– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

నిరుద్యోగులకు అవకాశాలు. రాబడి సంతృప్తినిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. మీ ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు నైపుణ్యతను ప్రదర్శిస్తారు. 28,29 తేదీలలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక ఆందోళన. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహన, కుటుంబ సౌఖ్యం. పోటీ పరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. రచయితలు, కళాకారులకు ఊహించని అవార్డులు. 29, 30 తేదీల్లో వృథా ఖర్చులు. సోదరులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. నృసింహ స్తోత్రం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్య, ఉద్యోగా వకాశాలు. వాహనాలు కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు గుర్తింపు. 1, 2 తేదీల్లో విచిత్ర సంఘటనలు. దూర ప్రయాణాలు. నవగ్రహ స్తోత్రం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉన్నతస్థాయివారి ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూల పరిస్థితి. క్రీడాకారులు, పరిశోధకులు వివాదాల నుంచి బయటపడతారు. 3, 4, తేదీలలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అదనపు రాబడి సమకూరుతుంది. చేపట్టిన పనులు విజయవంతం. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. క్రీడాకారులు, పరిశోధకులు ప్రతిభ నిరూపించుకుంటారు. 29, 30 తేదీల్లో బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు. గణేశ్‌ ‌స్తోత్రం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

సొమ్ము సమకూరుతుంది. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. ఆస్తి విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపు. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ద్వారా సన్మానాలు. పరిశోధకులు, రచయితలు తమ ప్రజ్ఞాపాటవాలు చాటుకుంటారు. 28, 29 తేదీల్లో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు. కనకధారా స్తోత్రం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

సమస్యల్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రాబడి ఆశాజనకం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. క్రీడాకారులు ప్రతిభ నిరూపించుకుంటారు. 30, 1 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆదాయం తగ్గి అప్పులు చేయాల్సిన పరిస్థితి. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో చిక్కులు. ఉద్యోగులు మరింత శ్రమపడాల్సిన సమయం. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా. 2,3 తేదీల్లో శుభవార్తలు. ధనలబ్ధి. కుటుంబసౌఖ్యం. కనకదుర్గాదేవి స్తోత్రం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

రాబడి పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు. 3,4 తేదీలలో అనారోగ్యం. కుటుంబ సభ్యులతో వైరం. విష్ణుధ్యానం మంచిది.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు సన్మానాలు. పరిశోధకులు విశేష గుర్తింపు. 1, 2 తేదీల్లో అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. ఆశించినంత రాబడి పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఉద్యోగులు సత్తా చాటుకుంటారు. కళాకారులు, క్రీడాకారులు తమ ప్రతిభ చాటుకుంటారు. 30,1 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వ్యతిరేకులు కూడా మీకు మద్దతుగా నిలుస్తారు. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులు అనుకోని అవకాశాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విశేషంగా కలిసివస్తుంది. రచయితలకు శుభవార్తలు. 2, 3 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE