– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

చేపట్టిన పనులు విజయవంతం. దేవాలయ దర్శనాలు. రాబడి పెరిగి అప్పులు తీరతాయి. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు. 7,8 తేదీలలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఖర్చులు అధికం. ఆదిత్య హృదయం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం ఆశించినంతగా సమకూరుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. చర, స్థిరాస్తుల వృద్ధి. విద్యార్థుల నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. గృహం, వాహనం కొంటారు. వ్యాపారులు చిక్కులు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు. 5,6 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. అంగారక స్తోత్రం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొత్త పనులు చేపడతారు. భూ, గృహ యోగాలు కలిగే సూచనలు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింత అనుకూల స్థితి. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి నుంచి ప్రశంసలు. కళాకారులకు అవార్డులు. పరిశోధకులు, క్రీడాకారులు సత్తా చాటతారు. 7,8 తేదీల్లో దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆదాయం అంతంత మాత్రమే. ముఖ్య కార్యక్రమాలు మొదట్లో మందగించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. దేవాలయాలు సందర్శిస్తారు. విలువైన సామగ్రి కొంటారు. వ్యాపారులు ఒడిదొడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు శుభవార్తలు. రచయితలు, మేధావులు సత్తా నిరూపించుకుంంటారు. అనుకోని ఖర్చులు. రాఘవేంద్ర స్తోత్రం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కష్టానికి తగిన ఫలితం. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. క్రీడాకారులు నైపుణ్యాన్ని చాటుకుంటారు. 5,6 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. విష్ణుసహస్రనామ పారాయణ పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆశించిన రాబడి సమకూరుతుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగినంతగా లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు. రచయితలు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు. 8, 9 తేదీల్లో ఆరోగ్య, కుటుంబ సమస్యలు. మానసిక అశాంతి. కనకదుర్గాదేవి స్తోత్రం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగుల హోదాలు పెరుగుతాయి. కళాకారులకు పురస్కారాలు, సన్మానాలు. సాంకేతిక నిపుణులు, రచయితలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 9, 10 తేదీల్లో ఖర్చులు. ఆస్తి వివాదాలు. గణేశాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

యత్నకార్యసిద్ధి. కుటుంబ సభ్యులతో వివాదాలు సద్దుమణిగి సఖ్యత ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వాహన యోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు విశేష గుర్తింపు. లక్ష్మీస్తుతి మంచిది.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

శుభవార్తా శ్రవణం. మీ ఆశయాలు, లక్ష్యాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రాగల అవకాశం. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. 5, 6 తేదీలలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. నవగ్రహ స్తోత్రం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఇళ్లు, వాహనాలు సమకూర్చుకుంటారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీయానం. 7, 8 తేదీలలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. దేవీఖడ్గమాల పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అనుకున్న పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. తొందరపాటు వద్దు. తరచూ ప్రయాణాలు సంభవం. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. దేవాలయాల సందర్శనం. పారిశ్రామిక వేత్తల విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. 6,7 తేదీల్లో శుభవార్తలు. వాహన యోగం. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త ఉద్యోగ యత్నాలు అనుకూం. మీ ఆశయాలు నెరవేరే సమయం. కుటుంబంలో శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు. పరిశోధకులు, క్రీడాకారులకు అరుదైన పురస్కారాలు దక్కవచ్చు. 9,10 తేదీలలో వివాదాలు. శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

About Author

By editor

Twitter
YOUTUBE