– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలులో అవాంతరాలు. ఉద్యోగవర్గాలకు పనిఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త చికాకులు. రచయితలు, కళాకారులకు మానసిక అశాంతి. 13, 14 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. నవగ్రహ స్తోత్రం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కుటుంబంలో శుభకార్యాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. కార్యజయం. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన విద్యావకాశాలు. మీ ఖ్యాతి పెరుగుతుంది. వాహనసౌఖ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిభారం కాస్త తగ్గుతుంది. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలకు కొన్ని సమస్యలు తీరతాయి. 12, 13 తేదీల్లో వృథా ఖర్చులు. ఊహించని ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు నిదానిస్తాయి. వ్యాపారాలు లాభించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు ఒత్తిడులు. 11,12 తేదీల్లో శుభవర్తమానాలు. వాహనయోగం. కనకధారా స్తోత్రం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. నూతన ఉద్యోగ యత్నాలు సానుకూలం. వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో స్వల్ప అవాంతరాలు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులను బ్యాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళాకారులు, రచయితలకు ఒత్తిడులు తొలగుతాయి. 14, 15 తేదీల్లో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. అంగారక స్తోత్రం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వివాహాది వేడుకలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలు మెరుగుపడతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు గుర్తింపు. 9,10 తేదీల్లో అనారోగ్యం, దూరప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
రావలసిన సొమ్ము అందుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. దైవకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతారు. ఉద్యోగాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. 13,14 తేదీల్లో వివాదాలు. మానసిక ఆందోళన. హనుమాన్ ఛాలీసా పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణభారాలు తొలగుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరడంలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు కీలక సమాచారం అందుతుంది. 12, 13 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. బుధగ్రహ స్తోత్రం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
రాబడి పెరుగుతుంది. అంచనాలు నిజం కాగలవు. ఒక మర్చిపోలేని సంఘటన ఎదురుకావచ్చు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వర్గాలకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 10, 11 తేదీల్లో ప్రయాణాలు వాయిదా. శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. శివారాధన మంచిది.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆర్థిక వ్యవహారాలలో గందరగోళంగా ఉన్నా అవసరాలకు ఇబ్బంది ఉండదు. జీవిత భాగస్వామి సలహాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. 9,10 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. లక్ష్మీ స్తోత్రం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆర్థిక విషయాలు ఆశాజనకం. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యక్రమాలు నిర్వహణపై చర్చలు సాగిస్తారు. దేవాలయ దర్శనాలు. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు అవకాశాలు. 12, 13 తేదీల్లో శ్రమాధిక్యం. శారీరక రుగ్మతలు. గణేశాష్టకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
మొదట్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. 14, 15 తేదీల్లో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శివాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం ఆశాజనకం. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణాలు చురుగ్గా సాగుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్క రించుకుంటారు. నిలిచిపోయిన పనులు సైతం పూర్తిచేస్తారు. వ్యాపారులు విస్తరణలో అడుగు ముందుకేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రచయితలకు ఆహ్వానాలు అందుతాయి. 10,11 తేదీలలో శారీరక రుగ్మతలు. అనుకోని ప్రయాణాలు. కనకదుర్గాదేవి స్తోత్రం పఠించండి.