రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు అందిస్తున్న చేయూత, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ, టీడీపీ కుటుంబపాలన, అవినీతి రాజకీయాలను ప్రజలకు వివరించడం ద్వారా పార్టీని శక్తిమంతం చేయనుంది.
ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఓటమి ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలియ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ కావడం, వైసీపీ మాదిరిగానే ఇది కూడా అవినీతి ఆరోపణలు, కుటుంబ వారసత్వ రాజకీయాలతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. ఇలా ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీ ఉపయోగించు కోనుంది. రెండు పార్టీల వ్యవహారంతో దగా పడి, నిరుత్సాహానికి గురైన రాష్ట్ర ప్రజలకు నేనున్నానని దగ్గరకు చేర్చుకుని సాంత్వన కలిగించనుంది. ఇలా ప్రజలకు దగ్గరై 2024 ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవడం ద్వారా ఏపీ రాజకీయాల్లో ప్రధాన భూమిక నిర్వహించనుంది. ఇందుకోసం ప్రణాళికాబద్దంగా పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తోంది. మేధావులు, ప్రముఖులతో చర్చలు, పార్టీ గురించి మాట్లాడటం, చేరికలకు ప్రోత్సాహం, బూత్‌స్థాయి వరకు పార్టీ బలోపేతం, ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు, ఉద్యమాలు చేయడం ద్వారా ప్రజల మద్దతు పొందేలా కార్యక్రమాల రూపొందించారు.
మేధావులు, ప్రముఖుల చేరికను ప్రోత్సహించేలా బీజేపీలోకి కార్యక్రమాలు అమలు చేస్తోంది. వారిని ఆకర్షించేలా పార్టీ చరిత్ర, పరిణామక్రమం, అభివృధ్ధి, రాష్ట్రాలు, కేంద్రంలో అధికారస్థాపన, స్వచ్ఛమైన పాలన, అభివృద్ధి వంటివి వారికి వివ రిస్తుంది. బీజేపీ నేడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా జాతీయవాదం, పేదల సంక్షేమం, భారతీయ సాంస్కృతిక విలువల పరిరక్షణ, పారదర్శకతను అమలుచేస్తూ, ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేస్తోంది. పార్టీ నేడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయ కత్వంలో, 18 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగింది. కేంద్రం సహా చాలా రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నాయి. బలమైన, నిజాయతీ గల నాయకత్వం, జాతీయవాద ఆలోచనలు, పేదల సంక్షేమం కోసం కార్యక్రమాలతో బీజేపీ దేశాన్ని సమర్ధంగా పాలించే స్థాయికి ఎది గింది. తొమ్మిదేళ్లుగా దేశంలో అభివృద్ధి కొనసాగు తోంది.
బీజేపీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో జాతీయ వాదాన్ని స్థాపించడం ద్వారా జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. పోలింగ్ బూత్ నుండి జాతీయ అధ్యక్షుని ఎన్నిక వరకు ప్రజా స్వామ్యాన్ని అనుసరించడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేది పార్టీ సంకల్పం. సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ ద్వారా పేదలను ఉద్ధరించడం, వివక్ష లేకుండా వారి వారి ఆరాధన విధానాలను అనుస రించడం, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అనే సూత్రానికి కట్టుబడి ఉండటం పార్టీ లక్ష్యం. ఈ అంశాలన్నిటినీ వివరించడం ద్వారా మేధావులను ఆకర్షించడం ప్రస్తుతం జరుగుతున్న పక్రియ. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పార్టీ వైపు ఆకర్షితులై ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయన దేశంలో మొదటగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేసిన ముఖ్యమంత్రి కాగా, ఆ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. పాలన పట్ల అనుభవం ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి సలహాలు, సూచనలను ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.
విస్తృత ప్రచారం
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, స్వర్ణ చతుర్భుజ పథకం, నదుల అనుసంధాన ప్రాజెక్టు, ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి సర్వశిక్షా అభియాన్… వంటివి పేదల అభ్యున్నతికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశ సంకల్పానికి ఉదాహరణలు. అలాగే పేదల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించడం ద్వారా వారిలో పార్టీ పట్ల అవగాహన కలిగించేలా ప్రచారం చేస్తారు. ముఖ్యంగా విభజిత ఆంధప్రదేశ్‌కు ప్రధాని మోదీ లక్షల కోట్ల నిధులు సాయం అందిస్తున్నారు. లోటు బడ్జెట్‌ను పూరించడమే కాక, రాజధాని అమరావతి నిర్మా ణానికి అవసరమైన నిధులను అందచేస్తున్నారు. లక్షల కోట్లతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. ఫ్లైఓవర్లు, వంతెనలు, కల్వర్టులు, రింగ్ రోడ్లు నిర్మిస్తున్నారు. నూతన రైల్వే లైన్లు వేస్తున్నారు. సముద్ర రవాణా ప్రోత్సాహానికి పోర్టులు అభివృద్ధి చేస్తున్నారు. మత్స్యరంగ అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. జాతీయ విద్యా సంస్థలను నిర్మిం చారు.
పారిశ్రామికాభివృద్ధికి విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను, చెన్నై – బెంగుళూరు కారిడార్‌ను అమలు చేస్తున్నారు. పారిశ్రామిక నోడ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. భారత్ సొంత•గా చేపట్టిన ప్రాజెక్టు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రెంటిని విశాఖపట్నం – హైదరాబాద్, తిరుపతి- హైదరాబాద్‌ల మధ్య నడుపుతున్నారు. ఈ అంశాలన్నిటినీ పార్టీ ప్రచారం చేస్తుంది. మొదటి విడతగా 11 పార్లమెంటు నియోజకవర్గాలు, 77 అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో గోడలపై పార్టీ గుర్తు ‘కమలం’ వేసి, దాని పక్కన ‘‘జై భారతీయ జనతా పార్టీ’’ అని రాస్తారు. రంగులద్దే ఈ గుర్తులు దీర్ఘకాలం పాటు కనిపిస్తూ, త్వరబీజేపీలోకిగా చెరగ కుండా పార్టీ గురించి ఎప్పటికీ ప్రజలకు గుర్తుండేలా చేస్తాయి.
ప్రభుత్వ ‘వ్యతిరేకత’ కలిసొచ్చేలా…
వైసీపీ ప్రభుత్వం పాలనలో తీవ్ర వైఫల్యం చెందింది. పన్నుల భారం, పెరిగిన ధరలను అదుపు చేయలేకపోవడం, కేంద్రీకృత అవినీతి, విచ్చలవిడిగా వనరుల దోపిడి, రౌడీయిజం, గూండాయిజం, ఆశ్రిత పక్షపాతం, అదుపులేని నిరుద్యోగం, పెరిగి పోతున్న పేదరికం, అస్తవ్యస్త నిర్ణయాలు, నగదు పంపకానికి చేస్తున్న మితిమీరిన అప్పుతో కుదేలైన ఆర్ధికవ్యవస్థ, పాలన అనేది లేకపోవడం, హిందువుల పట్ల చూపిస్తోన్న మత వివక్ష, సమస్యలను పరిష్కరించకపోవడం, కొత్త రోడ్ల నిర్మాణం అటుంచి, ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, కొత్త సమస్యలు సృష్టించడం, వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడం, అవినీతిని ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు, మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు అపలేకపోవడం, శాంతి భద్రతలు క్షీణించడం వంటి సమస్యలను ప్రజల వద్ద ప్రస్తావించి, వాటి పరిష్కా రానికి ప్రజల తరపున ప్రశ్నించేలా పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలను చేపట్టడం ద్వారా ప్రజలకు దగ్గరై వారి మద్దతును పొంది 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేలా పని చేయాలని బీజేపీ సంకల్పం చెప్పుకుంది.
– వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఛైర్మన్,సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు,
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.