– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగస్తులకు ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు క్లిష్ట సమస్యలు తీరతాయి. 7, 8 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. శ్రీరామరక్షా స్తోత్రం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. స్వల్ప శారీరక రుగ్మతలు ఎదురైనా ఉపశమనం పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఊరటనిచ్చే సమాచారం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 2, 3 తేదీల్లో ఆస్తి వివాదాలు. బంధువులతో తగాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

వ్యతిరేకులు కూడా మీ పట్ల విధేయులుగా మారతారు. ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఆదరణ పెరుగుతుంది. 7, 8 తేదీల్లో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఎటువంటి సమస్య ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆస్తుల వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. నూతన విద్యావకాశాలు. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవేత్తలు, రచయితలకు సంతోషకరమైన సమాచారం. 5,6 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. దేవీ స్తోత్రం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తిచేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు కొన్ని సమస్యలు తీరతాయి. 3,4 తేదీల్లో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. గణేశాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. 3,4 తేదీలలో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. ఉద్యోగ, ఇంటి నిర్మాణ యత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగులకు విధుల్లో తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం. 4, 5 తేదీల్లో ధనవ్యయం. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆంజనేయ దండకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. భూవివాదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారుల లక్ష్యాలు నెరవేరతాయి. 6, 7 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. ప్రయాణాలు వాయిదా. లక్ష్మీనృసింహ స్తోత్రం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయం మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. భూములు, వాహనాలు కొంటారు. ఊహించని ఆహ్వానాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఒడిదుడుకులు తొలగుతాయి. 5,6 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. అంగారక స్తోత్రం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన విద్య, ఉద్యోగా వకాశాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 3, 4 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన. శారీరక రుగ్మతలు. కనకధారా స్తోత్రం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

సమస్యలెదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలలో కదలికలు ఉంటాయి. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. 6,7 తేదీల్లో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు. నవగ్రహ స్తోత్రం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

అనుకున్న కార్యక్రమాలను నిదానంగా పూర్తిచేస్తారు. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆదాయ, వ్యయాలు సమానం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు అందుతాయి. 4, 5 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. లక్ష్మీగణపతి స్తోత్రం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE