మాఘ బహుళ ఏకాదశి (ఫిబ్రవరి 16) గురూజీ జయంతి

‘కొద్దిరోజులలో జనాభా లెక్కల సేకరణ ఆరంభం కాబోతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇస్లాం మతస్థులు అబద్ధపు లెక్కలు ఇచ్చి తమ జనసంఖ్యను ఉన్నదాని కన్నా ఎక్కువగా నమోదు చేయించుకోవడం గతంలో చేశారు. కొద్ది సంవత్సరాల ముందు హిందువుల కన్నా తక్కువ సంఖ్యలో ముస్లింల జనాభా ఉండేది. ఏడేళ్ల తరువాత జరిగిన జనాభా సేకరణలో హిందువుల సంఖ్య తక్కువగా నమోదయింది. ఇలా ఎందుకు నమోదు అయిందంటే, జనాభా లెక్కలలో నమోదు పట్ల వారికి గల ఉపేక్ష వల్ల, అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి మన నాయకులు జనాభా లెక్కలను బహిష్కరించ మని పిలుపు ఇచ్చారు. అందువల్ల తమ పేర్లను, సంఖ్యను హిందువులు వ్రాయించుకోకుండా ఊరుకున్నారు. కాని మహమ్మదీయులు మాత్రం తమ ఇళ్లలో నలుగురు ఉంటే పద్నాలుగా మంది ఉన్నట్లుగా నమోదు చేయించుకుని తమ సంఖ్యను అధికం చేసుకున్నారు. వాళ్లకు ఇది సహజంగానే వీలు పడింది. ఎందుకంటే వేరు వేరు రంగుల బురఖాలు ధరించి వాళ్లలో పురుషులు కూడా ఆడపేర్లు పెట్టుకొని పది పది సార్లు వచ్చి పేర్లు వ్రాయించగలరు. అప్పుడు ప్రజలను ‘జాగ్రత్తగా ఉండండి’ అని మనం హెచ్చరించడం జరిగింది. పెద్ద పెద్ద గెడ్డాలు ఉన్నవాళ్లు కూడా బురఖాలు ధరించి ఆడవాళ్ల పేర్లతో వచ్చి దొంగపేర్లు వ్రాయించు కొంటూ పట్టుబడ్డారు. ఇది కట్టు కథ కాదు. జరిగిన వాస్తవం. ఆ విధంగానే మళ్లీ జరగవచ్చు. మనం జాగరూకులమై ఉండాలి.

జాగ్రత్త వహించవలసిన రెండవ విషయం – మనని మనం ‘హిందువులు’ అనే పేరుతో నమోదు చేయించుకోవాలి. వేరు వేరు సంప్రదాయాల, కొండజాతుల పేర్లతో జనాభా లెక్కలలోకి ఎక్కకూడదు. ఖాశీలు, జయంతీయులు, ఉఫనాలు, మికిరులు, నాగాలు ఎవరైనా సరే, అందరూ కూడా తమను హిందువులు అనే వ్రాయించండి. ఏ పంథాను, మతాన్ని, శాఖను అనుసరించే వారికైనా అందరికీ మూలధర్మం హిందుత్వమే. ఈ విధంగా చాలా జాగరూకులమై ఉండి మనం ఒక సంఘటిత రూపంలో నిలబడాలి.

నేను ఇటీవల బొంబాయి వెళ్లాను. అప్పుడు జైనులందరినీ జనాభా లెక్కలలో జైనులుగానే నమోదు చేయించుకోవలసిందని, హిందువులుగా వ్రాయించుకోవద్దని కోరుతూ ఒక లేఖ ప్రచురించ బడింది. హిందూ ధర్మంలో బ్రాహ్మణుల పెత్తనం వచ్చి కూర్చుంటుందని అందుకు కారణంగా వివరించబడింది. ఈ లేఖ విషయం ప్రచురించిన ఆ నాయకుడి దృష్టికి తెచ్చాను. ఆ జైన నాయకుడు నాతో ‘జైనులను హిందువులు అని చెప్పడానికి ప్రయత్నించేవారంతా నిజానికి సమాజమంతటికీ వినాశనం తెచ్చిపెట్టే మాటలు చెబుతున్నారు’ అని అన్నారు.

కాస్త ఎక్కువ తక్కువలో ఇటువంటి విభేదాలకు ప్రోద్బలమిచ్చే ప్రవృత్తులు హిందూ సమాజంలోని వేరు వేరు సాంప్రదాయాలలోను, ఉప సాంప్రదాయా లలోను కనిపిస్తున్నాయి. ఈ విశాల హిందూదేశంలో జైనులు, శిక్కులు, బౌద్ధులు, శైవులు, శాక్తేయులు, లింగాయతులు, వైష్ణవులు మొదలైన అనేక పంథాల అనుయాయులు ఉన్నారు. వారందరూ ఆయా పంథాలను, ప్రాంతీయ భేదాలను బట్టి వేరువేరయి పోతే మన జాతీయ జీవనం ఆపదలో పడుతుందన్న విషయాన్ని ఈ విభేదాలను సృష్టించేవారు గమనించటం లేదు.

భారతదేశపు జాతీయ జీవనం హిందూ జీవనం. ఈ వాస్తవాన్ని మరచిపోయి మనం చిన్న చిన్న వర్గాలుగా విడిపోయామంటే ఆ వర్గాలన్నీ కలిసి జాతీయ భావనను నిలబెట్టుకొనడంలో విఫలమౌ తాయి. అలా జరిగితే ఆ చిన్న చిన్న వర్గాల మధ్య క్రైస్తవ, ముస్లిం వర్గాలే పెద్ద వర్గాలైపోయి దేశ మంతటా తమ ఆధిపత్యాన్ని స్థాపించుకోగల స్థితికి వస్తారు.

కొత్తగా ఏర్పాటైన ఈ మేఘాలయ రాష్ట్రంలో కొండ ప్రాంతాలలోను, అటవీ ప్రాంతాలలోను నివసిస్తున్న మన బంధువులందరూ హిందువులమనే భావనతో ఒక్కటై తమ ఆధిపత్యాన్ని స్థాపించుకో వలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. హిందువులనే హిందువులకు వ్యతిరేకంగా నిలబెట్టి, మనలో విభజనలు కల్పించి, అసంఖ్యాకులైన క్రైస్తవులు కూడా తమ మాట చెల్లించుకునే పరిస్థితిని ఏర్పరచడానికి ఇంగ్లీషువారి కాలం నుంచీ జరుగుతున్న కుట్రను భగ్నంచేసి ఈ రాష్ట్రపు పగ్గాలను మీ చేతుల్లోకి తెచ్చుకోవలసిందని కోరుతున్నాను. ఈ పర్వత క్షేత్రంలో బుద్ధి నైపుణ్యం గలవారు, విశుద్ధ ప్రవర్తన గలవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు పగ్గాలను తమ చేతిలోకి తెచ్చుకునేందుకై ఒకటి కావాలి.

మనమంతా వేరు వేరు క్షేత్రాల నుంచి ఇక్కడకు ప్రతినిధులుగా వచ్చాం. పర్వత క్షేత్రాల నుంచి కూడా బుద్ధి సంపన్నులైన ప్రతినిధులు వచ్చారు. వివిధ రకాలుగా ధర్మజాగరణ కార్యక్రమాలను నిర్వహిస్తూ, సకల విధాల ప్రతికూల పరిస్థితులలోనూ ప్రజా హృదయాలలో విశుద్ధ హిందూ భావనను బలంగా నిలబెట్టి ఉంచగల శ్రేష్టులైన కార్యకర్తలు ఇక్కడకు వచ్చి ఉన్నారు. వీరందరి కృషి వల్ల ఈ క్షేత్రమంతటా ఏక సూత్రబద్ధత నిర్మాణమైతే, ప్రస్తుతం పూర్తిగా జటిలమై ఉన్న పరిస్థితిలో మార్పు తెచ్చి మనను ఇక్కడ ఒక శక్తి సంపన్నమైన సమాజంగా నిలబెట్టగలరు. ఆ హైందవేతర శక్తులు పరాభవం పొందక తప్పదు. ఈ ప్రాంతం భరతభూమిలో ఒక బలిష్ఠ భాగమై సగర్వంగా విరాజిల్లుతుంది.’

‘శ్రీ గురూజీ సమగ్ర గ్రంథావళి- దిశానిర్దేశనము-5’ నుంచి13

About Author

By editor

Twitter
YOUTUBE