(సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ఇం‌టర్వ్యూ.. గతవారం తరువాయి)

ఈ రోజు యువత ముఖ్యంగా, 18-24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు, టెక్నాలజీ, పర్యావరణం, లింగ  సంబంధమైన అంశాలపై గందరగోళానికి గురవుతున్నారు. ఈ అంశాలను భారత్‌, ‌హిందుత్వ దృక్పథంలో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు.  అదే సమయంలో  ఇదే అంశాలకు సంబంధించి బయట జరుగుతున్న చర్చ, వారిని గందరగోళానికి గురిచేస్తోంది. సంఘ్‌ది భిన్నమైన కార్యశైలి. అలాగే ప్రాథమిక అవగాహన అంశాలు న్నాయి. యువతను సంఘ్‌ ‌కార్యశైలితో అను సంధానం చేసేందుకు, ముఖ్యంగా వారిని వేధిస్తున్న అంశాలకు సంబంధించి అంశాల విషయంలో వారికి అవగాహన కల్పించేందుకు కొత్త పద్ధతులను రూపొందించే ప్రయత్నం జరుగు తోందా?

యువతను ఆకర్షించేందుకు, వారితో అను సంధానం ఏర్పరచుకునేందుకు ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. అయితే, కేంద్ర స్థాయిలో నిర్దిష్ట ప్రణాళిక అంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే స్థానికంగా జరిగే ప్రయోగాలే ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. బాగా పనిచేస్తాయి. ఢిల్లీ, ముంబై, చెన్నైలలో సమస్య/ గందరగోళం ఎక్కడుంటే అక్కడి స్థానిక శాఖలు ఆ సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూస్తాయి. చంద్రపూర్‌ (‌మహారాష్ట్ర, విదర్భ ప్రాంతం లోను ఓ మారుమూలగ్రామం)లోని కాలేజీలో అలాంటి అవసరం ఉండకపోవచ్చును. అలాగే ఒక విద్యార్ధి జిల్లా పరిషత్‌ ‌స్కూల్‌నుంచి వచ్చారా లేక ఇంగ్లీష్‌ ‌మీడియం స్కూల్‌నుంచి వచ్చారా, అనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అందుకే మేము స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యూహాలు, ప్రయోగాలు చేసే సంపూర్ణ స్వేచ్ఛను, స్థానిక శాఖలకు వదిలిపెట్టాం. ఉదా హరణకు కొద్ది రోజుల క్రితం, 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, నాగపూర్‌లో చిన్న చిన్న సమూహాలతో చర్చా గోష్ఠులు నిర్వహించాం. కార్యక్రమం నృత్య నాటికతో మొదలైంది. ఆ తర్వాత యువత కేంద్రబిందువుగా మరికొన్ని కార్యక్రమాలు జరిగాయి. బౌద్ధిక్‌ (ఉపన్యాసం)ను చివరలో చేర్చారు. పాత తరం స్వయంసేవకులకు, ఈ కార్యక్రమం మొదటి భాగం, అసలు నచ్చి ఉండక పోవచ్చును. ఇదేమిటని ప్రశ్నించి ఉండవచ్చును. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పడు యువతను చేరుకునేందుకు ఇలాంటి ప్రయోగాలే అవసరమవు తున్నాయి. అందుకే సంఘ్‌ ‌మూలసూత్రాలను వదలకుండా మేము ఏది చేయాలో అది చేస్తూనే ఉన్నాము. ఫలితంగా చురుకైన యువత సంఘ్‌లో చేరుతున్నారు. జాయిన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రయోగం ద్వారా ప్రతి సంవత్సరం రెండు లక్షల మందికి పైగా యువత సంఘ్‌లో చేరుతున్నారు. (ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వెబ్సైటు ద్వారా అభ్యర్ధనలు అందుతున్నాయి). ఇలా చేరుతున్న వారిలో ఎక్కువ విద్యావంతులైన, ఇంగ్లీష్‌ ‌మాట్లాడే యువత. ఇలాంటి వారి నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. ఇంచుమించుగా ఇంతే సంఖ్యలో సంఘ శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అంటే సమాజంలో సంఘ్‌ ‌విషయంలో ఎవరి అవగాహన ఎలా ఉన్నా, యువత సంఘ్‌ ‌కార్యం వైపు ఆకర్షితులు అవుతున్నారు.

ఇక్కడ మరో ముఖ్య ప్రశ్న. సంఘ్‌లో మహిళల పాత్ర, మహిళలు- సంఘ్‌ ‌సంబంధాల గురించి తరచూ వినవస్తుంది. ఇటీవల విజయదశమి ప్రసంగంలో సంతోష్‌ ‌యాదవ్‌ ‌చేసిన వ్యాఖ్యలను బట్టి, రాష్ట్రీయ సేవికా సమితి మహిళలకు ఒక ముఖ్యవేదిక అంటాను. సంఘ్‌ ‌కార్యక్రమాల్లో మహిళల పాత్రను మీరు ఎలా చూస్తారు? ముందు కంటే ఇప్పడు వారి పాత్ర పెరుగుతోందా?

అవును, ముందుకంటే ఇప్పుడు సంఘ్‌లో మహిళల పాత్ర పెరుగుతోంది. గతంలో పరివార్‌ ‌సమ్మేళనాలు ఉండేవి కాదు.అలాగని మేము అందుకు వ్యతిరేకం అని కాదు, అప్పుటి పరిస్థితులు వేరు, అందుకే అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మేము కుటుంబ ప్రబోధన్‌ ‌పేరిట ప్రత్యేక కార్యక్రమం నిరహిస్తున్నాము. కార్యకారిణి (కార్యవర్గం) సభ్యులు సంవత్సరంలో కనీసం ఒకసారి అయినా కుటుం బాలతో కలిసి ఏదో ఓక ప్రదేశానికి వెళ్లాలని చెపు తున్నాము. కార్యకర్తల కుటుంబాలు అంటే కుటుంబ మహిళలు కూడా అందులోకి వస్తారు. ఇప్పటికే సంఘ్‌లో పదాతి (ఒకరి నాయకత్వంలో పనిచేసే స్వయంసేవకుల బృందం) వ్యవస్థ ఉంది. ఈ బృందంలోని సభ్యులకు సభ్యుల ఇళ్లలో వంట గదివరకు వెళ్లే చనువు ఉంటుంది. ఇది సంఘ్‌ను కుటుంబాల వరకు తీసుకువెళ్లే ఒక పక్రియ. శాఖకు రాని కుటుంబ సభ్యులతో సంబం ధాలు ఏర్పర్చుకునే వ్యవస్థ. అలాగే, స్వయంసేవకులు వారి కుటుంబ సభ్యుల కోసం మేధావుల ఉపన్యాసాలు (బౌద్ధిక్‌) ‌కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఇవ్వన్నీ నిజమే అయినా, రాష్ట్రీయ సేవికా సమితి (మహిళా సంఘం)లో మహిళల వ్యక్తి నిర్మాణ కార్యక్రమం నిత్య నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. సేవికా సమితి మహిళలతో కలసి పనిచేస్తుంది. సంఘ్‌ ‌పురుషులతో కలిసి పనిచేస్తుంది. ఎప్పుడైతే వారు ఈ పద్ధతి మారాలని కోరుకుంటారో, అప్పుడు తప్పకుండా మార్చుకుంటాము. కొవిడ్‌ ‌సమయంలో సుమారు రెండు సంవత్సరాలకు పైగా స్వయం సేవకుల ఇళ్లలోనే శాఖలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు మహిళలు సంఘకార్యంలో మరింత చురుగ్గా క్రియాశీల పాత్రను పోషిస్తున్నారు. మరింత ప్రధాన పాత్రను కోరుతున్నారు. సంఘ్‌ ‌శాఖలో నేర్చుకున్న విషయాలు, పొందిన శిక్షణ ఆధారంగా స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంఘ్‌ ‌కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు న్నారు, ఇతరులను స్వాగ తిస్తున్నారు. భాగస్వాములను చేస్తున్నారు. ఉదా హరణకు, ఈరోజు నేను ఒకరి ఇంటికి భోజనానికి వెళ్లాను. కొవిడ్‌ -19 ‌సమయంలో ఆ ఇంటి ఇల్లాలు వారి ఇంట్లో నిర్వహించిన నిత్య శాఖను దగ్గరగా చూసి ఉండ వచ్చు. ఆ స్ఫూర్తితో ఆమె యోగ శిక్షణ పొందారు. ఇప్పుడు ఆమె ఆన్లైన్‌ ‌తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆనేక మంది మహిళలు ఆన్లైన్‌ ‌తరగతులలో చేరారు. శిక్షణ పొందుతున్నారు. దీంతో ఇప్పుడు ఆమెకు, ఒక కార్యక్రమం, ఒక బాధ్యత ఏర్పడ్డాయి. స్వయం సేవకుల వలే స్వయంసేవికలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ విధంగా స్పూర్తిని పొంది సంఘకార్యంలో పాలుపంచుకుంటున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఈ దిశగా ఒక స్థిర నిర్ణయం తీసుకునే వరకు, ఎవరైనా మహిళలు, సంఘ్‌ ‌కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపి ముందుకు వస్తే, అలాంటి వారిని సేవికా సమితికి వెళ్లమని చెప్పరాదని, మేము మా కార్యకర్తలకు సూచిస్తు న్నాము. ఎందుకంటే, ఆ ప్రదేశంలో ప్రస్తుతానికి రాష్ట్రీయ సేవికా సమితి అంత బలంగా (శాఖల పరంగా, సంఖ్యా పరంగా) ఉండకపోవచ్చు. అలాగే ఉత్సాహంగా ముందుకు వచ్చిన మహిళల కోసం సేవికాసమితి స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహించేవరకు, వారిని ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నాం. ఎందుకంటే, వారు స్వయంసేవకులు చేస్తున్న నిర్మాణాత్మక పనులను చూసి, స్ఫూర్తి పొందారు. సంఘ కార్యక్రమాల్లో ఆసక్తి చూపు తున్నారు. అలా ఆసక్తి చూపుతున్న మహిళలకు సంఘ్‌’ ‌బోధించే విలువల తమ పిల్లలకు బోధించా లని కోరుకుంటున్నారు. మన కార్యక్రమాలను స్వయంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే వారిని సంఘ్‌ ‌కార్యక్రమంలో భాగస్వాము లను చేయవలసిన బాధ్యత మాపై ఉంది. మేము ఈ విషయం ఆలోచించవలసి ఉంది. డాక్టర్‌జీ కాలంలో, ఈ విషయం ఆలోచించేందుకు అనువైన పరిస్థితులు లేవు. కానీ, ఇప్పుడున్నాయి. అయితే, సేవికాసమితి మహిళా కార్యకర్తలు, మహిళలతో కలసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవికా సమితి కార్యకర్తలతో చర్చించి, ఏదో ఒకటి చేయలసి వుంది.

పరివార్‌ ‌ప్రబోధన్‌ (‌కుటుంబ జ్ఞానబోధన) కార్యక్రమ కొత్త కోణం కారణంగా ఈ మార్పులను చూడవచ్చునా?

లేదు. పరివార్‌ ‌ప్రబోధన్‌ ‌చాలాకాలంగా ఉన్న కార్యక్రమం. సంఘ్‌ ఆలోచనలను ఆ కార్యక్రమంలో చేర్చలేదు. కుటుంబ సంప్రదాయాలు, జాతీయ సంప్రదాయాలు, వంశాచారాలు, మన పూర్వికుల వివరాలు, విశేషాలు, ఇంటి, కుటుంబ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు, ఆరోగ్యవంతమైన, సంతోష దాయక కుటుంబ జీవితం వంటి మరికొన్ని అంశాలు పరివార్‌ ‌ప్రబోధన్‌ ‌కార్యక్రమ పరిధిలోకి వస్తాయి. ఈ కార్యక్రమంలో స్వయంసేవకులు కూడా పాల్గొంటారు, కానీ, అది సంఘ్‌ ‌విస్తరణ వేదిక మాత్రం కాదు.

మహిళల భాగస్వామ్యం పెరగడానికి, సమాజంలో సంఘ్‌ ‌పలుకుబడి పెరగడంతో పాటుగా కొవిడ్‌ ‌కూడా కొంతవరకు కారణం. సంఘ్‌ ‌కార్యక్ర మాలకు, ముఖ్యంగా, వ్యాపారవేత్తల సమావేశాలకు మహిళలను కూడా ఆహ్వానిస్తున్నాము. మా ఆహ్వానం మేరకు వ్యాపారవేత్తల కుటుంబాల మహిళలు మా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆ తర్వాత వారు స్వయంసేవకులు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని కొన్ని చోట్ల స్కూల్‌, ‌కాలేజీ అమ్మాయిలు కూడా శాఖలకు హాజరవుతున్నారు. ఇప్పుడు మేము, ఇది మీకోసం కాదు అని చెప్పలేము. ప్రత్యేక బృందంగా ఏర్పడేలా ప్రోత్సహిస్తాం. ప్రార్ధన సమయంలో కొంతదూరం పాటించమని లేదా సేవికా సమితి ప్రార్ధన చేయాలని మాత్రమే సూచిస్తు న్నాము. ఇప్పటికైతే, ఇలా చేస్తున్నాం. అయితే ఈ సర్దుబాటును క్రమబద్ధీకరించే విషయంలో ఆలోచించవలసి ఉంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక నిర్దిష నిర్ణయం తీసుకుంటాం.

దేశంలో పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న సామాజిక మార్పుల గురించి మాట్లాడుతూ, మీరు, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ (‌కృత్రిమ మేథస్సు) గురించి ప్రస్తావించారు. అలాగే, ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ కూడా మన సమాజాన్ని, సామాజిక వ్యవస్థను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తోంది. పాశ్చాత్య సమాజ పోకడలను గమనిస్తే, చాలా పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు గోచరిస్తు న్నాయి.  రానున్న రోజుల్లో డేటా వినియోగం ఒక ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ భవిష్యత్‌ ‌సవాళ్లపై సంఘ్‌లో చర్చ జరిగిందా? సమాజంపై ప్రభావంతో పాటుగా, ఈ సమస్యల ప్రభావం కొంతమేరకు ఆర్థికవ్యవస్థ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఉంటుంది కదా?  అలాగే, మరోవిధంగా చూస్తే, టెక్నాలజీ కారణంగా సమాజంలోని ఒక వర్గం ముందడుగు వేసింది. ప్రగతిని సాధించింది. అయితే అదే సమయంలో కొందరు దానికి దూరంగా ఉండి పోయారు. అలనాటి వారు తాము సాంకేతిక వేగాన్ని ఆదుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. అలాంటి వారు చదవగలరు, రాయగలరు కానీ, వారిని నిరక్షరాస్యులుగా చూస్తున్నారు. ఒక విధంగా టెక్నాలజీ సమాజంలో విభజన రేఖగా మారింది. ఈ సమస్యను మీరు ఎలా చూస్తున్నారు?

టెక్నాలజీ జీవితానికి ఎంతో ఉపయోగకరం. సక్రమంగా ఉపయోగించుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. అయితే కేవలం అదే సర్వస్వం కాదు. సంపూర్ణ వికాసానికి అది సరిపోదు. ప్రస్తుతం టెక్నాలజీ వ్యాప్తి సమాజాన్ని విడదీస్తోంది. సామాజిక సంబంధాలను దూరం చేస్తోంది. వ్యక్తులను ఏకాంతంలోకి నెట్టివేస్తోంది. ఈ పక్రియ ప్రభావంతో వ్యక్తులు అసంతృప్తికీ, అత్మన్యూనతా భావానికీ గురవుతున్నారు. ఇదొక కొత్త వ్యామోహం, సామాన్య ప్రజలు ఆకర్షితులవుతారు. ప్రత్యేకించి సంప్రదాయ కుటుంబ వ్యవస్థకు దూరమైనవారు, కుటుంబ వ్యవస్థ మూలాలతో సంబంధాలు లేని వారు, ఆలోచన, ముందుచూపు లేని వారు కొత్త వ్యామోహానికి ఆకర్షితులవుతారు.మన సంప్రదాయ తాత్విక గాఢత బలహీనపడిన నేపథ్యంలో అలాంటి వారు పాశ్చాత్య పోకడలను గుడ్డిగా అనుసరిస్తారు. ఫలితంగా పాశ్చాత్య దేశాలలో తరచూ వినవచ్చే కాల్పుల విష సంస్కృతీ ఉచ్చులో చిక్కుకోవచ్చును. కానీ, అది మితి మీరి గీత దాటితే, మేము దీనిని వదిలించుకోక తప్పదు. అందుకు మరో ప్రత్యా మ్నాయం కోసం ప్రయత్నిస్తాము. ప్రత్యామ్నాయం తప్పక దొరుకుతుంది. మనం ఆ ప్రత్యామ్నాయాన్ని ప్రపంచానికి కూడా ఇవ్వవలసి ఉంటుంది. టెక్నాలజీ అనేది, ఒక సౌకర్యం. ఒక సౌలభ్య సాధనం. అంతవరకే. అదే మన యజమాని కారాదు. ఆనందం అనేది పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడే పరిస్థితి వస్తే, మనం మన ఆనంద భావనను మార్చుకోవలసి ఉంటుంది. అవును, మీరన్నట్లుగా, టెక్నాలజీ కారణంగా వెనకబడిపోయామనే భావనతో బాధపడే వారున్నారు. కంప్యూటర్‌ ఉపయోగించని వారిని కంప్యూటర్‌ ‌నిరక్షరాసులుగా అభివర్ణిస్తున్నారు. ఇతరులకంటే తక్కువగా చూస్తున్నారు.

ఒకప్పుడు సంఘ్‌ ‌కార్యవర్గ సభ్యుడొకరు, సంఘ కార్యక్రమంలో పాల్గొని వెనక్కి వస్తున్న సమయంలో, ఆయనకు ఒక పక్కన ఒక వృద్థుడు, మరో పక్కన ఒక యువకుడు కూర్చున్నారు. ఆ ఇద్దరికీ, టికెట్లలోనే భోజనం చార్జీలు కలిపి ఉన్నాయి. సంఘ్‌ ‌కార్యకర్తకు తినేందుకు ఏదైనా కొనుక్కునేందుకు చూస్తుంటే,  సహ ప్రయాణీకులలో ఒకరు పానీయం ఇచ్చారు. ఆ తర్వాత మాటల సందర్భంగా ఆ పెద్దమనిషి, తాను దుబాయ్‌లో ఉంటానని, ఉద్యోగరీత్యా తాను వరసగా మూడునెలలు సముద్రంలోనే ఉంటానని, ఆ తర్వాత ఒక నెలరోజులు ఇంటివద్ద విశ్రాంతి తీసుకుని, ఆరోగ్యం కూడగట్టుకుని మళ్లీ సముద్రం లోకి వెళుతుంటానని చెప్పుకొచ్చారు. ఆయనకు నెలకు రూ.80 వేలు జీతం. అందులోంచి నెలకో రూ. 10 వేలు ఖర్చుచేసుకుని, మిగిలిన మొత్తాన్ని సంవత్సరంలో మూడుసార్లు రూ. 2 లక్షల 10 వేల చొప్ప్పున సంవత్సరంలో మొత్తం, రూ.6 లక్షల 30 వేలు ఇంటికి పంపుతానని చెప్పుకొచ్చారు. అయితే తాను చదువుకోలేదని, కనీసం అక్షరజ్ఞానం కూడా లేదని విచారం వ్యక్త పరిచారు.

అందుకు సంఘ్‌ ‌కార్యవర్గ సభ్యుడు, చదువు రాదని నిరాశ చెందవలసిన అవసరం లేదు. భగవంతుడు మీకు ఎన్నో ఇచ్చాడు. అయినా మీరు ఇంకా ఏదో లేదని బాధపడడం భగవంతుని కృపను దూషించడం అవుతుందని చెప్పారు. ఇక్కడ భారతదేశంలో ప్రేమగా, మీ యోగక్షేమాలు చూసుకునే కుటుంబం ఉంది. మీకు వచ్చే ఆదాయం ఇక్కడ కూలీలకు వచ్చే ఆదాయం కంటే చాలా ఎక్కువ. అన్నిటినీ మించి మీలో మానవత్వం మిగిలుంది. మీరు మీ పానీయాన్ని ముక్కు ముఖం తెలియని అపరిచితునితో పంచుకునే మంచి మనసుంది అన్నారు. అప్పుడు అతను తన సుగుణ సంపద విలువ తెలుసుకున్నారు. ఇక ముందు తనకు చదువురాదనే అత్మన్యూనతా భావం రానీయనని మాటిచ్చారు. మానసిక స్థితి, అలోచన ధోరణిలో మార్పు తీసుకువచ్చేందుకు, టెక్నాలజీ, అక్షరాస్యత, చదువు అవసరం లేదు. అలసిన బాటసారికి కాసింత నీడ, ఓ తియ్యని పండును ఇవ్వలేని కర్జూర చెట్టు వలన ఏమి ప్రయోజనం అన్నట్లు మనం, మన సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్న జీవితం, జీవిత విజయాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేక పోతున్నాము. మనం ఈ వాస్తవాన్ని గుర్తించినప్పుడు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు గోచరిస్తాయి. మనకే కాదు ప్రపంచానికి కూడా మనం దారి చూపగలుగు తాము. ఎట్టి పరిస్థితిలో ఇది మనం చేసి తీరవలసిందే. ఎందుకంటే, అది చీకటిదారి, ఎక్కడికి చేరుస్తుందో తెలియని, లోతులు తెలియని చీకటి బావి..

కొవిడ్‌ 19 ‌మహమ్మారి కేవలం వ్యక్తులు, కుటుంబాలనే కాదు, ప్రపంచ స్థితిగతులనే మార్చి వేసింది. ఇప్పడు అందరూ కొత్త ప్రపంచం గురించి మట్లాడుతున్నారు. కొవిడ్‌ ‌కాలంలో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, మార్పుల నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత్‌’ ‌స్థానం ఏమిటి? ఈ నూతన ప్రపంచంలో భారత్‌ ‌పోషించే పాత్ర ఏమిటి? భారత దేశంలో సంఘ్‌’ ‌పోషించే పాత్ర ఏమిటి?

నిజం. కొవిడ్‌ ‌సంక్లిష్ట సమయంలో భారతదేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు, కొవిడ్‌ ‌మహమ్మారి కారణం కాకపోవచ్చును. కానీ, కొవిడ్‌ ‌కారణంగా ప్రపంచానికి మనం ఆశాజ్యోతిగా నిలిచాము. నిజానికి, మనలో మార్పులేదు. మనం మనం గానే ఉన్నాము. మనం సరైన దారిలో ముందుకు సాగుతున్నాము. అంటే, మనం ఇప్పుడే మిటో, అప్పుడు (మహమ్మారికి ముందు) అదే ఆలోచనల వెంట అడుగులు వేశాము. కానీ, అప్పడు, ప్రపంచం మనల్ని స్పష్టంగా చూడలేదు. మేఘాల మాటున మసకబారిన ప్రపంచ దృష్టిని కొవిడ్‌ 19 ‌సంక్షోభం తొలిగించింది. కొవిడ్‌ ‌సంక్షోభానికి పరిష్కారాల కోసం ప్రపంచ ప్రజలు భారతదేశం వైపు చూశారు. మన దేశం పట్ల ప్రపంచ దృక్కోణంలో మార్పు వచ్చింది. భారతదేశం శీఘ్రంగా వాక్సిన్‌ ‌తయారుచేసింది. అంతే కాదు, తయారుచేసిన వాక్సిన్‌ ‌కుప్పలు పోయకుండా, ఇతర దేశాలకు పంచింది. లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ఇతర దేశాలకు సహాయం చేసిన ఇలాంటి సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశం గతంలో శ్రీలంకకు సహాయం చేసింది, ఇప్పుడు ఉక్రెయిన్‌కు సహాయం అందిస్తోంది.

నిజానికి ఇదే భారతీయత సారాంశం. ఇప్పడు ప్రజలు చూస్తున్నారు. గుర్తిస్తున్నారు. ప్రపంచ ప్రాధాన్యతా క్రమంలో పూర్వ వైభవాన్ని పొందు తోంది. అందుకే, ప్రపంచ ప్రజలు మనల్ని మెచ్చు కుంటున్నారు. రష్యా మన దేశాన్ని మెచ్చుకుంటుంది. గౌరవిస్తోంది. అలాగే, అమెరికా… బలమైన ఆర్థిక వ్యవస్థ, భారీ సైన్యం ఉన్న ఈ దేశాలు, మన దేశాన్ని అనుకరించవలసిన, అభినందించవలసిన అవసరం లేదు. అయినా అవి కూడా, భారతదేశాన్ని ఘనంగా కీర్తిస్తున్నాయి. ఇందుకు ఒకటే కారణం, భారత దేశాన్ని ఆ దేశాలు సుగుణ సంపన్న దేశంగా చూస్తున్నాయి. భారతదేశం అభివృద్దినీ, గమ్యాన్నీ గుర్తించారు. అందుకే, భారతదేశాన్ని గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు.

అయితే, ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్న మన ప్రత్యేకత, ప్రత్యేక లక్షణం ఏమిటి? ఇది ఏదో గమ్మత్తు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం చేసిన మ్యాజిక్కు కాదు. మన దేశ వ్యాపారవేత్తల గొప్పతనం కాదు. మన దేశ వ్యాపారవేత్తలు ఇప్పుడే కాదు, గతంలోనూ వ్యాపార నిపుణులు గానే ఉన్నారు. అయితే, అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా, ప్రామాణికత. భారతీయ ప్రామాణిక సుగుణాలు ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. సంఘ్‌ ‌యువతను ఎందుకు ఆకర్షిస్తోంది? అందుకు సమాధానం, నిజాయతీ. అవును, దేశభక్తి, నిస్వార్ధసేవ విషయంలో సంఘ్‌ ‌చూపే నిజాయతీ యువతను ఆకట్టుకుంటోంది. భారతదేశం వంటి దేశం ఇతరులకు సహాయం చేసేందుకు ప్రయత్నించి నప్పుడు, సహజంగానే, ప్రజలు ప్రామాణికతను, నిజాయతీని చూస్తారు. ఇతరులను ఆదుకునే విషయంలో భారతదేశం స్వార్ధంతో వ్యవహరించదు. భారతీయులకు తెలివితేటలున్నాయి. శక్తి ఉంది. ఏ విషయంలోనూ ఇతరులకు తీసిపోరు. భారతదేశం ఈ వాస్తవం తెలుసుకుంటోంది. మేల్కొంటోంది. విజయాన్ని ఆకాంక్షిస్తోంది.

భారత విజయం, ప్రపంచానికి కూడా మేలు చేస్తుంది. ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశం కొత్త మార్గం చూపాలని, ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్క భారత్‌కు మాత్రమే అది సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు. అయితే, భారత్‌ ఈ ‌ప్రగతిమార్గంలో పయనించాలంటే, ప్రతి భారతీయడు మన దేశ ‘స్వస్థ’ (స్వీయ సామర్ధ్యం) గుర్తించి, చావైనా బతుకైనా అందుకే అనే బలమైన కాంక్షతో ఉండడం అవసరం.  అలాంటి వాతావరణ నిర్మాణం కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తల బృందాలను తయారు చేయడంలో సంఘ్‌ ‌పాత్ర కీలకమైనది. ఇది శాశ్వత మారునకు దారితీస్తుంది. భారత పాత్రను బలోపేతం చేయడం సంఘ్‌ ‌పాత్ర, ప్రపంచాన్ని బలోపేతం చేయడంలో భారత్‌ ‌పాత్ర కీలకం.

కొవిడ్‌ ‌సమయంలో మీరు కూడా ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ అనే పదాన్ని పదే పదే పేర్కొన్నారు. అయితే, ప్రపంచ సరఫరా చట్రం (గ్లోబల్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌చైన్‌)‌లో ఫార్మాస్యూటికల్‌ ‌రంగం నుంచి చిన్న తరహా పరిశ్రమల వరకు వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఏమంటారు? ఈ సవాళ్లను మీరు ఎలా చూస్తారు? ఎంతో మంది జీవనోపాధిని కోల్పోయారు. చిన్న చిన్న పరిశ్రమలు పునరుత్తేజం పొందేందుకు సతమతమవుతున్నాయి. అంతే కాకుండా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం తర్వాత ఆర్థికవ్యవస్థ, విదేశీ మారక ద్రవ్యం, వడ్డీ రేట్లకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులలో ‘ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌’ ‌భావన ఎలా వాస్తవ రూపం దాలుస్తుంది?

ఆత్మ నిర్బర్‌ ‌భారత్‌ ‌భావన తప్పక వాస్తవరూపం దాలుస్తుంది. ఒకరి శక్తికి తగిన విధంగా, ఆత్మబలం ఆధారంగా అభివృద్ధి జరుగుతుంది. అయితే అందుకు హైబ్రీడ్‌ ‌రంగులు అద్దకూడదు. శిక్షణ ఇచ్చి ఒక ఏనుగు చేత ఫుట్‌బాల్‌ ఆడించవచ్చును. అయితే, అది ఏనుగు పురోగతి కాదు. ఈ అద్భుత క్రీడను చూసేందుకు ప్రజలు టికెట్లు కొనుక్కుని రావచ్చును. అయినా అది ఏనుగు సాధించిన అభివృద్ధి కాదు. ఒక సింహం గొర్రె పిల్ల పక్కన కూర్చుని, ప్రశాంతంగా విందారాగిస్తే, అది ప్రగతి సంకేతం కాదు. అది సింహం పౌరుషాన్ని ఒక ప్రహసనంగా మార్చివేస్తుంది. సింహం అడవిలోనే ఎదుగుతుంది. కాబట్టి మనం ఆత్మ నిర్బర్‌ ‌భారత్‌ ‌గురించి మాట్లాడినప్పుడు, ఈ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

అత్మ నిర్భర్‌ అం‌టే కేవలం అన్నీ వస్తువులను భారతదేశం ఉత్పత్తి చేయడమో, అన్నీ దేశంలోనే తయారుకావడమో కాదు. ఇంతవరకు ప్రపంచ ఆర్ధిక పోకడలు కార్పొరేట్‌ ‌లాజిక్‌ను అనుసరిస్తున్నాయి. ప్రతిదీ కేంద్రీకృతమైంది. భారత ఆర్థిక తర్కం, అందుకు విరుద్ధం. వికేంద్రీకరణ వలన ఉత్పత్తి పెరుగుతుందని, భారత ఆర్థిక తర్కం విశ్వసిస్తుంది. అలాగే, ఉత్పత్తుల అమ్మకంతో వినియోగ స్వభావం బలపడుతుందని కాదు. వినియోగంపై నియంత్రణ ఉంటే, ధరలు తగ్గుతాయి. పాశ్చాత్య దేశాలలో వాణిజ్యమే జీవిత ప్రధాన పునాది కాబట్టి, ఆ దేశాల వారు ధరల పెరుగుదలను సమర్ధిస్తారు. అందుకు వినియోగదారులు అవసరం, అది మళ్లీ వ్యక్తిత్వ వాదంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషవలయంలో ఒక దానిని ఒకటి అనుసరిస్తూ ఉంటాయి.

వినియోగవాదం, దీర్ఘకాలంలో తీవ్ర విపత్తుకు దారి తీసే ప్రమాదం ఎప్పడూ పొంచి ఉంటుంది. కాబట్టి ఆత్మ నిర్భర్‌ అం‌టే, ఈ ప్రపంచ పోటీలో గెలవడం కాదు. ఆత్మనిర్భర్‌ అం‌టే, భౌతిక సదుపా యాలు, భద్రత. భవిష్యత్‌ ‌జీవితానికి భరోసా ఇవ్వడమే కాకుండా, ప్రశాంత భావన, ఆత్మతృప్తి ఇచ్చే నూతన వాణిజ్య నమూనా. అందుకోసం, ఆత్మతో సయోధ్య కలిగి ఉండే భవనాలను, నూతన పద్దతులను నిర్మించుకోవలసి ఉంటుంది. వలసపాలన భావనలను పూర్తిగా వదిలించుకుని, మన గురించి మనం ఉన్నతంగా ఆలోచించుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత సైంటిఫిక్‌ అనుకుంటున్న వాటిలో వేటిని మన దృక్కోణంలో చేర్చుకోవాలి, వేటిని వదిలేయాలి అనేది నిర్ధారించుకోవలసి ఉంటుంది. తెలియక ఏవైనా తప్పడు పద్ధతులు పాటిస్తుంటే, వాటిని వదిలించుకోవలసి ఉంటుంది. ప్రపంచంలోని ఉత్తమమైన వాటిని వడపోసి, మనకు అనుకూలమైన నూతన విధానాన్ని నిర్మించు కోవలసి ఉంటుంది. అయితే నూతన మార్గాన్ని, కొత్త రోడ్డును మన విలువల పునాదుల ఆధారంగా నిర్మించుకోవసిందే కానీ, మరోలా కాదు.‘సర్వే భవంతు సుఖినః’ అందరూ ఆనందంగా, తృప్తిగా ఉండాలి, అనేది మన దృష్టికోణం. అంతేకానీ, బడిత ఉన్నవాడిదే బర్రె అనే భావన కానీ, ఎక్కువమందికి ఎక్కువ ప్రయోజనం అనే భావన కానీ భారతీయ భావన కాదు. మనం కష్టపడితే అందరికీ ఆనందం లభిస్తుంది. ప్రపంచంలో అయినా అంతే.. ఇదీ మన భావన. మన విధానం. మన విశ్వాసం. అందుకే 2000 సంవత్సరాలకు పైగా అనేక ప్రయోగాలు చేసి ఫలితం లేక చివరకు ప్రపంచం సామరస్య నమూనా మార్గం కోసం మన దేశం వైపు చూస్తోంది. మనం మన ఆత్మను అవిష్కరించడం ద్వారా మాత్రమే అలాంటి మార్గాన్ని కనుగొనగలుగుతాము. ఆత్మ మీద ఆధారపడడమే ఆత్మనిర్భర్‌. అం‌తేగానీ, ఇది ప్రపంచ పోటీలో గెలవడమో, ఓడడమో కాదు.

ఇక్కడ మన సమాజం ఎదుర్కుంటున్న మరో సమస్య ఉంది. అది జనాభా సమస్య. అసంతుల్య జనాభా ఎదుగుదల సమస్య. ఈ సమస్యను సంఘ్‌ ‌లేవనెత్తింది, నొక్కి చెప్పింది. ఇదొక సంక్లిష్ట సమస్య. ఈ సమస్యను హిందు, ముస్లిం సమస్యగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా ఏకాభిప్రాయం సాధ్యమేనా?

ముందుగా, మెజారిటీలైన హిందువులు ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. హిందువులకు దేశం గురించి నాదీ అనే ఆత్మీయతా భావం ఉంటుంది. హిందువుల అభ్యున్నతితో దేశం క్షేమంగా, సుభిక్షి తంగా ఉంటుంది. కాబట్టి, ముందుగా హిందువులు ఈ విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. జనాభా ఒక సంపద. అదే సమయంలో అది భారీ భారం. నేను ఆ ఉపన్యాసంలో పేర్కొన్నట్లుగా, మనం లోతైన ఆలోచనలతో దీర్ఘకాల, జనాభా విధానాన్ని రూపొం దించుకోవలసిన అవసరం ఉంది. అలాగే, ఆ విధానాన్ని అందరికీ సమానంగా వర్తింప చేయ వలసిన అవసరం ఉంది. అయితే, ఇది బల వంతంగా చేయరాదు. ప్రజలకు అవగాహన కలిపించి, ఆ విధంగా అమలు చేయాలి.

జనాభా అసమతుల్యత ఒక వాస్తవ సమస్య. ఎక్కడెక్కడైతే జనాభా అసమతుల్యత చోటు చేసుకున్నదో అక్కడడక్కడ దేశ విభజనలు జరిగాయి. ఇదొక అంతర్జాతీయ వరవడి. వాస్తవం. అక్కడి ప్రజలు, నాగరికతల దురుసు ప్రవర్తన, దూకుడు స్వభావం వలన, ఈ వరవడి కొనసాగుతోంది. ఇందుకు హిందూ సమాజం ఒక్కటే మినహాయింపు. హిందూ సమాజం ఎప్పుడు ఎక్కడా దూకుడుగా పోలేదు. దురాక్రమణకు పాల్పడలేదు. శాంతివాదం, అహింస, ప్రజాస్వామ్యం, లౌకికవాదం మొదలైన వాటి పరిరక్షణ కోసం, దూకుడు చూపక పోవడం అవసరం.అయితే, శాంతిమార్గం అనుసరించడం వలన, తైమూర్‌, ‌సూడాన్‌, ‌పాకిస్తాన్‌లలో విపత్కర ఫలితాలు చూశాము. ఇందుకు సంబంధించి బుజ్జగింపు రాజకీయాలకు అంతం పలకవలసి ఉంది. హిందువులు లేదా ఇతరులపట్ల ఎలాంటి వివక్ష లేకుండా, పాకిస్తాన్‌ ‌సృష్టికి కారణం ఏమిటని నిష్పాక్షికంగా అడగవలసి ఉంది?

చారిత్రిక అధారాల ప్రకారం, భారతదేశం ఒకప్పుడు అఖండ దేశంగా వెలుగొందింది. ఆ తర్వాత శతాబ్దాల పాటు సాగిన ఇస్లాం దుర్మార్గపు దాడులు అంతమైన తర్వాత దేశ విభజన జరిగింది. దేశ విభజన ఎలా జరిగింది? ఇందుకు నాకు ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది. హిందూ భావ కో జబ్‌ – ‌జబ్‌ ‌భూలే ఆయీ… ఎప్పుడయితే, మనం హిందూ మూల భావనను మరిచిపొయామో, అప్పుడప్పుడల్లా, మనం విపత్తులను ఎదుర్కున్నాం. సోదరులు విడిపోయారు. భూమిని కోల్పోయాం. మత వ్యవస్థలు ధ్వంస మయ్యాయి.

నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. కానీ, భారతదేశం చరిత్ర చూడని స్థాయిలో రక్తపాతాన్ని చూసింది. ఇది నిజం. మనం కళింగ యుద్ధం గురించి అనుకుంటే, ఇది ఒక విధంగా స్థానిక యుద్ధం. త్వరగానే ముగిసి పోయింది. మనం , నేను హిందువును, అనే మౌలిక హిందూ భావనను విస్మరించడం వల్లనే మనం ఈ పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చింది. మనం హిందూ భావం గురించి మాట్లాడినా, అందులో ఇస్లామిక్‌ ‌ప్రార్ధనా పద్ధతులకు ఎలాంటి విఘాతం కల్గించ లేదు.

హిందూ అనేది మన గుర్తింపు, మన జాతీయత, ప్రతి దాన్ని మనదిగా భావించే మన నాగరికత లక్షణం. ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోయే మన నాగరి••తా చిహ్నం. ఏనాడూ మనం మేము చెప్పిందే నిజం, ఇతరులు చెప్పింది అబద్ధం అని చెప్పలేదు. మీ దగ్గర మీరు చెప్పింది నిజం. మాదగ్గర మేము చెప్పింది నిజం. తగవు ఎందుకు, కలిసి కదులుదాం-ఇదీ హిందుత్వ భావన. ఈ విలువలకు కట్టుబడిన వారు మెజారిటీగా ఉన్నంత వరకు భారతదేశం ఐక్యంగా ఉంటుంది. ఐక్య భారతదేశం ప్రపంచాన్ని ఏకతాటిపై నడిపిస్తుంది. ఐక్యంగా, శక్తిమంతంగా ఉంచుతుంది. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, సమస్త మానవాళి సంక్షేమానికి సంబంధించిన విషయం. హిందూ సమాజం అదృశ్య మైతే, పరిస్థితి ఏమిటో ఒక్క క్షణం ఆలోచించుకోండి. ఇతర జాతులు ఆధిక్యం కోసం యుద్ధాలు మొదలెడ తాయి. అది అనివార్యం. అదే జరిగితే, అప్పుడు ఎదురయ్యే విపరిణామాల నుంచి మనల్ని రక్షించేది హిందువుల ఉనికి మాత్రమే. అదొక్కటే మనల్ని రక్షిస్తుంది.

హిందుస్తాన్‌.. ‌హిందుస్తాన్‌గానే ఉండాలి.. ఇదే సాధారణ సత్యం. ఈ రోజు భారతదేశంలో జీవిస్తున్న ముస్లింలకు ఎలాంటి ముప్పూ లేదు. వారు తమ విశ్వాసాలకు కట్టుబడి ఉండాలంటే, ఉండవచ్చును. లేదు, తమ పూర్వికుల విశ్వాసాలకు తిరిగి రావాలను కుంటే, రావచ్చును. అది పూర్తిగా వారి ఇష్టం. ఇందుకు సంబంధించి హిందువులలో ఎలాంటి మొండి పట్టుదల లేదు. అయితే అదే సమయంలో, ముస్లింలు తమ ఆవేశపూరిత ఆధిపత్య ధోరణిని వదులుకోవలసి ఉంటుంది. మాది ఒక ఉన్నత జాతి, ఒకప్పుడు మేము ఈ ప్రాంతాన్ని పాలించాము, మళ్లీ మరోమారు పాలిస్తాము. మేము అనుసరించే మార్గమే సరైనది, ఇతర మార్గాలన్నీ తప్పుడు మార్గాలు. మేము భిన్నం, కాబట్టి మేము ఇలానే ఉంటాము; మేము కలసి జీవించము, వంటి అనేక అహంకారపూరిత ధోరణిని వదులుకోవలసి ఉంటుంది. నిజానికి, ఒక్క ముస్లింలు మాత్రమే కాదు, ఇక్కడ జీవించే ఏ హిందువు అయినా, ఒక కమ్యూనిస్ట్ అయినా ఈ తర్కాన్ని వదులుకోక తప్పదు.

కాబట్టి, జనాభా అసమతుల్యత అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. మనం దీని గురించి లోతుగా ఆలోచించాలి. ఇది చెపుతున్నప్పుడు, నాతో విభేదించే వారు, నన్ను తప్పుపట్టే వారు, నాపై ఆరోపణలు చేసే ఉంటారనే విషయం నాకు తెలుసు. అయితే, అదే వ్యక్తులు, పరిపాలన బాధ్యతలలో ఉన్నప్పుడు, కచ్చితంగా అదే చేస్తారు. స్వతంత్ర భారతదేశం తొలినాళ్ల నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వ కార్యకలాపాలను చూస్తే అధికారంలో ఉన్నవారు, వారి విశ్వాసాలు ఏవైనప్పటికీ, ఈ విషయంలో ఆందోళన చెందుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్నవారు, భారత సర్వోన్నతిని కోరుకునేవారు, తప్పక ఈ విషయాన్ని అలోచిస్తారు. ఏమి చేయాలో, ఏది అవసరమో అది చేస్తారు. కాబట్టి, అందరికీ తెలిసిన విషయాన్నే మేము పునరుద్ఘాటిస్తున్నాము.

మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరినీ వ్యతిరేకించము. ఇది జననాల రేటు (బర్త్ ‌రేట్‌)‌కు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. జనాభా అసమతుల్యతకు మత మార్పిళ్లు, అక్రమ వలసలు ప్రధాన కారణం. వీటిని నిరోధిస్తే, సమతుల్యత సాధ్యమవుతుంది. కాబట్టి, జనాభా విధానం, ఈ సమతుల్యతను నిర్ధారించే విధంగా ఉండాలి. బర్త్ ‌రేట్‌, ఇతర కారణాల వలన స్వల్ప అసమతుల్యత ఉంటే ఉండవచ్చును, దానిని కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

ఇక్కడ హిందువుల మానవ హక్కుల విషయం కూడా దృష్టికి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం దృఢంగా ఉంటోంది. అమెరికా వంటి దేశాలలో హిందూ ఆలయాలు, సంస్థలు హిందువు లకు సంబంధించిన విషయాలకు సంబంధించి తీర్మానాలు ప్రతిపాదిస్తున్నారు. ఓ వంక హిందుత్వంపై జరిగే, విద్యాపరమైన సదస్సులు, సమ్మేళనాలలో సంఘ్‌ ‌కారణంగా హిందూ సమాజం దూకుడు చూపుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవంక, బర్మింగ్‌హామ్‌, ‌లీసెస్టర్‌లలో సంఘ్‌ ‌పేరున హిందువులపై దాడులు జరుగుతున్న ఉదాహరణ లున్నాయి. ఈ అవగాహనను పూర్వపక్షం చేసేందుకు సంఘ్‌ ఏమైనా ఆలోచన చేస్తోందా? ప్రపంచ స్థాయిలో హిందువుల మానవ హక్కుల గురించి, హిందు ఫోబియా గురించిన అలోచన ఉందా?

హిందువుల గురించి అనేక మంది మాట్లాడు తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మేముగా ఒక వేదికను ఏర్పాటు చేసే అలోచన ఏదీ లేదు. ప్రస్తుతమున్న సంస్థలు, వేదికలకు మరింత బలాన్ని సమకూర్చాలనేది మా ఆలోచన. హిందూ సమాజం జాగృతం అవుతున్న నేపథ్యంలో మనం ఈ ఘర్షణాత్మక మార్గం ద్వారా కూడా వెళ్లవలసి ఉంటుంది. మా ఎదుగుదలవలన ఎవరి స్వార్ధ ప్రయోజనాలు అయితే దెబ్బతింటున్నాయో వారే ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అదే సమయంలో దాడులకు దిగుతున్నారు. అయితే ఇప్పడు హిందువులు మేల్కొంటున్నారు. సరైన రీతిలో సమాధానం ఇస్తున్నారు.

అయితే, హిందువులు ఏ మార్గం ఎంచుకున్నా, అందరినీ కలుపుకుని వెళతారు. హిందూ సమాజం పై దాడులకు సంబంధించి, ఈ దాడులను వ్యతిరేకించే వారందరికీ, గ్లోబల్‌ ‌హిందూ సొసైటీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. సంఘ్‌ అలాంటి పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగకుండా, కాలక్రమంలో మరింత పెరగకుండా చూస్తుంది. అవగాహన పెంచే విషయానికి వస్తే, మేము ఇందుకు సంబంధించి ఏదో ఒకటి చేయవలసి ఉంది. ఈ అవగాహన భావన అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, భారత్‌లో కూడా ఉంది. ఈ విషయంపై మేము ఇప్పటికే దృష్టిని కేంద్రీకరించాము. మీడియా సంభాషణలు పెంచాము. ప్రజలకు చేరువయ్యే అవుట్‌ ‌రీచ్‌ ‌చర్యలు మొదలయ్యాయి. ఇక ఇప్పడు వీటి విస్తరణ మిగిలుంది. కాలక్రమంలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు, సరైన సమయంలో, సరైన వ్యూహంతో చర్యలు తీసుకోవాలి. త్వరలోనే తీసుకుంటాము.

2025 నాటికి సంఘ్‌ ‌వందేళ్లు పూర్తి చేసు కుంటోంది.  ప్రపంచం మొత్తం ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనిస్తున్నది. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని సంఘ్‌ ‌ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన చేస్తోందా? అలాగే కొత్త ప్రతిజ్ఞ లేదా కొత్త కోణం చేర్చడం వంటివి ఏమైనా ఉంటాయా?

సంఘ్‌ ‌కార్యంలో అనేక దశలున్నాయి. ఇది కేవలం సహజ పురోగతి మాత్రమే. ప్రపంచం దీనిని ప్రత్యేకంగా చూస్తోంది. డాక్టర్‌జీ జీవించి ఉన్న కాలంలో 1940 వరకు అనేక ప్రయోగాలు చేసి, హిందూ సమాజ నిర్మాణ కార్య పద్ధతుల నిర్ణయం జరిగింది. డాక్టర్‌జీ వెళ్లిపోయారు. ఆ పద్దతిలో సంఘ్‌ ‌కార్యక్షేత్రం విస్తరించింది. దేశంలోని అనేక ప్రాంతాలకు సంఘ్‌ ‌కార్యక్రమాలు విస్తరించాయి. ముందు జిల్లా స్థాయి వరకు. ఆ తర్వాత ఆ కిందకు సంఘ్‌ ‌విస్తరించింది. ఇదంతా గురూజీ సమయంలో జరిగింది. అదే సమయంలో శిక్షణ పొందిన స్వయం సేవకులు విభిన్న క్షేత్రాలలో పనిచేయడం మొదలైంది. స్వయంసేవకులు ఏ క్షేత్రాన్ని వదిలివేయలేదు. బాలాసాహెబ్‌ ‌దేవరస్‌జీ రోజుల్లో సంఘ్‌ ‌విస్తరణ కార్యక్రమం మరింత ఊపందుకుంది. చురుగ్గా సాగింది. సంఘ్‌ ‌సమాజ ఆధారిత సంస్థగా రూపు దిద్దుకుంది. సామాజిక బాధ్యతలను స్వీకరించింది. ఫలితంగా రాజకీయరంగంలో కొంత ప్రగతి కనిపించింది. రజ్జు భయ్యా, సుదర్శన్‌ ‌జీ కాలంలో మనం ఈ ప్రగతిని స్పష్టంగా చూస్తాము. ఈ రోజున సమాజంతో సంఘ్‌ ‌బలమైన బంధాన్ని పెనవేసు కుంది. సహజ పరిణామ క్రమంలో సంఘ్‌ ‌విస్తరి స్తోంది. హిందూ సమాజంలో అవసరమైన పరివర్తన, సమన్వయం కోసం సంఘ్‌ ‌పనిచేస్తుంది. స్వయం సేవకులు, సమాజంలోని ఉన్నత ఆశయాలు కలిగిన నిజాయతీపరులతో కలసి ఈ కార్యాన్ని నిర్వర్తిస్తారు. కలసి పనిచేస్తారు. మన దేశాన్ని కీర్తి శిఖరాలకు చేరుస్తారు. ఇందుకోసంగా, వందేళ్లు పూర్తయ్యే సమయానికి, శాఖలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవలసి ఉంటుంది. స్వయంసేవకులు అందుకు అవరమైన ఏర్పాట్లు చూస్తారు.

ఈ కార్యక్రమాల అవసరాల కోసం మరింత మంది స్వయంసేవకులను సమీకరించవలసి ఉంటుంది. అలా చేయడం వలన వందేళ్లు పూర్తయిన తర్వాత, ఈ పునాదులపై నిర్మాణం కొనసాగించే స్థితిలో ఉంటారు. సంఘ్‌ ‌వ్యక్తి నిర్మాణ కార్యక్రమం కొనసాగిస్తుంది. వందేళ్లు చేరుకునే సమయానికి సంఘ్‌ను సర్వవ్యాపి చేయాలి.. అంతటకు విస్తరించాలి, సమాజంలోని అన్ని వర్గాలతో సంబంధాలు ఏర్పరచుకోవాలి, తద్వారా, ప్రజలు ఉత్తమ ఉదాహరణలను అనుసరించగలుగు తారు; బాలీవుడ్‌ ‌సినిమాలు, మీడియా, రాజకీయా లకు ఇప్పడు ఇస్తున్న అతి ప్రాధాన్యత తగ్గుతుంది. ప్రజలు వారి సామాజిక బాధ్యతలను గుర్తిస్తారు. సమాజం ఉన్నత వ్యక్తులతో, ఉదాత్త శక్తిగా నిలుస్తుంది. జాతీయ ప్రయోజనాలతో ముడిపడిన సామరస్యపూర్వక సత్సంబంధాలతో పనిచేయవలసి ఉంటుంది. ఇందుకు అవసరమైన శక్తి, సామర్ధ్యాలను, మేము 2025 వరకు సమకూకుర్చుకోవలసి వుంది. ఈ కార్యంలో మేము ఏమి సాధించగలమో, ఆ మేరకు మేము ముందకు సాగుతాం.. ముందడుగు వేస్తాం.

(అయిపోయింది)

అను: రాజనాల బాలకృష్ణ

About Author

By editor

Twitter
YOUTUBE