– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగుల హోదాలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు సంతోషంగా గడుపుతారు. రచయితలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 22, 23 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువిరోదాలు. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. ముఖ్య సమాచారం అందుతుంది. కళాకారులు శ్రమానంతరం ఫలితం దక్కించుకుంటారు. వ్యవసాయదారులు, క్రీడాకారులకు శుభవార్తలు. 24, 25 తేదీల్లో దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఇతరులకు సలహాల విషయంలో నిదానం పాటించండి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారులు పుంజుకుంటారు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రచయితలు, వ్యవసాయదారుల ఆశలు ఫలిస్తాయి. 19, 20 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. దేవీస్తోత్రం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చేపట్టిన పనులు విజయవంతం. రాబడి మెరుగు పడుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులు క్రమేపీ వృద్ధి చెందుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తగ్గుతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. కళాకారులు, రచయితల యత్నాలు కొలిక్కివస్తాయి. 22, 23 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొన్ని వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులు లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులు సంతోషకర సమాచారం అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీపర్యటనలు. క్రీడాకారులు, వైద్యులకు మెరుగైన పరిస్థితులు ఉంటాయి. 23, 24 తేదీల్లో ఖర్చులు అధికం. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆదిత్య హృదయం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
శ్రమ పెరుగుతుంది. భూవివాదాలు నెలకొంటాయి. తొందరపాటు వద్దు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారులకు మరింత నిదానం అవసరం. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. కళాకారులు, వ్యవసాయ దారులకు చిక్కులు తొలగుతాయి. 22, 23 తేదీల్లో విందువినోదాలు. వాహన యోగం. ఆహ్వానాలు అందుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆస్తి సమస్యలు తీరి లబ్ధి పొందుతారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. గృహం, విలువైన వస్తువులు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారుల విస్తరణ కార్యక్రమాలు సఫలం. ఉద్యోగులకు మరింత ప్రగతి ఉంటుంది. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారుల యత్నాలు ఫలిస్తాయి. 24, 25 తేదీల్లో ఖర్చులు. స్నేహితులతో వివాదాలు. కనకధారా స్తోత్రం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
రాబడి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారులకు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. పారిశ్రామికవేత్తలు సత్తా చాటుకుంటారు. క్రీడాకారులు, వైద్యులకు ఆహ్వనాలు. 20,21 తేదీల్లో అనారోగ్యం. కుటుంబ సభ్యులతో విభేదాలు. దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
చేపట్టిన పనులు విజయవంతం. ఆదాయం అంచనాలకు తగినంతగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తీరతాయి. సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు విధుల్లో సమర్థతను చాటతారు. రచయితలు, క్రీడాకారులకు శుభవార్తలు. 24, 25 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. మానసిక ఆందోళన. రాఘవేంద్రస్వామి స్తోత్రం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆస్తుల వ్యవహారాలలో చికాకులు అధిగమిస్తారు. రాబడి మరింత దక్కవచ్చు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. కీలక సమాచారం అందుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు. వ్యాపారుకు లాభాలు. ఉద్యోగులకు పనిభారం నుండి విముక్తి. కళాకారులు, వైద్యులకు సన్మానాలు. 22, 23 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువిరోధాలు. ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం మీ అంచనాల మేరకు ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు. 20, 21 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. వృథా ఖర్చులు. గణేశాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
దూరప్రాంతాల నుండి శుభవార్తలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఎంతటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు. 19, 20 తేదీల్లో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.