జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

2022 ‌సంవత్సరానికి ఆరు రంగాలు… సాహిత్యం, శాంతి, రసాయన, భౌతిక, వైద్య, ఆర్థిక శాస్త్రాలలో నోబెల్‌ ‌పురస్కారాలను ప్రకటించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఈ బహుమతు లను ఈ ఏడాది డిసెంబర్‌ 10‌న ప్రదానం చేస్తారు. ఈ బహుమతుల ప్రకటన అక్టోబర్‌ 3‌వ తేదీన ప్రారంభమై 10వ తేదీ వరకు కొనసాగింది.

సాహిత్యం

ఫ్రాన్స్‌కు చెందిన కవయిత్రి అనీ ఎర్నాకు సాహిత్యంలో నోబెల్‌ ‌పురస్కారం లభించింది. అయితే ఈ రంగంలో బహుమతిని అందుకున్న అతి పిన్న వయస్కుడు రుడ్‌యార్డ్ ‌కిప్లింగ్‌ (41). 1907‌లో ఈ బహుమతికి ఎంపికయ్యారు. అదేవిధంగా ఈ బహుమతి గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడు డోరిస్‌ ‌లెస్సింగ్‌ (88). 2007‌లో ఈయనకు నోబెల్‌ ‌బహుమతి లభించింది. సాహిత్యంలో ఇప్పటి వరకు 15సార్లు ఈ బహుమతిని గెలుచుకొని ఫ్రాన్స్ అ‌గ్రస్థానంలో నిలవగా, 12 నోబెల్‌ ‌బహుమతులతో అమెరికా రెండవ స్థానంలో, గ్రేట్‌ ‌బ్రిటన్‌ 8 ‌బహుమతులతో తర్వాతి స్థానాన్ని ఆక్రమించిది. 1901లో సాహిత్యంలో మొట్టమొదటి నోబెల్‌ ‌బహుమతి గెలుచుకున్నది సుల్లే ప్రుథోమే. ఈయన ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వ్యాసకర్త.

Nobel Peace Prize 2022 winners: Who are the human rights activists in  Belarus, Russia and Ukraine? - World Newsశాంతి బహుమతి

మానవహక్కుల పరిరక్షణకు కొనసాగిస్తున్న పోరాటాలకు గుర్తింపుగా బెలారస్‌కు చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్‌ ‌బియాల్‌యాస్కీ (60), రష్యా మానవహక్కుల సంస్థ ‘మెమోరియల్‌’, ఉ‌క్రెయిన్‌ ‌సంస్థ ‘సెంటర్‌ ‌ఫర్‌ ‌సివిల్‌ ‌లిబర్టీస్‌’‌లకు సంయుక్తగా 2022 నోబెల్‌ ‌శాంతి బహుమతి లభించింది. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో రెండు దేశాకు చెందిన సంస్థలు ఈ బహుమతికి ఎంపిక కావడం విశేషం. వీరు సైనికచర్యలను నిరసిస్తూ మానవీయ విలువలు, న్యాయసూత్రాల రక్షణ కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారని, నార్వే నోబెల్‌ ‌కమిటీ ఛైర్మన్‌ ‌బెరిట్‌ ‌రీస్‌ ఆం‌డర్సన్‌ ‌ప్రశంసిస్తూ, ప్రస్తుతం జైల్లో ఉన్న అలెస్‌ ‌బియాన్‌ ‌యాస్కీని విడుదల చేయాలని బెలారస్‌ ‌ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలెన్‌ ‌బియన్‌యాస్కీ 1962 సెప్టెంబర్‌ 25‌వ తేదీన రష్యాలోని వెర్టిసిల్లాలో జన్మించినప్పటికీ తర్వాతి కాలంలో కుటుంబం బెలారస్‌కు వలస వెళ్లింది. విద్యాభ్యాసం తర్వాత కొంతకాలం ఉపాధ్యాయుడిగా, సైన్యంలో డ్రైవర్‌గా పనిచేశారు. 1980వ దశకం నుంచి ఆయన మానవహక్కుల ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. 1996లో వియన్నా హ్యూమన్‌ ‌రైట్స్ ‌సెంటర్‌ను స్థాపించారు. 2013లో హవెల్స్ ‌ఫర్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్ అవార్డు, 2020లో నోబెల్‌ ‌బహుమతికి ప్రత్యామ్నా యంగా భావించే ‘రైట్‌ ‌లైవ్లీహుడ్‌’ అవార్డును గెలుచుకున్నారు. పన్నులు ఎగవేశారన్న ఆరోపణపై బెలారస్‌ ‌పోలీసులు జూలై 14, 2021న నిర్బంధిం చారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.

ఉక్రెయిన్‌లోని కొందరు శాంతికాముకులు 2007లో ‘సెంటర్‌ ‌ఫర్‌ ‌సివిల్‌ ‌లిబర్టీస్‌’ ‌సంస్థను స్థాపించారు. మానవహక్కుల రక్షణ, ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఈసంస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది.

మెమోరియల్‌ ‌సంస్థ 1989 జనవరి 28న అప్పటి సోవియట్‌ ‌యూనియన్‌ ‌చివరి దశలో ఉన్న సమయంలో ఏర్పాటైంది. ప్రధానంగా ఇది న్యాయ సేవా సంస్థ. కమ్యూనిస్టు పాలకుల అణచివేత కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచింది. దీని ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. యాన్‌ ‌రచిన్‌స్కీ ఈ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 5‌న రష్యా ఈ సంస్థను మూసి వేసింది. అయినప్పటికీ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతుండటం విశేషం.

2 California scientists among 3 to share Nobel for chemistry - Los Angeles  Timesరసాయన శాస్త్రం

అమెరికా శాస్త్రవేత్తలు కరోలిన్‌ ‌బెర్టోజీ, బ్యారీ షార్ప్‌లెస్‌తో పాటు డెన్మార్క్‌కు చెందిన మోర్టన్‌ ‌మెల్డల్‌లకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్‌ ‌బహుమతి లభించింది. క్లిక్‌ ‌కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్‌ ‌కెమిస్ట్రీ అభివృద్ధి కోసం వీరు చేసిన కృషికి ఈ బహుమతికి ఎంపిక చేసినట్టు నోబెల్‌ ‌కమిటీ వెల్లడించింది. కాగా షార్ప్‌లెస్‌, ‌నోబెల్‌ ‌బహుమతిని అందుకోవడం ఇది రెండోసారి. 2001లో ఆయన రసాయన శాస్త్రంలో ఈ బహుమతిని గెలుచుకున్నారు. బిల్డింగ్‌ ‌బ్లాక్‌లుగా ఉండే అణువులు వేగంగా సమర్థవంతంగా అతుక్కు పోయే విధానాన్ని క్లిక్‌ ‌కెమిస్ట్రీ అంటారు. ఈవిధమైన క్రియాశీల రసాయన శాస్త్రానికి బ్యారీ షార్ప్‌లెస్‌, ‌మోర్టన్‌ ‌మెల్డర్‌లు గట్టి పునాది వేశారు. కరోలిన్‌ ‌బెర్టోజీ ఈ క్లిక్‌ ‌కెమిస్ట్రీని జీవుల్లో ఉపయోగించడం ప్రారంభించి, ఈ క్రియాశీలక రసాయన శాస్త్రాన్ని మరో కోణంలోకి తీసుకెళ్లారు.

Weirdness and wonder: Quantum entanglement work wins 2022 Nobel Prize for  Physicsభౌతికశాస్త్రం

అలెయిన్‌ ఆస్పెక్ట్, ‌జాన్‌ ఎఫ్‌. ‌క్లౌజర్‌, ఆం‌టోన్‌ ‌జెయిలింగర్‌లు ఈ సారి నోబెల్‌ ‌బహుమతిని సంయుక్తంగా గెలుచుకున్నారు. చిక్కబడ్డ ఫోటాన్‌లు బెల్‌ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ ‌సైన్స్‌కు సంబంధించి వీరికి ఈ పురస్కారం దక్కింది. వీరి కనుగొన్న ‘క్వాంటమ్‌ ‌టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్‌ ‌స్వీడిష్‌ అకాడమీ పేర్కొంది. అలెయిన్‌ ఆస్పెక్ట్ ‌ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త కాగా, జాన్‌ ఎఫ్‌.‌కౌజర్‌ అమెరికాకు చెందినవారు. ఇక ఆంటోన్‌ ‌జెయిలింగర్‌ ఆ‌స్ట్రియాకు చెందిన క్వాంటమ్‌ ‌భౌతిక శాస్త్రవేత్త. ఈ ముగ్గురి పరిశోధనా ఫలితాలు కొత్త సాంకేతికకు చక్కటి బాట వేశాయని నోబెల్‌ ‌కమిటీ ప్రకటించింది. 1901 నుంచి ఇప్పటివరకు భౌతిక శాస్త్రంలో 115 బహుమతులు ఇచ్చారు. అయితే ఇందులో మహిళలు నలుగురు మాత్రమే! వీరు వరుసగా మేడమ్‌ ‌క్యూరీ (1903), మారియా జియోపెర్ట్ ‌మయర్‌ (1963), ‌డొన్నా స్ట్రిక్‌ ‌ల్యాండ్‌ (2018), ఆం‌డ్రియా గెజ్‌ (2020). ‌వీరిలో మేడమ్‌ ‌క్యూరీ రెండు సార్లు నోబెల్‌ ‌బహుమతులు అందుకున్న తొలి మహిళ కూడా. ఈమె భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో ఈ బహుమతిని అందుకున్నారు.

Svante Paabo | Biography, Ancient DNA, Human Evolution, Nobel Prize, &  Facts | Britannicaవైద్యశాస్త్రం

ఏనాడో అంతరించిపోయిన ‘నియాండర్తల్‌’ ‌జాతి జన్యుక్రమాన్ని నమోదు చేయడంతోపాటు ఇప్పటివరకు అసలు గుర్తించని ప్రస్తుత మానవాళికి మరో బంధువు డెనిసోవన్‌ ‌జాతిని గుర్తించినందుకు ప్రొఫెసర్‌ ‌స్వాంటే పాబొ ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్‌ ‌బహుమతికి ఎంపికయ్యారు. 70వేల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో ప్రారంభమైన హోమోసెపియన్ల పరిణామంలో నియాడెర్తల్‌, ‌డెనిసోవన్‌ ‌జాతుల జన్యువులు చేరాయని, ఈ చేరిక ప్రభావం ఈ నాటికీ మనపై ఉన్నదని స్వాంటే పాబొ గుర్తించారు. వైరస్‌, ‌బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులకు రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరు మనలో చేరిన నియాడెర్తల్‌, ‌డెనిసోవన్‌ ‌జాతుల జన్యువులపై ఆధారపడి ఉన్నదని ఫాబో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈయన పరిశోధనల కారణంగా ‘పాలియో జీనోమిక్స్’ అనే కొత్త శాస్త్ర విభాగం ఉనికిలోకి వచ్చింది. హోమో సెపియన్లు, ఇతర మానవ జాతులను (హోమి యన్లు) వేరుచేసే జన్యువులను గుర్తించడం ఈ శాస్త్రం ఉద్దేశం. 1990లో జర్మనీలోని మ్యూనిచ్‌లో యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పురాతన డీఎన్‌ఏపై పరిశోధనలు జరిపిన ఫాబో, తర్వాత అత్యధిక సంఖ్యలో వుండే మైటో కాండ్రియాలపై పరిశోధనలు సాగించారు. ఎందుకంటే మైటో కాండ్రియన్‌లలో డీఎన్‌ఏలు అధికం. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని దాదాపు అసాధ్యమనుకున్న నియాండెర్తెల్‌ ‌జన్యుక్రమ నమోదును 2010లో పూర్తిచేశారు. ఆ విధంగా ఆయన నియాండెర్తెల్‌, ‌డెనిసోవన్స్ ‌జన్యువులను ఆధునిక మానవుడి జన్యువులతో సరిపోల్చి చూసి, రెండింటికి మధ్య తేడాలను వివరించే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారని నోబెల్‌ ‌కమిటీ ప్రశంసించింది. స్వాంటే పాబో తండ్రి సూనే బెర్గ్ ‌స్ట్రామ్‌ 1982‌లో వైద్య శాస్త్రంలో నోబెల్‌ ‌బహుమతి పొందడం గమనార్హం. ఫాబో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ ‌మ్యూనిక్‌లో మ్యాక్స్ ‌ప్లాంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‌ఫర్‌ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో పరిశోధనలు చేశారు.

Nobel Prize in Economics Winners Include Former Fed Chair Ben Bernanke - WSJఆర్థికశాస్త్రం

ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ ‌బహుమతి ఈ ఏడాది ముగ్గురు ప్రముఖ ఆర్థిక వేత్తలను వరించింది. వీరు బెన్‌ ఎస్‌. ‌బెర్నాన్‌కె, డబ్ల్యు, డగ్లస్‌ ‌డైమండ్‌, ‌ఫిలిప్‌ ‌హెచ్‌.‌డైబ్‌విగ్‌. ‌వీరు ముగ్గురూ అమెరికాకు చెందినవారే కావడం గమనార్హం. బ్యాకింగ్‌, ఆర్థిక రంగాల్లో పరిశోధనలకుగాను వీరికి ఈ బహుమతి లభించింది. బెన్‌ ఎస్‌. ‌బెర్నాన్‌కె, అమెరికాలోని వాషింగ్టన్‌ ‌డి.సి.కి చెందిన బ్రూకింగ్స్ ఇన్‌స్టి ట్యూషన్‌లో పనిచేస్తున్నారు. డగ్లస్‌ ‌డబ్ల్యు. డైమండ్‌, అమెరికాలోని చికాగో యూనివర్సిటీలో, ఫిలిప్‌ ‌హెచ్‌.‌డైబ్‌విగ్‌ అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ ‌యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం సమయంలో ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు నిర్వ హించాల్సిన పాత్రపై అందరిలో గొప్ప అవగాహన కలిగించారు. బ్యాంకులు కుప్పకూలిపోకుండా ఉండేందుకు వీరి పరిశోధనలు ఎంతగానో ఉపకరించాయి. దీనికి సంబంధించిన పరిశోధనలకు ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు అవసరమైన పునాదిని 1980ల్లోనే వేశారు. ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడం, మార్కెట్లను ఏవిధంగా నియంత్రించా లనే అంశంపై వీరు చేసిన విశ్లేషణలు ఆయా సమయాల్లో ఎంతగానో ఉపకరించాయి.

ఆర్థిక వ్యవస్థ పనిచేయాలంటే సేవింగ్స్‌ను పెట్టుబడులకు మరలించాలి. అయితే ఇక్కడ ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏమిటంటే… పొదు పరులు అనుకోని పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు తమ సొమ్మును తీసుకోవాలనుకుంటారు. అదే రుణగ్రహీతలు తాము తీసుకున్న రుణాలను, గడువు తీరకముందే చెల్లించడానికి ఇష్టపడరు. అందుకు తమపై వత్తిడి తీసుకురావడానికి అంగీకరించరు. అప్పుడు బ్యాంకులు ఇబ్బందుల్లో పడతాయి. దీనినుంచి బయడపడాలంటే బ్యాంకులు ఎక్కువ మంది నుంచి పొదుపులను అంగీకరించడం ద్వారా పొదుపరులు అవసరమైనప్పుడు తమ సొమ్మును తీసుకునేందుకు వీలు కల్పించాలి. ఇదే సమయంలో రుణగ్రహీతలకు దీర్ఘకాలిక రుణాలను ఇవ్వాలి. ఈ రెండు విధానాల ద్వారా బ్యాంకులు మధ్యవర్తులుగా వ్యవహరించి దివాలా సమస్య నుంచి బయపడ వచ్చునని ఫిలిప్‌ ‌హెచ్‌.‌డైబ్‌విగ్‌, ‌డబ్ల్యు, డగ్లస్‌ ‌డైమండ్‌లు సిద్ధాంతీకరించారు. అయితే ఈ రెండు కార్యకలాపాలు సమాంతరంగా కొనసాగుతున్నప్పుడు మాత్రమే బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ పనిచేయగలదు. ఏవైనా పుకార్లు వ్యాపించినప్పుడు, పొదుపర్లు ఒకేసారి భయంతో పెద్దమొత్తంలో తమ ధనాన్ని బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుంటే బ్యాంకుల దివాలా తప్పదు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో ప్రభుత్వం, డిపాజిట్‌ ఇన్సూరెన్స్, ‌బ్యాంకులకు రుణాలు ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్‌ ‌వ్యవస్థను కాపాడవచ్చునన్నది వీరి సిద్ధాంతం.

ఇక బెన్‌ ‌బెర్నాన్‌కే 1930 నాటి గొప్ప సంక్షోభాన్ని విశ్లేషిస్తూ, సంక్షోభం తీవ్రస్థాయిలో చాలాకాలం పాటు కొనసాగినప్పుడు, బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ పనిచేయడం ఎంతటి కీలక అంశమో చక్కగా వివరించారు. బ్యాంకులు కుప్పకూలిపోతే, రుణగ్రహీతల సమాచారం కూడా అందుబాటులో ఉండదు. దీన్ని తిరిగి తయారుచేయడం చాలా శ్రమతో కూడిన పని. దీర్ఘకాలం పట్టవచ్చు. అంతేకాదు సమాజంలో పొదుపుచేసే శక్తి కూడా దారుణంగా పడిపోతుందని విశ్లేషించారు. ఈ ముగ్గురు ఆర్థిక వేత్తల విశ్లేషణ బ్యాంకులు సంక్షోభ సమయాల్లో బయటపడేందుకు ఎంతగానో ఉపకరించినందున నోబెల్‌ ‌బహుమతికి ఎంపిక చేసినట్టు కమిటీ వెల్లడించింది. ఆర్థికరంగంలో ఇప్పటివరకు నోబెల్‌ ‌బహుమతి అందుకున్నవారిలో పిన్న వయస్కులు ఇస్తెర్‌ ‌డుఫ్లో (46). ఈయన 2019లో ఈ బహుమతిని అందుకున్నారు.

నోబెల్‌ ‌బహుమతుల నేపథ్యం

 మానవాళికి అత్యంత ప్రయోజనం చేకూర్చే పరిశోధనలు చేసిన వారికి ఏటా నోబెల్‌ ‌బహుమతు లను ప్రకటిస్తారు. 1895లో ఆల్‌‌ఫ్రెడ్‌ ‌నోబెల్‌, ఈ ‌బహుమతులను మొత్తం ఐదు విభాగాల్లో ప్రకటించారు. తర్వాత కూడా ఆయన అభిమతం మేరకు, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఫిజియాలజీ లేదా మెడిసిన్‌ (‌వైద్యం), సాహిత్యం, శాంతి అనే విభాగాల్లో నోబెల్‌ ‌బహుమతులను ప్రకటిస్తూ వచ్చారు. అయితే తర్వాతి కాలంలో ఆల్‌‌ఫ్రెడ్‌ ‌నోబెల్‌ ‌జ్ఞాపకార్థం ఆర్థిక రంగంలో కూడా ఈ బహుమతిని ఇవ్వడం మొదలు పెట్టడంతో ప్రస్తుతం మొత్తం ఆరు విభాగాల్లో నోబెల్‌ ‌బహుమతులను అందజేస్తున్నారు. ఈ బహుమతులను ఆరు సంస్థలు అందజేస్తాయి.

–             సాహిత్యం – స్విడిష్‌ అకాడమీ

–            రసాయనశాస్త్రం- రాయల్‌ ‌స్విడిష్‌ అకాడమీ ఆఫ్‌ ‌సైన్స్

–             ‌శాంతి బహుమతి- నార్వేజియన్‌ ‌నోబెల్‌ ‌కమిటీ

–             ఫిజియాలజీ లేదా మెడిసిన్‌ (‌వైద్యం)- కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌

–             ‌భౌతికశాస్త్రం- రాయల్‌ ‌స్విడిష్‌ అకాడమీ ఆఫ్‌ ‌సైన్స్

–            ఆర్థికశాస్త్రం-స్విరింజెస్‌ ‌రిక్స్‌బ్యాంక్‌, ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌స్వీడన్‌

‌పతకాలు, కొన్ని నిజాలు

ఇప్పటివరకు మూడుసార్లు నోబెల్‌ ‌శాంతి బహుమతిని ఇంటర్నేషనల్‌ ‌రెడ్‌‌క్రాస్‌ ‌సంస్థ 1917, 1944, 1963 సంవత్సరాల్లో గెలుచుకుంది. అదేవిధంగా 1901లో మొట్టమొదటి శాంతి బహుమతిని అందుకున్నది ఐసీఆర్‌సీ వ్యవస్థాపకుడు హెన్రీ డాంట్‌. ఎవరితో షేర్‌ ‌చేసుకోకుండా రెండుసార్లు నోబెల్‌ ‌బహుమతులు గెలుచుకున్న మేధావి లినస్‌ ‌పౌలింగ్‌. ఆయన 1954లో రసాయనశాస్త్రంలో, 1963లో శాంతి బహుమతిని గెలుచుకున్నారు. 1974 నుంచి మరణానంతరం నోబెల్‌ ‌బహుమతులు ఇవ్వడం నిలిపేశారు. అయితే బహుమతి ప్రకటించిన తర్వాత మరణం సంభవిస్తే అందుకు మినహాయింపు ఉన్నది. 1974కు ముందు మరణించిన తర్వాత నోబెల్‌ ‌బహుమతిని కేవలం ఇద్దరికి మాత్రమే ప్రదానం చేశారు.

వారు డాగ్‌ ‌హమ్మర్‌స్క్‌జోల్డ్ (‌నోబెల్‌ ‌శాంతి బహుమతి-1961), ఎరిక్‌ ‌యాగ్జెల్‌ ‌కార్ల్‌ఫెల్డ్ (‌సాహిత్యంలో నోబెల్‌ ‌బహుమతి-1931). నోబెల్‌ ‌బహుమతి ప్రకటించిన తర్వాత మరణించింది రాల్ఫ్ ‌స్టెయిన్‌మాన్‌. 2011‌లో ఈయనకు వైద్యశాస్త్రంలో నోబెల్‌ ‌బహుమతి ప్రకటించడానికి మూడురోజుల ముందు మరణించారు. ఈవిషయం నోబెల్‌ ‌కమిటీకి తెలియకపోవడంతో ఆయనకు బహుమతి ప్రకటించింది. తర్వాత ఆయన మరణం విషయం తెలిసినప్పటికీ, నిబంధనల మేరకు ఆయన బహుమతిని రద్దు చేయలేదు.

నోబెల్‌ ‌పతకాలు

నోబెల్‌ ‌బహుమతి ప్రదానం సందర్భంగా విజేతలకు నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌డిప్లొమా, నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌మెడల్‌, ‌బహుమతి మొత్తానికి సంబంధించిన డాక్యుమెంట్‌ అం‌దజేస్తారు. నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌డిప్లొమాను స్విడిష్‌, ‌నార్వేజియన్‌ ‌కేలిగ్రాఫర్లు, ఆర్టిస్టులు అత్యంత నైపుణ్యంతో తయారు చేస్తారు.

నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌పతకాలను కూడా చేత్తోనే జాగ్రత్తగా 18 క్యారెట్ల రీసైకిల్డ్ ‌బంగారంతో రూపొందిస్తారు. భౌతిక, రసాయన, వైద్యశాసస్త్రాలు, సాహిత్యం రంగాల వారికి ఇచ్చే పతకాలు ఒకే మాదిరిగా ఆల్‌‌ఫ్రెడ్‌ ‌నోబెల్‌ ‌చిత్రం (1833-1896)తో ఉంటాయి. శాంతి, ఆర్థిక రంగాలకు ఇచ్చే పతకాలపై ఉండే ఆల్‌ ‌ఫ్రెడ్‌ ‌నోబెల్‌ ‌చిత్తరువు డిజైన్‌ ‌కొంచెం భిన్నంగా ఉంటుంది.

నోబెల్‌ ‌బహుమతి విజేతలు 10,00,000 స్వీడిష్‌ ‌క్రోనా మొత్తాన్ని (9లక్షల డాలర్లు అంటే రూ.7.35కోట్లు) బహుమానంగా అందుకుంటారు. మొట్టమొదటి నోబెల్‌ ‌బహుమాన ఉత్సవం 1901లో జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు 615 సార్లు ఈ బహుమానాన్ని ప్రకటించగా, 989 మంది వ్యక్తులు, సంస్థలు వీటిని గెలుచుకున్నారు. అయితే వీరిలో కొందరు రెండుసార్లు ఈ బహుమతిని అందుకోవడం వల్ల వ్యక్తుల సంఖ్య 954 సంస్థల సంఖ్య 27గా ఉంది.

ఉత్సవాలు

1901, డిసెంబర్‌ 10‌వ తేదీన మొట్టమొదటి సారి నోబెల్‌ ‌బహుమతులను స్టాక్‌ ‌హోమ్‌, ‌క్రిస్టియానియా (ప్రస్తుతం ఓస్లో)లో ప్రదానం చేశారు. 1901-25 మధ్యకాలంలో నోబెల్‌ ‌బహుమతులను స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ‌మ్యూజిక్‌లో అందజేశారు. 1926నుంచి కొన్ని మినహాయింపు లతో స్టాక్‌హోమ్‌లోని సంగీత కచేరీ హాలులో ఇవ్వడం మొదలుపెట్టారు. 1971లో ఫిలడెల్ఫియా చర్చిలో, 1972లో ఆల్‌వస్‌జోలోని సెయింట్‌ ఎరిక్‌ ఇం‌టర్నేషనల్‌ ‌ఫెయిర్‌ (‌ప్రస్తుతం దీన్ని స్టాక్‌హోమ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌ఫెయిర్స్ అని వ్యవహరిస్తున్నారు)లో, 1975లో సెయింట్‌ ఎరిక్స్ ఇం‌టర్నే షనల్‌ ‌ఫెయిర్‌లో, 1991లో స్టాక్‌హోమ్‌ ‌గ్లోబల్‌ ఎరినాలో ఈ బహుమతులను అందజేశారు. స్విడన్‌ ‌రాజు ఈ బహుమతులను అందజేస్తారు.

శాంతి బహుమతులు

1901-04 మధ్యకాలంలో నోబెల్‌ ‌శాంతి బహు మతిపై నిర్ణయాన్ని డిసెంబర్‌ 10‌వ తేదీన స్టోర్టింగ్‌లో జరిగిన సమావేశంలో ప్రకటించిన తర్వాత విజేతకు లిఖితపూర్వకంగా తెలిపేవారు. 1905-46 వరకు నోబెల్‌ ‌శాంతి బహుమతిని నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‌భవనంలో, 1947-89 మధ్య కాలంలో యూని వర్సిటీ ఆఫ్‌ ఓస్లో ఆడిటోరియంలో ప్రదానం చేసే వారు. 1990 నుంచి ఓస్లో సిటీహాల్‌లో ఇస్తున్నారు. ఈ శాంతి బహుమతుల ప్రదానం సందర్భంగా నార్వే రాజు సమక్షంలో నోబెల్‌ ‌కమిటీ ఛైర్మన్‌ ఈ ‌బహుమతిని విజేతలకు అందజేస్తారు.

About Author

By editor

Twitter
YOUTUBE