స్వతంత్ర భారత్‌ను మత రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది, బహుపరాక్‌ అం‌టూ గత కొన్ని దశాబ్దాలుగా ఆరెస్సెస్‌ ‌చేస్తున్న హెచ్చరిక వాస్తవమేనని తేలిపోయింది. ఆరెస్సెస్‌, ‌బీజేపీ, వీహెచ్‌పీలు చేస్తున్న ప్రచారం హిందూరాష్ట్ర కోసమేనన్న ప్రతిపక్షాల పిడివాదం ఇప్పుడు నోరెళ్లబెట్టింది. ఈ దేశంలో ముస్లిం ఛాందసవాదులు, మతోన్మాదం నెత్తికెక్కిన దేశద్రోహులు ఇప్పుడు బరితెగించి తమ భయానక ప్రణాళిక వాస్తవమేనని వీధులకెక్కి అరుస్తున్నారు. ఆ విధ్వంసక ప్రణాళిక సెక్యులరిస్టుల, ఉదారవాదుల, కమ్యూనిస్టుల, కాంగ్రెస్‌ ‌పంచనే జరిగిందని దేశానికి అర్ధమయ్యే క్షణాలు వచ్చాయి. 2006 నుంచి కేరళ కేంద్రంగా సాగుతున్న ఈ జిహాద్‌ అసలు ఉద్దేశం సెప్టెంబర్‌ 22‌వ తేదీతో పటాపంచలయింది. ఇంకొక మాటలో చెప్పాలంటే  2047 కల్లా ఇస్లామిక్‌ ‌రాజ్యంగా మార్చే అతిపెద్ద కుట్ర బయట పడింది.

గణతంత్ర దినోత్సవవేళ ఎర్రకోట మీద దాడి జరిగితే వినిపించిన పేరు పీఎఫ్‌ఐ. ‌రైతుల పేరుతో విద్రోహులు, ఖలిస్తానీవాదులు, ముస్లిం మతోన్మా దులు దేశ రాజధానిలో కల్లోలాలు సృష్టిస్తే దాని వెనుక వినిపించే పేరు కూడా అదే- పీఎఫ్‌ఐ. ‌వందల హత్య కేసులు.. ప్రతి రాష్ట్రం నుంచి పీఎఫ్‌ఐని నిషేధించమని విన్నపాలు… కశ్మీర్‌ ‌నుంచి కన్యాకు మారి వరకు కేన్సర్‌లా వ్యాపించినది పీఎఫ్‌ఐ. అదే పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా. దీని ప్రణాళిక ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవడానికి పెద్ద ప్రయత్నం అక్కరలేదు. లవ్‌ ‌జిహాద్‌లు ప్రోత్సహించి అమాయక ముస్లిమేతర యువతులను సిరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది. అక్కడ వారు ఉగ్రవాదులవు తారు. లేదంటే ఉగ్రవాదులకు సెక్స్ ‌బానిసలుగా మగ్గిపోతారు. ఇందుకు సంబంధించిన కేసులు కేరళలో ఎన్నో బయటపడ్డాయి. అంతేనా? అల్‌ ‌కాయిదా, లష్కర్‌ ఏ ‌తాయిబా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు ముస్లిం యువకులను సరఫరా చేస్తుంది. భారత్‌లో తమ ప్రణాళిక కోసం ఎక్కడ వీలైతే అక్కడ రక్తపాతం సృష్టించడానికి, విధ్వంసం సృష్టించడానికి రక్తపిపాసులను సిద్ధం చేసిపెట్టింది. నిజంగానే, మోదీ ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని పసిగట్టింది. కేరళలో ఒక పీఎఫ్‌ఐ ‌నాయకుడు బాహాటంగానే చెప్పాడు, ‘మీరు అర్ధరాత్రి దాడులు చేశారు. మాకు పది సెకన్లు అవకాశం దొరికితే ఆరెస్సెస్‌ను అంతమొందిస్తాం’ అని అన్నాడు.

ఇంత రక్త చరిత్ర ఉన్నా, నేర చరిత్ర ఉన్నా పీఎఫ్‌ఐని ఎందుకు నిషేధించరు? బీజేపీ అభిమాను లకు కూడా వచ్చిన ప్రశ్న ఇది. పాపం పండింది. సెప్టెంబర్‌ 22‌న వేకువన ఈ ముస్లిం మతోన్మాద సంస్థ పీచమడిచే క్షణం ఇప్పుడు వచ్చింది.   దేశ, విదేశాల్లోని ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి భారత్‌లో పథకం ప్రకారం అలజడులు సృష్టించడం, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చడం  ఆ సంస్థ లక్ష్యం. నిలువెల్లా హిందూ ద్వేషం. అడుగడు గునా భారత వ్యతిరేకత. అన్నట్టు ఇవేమీ కూడా ఆ సంస్థ దాచుకోవడం లేదన్నది దాచేస్తే దాగని సత్యం. ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ నాయకులతో పాటు ఇతర ప్రముఖులను హతమార్చేందుకూ ప్రణాళికలను రూపొందించింది. ఒకవర్గం పట్ల అంటూ మీడియా అఘోరిస్తున్న ఆ వ్యూహాత్మక దాపరికం హిందువుల గురించే. హిందువుల పట్ల ముస్లింలలో  విద్వేషం నింపడమే దాని పని. ఇందుకోసం విదేశాల నుంచి భారీగా నిధులను సమకూర్చుకుంటున్నది. కేంద్ర హోంశాఖకు అందిన సమాచారంతో తీగలాగితే డొంకంతా కదిలింది. ఇటీవల జాతీయ దర్యాప్తుసంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ) 15 రాష్ట్రాల్లోని 93 ప్రాంతాల్లో పీఎఫ్‌ఐ, ‌దాని అనుబంధ సంస్థల కార్యకర్తల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరిపి 109 మందిని అరెస్టు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పీఎఫ్‌ఐ ‌లింక్‌లు భారీగా బయట పడ్డాయి.ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇంత జరుగుతున్నా ఒక్క ప్రతిపక్షం కూడా పీఎఫ్‌ఐ ‌దౌష్ట్యం గురించి నోరు విప్పలేదు. ఆ విధంగా పీఎఫ్‌ఐ ‌మతోన్మాదానికి ఈ దేశంలోని బీజేపీయేతర పక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయనే చెప్పాలి.

ప్లాన్‌ 2047

‌పీఎఫ్‌ఐ ‌దుర్మార్గం గురించి కాస్త వివరించు కోవాలి. అప్పుడే దేశ చరిత్రలోనే అతి పెద్ద దాడి ఆంతర్యం అర్ధమవుతుంది. ‘ప్లాన్‌ 2047’.. ‌జాతీయ దర్యాప్తు సంస్థ, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ‌నిర్వహించిన దాడుల్లో లభించిన ఒక కీలక పత్రమిది. ముంబైలోని కుర్లాకు చెందిన పీఎఫ్‌ఐ ‌కార్యకర్త మజార్‌ ‌మసూద్‌ఖాన్‌ ఇం‌ట్లో ఈ పుస్తకం దొరికింది. అంటే స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవు తున్న నేపథ్యంలో జిహాద్‌ ‌ప్రకటించి, ఇస్లామిక్‌ ‌రాజ్యం స్థాపించాలనీ, షరియా చట్టం అమలు చేయా లనీ ఈ పుస్తకంలో ఉంది. ‘ఒక వర్గం’ మీద విద్వేషాన్ని నింపే ఘనకార్యం నిర్వర్తిస్తున్నందుకు అతనికి పీఎఫ్‌ఐ ‌నెలకు రూ.10,000 చెల్లిస్తోందని కూడా పోలీసులు గుర్తించారు. ఇదొక ఉదాహరణ మాత్రమే.

దేశప్రతిష్టను దిగజార్చడం కోసమే..

భారత్‌లో మత సామరస్యాన్ని నాశనం చేయడం, ప్రపంచం దృష్టిలో దేశప్రతిష్టను దిగజార్చడం, ఇక్కడ మైనారిటీలకు రక్షణ లేదని నమ్మించడం పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా లక్ష్యం. నేరాలకు, అల్లర్లకు పాల్పడే ముస్లింలకు సాయపడేందుకు న్యాయ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఏడాది పొడవునా బాబ్రీ దినం, గోద్రా అల్లర్లు, యూదులకు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు, ఎన్‌కౌంటర్లలో తీవ్రవాదులు మరణిస్తే నివాళులు అర్పించడం.. వంటివి ఈ సంస్థ కార్యకర్తలు చేస్తుంటారు.  సోషల్‌ ‌మీడియా ద్వారా హిందువులపై ద్వేషాన్ని రగిలిస్తోంది. ఎక్కడో జరిగిన అల్లర్లను ఇక్కడ జరిగినట్లు ప్రచారం చేస్తుంది. అస్సాంలో బోడోలపై బంగ్లాదేశ్‌ ‌చొరబాటుదార్లు దాడి చేస్తే, కర్ణాటకలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై దాడులు జరిగినట్లు పుకార్లు సృష్టించింది. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఉల్‌ ‌హుమాన్‌ ‌సయీద్‌ ‌మహమ్మద్‌ ‌మాల్దీవులలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ భారత వ్యతిరేక వాట్సప్‌ ‌గ్రూప్‌లకు అడ్మిన్‌గా వ్యవహరిస్తు న్నాడు. అంతేకాదు, ఇటీవల ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాల సందర్భంగా ‘సేవ్‌ ‌ది రిపబ్లిక్‌’ ‌పేరుతో ప్రచారం నిర్వహించి, దేశప్రతిష్టను దెబ్బతీయాలని పీఎఫ్‌ఐ ‌ప్రయత్నించింది. ఆర్టికల్‌ 370 ‌రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సీఏఏ, ట్రిపుల్‌ ‌తలాక్‌కు కూడా వ్యతిరేకంగా పీఎఫ్‌ఐ ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే.

పీఎఫ్‌ఐ ‌ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 80,000 మంది కార్యకర్తలతో పనిచేస్తున్నది. ఒక్క కేరళలోనే ఈ సంస్థ కార్యకర్తలపై 85 హత్యాయత్నం, 133 మతపరమైన కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. 1993 ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్‌ ‌మెమన్‌కు క్షమాభిక్ష పెట్టాలని పీఎఫ్‌ఐ ‌కోరింది. తమ పత్రికలో బిన్‌ ‌లాడెన్‌ను కీర్తించడం, తాలిబన్‌కు మద్దతు ఇవ్వడం చూడవచ్చు. రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితులతో పాటు, ముస్లిం ఖైదీలందరినీ విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేసింది. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్‌గురుకు మద్దతు నిచ్చింది. విద్వేష ప్రసంగాలు చేసే జకీర్‌నాయక్‌కి అనేక సందర్భాల్లో పీఎఫ్‌ఐ ‌సభ్యులు మద్దతుగా నిలిచారు. జగ్గీవాసుదేవ్‌-ఈశా ఫౌండేషన్‌ను, గోహత్య నిషేధాన్ని వ్యతిరేకించడంలోనూ పీఎఫ్‌ఐ ‌ముందుంటుంది. తమిళనాడులో అణువిద్యుత్‌ ‌కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ ఈ సంస్థ చురుకైన పాత్ర పోషించింది.


అం‌తా రక్తచరిత్రే

1977లో ఏర్పడిన స్టూడెంట్స్ ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (సిమి) లక్ష్యం భారత్‌ను ఇస్లామిక్‌ ‌దేశంగా మార్చడం. ఆ సంస్థ జిహాద్‌ను ప్రకటించింది. అనేక మత కలహాలు, హత్యల వెనుక సిమి హస్తం ఉంది. 9/11 దాడుల తర్వాత 2001లో భారత ప్రభుత్వం దీన్ని తీవ్రవాద సంస్థగా గుర్తించి నిషేధించింది. అయితే 2008, ఆగస్ట్‌లో ప్రత్యేక ట్రిబ్యునల్‌ ‌ద్వారా నిషేధాన్ని తొలగించారు. ఆ తర్వాత 2019 నుండి మరో ఐదేళ్ల పాటు సిమిపై నిషేధాన్ని భారత ప్రభుత్వం పొడిగించింది.

అలాంటి సిమి కొత్త రూపమే పీఎఫ్‌ఐ. ఇది మైనార్టీల హక్కుల కోసం పోరాడే సంస్థగా చెప్పుకుంటోంది. ఇంకా ఆశ్చర్యం. ఇది సాంస్కృతిక ముసుగు వేసుకుంది. ముస్లింలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత పేరుతో 2006లో కేరళ, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన మూడు సంస్థలు ఏకమయ్యాయి. కేరళ మలప్పురం జిల్లాలోని మంజెరీలో ఆ రాష్ట్రానికి చెందిన నేషనల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫ్రంట్‌, ‌తమిళనాడుకు చెందిన మనిద నీథి పాసారాయ్‌, ‌కర్ణాటకకు చెందిన ఫోరం ఫర్‌ ‌డిగ్నిటీలు విలీనమై పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ)‌గా అవతరించాయి. పైకి మైనార్టీల హక్కుల కోసమే.. అని చెబుతున్నా లవ్‌ ‌జిహాద్‌, ‌బలవంతపు మతమార్పిళ్లు, ఉగ్రవాద శిక్షణ వెనుక పీఎఫ్‌ఐ ఉం‌దనేది బహిరంగ రహస్యం. క్రమంగా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను ఆ సంస్థ విస్తరించింది. కేరళలో ఈ సంస్థ కార్యకలాపాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత అనంతరం 1993లో ఏర్పాటైన ఎన్‌డీఎఫ్‌తో పీఎఫ్‌ఐకి దగ్గరి సంబంధాలున్నాయి. 2002, 2003లో కేరళలో జరిగిన మతఘర్షణలు, వాటిలో ఇరు వర్గాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి నిషేధిత సిమి మాజీ నేతలతో ఏర్పాటైన ఎన్‌డీఎఫ్‌ ‌కారణమన్న వార్తలు వచ్చాయి. 2011లో మహమ్మద్‌ ‌ప్రవక్తపై కేరళలోని ఒక ప్రొఫెసర్‌ ‌ప్రశ్నపత్రంలో అనుచితమైన ప్రశ్న ఇచ్చాడని ఆరోపిస్తూ పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు ఆయన చేయి నరికారు. అదే రాష్ట్రంలో ఒక హత్య కేసులో పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలకు యావజ్జీవ శిక్ష పడింది. మొత్తం 30 హత్యల్లో పీఎఫ్‌ఐ ‌ప్రమేయం ఉన్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ రికార్డులు కూడా చెబుతున్నాయి. కర్ణాటకలో 2016లో ఆరెస్సెస్‌ ‌కార్యకర్తనూ, బజరంగ్‌దళ్‌ ‌కార్యకర్తనూ హతమార్చిన కేసుల్లోనూ, 2019లో తమిళనాడులో ఒకరిని హత్యచేసిన ఉదంతంలోనూ పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు అరెస్టయ్యారు. ఇటీవల కేరళలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌-‌బీజేపీ నేతల హత్యల కేసుల్లోనూ పీఎఫ్‌ఐ, ‌దాని అనుబంధ సంస్థల సభ్యులు అరెస్టయ్యారు. ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ ఎంపవర్‌ ఇం‌డియా ఫౌండేషన్‌ ‌ద్వారా తన లక్ష్య సాధనకు పీఎఫ్‌ఐ ‌కార్య కలాపాలు కొనసాగిస్తూనే ఉంది. 2012లో కేరళలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు పీఎఫ్‌ఐ అం‌టే సిమికి మరో రూపమని పేర్కొంటూ ఊమన్‌ ‌చాండీ ప్రభుత్వం అఫిడవిట్‌ ‌కూడా దాఖలు చేసింది. గత ఎనిమిదేళ్లలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్నో ఆందోళనల్ని పీఎఫ్‌ఐ ‌నడిపించింది.

ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పీఎఫ్‌ఐ ‌సభ్యులే అధికంగా పాల్గొన్నారు. పీఎఫ్‌ఐ ‌ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టకపోయినప్పటికీ దానికి అనుబంధంగా సోషల్‌ ‌డెమొక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా (ఎస్‌డీపీఐ) పేరుతో రాజకీయ పార్టీ ఉంది.

దక్షిణాదిన ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇవి తమ భావజాలం తీసుకువెళుతున్నాయి. కర్ణాటకలో ఉడుపి, దక్షిణ కన్నడ ప్రాంతంలోనూ ఎస్‌డీపీఐ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి రాజకీయ ఉనికిని చాటుకుంది.

__________________________________________________________________________________________________________________________________________________

విదేశాల్లోని మతోన్మాద శక్తులతో సంబంధాలు..

పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాకు ఇస్లామిక్‌ ‌స్టేట్‌, అల్‌-‌ఖైదా, జమాత్‌-ఏ-ఇస్లామీలతోనూ సంబంధాలున్నాయని కేరళ ప్రభుత్వ ఉపకార్యదర్శి ఆర్‌. ‌రాజశేఖరన్‌ ‌నాయర్‌ ఆ ‌రాష్ట్ర హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు. అంతేకాదు, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రాయిన్‌, ‌కువైట్‌, ‌ఖతార్‌, ఒమన్‌, ‌మాల్దీవులు, బంగ్లాదేశ్‌, ‌శ్రీలంక, టర్కీ, జర్మనీ, ఈజిప్టు, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని పలు మతఛాందస సంస్థలతోనూ పీఎఫ్‌ఐకి సంబంధాలున్నాయి. అక్కడి అనేకమంది రాజకీయ నేతల మద్దతు కూడగట్టుకుంటున్నది కూడా. భారత్‌ ‌నుండి మక్కా, మదీనా వెళ్లే హజ్‌ ‌యాత్రికులకు సహాయం పేరుతో తమ కార్యకలాపాలను దేశమంతా విస్తరించాలని చూస్తోంది. విదేశాల్లో స్థిరపడిన మనదేశ ముస్లింలను సేవా కార్యక్రమాల పేరుతో ఆహ్వానించి విద్రోహ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటోంది. ఇండియన్‌ ‌ప్రవాసీ కౌన్సిల్‌ ‌పేరుతో మలయాళీ ముస్లిం ప్రవాసులలో తీవ్రవాద భావజాలాన్ని విస్తరించే ఉద్దేశంతో పనిచేస్తోంది. పీఎఫ్‌ఐకి కశ్మీర్‌ ‌తీవ్రవాదులతోనూ సంబంధాలున్నాయి. ఆయుధాలు, మందుగుండు సామగ్రిలతో తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చే రహస్య యంత్రాంగం కూడా ఉంది. జూలై 2010, ఏప్రిల్‌ 2013‌లలో కన్నూర్‌లోని పీఎఫ్‌ఐ ‌కేంద్రాలపై  కేరళ పోలీసుల దాడుల్లో భారీగా ఆయుధాలు, కత్తులు, బాంబులు, బాంబుతయారీ సామగ్రి, విదేశీ నగదు లభించాయి. కోజికోడ్‌లో 2017లో జరిగిన పీఎఫ్‌ఐ ‌సమావేశాలకు నాటి భారత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ హాజరైనట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఇండియన్‌ ‌ముజాహిదీన్‌తోనూ..

పీఎఫ్‌ఐకి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్‌ ‌తెలిపారు.

ఇండియన్‌ ‌ముజాహిదీన్‌తో పీఎఫ్‌ఐకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ఉదయ్‌పూర్‌ ‌టైలర్‌, అమరావతిలో ఓ ఫార్మసిస్ట్ ‌హత్యలతో పీఎఫ్‌ఐకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఐపై నిషేధం విధించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మూడు నెలల క్రితమే వెలుగులోకి..

వాస్తవానికి పీఎఫ్‌ఐ ‌చట్ట వ్యతిరేక కార్యకలాపా లకు సంబంధించిన కీలక ఆధారాలను మూడు నెలల క్రితమే బిహార్‌లో పోలీసులు గుర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు ఈ సంస్థ పన్నిన కుట్రను దర్యాప్తు సంస్థలు ముందే పసిగట్టాయి. ఈ ఏడాది జూలై 12న ప్రధాని మోదీ బిహార్‌ ‌రాజధాని పట్నా పర్యటనకు కొన్ని గంటల ముందు మరో రెండు కుట్రలు బయటపడ్డాయి. నిషేధిత అతివాద సంస్థ స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ‌మూవ్‌ ‌మెంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (సిమి) కోసం పనిచేసిన వారితో ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేసేందుకు పీఎఫ్‌ఐ ‌ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆయుధాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, తమ వర్గంపై జరిగే దాడులకు ప్రతీకారం తీర్చు కునేందుకు ఆ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు పట్నాలోని ఫుల్వారీ షరీఫ్‌ ‌ప్రాంతంలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. రెండు వాట్సప్‌ ‌గ్రూప్‌ల్లో మెసేజ్‌లకు సంబంధించి ఈ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక గ్రూప్‌కు పాకిస్తాన్‌, ‌యెమెన్‌ ‌మరికొన్ని గల్ఫ్ ‌దేశాలతోనూ సంబంధాలున్నట్లు గుర్తించారు. మరో గ్రూప్‌లో భారత్‌, ‌పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌లకు చెందిన ఎనిమిది మంది సభ్యులున్నట్లు దర్యాప్తులో తేలింది.

అమిత్‌షా, ధోవల్‌ ‌పర్యవేక్షణలో..

పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ దాడులకు మూడు రోజుల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా కీలక భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌ధోవల్‌, ‌కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ ‌భల్లా, ఎన్‌ఐఏ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌దినకర్‌ ‌గుప్తా సహా పలువురు కీలక అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పీఎఫ్‌ఐ ‌కార్యకర్తలు, ఉగ్రవాద అనుమానితుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్‌ ‌షా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత అర్ధరాత్రి ఆకస్మాత్తుగా దాడులు ప్రారంభ మయ్యాయి. ఈ దాడులను సమన్వయ పరచేందుకు ఆరు కంట్రోల్‌ ‌రూమ్‌లను కూడా ఏర్పాటుచేశారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని చాలా ఎన్‌ఐఏ ‌బృందాలు తిరిగి తమ శాఖా కార్యాలయాలకు కూడా వచ్చేశాయి.

ఆపరేషన్‌ ఆక్టోపస్‌

‌దేశ ప్రజలు భావిస్తున్నట్టు కేంద్రం ప్రభుత్వం పీఎఫ్‌ఐ ‌పట్ల ఉదాసీనంగా లేదని దీనిని బట్టి అర్ధమవుతుంది. దాని కార్యకలాపాలపై ఎప్పటి నుంచో  జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌నిఘా పెట్టినాయి. చివరికి పాపం పండింది. సెప్టెంబర్‌ 22‌న ఆ సంస్థలు దేశవ్యాప్తంగా దాడులు చేపట్టాయి. ఇది దేశంలోనే అతి పెద్ద ఆపరేషన్‌. ‘ ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ‌పేరిట ఈ సోదాలు నిర్వహించారు. 200 మందికి పైగా ఎన్‌ఐఏ అధికారులు, ఇతర సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 109 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కేరళకు చెందిన పీఎఫ్‌ఐ ‌చైర్మన్‌ ఓఎంఐ ‌సలాం, పీఎఫ్‌ఐ ‌ఢిల్లీ చీఫ్‌ ‌పర్వేజ్‌ అహ్మద్‌, ‌పీఎఫ్‌ఐ ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ కోశాధికారి నదీం, మహ్మద్‌ ఇలియాస్‌, ‌షఫీఖ్‌ ‌కూడా ఉన్నారు. అత్యధికంగా కేరళలో 22 మందిని అరెస్టు చేయగా, మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20, తమిళనాడులో 10, ఉత్తరప్రదేశ్‌లో 8, తెలంగాణలో 4, ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.  దేశంలోని ఇంకా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి. తెలుగు రాష్ట్రాల్లోని నిజామాబాద్‌, ‌నెల్లూరులోనూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌, ‌ఘట్‌ ‌కేసర్‌లో పీఎఫ్‌ఐ ‌కార్యకర్తల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగాయి. చాంద్రాయణగుట్టలో పీఎఫ్‌ఐ ‌కార్యాలయాన్ని ఎన్‌ఐఏ ‌సీజ్‌ ‌చేసింది. గుంటూరులోని ఆటోనగర్‌, ‌కరీంనగర్‌లోని 8 ప్రాంతాల్లో, కర్నూలు లోని ఖడక్‌పురా వీధిలో తనిఖీలు చేపట్టారు. మైనారిటీల హక్కుల పేరుతో ఎంత దేశద్రోహం ఎంతగా విస్తరించిపోయిందో ఈ దాడులు, తదనంతర సంఘటనలు ఎలుగెత్తి చాటుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 40 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఎన్‌ఐఏ.. ‌నిజామాబాద్‌కు చెందిన సయ్యద్‌ ‌యాహియా సమీర్‌, ఆదిలాబాద్‌కు చెందిన ఫిరోజ్‌ఖాన్‌, ‌మేడ్చల్‌ ‌జిల్లా శామీర్‌పేటకు చెందిన మహ్మద్‌ ఒస్మాన్‌, ‌కరీంనగర్‌కు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌లను అరెస్ట్ ‌చేసింది. ఈ నలుగురి రిమాండ్‌ ‌నివేదికలో ఎన్‌ఐఏ ‌పలు కీలక అంశాల్ని ప్రస్తావిం చింది. విచారణ సందర్భంగా తొలుత తమకేమీ సంబంధం లేదని చెప్పిన నిందితులు దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ఆంధప్రదేశ్‌లో పీఎఫ్‌ఐ, ‌దాని అనుబంధ సంస్థలతో రిహాబ్‌ ఇం‌డియా ఫౌండేషన్‌, ‌సోషల్‌ ‌డెమొక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియాతో సంబంధాలున్న గుంటూరు చెందిన అబ్దుల్‌ ‌వహీదలీ, షేక్‌ ‌జఫ్రుల్లా, అబ్దుల్‌ ‌రహీం, రియాజ్‌ అహ్మద్‌ను, కర్నూలుకు చెందిన అబ్దుల్‌వారిస్‌ను అరెస్టుచేశారు.

కేరళలోని 50 ప్రాంతాల్లో పీఎఫ్‌ఐ ‌నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఐఏ ‌దాడులుచేసింది. మల్లప్పురం జిల్లా మంజేరిలోని పీఎఫ్‌ఐ ‌ఛైర్మన్‌ ఓఎంఐ ‌సలాం ఇంటితో సహా పలువురు కార్యకర్తల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. తమిళనాడులోని మధురై, తేనీ, దిండిగుల్‌, ‌రామనాథ పురం, కడలూరు, తిరునల్వేలీ, టెంకాసీ ప్రాంతాల్లో పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేశారు. కడలూరు పీఎఫ్‌ఐ అధినేత ప్యాజ్‌అహ్మద్‌, ‌మధురై జిల్లా కార్యదర్శి యాసర్‌ అరాఫత్‌లను విచారించారు. ఈ సోదాల్లో పీఎఫ్‌ఐ ‌సభ్యులు దేశవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమైంది.

సరైన ఆధారాలు

వీటి కోసమే భారత నిఘా సంస్థలు వేచి ఉన్నాయి. ఇప్పుడు సాధించాయి. ‘జిహాద్‌ ‌పేరిట ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతూ భారత్‌లో ఇస్లామిక్‌ ‌పాలనను తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, అరాచకం పెచ్చరిల్లేలా చేసే పథక రచనలు ఉన్న పత్రాలనూ స్వాధీనం చేసుకున్నాం’ అని కోర్టుకు ఎన్‌ఐఏ ‌తెలిపింది. సమాజంలో మతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే లక్ష్యంతో ముస్లిం యువతకు శిక్షణ శిబిరాలను పీఎఫ్‌ఐ ‌నిర్వ హిస్తోందని కూడా కోర్టుకు ఎన్‌ఐఏ ‌వివరించింది. ముస్లిం యువతను రెచ్చగొట్టి వారిని ఇస్లామిక్‌ ‌స్టేట్‌, ‌లష్కరే తోయిబా, అల్‌కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలలో చేరే విధంగా ప్రోత్సహిస్తోందని తెలిపింది.

కరాటే ముసుగులో ఉగ్రశిక్షణ

ఈ ఏడాది జూలైలో నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో విద్రోహ కుట్రను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. నిజామాబాద్‌లోని ఆటోనగర్‌లో సుమారు 200 మందికి దేశవ్యతిరేక భావజాలంపై పీఎఫ్‌ఐ ‌శిక్షణ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. శిక్షణ తీసుకున్నవారిలో 23 మంది కీలక వ్యక్తులున్నారు. తెలంగాణ లోని భైంసా, జగిత్యాల, కరీంనగర్‌, ‌హైదరాబాద్‌ ‌యువకులతోపాటు ఏపీలోని ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందినవారు కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్నట్టు సమాచారం. వీరందరికి జగిత్యాలకు చెందిన అబ్దుల్‌ ‌ఖాదర్‌ ‌మార్షల్‌ ఆర్టస్‌లో శిక్షణ ఇచ్చాడు. గతంలో గల్ఫ్ ‌వెళ్లి వచ్చిన ఖాదర్‌ 2017‌లో పీఎఫ్‌ఐలో చేరాడు. గత ఆరు నెలలుగా ఖాదర్‌ ‌తన ఇంటిపైనే పీఎఫ్‌ఐ ‌కార్యకలాపాలపై శిక్షణ ఇస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. శిక్షణ కోసం విదేశాల నుంచి భారీగా విరాళాలు వచ్చినట్టు విచారణలో వెల్లడైంది. శిక్షణ తీసుకున్న పీఎఫ్‌ఐ ‌సభ్యుల వద్ద మారణాయుధాలు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఖాదర్‌తో పాటు మహ్మద్‌ ఇ‌మ్రాన్‌, ‌మహ్మద్‌ అబ్దుల్‌ ‌మొబిన్‌,  ‌షేక్‌ ‌సాదుల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని కడపలో బేస్‌ ‌క్యాంపు ఏర్పాటు చేసుకుని పీఎఫ్‌ఐ ‌సభ్యులు కార్య కలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. నిజామాబాద్‌లో 2 నెలల్లో లీగల్‌ ‌వర్క్‌షాప్‌, ‌ఫిజికల్‌ ‌ట్రైనింగ్‌ ‌క్యాంప్‌ ‌తదితర కార్యక్రమాలు నిర్వహిం చారు. వీరికి భైంసా అల్లర్లు, జార్ఖండ్‌లో జరిగిన అల్లర్లతో సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక మతానికి చెందిన ప్రజలను హత్య చేసే లక్ష్యంతోనే నిజామాబాద్‌లో పీఎఫ్‌ఐకి చెందిన అబ్దుల్‌ఖాదర్‌ ‌తమ సభ్యులకు మార్షల్‌ ఆర్టస్‌లో శిక్షణ ఇచ్చాడని ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్‌ ‌నివేదికలో ఎన్‌ఐఏ ‌పేర్కొంది.  కీలక అవయవాలపై గురి చూసి దాడి చేయడంపై నిందితులు శిక్షణ ఇచ్చారని స్పష్టంచేసింది.

నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ ‌సాగిస్తున్న శిక్షణ కార్యకలాపాలు, కార్యాలయాల నిర్వహణకు నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయనే దానిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌కీలక సమాచారాన్ని రాబట్టింది. విదేశాల నుంచి రూ.160 కోట్ల మేర నిధులు పీఎఫ్‌ఐ ‌ప్రతినిధులైన కొంతమంది ఖాతాల్లోకి వచ్చినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. తెలంగాణలో అరెస్టయిన ఓ ముగ్గురి ఖాతాల్లోకి రూ.12 కోట్లకు పైగా బదలీ అయినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిని ఎన్‌ఐఏతో కలిసి ఈడీ విచారించింది. కేరళ, కర్ణాటక, రాజస్తాన్‌, ‌బిహార్‌ ‌తదితర రాష్ట్రాల్లోని 38 మంది ఖాతాల్లోకి కూడా కోట్ల రూపాయల విదేశీనిధులు జమ అయిన వ్యవహారం కూడా ఈడీ విచారణలో వెలుగు చూసింది. నిధులు అందించిన 600 మందికి పైగా బ్యాంకు ఖాతాలను ఈడీ నిలిపివేసింది.  పీఎఫ్‌ఐకి ఇంత పెద్దమొత్తంలో నిధులు పంపిన సంస్థలు ఏవి? అసలు ఆ సంస్థలు కానీ, ఆ వ్యక్తులకు గానీ పీఎఫ్‌ఐతో ఆర్థిక సంబంధాలేమిటనే దానిపై ఈడీ ఆరా తీస్తోంది. అబుదాబిలో ఉన్న దర్బార్‌ ‌హోటల్‌లో ఈ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ నిధులను ఏయే కార్యకలాపాలకు, ఎవరిపై కుట్ర చేసేందుకు ఉపయోగించారన్న అంశాలపై అటు జాతీయ దర్యాప్తు సంస్థ సైతం విచారణ వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.

విద్వేషం నింపుతోన్న తేజస్‌ ‌పత్రిక

దేశంలో ఒక వర్గం మీడియా బీజేపీ జాతీయ భావాలను వ్యతిరేకించే క్రమంలో పీఎఫ్‌ఐని అడ్డంగా భుజాన వేసుకున్న సంగతి జగద్విదితం. ఇది చాలక పీఎఫ్‌ఐ ‌తన భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు ‘తేజస్‌’ అనే మలయాళీ దినపత్రికను నడుపుతోంది. ఈ పత్రిక డైరెక్టర్‌, ‌పీఎఫ్‌ఐ ‌కేరళ నేత షఫిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ పత్రికకు కోజికోడ్‌ ‌ప్రధాన కార్యాలయంగా కేరళలో ఆరు ఎడిషన్‌లు ఉన్నాయి. దాదాపు 250 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది డిజిటల్‌ ‌రూపంలో అందుబాటులో ఉంది. ‘భారత్‌ను ఇస్లామిక్‌ ‌రాజ్యంగా మార్చిన తర్వాత.. పీఎఫ్‌ఐ ఇతర దేశాలపైనా దృష్టి పెడుతుంది’ అని ఆ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌, ‌పీఎఫ్‌ఐ ‌స్థాపక సభ్యుడు అహ్మద్‌ ‌షరీఫ్‌ అం‌దులో పేర్కొన్నాడు.

ఆరెస్సెస్‌, ‌బీజేపీ నేతలే లక్ష్యం

పీఎఫ్‌ఐ ‌కుట్రలన్నీ ఆరెస్సెస్‌, ‌బీజేపీ నేతల కేంద్రంగా రచించుకున్నవే. ఈ సంగతి మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ ‌స్క్వాడ్‌ ‌తెలిపింది. దసరా ఉత్సవాల్లో ఈ దాడులు చేసేందుకు పథకం వేశారు. పీఎఫ్‌ఐ ‌కుట్ర జాబితాలో నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ ‌ప్రధాన కార్యాలయం కూడా ఉంది. మహారాష్ట్రలో నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఆరెస్సెస్‌ ‌సీనియర్‌ ‌నేతలపై దాడులు చేసేందుకు వారి కదలికలపై దృష్టి సారించా రని, దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని అనేక కుట్రలు పన్నుతున్నారని పోలీసులు చెప్పారు. అంతేకాదు, పలు ప్రాంతాల్లోని ఆరెస్సెస్‌  ‌కార్యాల యాలపై పీఎఫ్‌ఐ ‌సభ్యులు రెక్కీ నిర్వహించడం కలకలం రేపుతోంది. పలు దర్యాప్తు సంస్థల అధికా రులు కూడా వీరి హిట్‌ ‌లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

పీఎఫ్‌ఐ ‌హింసాత్మక ఆందోళనలు

పీఎఫ్‌ఐ ‌కార్యాలయాల్లో సోదాలకు నిరసనగా కేరళలో సెప్టెంబర్‌ 23‌న ఆ సంస్థ సభ్యులు నిర్వహించిన హర్తాళ్‌ ‌హింసాత్మకంగా మారింది.  ముసుగులు ధరించిన పీఎఫ్‌ఐ ‌గూండాలు దుకాణాలపై దాడులు చేశారు.

ప్రయివేట్‌, ‌పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ప్రభుత్వ బస్సులు, కార్యాలయాలపై రాళ్లు రువ్వారు. అంబులెన్సులనూ వదల్లేదు. తిరువనంతపురం, కొల్లాం, వయనాడ్‌, అలపూడ, కొట్టాయం తదితర జిల్లాల్లో బలవంతంగా దుకాణాలను మూయించారు. నిరసనకారుల రాళ్ల దాడుల్లో సాధారణ పౌరులతో పాటు పోలీసులు కూడా గాయాల పాలయ్యారు. కన్నూర్‌లో వార్తా పత్రికలు తీసుకెళ్తోన్న ఓ వాహనంపైకి పెట్రోల్‌ ‌బాంబు విసిరారు. తమిళనాడులో గుర్తు తెలియని వ్యక్తులు భాజపా, హిందు మున్నానీ సభ్యులకు చెందిన కార్లను, ఆటోలను ధ్వంసం చేశారు. పీఎఫ్‌ఐ ‌కార్యకర్తల హింసాత్మక చర్యలను కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ముందస్తు అనుమతి లేకుండా బంద్‌లు, హర్తాళ్లకు పిలుపు ఇవ్వకూడదన్న న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘించడంపై మండిపడింది. కేసును సుమోటోగా తీసుకొని ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమించింది. కోర్టు తీర్పును ధిక్కరించిన పీఎఫ్‌ఐ ‌నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

———————————

అక్కసంతా ఆరెస్సెస్‌ ‌పైనే

సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ను తలపిస్తూ పీఎఫ్‌ఐ ‌కార్యాలయాల మీద జాతీయ దర్యాప్తు సంస్థ సెప్టెంబర్‌ 22‌న దాడులు నిర్వహించడంతోనే ముస్లిం ఛాందసవాదులకు స్వర్గధామంగా ఉన్న కేరళ, తమిళనాడు దారుణ విధ్వంసాన్ని చూశాయి. ఆ సంస్థ హిందూ ద్వేషం, భారతీయ వ్యతిరేకత, భారతదేశ సమగ్రత పట్ల నిబద్ధత కలిగిన సంస్థల పట్ల ఉన్న ఆగ్రహం దీనితో బయటపడినాయి. సెప్టెంబర్‌ 22 ‌నుంచి ఆరెస్సెస్‌, ‌బీజేపీలతో పాటు ఇతర హిందూ సంస్థలను ముస్లిం మతోన్మాదులు లక్ష్యంగా చేసుకున్నారు. నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ ‌ప్రధాన కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కేరళ, తమిళనాడులలో బీజేపీ, ఆరెస్సెస్‌ ‌కార్యాలయాల మీద, నాయకుల ఆస్తుల మీద కక్ష కట్టి మరీ దాడులు చేస్తున్నారు. మాల్తోవ్‌ ‌కాక్‌టెయిల్‌, ‌పెట్రోలు నింపిన చిన్న చిన్న సంచులు (పెట్రోలు బాంబులు) కార్యకర్తల వాహనాల మీద, ఇళ్ల మీద కూడా దాడులకు తెగబడుతున్నారు. కేరళలోని మట్టన్నూర్‌లో ఉన్న ఆరెస్సెస్‌ ‌కార్యాలయం మీద మతోన్మాదులు పెట్రోలు బాంబులు విసిరారు. కశ్మీర్‌లో తగ్గిన రాళ్ల దాడులను ఈ నేపథ్యంలోనే కేరళ ముస్లిం మతోన్మాదులు అందిపుచ్చుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు జరిగిన మరుక్షణమే కేరళ అంతటా రాళ్లదాడుల దుర్ఘటనలు జరిగాయి. పీఎఫ్‌ఐ ‌చట్టవిరుద్ధంగా ఇచ్చిన సమ్మెతో, ఆ సమయంలో చెలరేగిన విధ్వంసంతో పల్లిముక్కు, కొల్లాం జిల్లాలో పోలీసులు కూడా గాయపడ్డారు. ఇక చంపేస్తాం అంటూ ఆరెస్సెస్‌ ‌నేతలకు వస్తున్న బెదిరింపులకు లెక్కలేదు. కర్ణాటక ఆరెస్సెస్‌ ‌ప్రముఖుడు శశిధర్‌కు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. చిక్కమగళూరు జిల్లాకు చెందిన కొందరు దుండగులు ఈ మేరకు రాసి ఉన్న ఒక కాగిత్తాన్ని ఆయన కారులోనే పడేశారు.

తమిళనాడు, కేరళలలో ముస్లిం ఛాందస మూకలు రెచ్చిపోతున్నాయి. పీఎఫ్‌ఐ ‌మీద జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీల పెనుదాడి తరువాత ఒక్క తమిళనాడులోనే ఆరెస్సెస్‌, ‌బీజేపీ కార్యాలయాలను, ఆ సంస్థల నాయకుల ఆస్తులను ధ్వంసం చేసినట్టు చెప్పే 20 ఘటనలు జరిగాయి. ఈ అరాచకానికి సంబంధించి ఎస్‌డీపీఐ కార్యకర్తలు ఇద్దరు సహా, మొత్తం 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూర్‌, ఈరోడ్‌, ‌సేలం, రామనాథపురం, దిండిగల్‌, ‌కన్యాకుమారి, ఆఖరికి చెన్నై మహానగరంలో కూడా ఈ దాడులు జరిగాయని ది కమ్యూన్‌ అన్న పత్రిక కూడా నమోదు చేసింది. కోయంబత్తూర్‌లో కునియముత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న జిహాదీలు బీజేపీ నాయకుడు భరత్‌ ఇం‌టి మీద పెట్రోలు బాంబులు విసిరి, కారుని తగులబెట్టారు. మూలపాళయంలో బీజేపీ నాయకుడు దక్షిణామూర్తి నిర్వహించే ఫర్నిచర్‌ ‌దుకాణం మీద కూడా డీజిల్‌ ‌బాంబులు విసిరారు. బీజేపీ సానుభూతిపరుడిని కూడా వదిలిపెట్టలేదు. రామనాథపురంలో బీజేపీ సానుభూతిపరుడైన డాక్టర్‌ ‌కారు ఆసుపత్రి ప్రాంగణంలో ఉండగానే దగ్ధం చేశారు. బీజేపీ కార్యకర్త ఒకరు నడిపే బస్సు మీద కూడా తూత్తుకుడిలో పెట్రోలు బాంబు విసిరారు.

About Author

By editor

Twitter
YOUTUBE