ఈ డిసెంబర్‌లో మరొక ఉత్సవం: ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో వక్తలు

భాగ్యనగర్‌ : ‌కేశవ మెమోరియల్‌ ‌కళాశాల (హైదరాబాద్‌)‌లో గత సంవత్సరం జరిగిన గోల్కొండ లిటరరీ ఫెస్టివల్‌ (‌జీఎల్‌ఎఫ్‌)‌తో చాలా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయనీ, ఇంకా ఎన్నో పరిశోధనలు చేసి నిజమైన చరిత్రను రాయవలసి ఉందనీ సాహిత్యోత్సవ కన్వీనర్‌ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2021 నవంబర్‌ 20-21 ‌తేదీలలో జరి గిన జీఎల్‌ఎఫ్‌ ‌వివరాలతో కూడిన ఒక ప్రత్యేక సంచికను అక్టోబర్‌ 26‌న కేశవ మెమోరియల్‌ ‌కాలేజీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జీఎల్‌ఎఫ్‌ ‌వేదికల మీద ఆవిష్కృతమైన పలు అంశాలను వక్తలు సమీక్షించారు. సమాచారభారతి అధ్యక్షులు గోపాల్‌రెడ్డి ప్రారంభోపన్యాసం ఇచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో మన చరిత్రను చాలా వరకు వక్రీకరించారని అన్నారు. ఇప్పటికైనా మన నిజమైన చరిత్ర సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గోపాల్‌రెడ్డి, కసిరెడ్డితో పాటు వేదికపై ఉన్న జి. వల్లీశ్వర్‌, అన్నదానం సుబ్రహ్మణ్యం, నడింపల్లి ఆయుష్‌ ‌పాల్గొన్నారు.

కర్మన్‌ఘాట్‌ ‌హనుమాన్‌ ‌దేవాలయంపై జరిపిన పరిశోధనల్లో కాకతీయ సామ్రాజ్యానికి చెందిన రుద్రదేవుడు ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు లభించాయని జిఎల్‌ఎఫ్‌ ‌కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రుద్రదేవుడు గోల్కొండ కోటను నిర్మించటంతో పాటు వినాయక (హుస్సేన్‌)‌సాగర్‌ ‌కట్ట నిర్మాణాన్ని ప్రారంభించాడని పేర్కొన్నారు. వరం గల్‌ ‌భద్రకాళి దేవాలయం మొదలైనవి రుద్రదేవుడు నిర్మించినట్లు తెలుస్తోందన్నారు. ప్రసిద్ధ మేడారం సమ్మక్క, సారక్కలు మాలిక్‌ ‌కాఫర్‌ ‌సైన్యంతో పోరాడి వీరమరణం పొందారని చరిత్ర చెబుతుందని, ఆ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోందని తెలిపారు.

కుతుబ్‌షాహీల కాలంలో మంత్రులు అక్కన్న, మాదన్నలు కాలువలు, జలాశయాలను చక్కగా నిర్మించిన సంగతి కె.వి.భూపాల్‌రావు పరిశోధనలో తేలిందని వెంక•రెడ్డి వివరించారు. భాగ్యనగరం పేర్ల మూలాలు, అక్కన్న, మాదన్నల దారుణ హత్యల గురించి ఓగేటి అచ్యుతరామ శాస్త్రి రచించారని తెలి పారు. అచ్యుతరామ శాస్త్రి పరిశోధనను కొనసాగిం చాలని కసిరెడ్డి సూచించారు. తానీషా కాలంలో ఛత్రపతి శివాజీ శ్రీశైలం వెళుతూ గోల్కొండ కోటలో బస చేశారని, ఆ సమయంలో శ్రీరామదాసును జైలులో ఉన్నాడని తెలిపారు. ‘యయాతి చరిత్ర’ అనే గ్రంథంలో ఆ కాలంలోని అనేక అంశాలను వివరించినట్లు తెలుస్తోందని అన్నారు.

అసఫ్‌ ‌జాహీలు 1724లో హైదరాబాద్‌గా కేంద్రంగా తమ పరిపాలన మొదలుపెట్టి 1948 వరకు కొనసాగారని కసిరెడ్డి తెలిపారు. ఈ సుదీర్ఘ పాలనలో హిందువులు అణచివేతకు గురయ్యారని పేర్కొన్నారు. 6వ నిజాం కాలంలో ఆయన ప్రధాన మంత్రి మహారాజా కిషన్‌ ‌ప్రసాద్‌ ‌కొంతవరకు హిందూ వారసత్వాన్ని పరిరక్షించే ప్రయత్నం చేశారని, కిషన్‌ ‌ప్రసాద్‌ ‌సలహాల మేరకు 6వ నిజాం కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఆ కాలంలో సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కొండ పత్రిక’ అనే తెలుగు పత్రికను ప్రారంభించారన్నారు. 7వ నిజాం ప్రధానమంత్రిగా ఉన్న మహారాజా కిషన్‌ ‌ప్రసాద్‌ను తొలగించి ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారని కసిరెడ్డి గుర్తు చేశారు. దక్షిణ భారతదేశం మధ్యలో పాకిస్తాన్‌ ‌తరహాలో ఉస్మానిస్తాన్‌ ఏర్పాటు చేయాలని 7వ నిజాం కలలు కన్నాడని, ఆ కలలను నాటి భారత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసి భారతదేశంలో హైదరాబాద్‌ ‌ప్రాంతాన్ని అంతర్భాగం చేసిందని గుర్తు చేశారు.

ప్రత్యేక సంచిక కన్వీనర్‌ ‌వల్లీశ్వర్‌ ‌మాట్లాడుతూ, నాటి ప్రజల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నందున ఈ సావనీర్‌కు ‘స్మరణీయులు’ అనే శీర్షిక పెట్టినట్లు తెలిపారు. సమాచార భారతి, ఇతిహాస సంకలన సమితి, ప్రజ్ఞాభారతి, సంస్కార భారతి వంటి అనేక సంస్థల కృషితో ఈ సావనీర్‌ను తయారు చేశామన్నారు. సావనీర్‌ ‌ముద్రణకు సహకరించిన ఎమెస్కో విజయ్‌కుమార్‌కు వల్లీశ్వర్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు.

 ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌లో జీఎల్‌ఎఫ్‌ ‌భాగం కావటం సంతోషంగా ఉందని ఇతిహాస సంకలన సమితి తరుపున పాల్గొన్న వేదుల నరసింహం అన్నారు. గత సంవత్సరం ఉత్సవం ఇచ్చిన అనుభవాల నుండి నేర్చుకుని భవిష్యత్తులో నిర్వహించబోయే జీఎల్‌ఎఫ్‌లో మరింత చురుగ్గా పాల్గొంటామని ఎం. రాజేష్‌ (‌ప్రజ్ఞాభారతి) తెలిపారు. జీఎల్‌ఎఫ్‌లో సంస్కార భారతిని భాగస్వామిని చేసినందుకు శివాజీ ధన్యవాదాలు తెలియచేశారు. అనేక సంస్థల సహకారంతో జీఎల్‌ఎఫ్‌ ‌ఘనవిజయం సాధించిందని ప్రధాన వక్తగా పాల్గొన్న డా।। అన్నదానం సుబ్రహ్మణ్యం అన్నారు. సాహిత్యం అనేది ఆయా సమయాల్లో ఉండే సామాజిక పరిస్థితులను, స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ ఉత్స వంతో మొదలైన సాహితీధార ఇలాగే కొనసాగాలని, అందుకు తగినట్టు భవిష్యత్తు కార్యాచరణ చేసు కోవాలని సూచించారు.

సాహిత్యానికి గొప్ప శక్తి ఉందని అది సమా జంలో అన్ని రంగాలను స్పృశిస్తూ గొప్ప సాహితీ వేత్తలను సమాజానికి పరిచయం చేయగలదని, వారి రచనలతో జాతీయ స్ఫూర్తి రగల్చడమే కాకుండా సమాజానికి దిశా నిర్దేశం చేయగలదని అన్నారు. ఈ ప్రత్యేక సంచిక సమాజానికి అవసరమైన దిశానిర్దేశం చేయడంలో కూడా సహాయపడుతుంద న్నారు. సంచికను విడుదల చేసిన వల్లీశ్వర్‌, ‌కసిరెడ్డి లను అన్నదానం సుబ్రహ్మణ్యం అభినందించారు.

క్షేత్ర ప్రచార ప్రముఖ్‌ ‌నడింపల్లి ఆయుష్‌ ‌మాట్లా డుతూ హిందూ చరిత్ర, సంస్కృతిని కించపరచడం, వక్రీకరించడం వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. కొన్ని ఎన్జీవోలు, మీడియా, విద్యాసంస్థల ద్వారా కొన్ని విభజన వ్యక్తులను హఠాత్తుగా వెలుగులోకి తీసుకు రావడం వెనుక అంతర్జాతీయ కుట్ర కనిపిస్తోందని తెలిపారు. ఇంటర్నెట్‌, ‌బ్లాగులు, వ్లాగ్‌లు, కాలమ్‌లు, మీమ్‌లు, షార్ట్ ‌వీడియోలు, ఫిల్మ్‌లు, స్కిట్‌లు మొదలైన వాటి ఆవిర్భావంతో ఈ రోజు కంటెంట్‌ ‌వివిధ ఫార్మాట్‌లలో రూపొందుతున్నదని అన్నారు. తాము నిజమైన చరిత్రలను వెలుగులోకి తీసుకొనే వచ్చే థీమ్‌ను తీసుకున్నామని, అందుకు జీఎల్‌ఎఫ్‌ ‌వేదిక అయిందని అన్నారు. ఇప్పుడు డిసెంబర్‌ 2022‌లో గోల్కొండ లిటరరీ ఫెస్టివల్‌ను నిర్వహించ డానికి చొరవ తీసుకున్నామని తెలిపారు. జరగబోయే కార్యక్రమం ప్రధానంగా హిందీ భాష కేంద్రంగా ఉంటుందని తెలిపారు.

నిజాంల కాలంలో హైదరాబాద్‌ ‌ప్రాంతానికి చెందిన పరిపాలన పర్షియన్‌, అరబిక్‌ ‌భాషలలో జరిగిందని, తాము పర్షియన్‌, అరబిక్‌ ‌భాషలలో ఉన్న అసలు పత్రాలపై కూడా పరిశోధన చేయాలని అనుకుంటున్నామని అన్నారు. 700 సంవత్సరాల దక్కన్‌ ‌చరిత్రను, పోరాటాన్ని వెలికి తీసి అక్కన్న మాదన్నలాంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందా లని అన్నారు. మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజుల చరిత్రను వెలుగులోకి తెచ్చారని, సమాజంలో వారిపట్ల అవగాహన కల్పించారని తెలిపారు. మరిచిపోయిన ఈ చరిత్రలను వెలుగులోకి తెచ్చేందుకు, సమాజంలో అవగాహన కలిగించే ఆలోచనను పెంపొందించడానికి సాహిత్య ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గోల్కొండ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ ‌బ్యూరో వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కల్యాణ్‌ ‌చక్రవర్తి ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

About Author

By editor

Twitter
YOUTUBE