– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

పరపతి పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనలబ్ధి. విద్యార్థులకు అప్రయత్నంగా అవకాశాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులు విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. 28, 29 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. చికాకులు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్య కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. వాహన సౌఖ్యం. అదనపు ఆదాయం సమకూరే సమయం. వివాదాల నుంచి బయటపడతారు. ఇంటినిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రచయితలు, క్రీడాకారుల కృషి ఫలిస్తుంది. 31, 1 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

శుభవార్తలు. ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. దేవాలయాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు సానుకూలం. ఉద్యోగులు సత్తా చాటుకుంటారు. రాజకీయవేత్తలకు నూతన పదవులు. 26, 27 తేదీల్లో బంధువిరోధాలు. శ్రమ తప్పదు. అనారోగ్యం. దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆదాయం సంతృప్తినిస్తుంది. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. ఉద్యోగులు చిక్కులు అధిగమిస్తారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. కళాకారులు, క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. 28,29 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తుతించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుంటారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. రాబడి ఆశాజనకం. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి పోస్టులు దక్కవచ్చు. రచయితలు, క్రీడాకారులకు శుభవర్తమానాలు. 29, 30 తేదీల్ల్లో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. అంగారక స్తోత్రం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొన్ని వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పూర్వవైభవం. రాజకీయవేత్తలకు కొత్త పదవులు లభిస్తాయి. క్రీడాకారులు, వైద్యులకు కార్యసిద్ధి. 31, 1 తేదీల్లో అనారోగ్య సూచనలు. స్నేహితులతో తగాదాలు. ఆదిత్య హృదయం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

అదనపు ఆదాయం సమకూరి సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం. ఆస్తుల విషయంలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులు అవకాశాలు అందుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు. రాజకీయవేత్తలకు చిక్కులు వీడతాయి. కళాకారులు, రచయితలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. 26, 27 తేదీల్లో మానసిక అశాంతి. సోదరులతో కలహాలు. హయగ్రీవ స్తోత్రం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సంతోషకరంగా గడుస్తుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. రచయితలు, వైద్యులకు ఆహ్వానాలు అందుతాయి. 28, 29 తేదీల్లో అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. శ్రమ తప్పదు. విష్ణుధ్యానం చేయండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాల్లో అవరోధాలు అధిగమిస్తారు. విద్యార్థులు సత్తా నిరూపించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహన యోగం. వ్యాపారులు లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తల వివాదాలు పరిష్కారమవుతాయి. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు ఆశలు చిగురిస్తాయి. 31, 1 తేదీల్లో ఆరోగ్యం చికాకు పరుస్తుంది. కుటుంబంలో సమస్యలు. శ్రీరామ రక్షాస్తోత్రం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆదాయం ఆశాజనకం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విజయాలు సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వాహన సౌఖ్యం. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తుల చిరకాల ప్రయత్నం నెరవేరుతుంది. పారిశ్రామికవేత్తలకు అవార్డులు. రచయితలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. 30, 31 తేదీల్లో దూర ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆదాయానికి ఇబ్బందులుండవు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలపై సందిగ్ధత తొలగుతుంది. విద్యార్థుల ఆశలు తీరే సమయం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. కళాకారులకు అవకాశాలు దక్కుతాయి. క్రీడాకారులు, వైద్యులకు పురస్కారాలు. 30,31 తేదీల్లో వివాదాలు. మానసిక ఆందోళన. శివాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

అదనపు ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. మీ ఆలోచనలు అందర్నీ మెప్పిస్తాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు పైస్థాయి పోస్టులు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ ఆహ్వానాలు రాగలవు. 27, 28 తేదీల్లో అనారోగ్యం. కుటుంబ సభ్యులతో తగాదాలు. గణేశాష్టకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE