‘విద్వేషం గెలిచింది. కళాకారుడు ఓడిపోయాడు’ ఇది మున్వర్‌ ‌ఫారూకి అనే ‘స్టాండప్‌ ‌కమేడియన్‌’ ఒక సందర్భంలో చెప్పిన మాట. విద్వేషం ఏమిటి? ఎవరి మీద? ఆ కళాకారుడి ఓటమి ఎలాంటిది?

‘నేను టీవీ తెర మీద ఓ రైలు కాలిపోవడం చూస్తున్నాను. మా నాన్న వచ్చి ఇలాంటి చెత్త చూడొద్దు అంటూ కట్టేసి వెళ్లిపోయాడు. ఎందుకు అన్నాను నేను. అది గోధ్రా కాండ అన్నారు నాన్న. అది చూపించినది న్యూస్‌ ‌చానల్‌ ‌కాబట్టి, అదంతా ఒక సినిమా అనుకున్నాను. అది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిర్మిస్తే, అమిత్‌ ‌షా దర్శకత్వం వహించి ఉంటారని అనుకు న్నాను. నిజమేమిటో నాకు తెలియదు’. 2020లో ఫారూకి ఇచ్చిన ఒక ప్రదర్శనలో వాగుడు ఇది. దీనికే  జోక్‌ అని పేరు పెట్టాడు కూడా. అంటే నవ్వుకోవ డానికి ఉపయోగపడే సంగతి. ఇలాంటి పాశవికా నందాన్ని జోకుల పేరుతో పేలితే ఊరుకోం, మా బెంగళూరు వస్తే కాళ్లు విరిచేస్తాం అని హెచ్చరికలు వచ్చాయి. ప్రదర్శన రద్దయింది. పాపం, డబ్బులు పోయాయన్న బాధ. అప్పుడే, ‘విద్వేషం గెలిచింది, కళాకారుడు ఓడిపోయాడు’ అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లించాడు ఫారూకి. గోధ్రా కాండలో హిందువులు  సజీవంగా దగ్ధమయ్యారని అంటు న్నారు కదా! ఏం వాళ్లని చనిపోయాకా దహనం చేయరా? అని కూడా మరొక ‘‘జోక్‌’’ ‌విసిరాడు ఫారూకి. ఇది హాస్యమా, మానసిక రోగమా? ఒక మతానికి చెందిన వారి శవాల మీద కూడా జోకులు వేస్తే ఏమనాలి? పైగా దీనికి కళ అని పేరు. ఇలాంటి కళాకారులను పోషించడం మా కర్తవ్యం అంటూ పెద్ద మనసు ప్రదర్శిస్తున్నారు కేటీఆర్‌ ‌వంటి మంత్రులు. మీకేం భయం లేదు మీ కళా ప్రతిభని ప్రదర్శించండి అని దగ్గర ఉండి మరీ ప్రదర్శనలు చేయిస్తున్నారు. 59 మంది కరసేవకులను అంత దారుణంగా దహనం చేస్తే కనీస మానవత్వం లేకుండా ఇలాంటి కారుకూతలు కూసి దానికి హాస్యమని పేరు పెడతారా? అందుకే మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వం నెల రోజులు జైలులో ఉంచింది. ఇతడు హిందువులనీ, హిందూ దేవతలనీ హాస్యం పేరుతో తూలనాడతాడు. సభకు వచ్చిన వెంగళప్పలు వెర్రినవ్వులు నవ్వుతారు. కళ ముసుగులో, వ్యంగ్యం ముసుగులో హిందూత్వను తూలనాడే ముస్లిం మతోన్మాది. మతోన్మాదం జీర్ణించుకున్న ఉన్మాది హాస్యం, వ్యంగ్యం పేరుతో  చేస్తున్న వెర్రి చేష్ట ఇది. వెరసి ఇదే స్టాండప్‌ ‌కామెడీ.

ఆగస్ట్ 21‌న ఫారూకి ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించారు. లోపల ఎంత హాస్యం పండించాడో ఎవరికీ తెలియదు కానీ, బయట మాత్రం విషాదం నింపాడు. ఈ పిచ్చివాడి ప్రదర్శనకి వేయి మంది పోలీసులు కాపలా కాశారు. సాయుధ పోలీసులతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి లోపల హాస్యం పండించే వెసులుబాటు కల్పించారు. బీజేపీ కార్యకర్తలని, నాయకులని ముందే అరెస్టు చేశారు. వాళ్ల మీద లాఠీచార్జి చేశారు. కొందరిని అక్కడ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ముందే నిర్బంధం లోకి తీసుకున్నారు. ఇసకవేస్తే రాలనంత ట్రాఫిక్‌ ఉం‌డే శిల్పకళావేదిక పరిసరాలలో ఈ వికృత విన్యాసం కోసం ఆంక్షలు పెట్టి జనాన్ని హింసించి ఆనందించారు. బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌వాహనంలో ఫారూకి వచ్చాడు. ఆ గంథొళిగాడి వాగుడు కోసం వందలు పోసి టిక్కెట్టు కొని వచ్చిన వాళ్లని లోపలకి వెళ్లే వాళ్లని నఖశిఖ పర్యంతం తనిఖీ చేసి పంపించారు. ప్రదర్శన ప్రారంభం కాగానే పోలీసులు గేట్లు మూసేశారు. ఎంతయినా టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కనుసన్నలలో జరిగింది కాబట్టి ఆ మాత్రం శ్రద్ధ ఆ యంత్రాంగానికి ఉంటుంది. మేం అక్షరాలా 1299 రూపాయలు పోసి టిక్కెట్లు కొన్నాం, మమ్మల్ని లోపలికి పంపించండి మహప్రబో అని కొంచెం ఆలస్యంగా వచ్చిన కొందరు మొరపెట్టు కున్నా ఫారూకి రక్షణ కోసం గేట్లు ససేమిరా తీయమని పోలీసులు చెప్పేశారు. అయినా ప్రదర్శనకి ఎంత సమయం ముందురావాలి, ఎలా ఉండాలి వంటి యావత్తు సమాచారం ఉందట. అతడు సమయ పాలనలో చండశాసనుడట. చాలామందే పాపం ఫారూకి ప్రదర్శన చూడకుండా వెనుదిరిగారని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. జన్మ వృథ అయి పోయిందికదా అని వాళ్లు అనుకున్నా ఆశ్చర్యం లేదు.

ఇంతకీ ఇది హాస్యం ప్రదర్శనేనా? లోపలున్న ఏ కొందరికో అందులో హాస్యం వినిపించి ఉండవచ్చు. లోపలికి వెళ్లిన వాళ్లకి తగిన మసాలా అందలేదు. రాజకీయవేత్తల మీద నోరు పారేసుకో లేదట. అంటే బీజేపీ మీద, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద జోకులు వేయలేదన్నమాట. మొన్నటి మధ్యప్రదేశ్‌ ‌జైలు జీవితం బాగా పనిచేసినట్టే ఉంది. ప్రశాంతంగా సాగిందట ప్రదర్శన. ఇది కాదు కదా, లోపలికి వెళ్లిన చాలా మంది ఆశించినది.

బీజేపీ వారు ఫారూకి ప్రదర్శన గురించి ఎందుకు ఇంత వ్యతిరేకతతో ఉన్నారు? వాళ్లకి హాస్యప్రియత్వం లేక కాదు. హాస్యం పేరుతో అతడు వెదజల్లుతున్న విషం గురించే వారి పట్టింపు. అందులో ముమ్మాటికీ హిందూ వ్యతిరేకత, బీజేపీ వ్యతిరేకత సుస్పష్టం. గోధ్రా దుర్ఘటన మీద అవాకులూ చెవాకులూ పేలిన తరువాత ఫారూకికి గట్టి హెచ్చరికలే వచ్చాయి. కానీ ఇలాంటి వాడికి భావ ప్రకటనా స్వేచ్ఛ మకుటం తగిలించి దేశం నెత్తిన రుద్దడానికి మంచి ప్రచారం కల్పించే మీడియా మూర్ఖులకు లోటు లేదు కదా! గోధ్రా వ్యాఖ్యలు, నిరసనల నేపథ్యంలో బర్ఖాదత్‌ అనే యాంకర్‌ ‌జాతిని ఉద్దేశించి ఫారూకి మాట్లాడే అవకాశం కల్పించింది. గోధ్రా వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెప్పనని అన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదనే చెప్పాడు. విదూషకుడి పేరుతో చెలామణి అవుతున్న ఈ విషక్రిమి ఒక ప్రదర్శనలో రాముడి మీద, సీత మీద కూడా నానా చెత్తా వాగాడు. హిందూ సంస్థలు నిరసన ప్రదర్శనలకు దిగాయి. 2021 జవవరిలో ఇతడిని అరెస్టు చేశారు. ఇదంతా చూసిన సెక్యులరిస్టులు, ఉదారవాదులు, ముస్లిం మత పెద్దలు, టీఆర్‌ఎస్‌ ‌వంటి పార్టీలు ఔను, విద్వేషమే నెగ్గింది, కళ ఓడిపోయిందంటూ ఫారూకికి వంత పాడారు. ఇప్పటికీ పాడుతున్నారు. కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌ అయితే పాపం ఒక విదూషకుడిని ఇలా ఏడిపించడం ఏం బావుంది అంటూ వాపోయాడు. హిందూ మతానికి వ్యతిరేకంగా నోరు పారేసుకునే వాడికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలి. ఇది తగదు అని చెబితే మాత్రం అది విద్వేషాన్ని రెచ్చగొట్టడమని చెబుతోంది ఈ మేధావి లోకం. ఎంత వింత?  దీనికి బోలెడు పేర్లు, క్రియెటివ్‌ ‌లిబర్టీ, ఆర్టిస్టిక్‌ ‌ఫ్రీడమ్‌… ఇం‌కా అలాంటివే. దీనికి విరుగుడు హిందువులలో ఆత్మగౌరవ స్పృహ రావాలి. కనీసం ఇలాంటి విష క్రిములు దాడి చేసినప్పుడు నిరసన తెలియచేయాలి. నిరసన తెలియచేస్తున్నవారికి మద్దతు ఇవ్వాలి. అంతకంటే ముందు అలాంటి ప్రదర్శనలను బహిష్కరించాలి.

About Author

By editor

Twitter
YOUTUBE