ఉత్సాహంగా గడుపుతారు. రచయితలకు ఆహ్వానాలు అందుతాయి. 6, 7 తేదీలలో శారీరక రుగ్మతలు. అనుకోని ప్రయాణాలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉన్నా అవసరాలకు ఇబ్బంది ఉండదు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో కొన్ని చికాకులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.