పురాతనమైన మన సంస్కృతి, నాగరికతలపై అంతులేకుండా కొనసాగుతున్న దాడులలో భారతదేశం తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నది. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మకంగా ప్రపంచంలోని వివిధ కేంద్రాల నుండి దాడులు జరుగుతున్నాయి. మన సామాజిక వ్యవస్థను ఒక దురన్యాయాల పుట్టగా చిత్రీకరించ డానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుట్రను బహిరంగపరిచే యత్నం 12 సంవత్సరాల వెనుక జరిగింది. దీతీవBreaking India: Western Intervention in Drevidian and Dalit Faultlines అనే ఒక మార్గదర్శక గ్రంథ•ం ఒక భావ విప్లవానికి దారి తీసింది. “Making India Forces” అనే పదం, దానితో పాటు ఆ గ్రంథం ఇచ్చిన ఆలోచనా చట్రం, పదజాలం ఆ భావ విప్లవంలో భాగం అయ్యాయి. గ్రామీణ పేదలను మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, మతం మార్చి భారతదేశపు సంస్కృతి నాగరికతలను సమూలంగా నాశనం చేసే లక్ష్యంతో దేశం బయటా, లోపలా జరుగుతున్న కుట్రను ఆ గ్రంథం తిరుగులేని సాక్ష్యాధారాలతో బయట పెట్టింది.
విచ్ఛినకరశక్తుల కుట్ర గురించిన పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్త శక్తులు, కొత్త కుయత్నాలు తెరమీదకు వచ్చాయి. గుణాత్మకంగా ఈ కొత్త శక్తులు పాత శక్తులకంటే భిన్నమైనవి. ‘బ్రేకింగ్ ఇండియా’ గ్రంథ రచయిత రాజీవ్ మల్హోత్రా ఇంకొక గ్రంథం ‘Snakes in the Ganga’ ప్రచురించారు. అప్పటి ‘బ్రేకింగ్ ఇండియా’ శక్తుల కంటే ‘బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ 2.0’ మరింత సమాచారాన్ని పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటి విచ్ఛిన్నకర శక్తులు మేధోపరమైన కుయత్నాలకు పాల్పడుతున్నాయి. వారి కార్యకలాపాల గురించి సునిశితమైన పరిశీలన, లోతైన పరిశోధన ఉంటేనే తప్ప కొత్త విద్రోహ శక్తుల కుట్రలను, కుయుక్తులను అర్థం చేసుకోలేం. రాజీవ్ మల్హోత్రా ఎంతో పరిశోధన చేసి, ఆ కీలక సమాచారాన్ని తన గ్రంథంలో ఇచ్చారు.
ఇక్కడి సమకాలీన సామాజిక ఘర్షణల వెనుక ఉన్న శక్తుల పాత్రను
ఈ గ్రంథం వెలుగులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి అవగాహన లేకపోతే 370వ అధికరణ రద్దు, పౌరసత్వ చట్ట సవరణలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల గురించి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల తిరుగుబాటుతో పాటుగా ఇటీవలి నుపూర్ శర్మ ఉదంతం, అగ్నిపథ్ పథకాల గురించి జరిగిన ఆందోళనల వెనుక ఉన్న దురుద్దేశాలను మనం అర్థం చేసుకోలేం.
‘Snakes in the Ganga’తో సిద్ధాంతపరమైన విషయాలను పొందుపరచి చర్చకు పెట్టారు. విమర్శనాత్మక జాతి సిద్ధాంతం (Crtical Race Theory)కు, మార్క్సిజంకు మధ్య ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ విమర్శనాత్మక జాతి సిద్ధాంతం లేక వోకిజం (Wokeism) భారతదేశ సామాజిక పరిస్థితులను విశ్లేషించే నూతన పత్రం అయింది. కులం కావచ్చు, ముస్లింల ఫిర్యాదులు కావచ్చు, కశ్మీర్ సమస్య, స్వలింగ సంపర్కుల ఉద్యమం, మత ఘర్షణలు, ప్రజారోగ్యం, జల విధానాలు, పర్యావరణం, విద్యావిధానాలు… ఇలా భారతదేశానికి సంబంధించిన ఏ సమస్య అయినా, విధానమైనా విశ్లేషించేందుకు, తీర్పు ప్రకటించటానికి వోకిజాన్ని విరివిగా వాడుతున్నారని తెలిసినవారు బహు కొద్దిమంది. విమర్శనాత్మక జాతి సిద్ధాంతం భారతదేశంలో ఏ విధంగా చొరబడిందో, సమీప భవిష్యత్తులో దాని విక్షేప మార్గం ఎలా ఉండబో తుందో ఈ గ్రంథ•ంలో లోతుగా చర్చించారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం కనుసన్నలలో, భాగస్వామ్యంతో ఈ మొత్తం పక్రియ జరుగుతున్నది. కొందరు నల్లజాతి మేధావులను, దళిత యువ మేధావులను ఒకచోటకు చేర్చటంలోనూ, వారికి మైత్రి కుదుర్చటంలోనూ, హార్వర్డ్ విశ్వవిద్యాలయా నిది ప్రధాన పాత్ర. విమర్శనాత్మక కుల సిద్ధాంతం (Crtical Caste Theory), విమర్శనాత్మక దళిత సిద్ధాంతం (Crtical Dalit Theory), విమర్శనాత్మక జాతి సిద్ధాంతం కోణాల నుండి వండివార్చి హార్వర్డ్ లోనూ ఇతర పేరెన్నిక గల విశ్వవిద్యాలయాలలో బోధనలు సాగుతున్నాయి. తద్భిన్నంగా ఉన్న సిద్ధాంతాలను, ఆలోచనా విధానాలను హార్వర్డ్ బోధిం చకపోగా, కనీసం చర్చకు గూడా అనుమతించటం లేదు.
నల్ల అమెరికన్లను దళితులతోనూ, తెల్ల అమెరి కన్లను బ్రాహ్మణులతోనూ సమానం చేసే కుయత్నాలు కిందటి దశాబ్దంలో ప్రారంభదశలో ఉన్నాయి. ఆ కుటిల ఉద్యమం ఇప్పుడు పూర్తిగా ఊపందుకొన్న వైనం గురించి రాజీవ్ వెలుగులోకి తెచ్చారు. బానిసత్వ రద్దు కోసం, పౌరహక్కుల కోసం నల్ల జాతీయులు చేపట్టిన మహోజ్జ్వల ఉద్యమానికి మనదేశంలో దళితుల ఉద్యమాలకు పొంతన లేక పోయినా, లేని సారూప్యాన్ని సృష్టించడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయ మేధావులు తలమునకలుగా ఉన్నారు. ‘బ్లాక్ హెరిటేజ్ మూమెంట్‌కు సమాం తరంగా ‘దళిత లైవ్స్ మాటర్స్’ మూమెంటును తీసుకు వచ్చారు. ‘బ్లాక్ పాంథర్స్ పార్టీ’ ఉన్నట్లుగానే ‘దళిత పాంథర్స్ ఆర్గనేజేషన్’ ఉంది. అదేవిధంగా అనేక సమాంతరాల మాయాబజార్‌ను సృష్టించే పనిలో హార్వర్డ్ మేధావులు ఉన్నారని ఈ గ్రంథంలో తెలిపారు.
అమెరికాలో రూపొందిన సిద్ధాంతాలను మన మేధావులు తగినంతగా పరిశీలించకుండానే ఆమోదించి ప్రవేశపెడతారు. విమర్శనాత్మక జాతి సిద్ధాంతం కోణం నుండి సిలికాన్ వ్యాలీలో కులగణన చేపట్టారు. ఆ సర్వేలో క్షణాలలో సేకరించిన సమాచారం ఆధారంగా, అగ్రకులాలకు చెందిన భారతీయులను జాతి వివక్షకు పాల్పడుతున్నారనే అభియోగం మోపి న్యాయస్థానాలకు ఈడ్చాలనే దురుద్దేశం దాగి ఉంది. ‘అత్యాచార సాహిత్యం’ను పెద్ద పెట్టున సేకరిస్తున్నారు. కృత్రిమ మేధ కలన గణితం (అల్గోరిథం) భారత వ్యతిరేక ప్రచారానికి అనువుగా ఉపయోగించుకోనున్నారని రాజీవ్ హెచ్చరిస్తున్నారు. భారతదేశం నుండి మేధో వలసల వల్ల అమెరికా ఎంతో ప్రయోజనం పొందగా, మన దేశం తీవ్రంగా నష్టపోతున్నది. అయినప్పటికి భారత అత్యున్నత శాస్త్ర, సాంకేతిక, మేనేజ్‌మెంట్, గణిత విద్యాసంస్థల• కులతత్త్వాన్ని ప్రోత్సాహిస్తున్నాయని పెద్ద పెట్టున దుష్ప్రచారం సాగిస్తున్నారు. ప్రతిభకు పట్టం కట్టటం వలన బ్రాహ్మణ విద్యార్థులే ఎక్కువ మంది పేరెన్నికగన్న విద్యాసంస్థలలో చదువుకో గలుగుతున్నారని, అందువలన బ్రాహ్మణాధిక్యత పెరుగుతుందని విమర్శిస్తున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం భారతదేశ విభజన, అస్తిత్వ రాజకీయాలను పైపై స్థాయులకు తీసుకొని వెళుతున్నది. ఆంగ్లేయులు నాగరికతా మిషన్ పేరుతో భారతీయులను విభజించి నియంత్రించారు. మరో కొత్తరూపంలో ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం విభజన, అస్తిత్వ రాజకీయాలకు కావలసిన మేధో పరమైన వనరులను ఉచితంగా సమకూర్చిపెట్టి తమాషా చూస్తున్నది. సంస్కృతాన్ని ఒక అణచివేత భాషగా చిత్రీకరిస్త్తున్నారు. హిందూమతం ధ్వంసం చేయదగినదిగా పేర్కొంటూ, ఇస్లామ్ గురించి మాట్లాడకపోగా, ఎవరూ అడగకుండానే దానికి బాధిత అస్తిత్వాన్ని కల్పించారు. భారతీయ కుటుంబ వ్యవస్థ పితృస్వామ్యానికి, బ్రాహ్మణుల ఆధిపత్యానికి కారణం అవుతున్నదని నెపం మోపి, దానిని అణచి వేతకు మారుపేరైనా ఒక వ్యవస్థగా చిత్రీకరిస్తున్నారు. ఆర్ష గురు పరంపరలను కూడా వారు వదలలేదు. భారతదేశ సంస్కృతీ పునాదులను దెబ్బగొట్టే ప్రయత్న మిది. భారతదేశాన్ని, దేశ రాజ్యాంగాన్ని, పాలక పక్షాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అవి వారి పరిశో ధనా ప్రాజెక్టుల ఎజెండాలయ్యాయి. ప్రపంచంలో మరే ఇతర దేశ సామాజిక పరిస్థితులను అక్కడి మేధావులు విశ్లేషించటం లేదు. కేవలం భారతదేశం గురించే వారు పరిశోధనలు చేస్తున్నారు.
రాజీవ్ మల్హోత్రా విశేష పరిశోధనా ఫలితం ఈ గ్రంథం. ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలు హార్వర్డ్ విశ్వవిద్యాలయ రాజపోషకులుగా మారి, అది చేపట్టిన ప్రాజెక్టులకు విరివిగా విరాళాలు ఇచ్చారు. అంటే మన పారిశ్రామికవేత్తలు నిధులు ఇవ్వగా, మన యువ మేధావుల చేత మన దేశ వ్యతిరేక పరిశోధనలు చేయించి, హార్వర్డ్ విశ్వవిద్యాలయం విచ్ఛిన్నకరశక్తులను ప్రోత్సహిస్తున్నది.
ఇరవై మూడు అధ్యాయాలున్న ఈ గ్రంథంలో, మనకు ఇప్పటి వరకు తెలియని అనేక వివరాలు ఉన్నాయి. చివరకంటా చదివించటానికి వీలైన శైలిలో ఈ గ్రంథాన్ని రచించారు. ప్రతి సామాజిక కార్యకర్త తప్పక ఈ గ్రంథం చదవాలి. విచ్ఛిన్నకరశక్తుల కుట్రను అర్థం చేసుకోవటానికి, ఆ కుట్రను వమ్ము చేయటానికి కావలసిన ప్రతి ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి ఈ గ్రంథం స్ఫూర్తిని ఇస్తుంది.
– డా. బి. సారంగపాణి, 9440828487