– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ముఖ్య కార్యక్రమాలు విజయవంతం. ఆలోచనలు కలసివస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రచయితలు, క్రీడాకారులకు అవకాశాలు. 19, 20 తేదీల్లో ధనవ్యయం. కుటుంబ సభ్యులతో వైరం. దేవీస్తుతి మంచిది.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. కళాకారులు, వైద్యరంగం వారి ఆశలు నెరవేరతాయి. 21, 22 తేదీల్లో స్నేహితుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కుటుంబ సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
యత్నకార్యసిద్ధి. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ధార్మికవేత్తల ద్వారా మీ అనుమానాలు నివృత్తి చేసుకుంటారు. రుణదాతల ఒత్తిడులుండవు. భూములు, వాహనాలు కొంటారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలకు లాభాలు. ఉద్యోగ విధి నిర్వహణలో వివాదాలు తీరతాయి. 16, 17 తేదీలలో సోదరులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. కాలభైరవాష్టకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆస్తి వివాదాలు తీరతాయి. భూ, గృహయోగాలు. పోగొట్టుకున్న డాక్యుమెంట్లు తిరిగి పొందుతారు. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు. వైద్యులు, వ్యవసాయదారులకు అనూహ్యంగా కలసి వస్తుంది. 17,18 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుని ఆశ్చర్యపడతారు. ఉద్యోగాలలో మీ మాటకే విలువ పెరుగుతుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు విజయాలు సిద్ధిస్తాయి.18, 19 తేదీల్లో మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. గణేశాష్టకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిదానంగా పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. సోదరులతో విరోధాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. పెట్టుబడుల్లో తొందర వద్దు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. రాజకీయవేత్తలకు కొన్ని చిక్కులు. రచయితలు, క్రీడాకారులకు గందరగోళ పరిస్థితి. 19, 20 తేదీల్లో శుభవార్తలు. వాహన యోగం. ఆంజనేయ దండకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
భూవివాదాలు పరిష్కారం. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. వివాహ, ఉద్యోగయత్నాలలో ముందడుగు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు. రాజకీయవేత్తల కష్టం ఫలిస్తుంది. రచయితలు, వైద్యులకు గుర్తింపు. 21,22 తేదీల్లో బంధు విరోధాలు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయపరంగా ఇబ్బందులు తీరతాయి. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. దైవ దర్శనాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు. క్రీడాకారులు, వైద్యులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. 16, 17 తేదీల్లో శారీరక రుగ్మతలు, లేనిపోని ఖర్చులు. దూరప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయానికి ఇబ్బంది ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగుల ఆశయాలు నెరవేరుతాయి. రాజకీయవేత్తలకు విశేష గౌరవం. కళాకారులు, క్రీడాకారులకు కీర్తి దక్కుతుంది. 21, 22 తేదీల్లో వృథా ప్రయాస, మానసిక ఆందోళన, బంధువర్గంతో విభేదాలు. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. రాబడి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన విద్యావకాశాలు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగులు సహనంతో కొన్ని బాధ్యతలు చక్కదిద్దుతారు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలు, వ్యవసాయదారుల ఆశలు ఫలించే సమయం. 17,18 తేదీలలో బంధు విరోధాలు. ఖర్చులు. దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటాబయటా మీదే పైచేయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలకు లోటుండదు. ఉద్యోగులు సత్తా, ప్రతిభ చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు గుర్తింపు రాగలదు. రచయితలు, వైద్యులకు శుభవార్తలు. 19, 20 తేదీలలో ఆరోగ్య సమస్యలు, బంధువుల నుంచి ఒత్తిడులు. హయగ్రీవ స్తోత్రం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యయప్రయాసలు తీరతాయి. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు ఆహ్వానాలు. 20, 21 తేదీల్లో ధనప్రాప్తి. విందు వినోదాలు. దుర్గాదేవి స్తోత్రం పఠించండి.