బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 2022 జూలైలో హైదరాబాద్‌లో జరిగాయి. ఇక్కడ ఆపరేషన్‌ ‌దక్షిణ్‌ అన్న సంకల్పం చెప్పుకున్నారు. భారతీయ జనసంఘ్‌ ‌జాతీయ కార్యవర్గ సమావేశాలు 1964లో విజయ వాడలో జరిగాయి. సరిగ్గా ఇదే ఆశయం- దక్షిణాదికి విస్తరించడం. అందుకే జనసంఘ్‌ ఆవి ర్భావం, విజయవాడ సభల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి. ఆ సభలకు విజయవాడ వెళ్లాను. భారతీయ జనసంఘ్‌ ‌వల సిద్ధాంతం ఇంటిగ్రల్‌  ‌హ్యూమనిజం అని ఈ మహాసభలలోనే పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రకటించారు. దీనినే తెలుగులో ఏకాత్మతా మానవతాదర్శన్‌ అన్నారు.

 బీజేపీకి మాతృక భారతీయ జనసంఘ్‌. ‌స్వతంత్ర భారతదేశంలో లోక్‌సభకు మొదటి ఎన్నికలు జరగడానికి కొంచెం ముందు, అక్టోబర్‌ 21, 1951‌న డాక్టర్‌ ‌శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ ఈ హిందూత్వ పార్టీని స్థాపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రెండవ సరసంఘ్‌చాలక్‌ ‌పరమ పూజనీయ గోళ్వల్కర్‌ (‌గురూజీ) ఆశీస్సులతో హిందూ అజెండాతోనే నెలకొల్పారు. తొలి ఎన్నికలలో మూడు స్థానాలు వచ్చాయి  ఎన్నికల గుర్తు దీపం. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నుంచి పండిత్‌ ‌దీనదయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ ‌బిహారీ వాజపేయి, ఎల్‌కె అడ్వాణి వంటివారు ఆ పార్టీలో పనిచేయడానికి వెళ్లారు. దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శి.

1955 ఎన్నికలలో జనసంఘ్‌ 5 ‌సీట్లలోనే పోటీ చేసింది. 1962లో వంద సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టింది. అది పార్టీ విస్తరణలో ఒక భాగంగా భావించింది. కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి సరికాదంటూ ఉద్యమించిన పార్టీ జనసంఘ్‌. ఆ ఆశయ సాధనలోనే డాక్టర్‌ ‌ముఖర్జీ ప్రభుత్వ నిర్బంధంలోనే కశ్మీర్‌లోనే కన్నుమూశారు. ఆ మరణం వెనుక రహస్యం ఇప్పటికీ బయటపడలేదు. ఆంధప్రదేశ్‌ ‌శాసన మండలిలో ఆనాటి సభ్యుడు అవసరాల రామారావు 1961-62 మధ్య జనసంఘ్‌ అధ్యక్షునిగా పనిచేశారు. జూపూడి యజ్ఞనారాయణ, వై.సి.రంగారెడ్డి, అన్నదానం మాధవరావు, డి.సూర్య ప్రకాశరెడ్డి వంటి వారు ఆనాటి ఆంధ్ర ప్రాంత జనసంఘ్‌ ‌నాయకులు. హైదరాబాద్‌లో భగన్‌లాల్‌ ‌విజయ వర్గీయ (ఆర్య సమాజ్‌) ‌నాయకుడు.  గోవధ నిషేధం కూడా ఆ పార్టీ నినాదమే. 1968లో  దీనదయాళ్‌ను కవ్యనిస్టులు హత్యచేశారు.

ఆవిర్భావం నుంచీ జనసంఘ్‌ ‌మీద నెహ్రూ నిప్పులు కురిపిస్తూ వచ్చారు.  మత ఛాందస పార్టీ అన్నాడు. రైలు వదిలి, ఎడ్లబండిలో పోవాలంటారని ఆక్షేపించాడు. నెహ్రూ కుటుంబం దాదాపు వ•డుసార్లు హిందూ సంస్థలను నిషేధించింది. 1948లో హిందూ సంస్థలపై నిషేధించి విధించిన ప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తల ఇళ్లపై కవ్యనిస్టులు కర్రలతో దాడి చేశారు. కాంగ్రెసు వారు సహకరిం చారు. స్వయంసేవకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మారువేషాలలో తిరిగారు. ఆ రోజుల్లోనూ సంఘ శాఖలు బలంగా ఉండేవి. నిత్య ఉపస్థితి వందకు పైనే. దేశ విభజన ప్రభావం మొత్తం భారతదేశం మీద తీవ్రంగా పడింది. 1950 తర్వాత రామ మనోహర్‌ ‌లోహియా సోషలిస్టు పార్టీ ఆంధ్రలో ప్రవేశించింది. ప్రజా సోషలిస్టు పార్టీ వంటివి అందులో నుండి పుట్టుకొచ్చాయి. 1960లో చక్ర వర్తుల రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ స్థాపించాడు. దాని ప్రభావం కూడా తెలుగునాట పడింది.

1964 నాటి విజయవాడ సమావేశాలలో నేనూ, మన్నవ గిరిధరరావు, భండారు సదాశివరావు, బుద్ధవరపు వెంకటరత్నం వంటి రచయితలం చాలా మందిమి పాల్గొన్నాం. బచ్‌రాజ్‌ ‌వ్యాస్‌ ‌పార్టీ అధ్యక్షుడు. విజయవాడ పురవీధులలో ఆయనను ఊరేగించారు. కశ్మీరు నుండి కన్యాకుమారి  వరకు ప్రతినిధులు వచ్చారు. కర్ణాటక నుండి జగన్నాథరావు జోషి వచ్చారు. సుందర్‌సింగ్‌ ‌భండారి, నానాజీ దేశ్‌ముఖ్‌, ‌దత్తోపంత్‌ ‌ఠేంగ్డే వంటి జాతీయ నాయకులు వచ్చినట్లు జ్ఞాపకం. టి.ఎస్‌.‌రామారావు, పిరాట్ల వెంకటేశ్వర్లు, యం.వెంకయ్యనాయుడు వంటి స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికపై దీన్‌దయాళ్‌, ‌ప్రొఫెసర్‌ ‌బలరాజ్‌ ‌మధోక్‌, అటల్‌ ‌బిహారీ వాజపేయి, భైరాన్‌సింగ్‌ ‌షెకావత్‌ ‌వంటి నాయకులు ఆసీనులయ్యారు.  నగరంలో కట్టిన స్వాగత తోరణాలలో  కవ్యనిస్టులు ఒకటి రెండు ధ్వంసం చేశారు.

ఇంగ్లిష్‌ ‌స్థానంలో హిందీ జాతీయ భాషగా ఉండాలనీ, సంస్కృతాన్ని రాజోత్సవ భాషగా గౌరవించాలని ఆనాటి మానిఫెస్టోలో పేర్కొన్నారు. దున్నగలిగేవాడిదే భూమి అన్నారు. బొటనవ్రేలుకు, అంటే చేతివృత్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. భారీ పరిశ్రమలకన్నా జపాన్‌ ‌తరహా పారిశ్రామికీకరణ వైపు మొగ్గారు. సత్వర ఆర్థిక వికాసానికి అదే కారణ మన్నారు. కశ్మీరు భారతదేశంలో అంతర్భాగం. అందుకే రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ పతాకాలు సాగవని నినదించారు. మంచి ఆతిథ్యం ఇచ్చారు. ఉత్తర హిందూస్థానం వారికి రొట్టెలు, దక్షిణ భారతీయులకు అన్నం వడ్డించారు.

‘జాగృతి’ అప్పుడు విజయవాడ నుండి వచ్చేది. తూములూరి లక్ష్మీనారాయణ, కందర్ప రామచంద్ర రావు సంపాదక బాధ్యతలు నిర్వహించేవారు. వారు ఈ సమావేశాల వివరాలు అందించారు. స్థానిక దినపత్రికలు కూడా పతాక శీర్షికలిచ్చాయి. జనసంఘం కాదు, భోజన సంఘం అని నార్ల వెంక టేశ్వరరావు వంటి వారు పరిహసిస్తూ సంపాదకీయ వ్యాఖ్యలు రాశారు. దీనికి కారణం హిందూత్వంపై వ్యతిరేకతే. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత 1977లో  కాంగ్రెస్‌ను, ఇందిరను గద్దె దించడానికి ఏర్పడిన జనతా కూటమిలో జనసంఘ్‌ ‌భాగస్వామి అయింది. అయితే జనతా పార్టీలోని సోషలిస్టులు ద్వంద్వ సభ్యత్వం వివాదం రేపడంతో వారితో ఇమడలేక మాజీ జనసంఘీయులు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని నెలకొల్పారు (1980).

ఒకసారి గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో జరిపిన జనసంఘ్‌ ‌సభలకూ నేను వెళ్లాను. ఇవి బాగా జ్ఞాపకం. అప్పుడక్కడ కాంగ్రెసు ప్రభుత్వం ఉంది. ఆ రోజు పూర్ణిమ – వాజ్‌పే• ప్రసంగం శరత్‌జ్యోత్స్నలా కవితామయం.

– ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌, ‌విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE