జాగృతి వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచిక కోసం సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ వాకాటి పాండురంగారావు స్మారక ‘కథల పోటీ – 2022’ నిర్వహిస్తున్నాం.
రచయితలకు ఆహ్వానం..
ప్రథమ బహుమతి : రూ. 12000/-
ద్వితీయ బహుమతి : రూ. 7000/-
తృతీయ బహుమతి : రూ. 5000/-
- సమకాలీనం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంతో కూడిన కథలను పంపవచ్చు. భారతీయ సామాజిక జీవనమే నేపథ్యంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆంగ్ల పదాలను పరిహరించండి.
- ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఎనిమిది కథలకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహక బహుమతి, సాధారణ ప్రచురణకు స్వీకరించిన ప్రతి కథకు జాగృతి పారితోషికం ఉంటాయి.
- కథ నిడివి 1500 పదాలకు మించరాదు. ఒక రచయిత 3 కథలకు మించి పంపరాదు.
- కథ తన స్వంతమేనని, అనువాదం, అనుసరణ కాదని, బ్లాగుల్లోనూ, వెబ్ పత్రికల్లోనూ మరెక్కడా ప్రచురితం, ప్రసారం కాలేదని; పరిశీలనలో లేదని విడిగా హామీపత్రం జతచేయాలి. హామీపత్రంలో రచయిత పేరు, చిరునామా, ఇ`మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ తప్పక రాయండి. కథ రాసిన పుటలలో ఎక్కడా రచయిత పేరు గానీ, ఇతర వివరాలేవి ఉండరాదు.
- దీపావళి సంచిక నుంచి ఆరంభించి, వరుసగా ఈ కథలను ప్రచురిస్తాం.
- కథలను తెలుగులో అను లేదా యూనికోడ్ ఫాంట్‌లో డిటిపి చేసి [email protected] కు మెయిల్ చేయాలి. చేతి రాత అందంగా, న్యాయనిర్ణేతలకు అర్థమయ్యేలా ఉంటే స్కాన్ చేసి పంపినా పరవాలేదు. కొట్టివేతలు ఉన్నా, సరిగా స్కాన్ చేయకున్నా పోటీకి తీసుకోలేం.
- కథను పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలనుకుంటే ‘కథల పోటీ’ జాగృతి వారపత్రిక, 3-4-228/4/1, జాగృతి భవన్, కాచిగూడ, హైదరాబాద్`500027 కు పంపొచ్చు. జాగృతికి కథల్ని చేర్చే బాధ్యత రచయితలదే.
- కథల ఎంపికలో ఉత్తర, ప్రత్యుత్తరాలకు తావులేదు. సంపాదకునిదే అంతిమ నిర్ణయం.
కథలు జాగృతికి చేరడానికి చివరి తేది : 21 సెప్టెంబర్, 2022