మత సామరస్యం, శాంతియుత సహజీవనం హిందువులకు కొత్తేమీ కాదు. ఇది మన రక్తంలోనే ఉంది. అయితే, కుహనా లౌకికవాదులు మనకే సుద్దులు చెబుతుంటారు. కానీ అన్యమతస్తులు కూడా వీటిని ఆచరించాలని పొరపాటున కూడా చెప్పరు. వారు చెప్పే సామరస్యానికి ప్రతీకగా అజ్మీర్ దర్గాను ప్రముఖంగా ఉదహరిస్తారు. కానీ
ఈ దర్గాకు చెందిన చిస్తీలు ఇప్పుడు పెద్ద చిచ్చే పెట్టారు. హిందువుల వ్యాపారాలను బహిష్కరించాలని చిస్తీలు పిలుపునిచ్చారు. అది కాస్తా బూమరాంగ్ అయి, వారి వ్యాపారాలకే ఎసరు తెచ్చింది. వారి అస్థిత్వానికే సవాలుగా మారింది. హిందువుల మీద తరచూ విషం కక్కుతున్న సర్వర్ చిస్తీ, సల్మాన్ చిస్తీ, ఆదిల్ చిస్తీ, గౌహర్ చిస్తీలు ఎవరు? వీరి అసలు రంగేమిటి?
మనదేశంలో కుహనా లౌకికవాద జపం ఆచరించే వర్గాలకు అజ్మీర్ దర్గా పవిత్ర స్థలం. తమ సెక్యులర్ పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు అక్కడికి చాలామంది నేతలు వెళ్తుంటారు. అయితే వారు పవిత్రంగా చెప్పుకునే ‘లౌకికధామం’ ఎంతటి ఛాందసవాద కర్మాగారమో ఇప్పుడు వారికే తెలిసొ చ్చింది. ఆ దర్గా కేంద్రంగా మనుగడ సాగిస్తున్నవారు ఎంతటి ప్రమాదకర విషపురుగులో బయటపడింది. దర్గాను పోషించిన హిందువులనే సెక్యులరిజం మత్తులో బెదిరించారు ఈ చిస్తీలు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు.
దర్గా ఎందుకు బోసిపోయింది?
గత రెండు వారాలుగా రాజస్తాన్‌లోని అజ్మీర్ నగరంలో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు సందర్శకులు తగ్గిపోయారు. సాధారణంగా బక్రీద్ రోజుల్లో చాలా రద్దీగా ఉంటుంది. శుక్రవారం నాడు సందడిగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అతి కొద్దిమంది మాత్రమే దర్గాను దర్శించుకుంటున్నారు. అజ్మీర్‌లో హోటళ్లు, దుకాణాలు, బస్సులు గతంతో పోలిస్తే పదిశాతం ఆదాయాన్ని కూడా ఆర్జించలేకపోతు న్నాయి. అంతేకాదు, అజ్మీర్‌లోని దర్గా బజార్, ఢిల్లీ గేట్, డిగ్గీ బజార్‌లోని రిసార్ట్‌లు, ఖాదీం మొహల్లా, కమ్మాని గేట్, అందర్ కోటే, లఖన్ కోట్రీలలోని రిసార్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి. వాటి ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఈ దర్గాను ముస్లింల కంటే హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.
అజ్మీర్ దర్గాను ప్రతిరోజు 15 నుంచి 20 వేల మంది భక్తులు దర్శించుకుంటారని, శుక్రవారం నాడు కిక్కిరిసిపోతుందని, కానీ ఇప్పుడు మాత్రం వెలవెల బోతోందని ఖాదిమ్ సయ్యద్ ఐనుద్దీన్ చిస్తీ గుర్తు వాపోయాడు. సందర్శకుల వల్లే తమకు జీవనోపాధి, అజ్మీర్ ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని తెలిపాడు. ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏమిటి? సమాధానం కూడా అక్కడి వ్యాపారులే స్పష్టంగా చెప్పారు. అజ్మీర్ దర్గాకు చెందిన చిస్తీ ఖాదింల తీరు, వారి హింసా త్మక, వివాదాస్పద ప్రసంగాలు తమకు తీరని నష్టం కలిగిస్తున్నాయని వాపోయారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్యా హత్య తర్వాత అజ్మీర్‌కు సందర్శకుల తాకిడి తగ్గింది. చిస్తీల ప్రసంగాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మరింత ప్రతికూల ప్రభావం కనిపించిందని జన్నత్ గ్రూప్ ఆఫ్ రిసార్టస్ యజమాని రియాజ్ ఖాన్ తెలిపారు. చిస్తీ ఖాదీంల కపటత్వం బయటపడటంతో అజ్మీర్ దర్గాకు కష్ట కాలం మొదలైంది. అటువైపు కూడా చూసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఈ వివాదాస్పద చిస్తీల చర్యలతో తమకు సంబంధం లేదని అజ్మీర్ దర్గా దేవాన్ జైనుల్ అబెదిన్ అలీఖాన్ కార్యాలయం చెబుతోంది. వారి వ్యాఖ్యలను ఖండించింది. తమ దర్గా మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొంది.
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌శర్మకు వ్యతిరేకంగా ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే విషయంలో అజ్మీర్‌లోని దర్గాకు చెందిన ఖాదీంలు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. నుపూర్ తల తెస్తే తన ఆస్తి రాసిస్తానని సల్మాన్ చిస్తీ ఓ వీడియోలో పిలుపునిచ్చాడు. ‘నేను రాజస్తాన్‌లోని అజ్మీర్ నుంచి మాట్లాడుతున్నా. హుజూర్ ఖ్వాజా బాబా కా దర్బార్ నుంచి ఈ సందేశం పంపుతున్నా.’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇది కన్హయ్యాలాల్ హత్యకు ముందే విడుదలై సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అజ్మీర్ పోలీసులు జూలై 5న సల్మాన్ చిస్తీని అరెస్టుచేశారు. వీడియోను కన్హయ్యాలాల్ హత్య జరిగిన జూన్ 28కి ముందే చిత్రీకరించాడని, తరు వాత లీకైందని పోలీసులు చెప్పారు. సల్మాన్ చిస్తీ అజ్మీర్ దర్గాలో పనిచేస్తాడని కూడా నిర్ధారించారు. మరో విచిత్రం ఏమిటంటే ఈ వ్యక్తి మీద ఇప్పటికే రౌడీషీట్ ఉంది. ఈ వీడియో అంతకుముందే వైరల్ అయినా కన్హయ్యాలాల్ హత్య తరువాత అరెస్టులు మొదలయ్యాయి. దీనిని ముందే గుర్తించి చర్యలు తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. జూన్ 17న అజ్మీర్ దర్గా ప్రధాన ద్వారం దగ్గర రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన మరికొందరినీ కూడా అరెస్టు చేశారు. వీరిలో గౌహర్ చిస్తీ పేరు ప్రముఖంగా వినిపించింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించిన వారి తల నరికేయాలంటూ ఇతడు చేసిన వ్యాఖ్యలు కూడా కలకలంరేపాయి. చివరకు ఇతన్ని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కన్హయ్యా లాల్‌ను హత్య చేసిన వారితో గౌహర్‌కు ఉన్న సంబంధాలపై విచారణ కొనసాగుతోంది.
ఇవి దైవ దూషణలు కాదా?
‘సగం మనిషి, సగం జంతువుగా ఉన్న వినాయ కుడు, హనుమంతుడు దేవుళ్లేనా? హిందువులకు 33 కోట్లమంది దేవుళ్లు ఎలా ఉంటారు? ఈ దేవుళ్ల సంఖ్యను ఎలా నమ్మాలి?’ అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ జూన్ 23, 2022న ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలపై హిందూ సంస్థల నుంచి ఆగ్రహా వేశాలు వ్యక్తం కావడంతో అదిల్ మాట మార్చాడు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని అన్నాడు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని కోరారు. నుపూర్‌శర్మ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందని గగ్గోలుపెట్టిన వర్గాలు అదిల్ వ్యాఖ్యలపై మాత్రం మౌనం వహించడం గమనార్హం.
ఉగ్రవాద సంస్థలకు బాసట
అజ్మీర్ దర్గాకు చెందిన చిస్తీలు తరచూ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. ఆదిల్ చిస్తీ తండ్రి సర్వర్ చిస్తీ కూడా తక్కువేమీ కాదు. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)ని 2020 అక్టోబర్‌లో ప్రశంసలతో ముంచె త్తాడు. ముస్లింల హక్కులను కాపాడేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ సంస్థ పనిచేస్తోందని చెప్పాడు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఉద్య మించినందుకు పీఎఫ్‌ఐ నాయకుల మీద కేసులు పెడుతున్నారని విమర్శించాడు. జమియత్ ఉలామా-ఎ-హింద్, జమాతే-ఇ-ఇస్లామీలనూ ఆయన ప్రశం సించాడు. ఈ సర్వర్ చిస్తీ మేనల్లుడే గౌహర్ చిస్తీ.
కలకలం రేపిన 1992 అజ్మీర్ రేప్ కేసు
అజ్మీర్ దర్గా సంప్రదాయ సంరక్షకుల కుటుం బాల నేరచరిత్ర చాలా పెద్దది. ఈ రేప్ కేసు గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోచ్చు. అప్పట్లో ‘ఇండియన్ రోథర్‌హామ్ స్కామ్’గా పిలిచారు. 1992లో అజ్మీర్‌లో స్కూల్, కాలేజీ అమ్మాయిల లైంగికదోపిడీ కొనసాగింది. ప్రేమ పేరుతో వల వేసి, వారి నగ్న ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ ద్వారా లొంగ దీసుకున్నారు. నిందితుల్లో ఎక్కువమంది ఖాదీం కుటుంబాలకు చెందినవారే. వీరంతా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో పనిచేసేవారే. ఈ కేసులో ప్రధాన నింది తుడు ఫరూక్ చిస్తీ. ఇతడు అజ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నకాలంలో ఈ అరాచకాలకు తెరలే పాడు. ఈ కేసులో 18 మందిపై అభియోగాలు మోపితే సాంకేతిక కారణాలతో 8 మంది నిర్దోషు లుగా విడుదలయ్యారు. ఈ కేసులో మరో నిందితు డైన సుహైల్ ఘనీ చిస్తీ 26 ఏళ్ల తర్వాత 2018లో లొంగిపోయాడు. అప్పట్లో ఖాదీం చిస్తీలకు అక్కడి సమాజంలో ఉన్న పలుకుబడి కారణంగా పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేక పోయారని చెబుతుం టారు. దాదాపు 200 మంది బాధిత బాలికల్లో ఎక్కు వగా ఉన్నది హిందువులే. వీరిలో కొందరు అజ్ఞా తంగా, మౌనంగా ఉండిపోగా, మరికొందరు ఆత్మహ త్యలు చేసుకున్నారు. అజ్మీర్‌లోని నవజ్యోతి పత్రిక సంపాదకుడు దీనబంధు చౌదరి ఈ లైంగిక దోపిడిని బయటపెట్టడంతో రాజస్తాన్‌తో పాటు దేశమంతా ఉలిక్కిపడింది. మూడురోజుల పాటు అజ్మీర్ బంద్ జరిగింది. పెద్దఎత్తున నిరసనలు కొనసాగాయి. ఈ కేసును నీరు గార్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. అప్పటి బీజేపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఏమిటీ అజ్మీర్ దర్గా చరిత్ర
ఇస్లాంలో భాగమైన సున్నీ సూఫీతత్వాన్ని ప్రచారం చేసిన వారిలో ఒకరు చిస్తీ మొయిన్ అల్-దిన్ హసన్ సిజ్జి (1143-1236). ఇతన్ని మొయినుద్దీన్ చిస్తీ, ఖ్వాజా గరీబ్ నవాబ్ అని కూడా పిలుస్తారు. ఆఫ్ఘాస్తాన్‌లోని ఘజ్నవీ హెరాత్‌లో పుట్టిన ఈయన హిందుస్తాన్‌కు వచ్చి అజ్మీర్‌లో స్థిరపడ్డాడు. అక్కడే చిస్తియా సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. చరిత్రకారులు ఆయన్ని గొప్ప ఆధ్మాత్మిక, తత్త్వవేత్తగా పేర్కొన్నారు. ఆయన మరణించిన తర్వాత అజ్మీర్‌లో సమాధి చేశారు. ఇదే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ దర్గాలో ఆధ్యా త్మిక విధులు నిర్వహిస్తున్నవారిని, వారి సంతతిని చిస్తీలుగా పిలుస్తారు.
ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీని ఆధ్మాత్మికవేత్తగా ప్రాచుర్యంలోనికి తెచ్చారు కానీ ఆయనదంతా హిందూమతానికి వ్యతిరేకంగా కత్తికట్టిన రక్తచరిత్రే. భారతదేశంలో ఇస్లాంను వ్యాపింపజేసే క్రమంలో ఇక్కడకి వచ్చాడు. శాంతి, ప్రేమ, సామరస్యం అనేవి ఆయన ముసుగులు మాత్రమే. ఒక సన్యాసిగా గుర్తింపు ఉన్నా ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఆయనలో ఉన్మాదం, మూర్ఖత్వం మరో కోణం. హిందువుల ఆచారాలకు ఏమాత్రం విలువ ఇచ్చే వాడు కాదు. దాదాపు 7 లక్షల మంది హిందువులను తన హింసాత్మక చర్యలతో ఇస్లాంలోకి మార్చిన చరిత్ర ఇతనిది. ఈ క్రమంలో మూడుసార్లు హిందూ స్త్రీలను వివాహం చేసుకుని ఇస్లాంలోనికి మార్చాడు. మొయినుద్దీన్ చిస్తీకి మాలిక్ ఖితాబ్ అనే అనుచరుడు ఉండేవాడు. అతడు ఓ హిందూ రాజకుమార్తెను అపహరించి చిస్తీకి బహుమతిగా ఇచ్చాడు. చిస్తీ సంతోషంగా స్వీకరించి ఆమెకు బీబీ ఉమియా అనే పేరు పెట్టుకున్నాడు. ఎన్నో ఆలయాలను కూల్చి గోమాంస భక్షణను ప్రోత్సహించిన చరిత్ర కూడా ఇతనికి ఉంది.
మహారాజ్ పృథ్వీరాజ్ హత్య వెనుక ఖ్వాజా
భారతదేశంపై ఇస్లాం దాడులను తిప్పికొట్టిన గొప్ప రాజు పృథ్వీరాజ్ చౌహాన్. అజ్మీర్ చరిత్ర ఆయనతో ముడిపడి ఉంది. పృథ్వీరాజ్ రాజ్యంపై దాడి చేసేందుకు మహమ్మద్ ఘోరీని పురికొల్పిన వారిలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఒకడు. ఘోరీతో చౌహాన్‌కు అనేకసార్లు యుద్ధం జరిగింది. ప్రతి యుద్ధంలో ఘోరీ ఓడిపోయాడు. పృథ్వీరాజ్ అతన్ని చంపకుండా క్షమాభిక్ష పెట్టి వదిలేశారు.
చివరగా జరిగిన యుద్ధంలో దురదృష్టవశాత్తు పృథ్వీరాజ్ ఓడిపోయాడు. ఆయనను చంపేశారు. మహారాజా పృథ్వీరాజ్ చౌహాన్‌ను తాము వెన్నుపోటు పొడిచి, కిరాతంగా చంపించి ఇక్కడ ఇస్లాంను స్థాపించామని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ గర్వంగా చెప్పుకున్నాడట.
ఇస్లాంలోకి మారితే నిన్ను, నీ భార్యను చంపకుండా వదిలేస్తామని ఆశ చూపినా లొంగ కుండా సనాతన హిందూధర్మం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన త్యాగమూర్తి పృథ్వీరాజ్ చౌహాన్. దురదృష్టవశాత్తు ఆ మహారాజు చరిత్ర అజ్ఞాతంలో కలిసిపోయింది. ఖ్వాజా మొయినుద్దీన్ దర్గా ప్రఖ్యాతి పొందింది.
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్