– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అద్భుతాలు జరుగుతాయి. ఆశించిన రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలం. వాహనయోగం. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. 6,7 తేదీల్లో ఆరోగ్య, కుటుంబ సమస్యలు. మానసిక అశాంతి. కనకదుర్గాదేవి స్తోత్రం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. అదనపు రాబడి దక్కుతుంది. ఇంట్లో శుభకార్యాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు మరింత పెరుగుతాయి. కళాకారులకు పురస్కారాలు, సన్మానాలు. సాంకేతిక నిపుణులు, రచయితలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 8, 9 తేదీల్లో ఖర్చులు. ఆస్తి వివాదాలు. గణేశాష్టకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం అంతంత మాత్రం. తరచూ ప్రయాణాలు. ముఖ్య కార్యక్రమాలు మొదట్లో మందగించినా ఎట్టకేలకు పూర్తిచేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. విలువైన సామగ్రి కొంటారు. వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు శుభవార్తలు. రచయితలు, మేధావులు సత్తా చాటతారు. 10, 11 తేదీల్లో ఆస్తి వివాదాలు. అనుకోని ఖర్చులు. రాఘవేంద్ర స్తోత్రం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం గందరగోళం పెట్టవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ నిర్ణయాల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తారు. అయినా తొందరపాటు వద్దు. తరచూ ప్రయాణాలు. దేవాలయాల సందర్శనం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. 8,9 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త కార్యక్రమాలు చేపడతారు. భూ, గృహయోగాలు కలిగే సూచనలు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. వ్యాపారులకు మరింత అనుకూల స్థితి. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి నుంచి ప్రశంసలు అందుతాయి. కళాకారులకు అవార్డులు. పరిశోధకులు, క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. 11,12 తేదీల్లో దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. దేవాలయ దర్శనాలు. రాబడి పెరిగి అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. 6,7 తేదీలలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఖర్చులు అధికం. ఆదిత్య హృదయం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. మీ ఆశయాలు నెరవేరే సమయం. కుటుంబంలో శుభకార్యాలపై సంప్రదింపులు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు. పరిశోధకులు, క్రీడాకారులకు అరుదైన పురస్కారాలు. 10, 11 తేదీలలో వివాదాలు. శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం ఆశించినంతగా సమకూరుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. చర, స్థిరాస్తుల వృద్ధి. విద్యార్థుల నైపుణ్యానికి గుర్తింపు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారులు చిక్కులు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు. 8, 9 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. అంగారక స్తోత్రం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానించినా సమయానికి పూర్తి చేస్తారు. ఇళ్లు, వాహనాలు సమకూర్చుకుంటారు. మీ పట్ల బంధువులు ప్రేమానురాగాలు చూపుతారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. వ్యాపారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. 11,12 తేదీలలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. దేవీఖడ్గమాల పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
కష్టానికి తగిన ఫలితం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. క్రీడాకారులు నైపుణ్యాన్ని చాటుకుంటారు. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. విష్ణుసహస్రనామ పారాయణం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
శుభవార్తా శ్రవణం. అనుకున్న పనులు పూర్తిచేసే వరకూ విశ్రమించరు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూముల కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావొచ్చు. రచయితలు, పరిశోధకులు ప్రత్యేకతను నిలుపుకుంటారు. 9, 10 తేదీలలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
యత్నకార్యసిద్ధి. ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యుల్ని మెప్పిస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వాహన యోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. రాజకీయ వర్గాలకు పదవీయోగం. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు విశేష గుర్తింపు. 10, 11 తేదీల్లో ఖర్చులు. శారీరక రుగ్మతలు. లక్ష్మీస్తుతి మంచిది.