– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

అనుకున్న రాబడి అందుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం. వ్యాపారులకు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు మరింత అనుకూలం. 26, 27 తేదీల్లో ఖర్చులు, అనారోగ్యం. గణేశ్‌ ‌స్తోత్రం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. వాక్చాతుర్యంతో అందర్నీ మెప్పిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. వైద్యులు, పరిశోధకులకు ఉత్సాహవంతమైన కాలం. 23, 24 తేదీల్లో స్వల్ప వివాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. శివాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

సమాజంలో పేరుప్రతిష్ఠలు పెంపొందుతాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవేత్తలకు విశేష గౌరవం. 24, 25 తేదీల్లో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. నవగ్రహ స్తోత్రం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆశించిన రాబడి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వైద్యులు, శాస్త్రవేత్తల కృషి ఫలిస్తుంది. 25, 26 తేదీల్లో స్నేహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. కనకధారా స్తోత్రం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

రాబడి ఆశాజనకం. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. కళాకారులు, రచయితలకు నూతనోత్సాహం. 26, 27 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆర్థిక విషయాల్లో పురోగతి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. గృహ, వాహన యోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవేత్తల దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. రచయితలు, క్రీడాకారులకు సన్మానాలు. 23, 24 తేదీల్లో ఆరోగ్య, కుటుంబ సమస్యలు. బంధువిరోధాలు. కనకధారా స్తోత్రం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కొద్దిపాటి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఎదురైనా క్రమేపీ అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు గుర్తింపు. రాజకీయవేత్తలకు అనుకూల సమాచారం. క్రీడాకారులు, వైద్యుల ఆలోచనలు కలసివస్తాయి. 25, 26 తేదీల్లో బంధువిరోధాలు. చికాకులు. విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభం. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రచయితలు, శాస్త్రవేత్తలు అనుకున్నది సాధిస్తారు. 25, 26 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. శివస్తుతి మంచిది.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు. సంతానరీత్యా కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారులకు స్వల్పలాభాలు. వ్యవసాయదారులు, క్రీడాకారుల యత్నాలలో అవాంతరాలు. 24, 25 తేదీల్లో ధనలబ్ధి. సమస్యల నుంచి ఉపశమనం. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

అప్రయత్న కార్యసిద్ధి. విద్యార్థులకు శుభవార్తలు. అదనపు రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు విశేష గుర్తింపు. రచయితలు, వైద్యుల సేవలకు తగిన గుర్తింపు రాగలదు. 27, 28 తేదీల్లో బంధువిరోధాలు. ప్రయాణాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహయోగం. చర్చలు ఫలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది. రాజకీయ వర్గాలకు అవకాశాలు అనూహ్యంగా దక్కుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు. 23, 24 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబ సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. పరపతి పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు గుర్తింపు. 26, 27 తేదీల్లో చికాకులు. దూర ప్రయాణాలు. దుర్గా స్తోత్రం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE